అసలు మాకు ఏమాత్రం అవసరంలేకపోయినా మీరే 1956 లో మాతో కలవడానికి తహతహ లాడారు.
పెద్దమనుషుల ఒప్పందం మీకు(తెలంగాణాకి) అనుకూలంగా 'ఏకపక్షంగా' జరిగింది.
వీరు చెప్పేదాని ప్రకారం తెలంగాణా వారే తహ తహలాడి, తెలంగాణా వారే మళ్ళీ ఆంధ్రా వాళ్లకు కొన్ని కండిషన్లు పెట్టి, మళ్ళీ తెలంగాణా వారే ఏకపక్షంగా అగ్రిమెంటు చేశారన్న మాట! ఇలాంటి వాదనలు చేయడం కేవలం సమైక్యవాదులకు తప్ప భూమ్మీద మరెవరికీ చేతకాదు.
నదులు పళ్ళానికి పారేలా దేవుడు నిర్ణయించాడు. నీళ్ళు వస్తున్నాయి, వాడుకుంటున్నాం. అది తప్పా?
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి అవకాశాలు లేకపోతే మాతప్పా?
తెలంగాణా వస్తే కోస్తా థార్ ఎడారిగా మారుతుంది.
తెలంగాణా వస్తే ఎడారిగా మారుతుందన్న భయం ఎందుకు? తెలంగాణలో నీళ్ళు ఆపే అవకాశం వుందనేగా? ఒకవేళ తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టడానికి అవకాశాలే లేకపోతే రాష్ట్రం వేరుపడ్డా నీళ్ళు మీకే వస్తాయిగా? మరి భయమెందుకు? ఒకవేళ మీరు ఇప్పటిదాకా అబద్ధాలే చెప్తున్నారని ఒప్పుకున్నా, తెలంగాణా ఏక మొత్తంగా నీళ్ళని వాడుకునే అవకాశమే లేదు. దాన్ని పర్యవేక్షించడానికి ట్రిబ్యునళ్ళు, కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు వున్నాయి. ఇవి కేవలం మభ్యపెట్టే మాటలు తప్ప వేరుకాదు.
తెలుగుజాతి విడిపోవడానికి ఎట్టిపరిస్థితిలో ఒప్పుకునేది లేదు.
రాష్ట్రం విడిపోతే హైదరాబాదు సంగతి తేల్చాలి.
ఓ! అదన్నమాట మీ బాధ. మీ బాధ హైదరాబాదు గురించి తప్ప ఐక్యత గురించి కాదు.
రాష్ట్రం విడిపోతే హైదరాబాదులోని సీమాంధ్ర వారికి రక్షణ ఉండదు.
హైదరాబాదులో సీమాన్ద్రులకంటే ఇతర భారతీయులే ఎక్కువగా (తెలంగాణా వారు కాక) వున్నారు. మరి వాళ్ళందరికీ లేని బాధ మీకెందుకు? ఆ విషయం పక్కన బెడితే ఆంధ్రా వాళ్ళు హైదరాబాదులో ఎంత మంది వున్నారో, మిగతా తెలంగాణా ప్రాంతాల్లో అంతే మంది వున్నారు. పైగా హైదరాబాదులో ఏక మొత్తంగా వుంటే, మిగతా తెలంగాణాలో ఊరికి ఒకటి రెండు కుటుంబాలుగా వున్నారు. అంటే హైదరాబాడుకన్నా కూడా గ్రామ్మాల్లో వారు ఎక్కువ మైనారిటీలన్న మాట. మరి తక్కువ నిష్పత్తిలో వున్నవారిపై లేని శ్రద్ధ ఎక్కువ నిష్పత్తిలో వుండి తమను తాము రక్షించు కోగలిగే స్థితిలో వున్న హైదరాబాదు ప్రాంతం వారిపై ఎందుకు అంట శ్రద్ధ?
కెసిఆర్ భాష సరిగా వుండడం లేదు.
నాలుకలు కోస్తాం - TG వెంకటేష్
రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది - దేవినేని ఉమా
మానవబాంబులుగా మారుతాం - పయ్యావుల కేశవ్
(ఇక మన సీమాంధ్ర బ్లాగర్ల భాష సంగతి చెప్పనే అవసరం లేదు)
దీనికి వేరే వివరణ అవసరమా?
సమైక్యాంధ్రకోసం ఊరూరా విద్యార్ధులు స్కూళ్ళూ కాలేజీలు వదిలేసి అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. (2009 డిసెంబరు)
ఉద్యమాలు చేసుకోండి. విద్యార్థులను వదిలేయండి. (ఇప్పుడు)
అదీ సమైక్యతా మార్కు నాలుక తిప్పడం అంటే! నాలుక్కి నరం ఉంటేగా!
ఇంకా చాలావున్నాయి, అవి మరో సారి చర్చిద్దాం.
sooooper.correct ga raasaru. kontamandi vedavalu blogullo atiga orrutunnaru.
ReplyDeleteనిప్పులాంటి నిజాలు చెప్పారు.
ReplyDeleteఅయినా మంది సొమ్ము తినమరిగిన వారికి ఇవేం ఎక్కవు.
వాళ్ళ యావ వాళ్ళదే.
మాది మాకే గావాలె మీదీ మాకే గావాలె
ఇదీ చాల్బాజ్ ఆంధ్రుల దుర్బుద్ధి
ఈమధ్య పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ కొత్త ప్రచారం. తెలంగాణాలో చాలా మంది "విషాంద్ర" కోరుకుంటున్నారట కానీ భయపడి బయటికి చెప్పరట. నువ్వు చిరంజీవి "కంపెనీ" లో ఉన్నప్పుడు తెలంగాణా కావాలని ఎందుకు అన్నావని అడిగితె మాత్రం సరయిన జవాబు రాదు.
ReplyDelete