Sunday, October 23, 2011

మా జాతిని రక్షించే మార్గమొకటే, మారాష్ట్రం


కష్టాల కడలిని కడదాకా ఈది ఈది 
తీరం చేరామో లేదో తేరగా నువ్వొచ్చావు 

భాషే లంకెగ మార్చి పాశం సంధించావు
కవలలమని అన్నావు కలిసుందామన్నావు

అనుమానించిన నాతో ఆప్యాయత నటిస్తూ  
పలుబాసలు చేశావు పాటిస్తానన్నావు

నీ మాటలు నమ్మేసి నీతో జత కలిశాక 
ఒప్పందాలకు వరుసగా నూకలు చెల్లించావు

మాకున్న ఘనచరిత్ర మాపిల్లలు చదువకుండా 
కుట్రలు మొదలెట్టావు కుయుక్తులను పన్నావు 

మా నదులను ఒంపుకొని మాగాణం పండించి
కోట్ల డబ్బు కూడబెట్టి కొల్లగొట్టి మా నేలను
వ్యాపారాలను పెట్టి మమ్ముల కూలీలు జేసి
మా నేలను మొత్తం నీ వలసగా మార్చేశావు

నీ ఎత్తులు చూశాక నీ వంచన తెలిశాక
నీతోనే కలిసుంటే నీ బంధం వీడకుంటే
నాజాతే మొత్తంగా నాశనమై పోతుంది
నీ దొరతనం కిందే నీల్గవలసి వస్తుంది

అంతే మా ఆరాటం అందుకే మా పోరాటం
మా జాతిని రక్షించే మార్గమొకటే, మారాష్ట్రం 

11 comments:

  1. సమైక్యవాదులకి జాతి అనేది లేదు, హైదరాబాద్ మీద వ్యామోహం ఒక్కటే ఉంది. తెలంగాణాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాట్లాడలేదు కానీ ప్రత్యేక రాష్ట్రం అడిగినప్పుడే తెలంగానా ప్రజలు మా జాతివాళ్ళు, మా రక్తంవాళ్ళు అని అంటారు.

    ReplyDelete
  2. nuvu nenu veru kadu. andaram okkate. nizam bastards vidadeesaru. malli kalisam. maa rashtram kadu. mana rashtram. inkaa pedda rashtrame konni uullu pakka rastralloki poyi konchem kudinchuku poyinam. intaa yaagi jesindru. adEdo project panulako, inka deniko jesunte oka result kanipinchedi. ada kanapadanappudu ippudu chestunna gola ki ardam undedi andaru support chesevallu. nayakula mida eduru tirigite panulavtayi. prabhutvam mida eduru tirigite manake bokka. (manadi peruke prajaswamyam. adugaduguna niyatrutvam).

    -krishna

    ReplyDelete
  3. సొల్లు కబుర్లు ఎందుకు? సీమాంధ్ర నాయకులు మాత్రం ఇరిగేషన్ ప్రోజెక్ట్‌ల కోసం ఏనాడైనా ఐక్యంగా ఉద్యమించారా? ఇప్పుడు హైదరాబాద్ సీమాంధ్రకి చెందకుండా పోతుందనిపించి వీధిలో పడి సమైక్యత పేరుతో ఊరేగుతున్నారు.

    ReplyDelete
  4. krishna,

    When 4 cr people are fighting for a common cause and you do not even bother to understand the reason. More over you people wage pseudo agitations against us. More over you are ready to leave us if you get Hyd. How can you say with the same mouth that we are one?

    ReplyDelete
  5. ప్రవీణ్ శర్మ గారు,

    వారికి అన్ని సమయాల్లోనూ తెలంగాణా ప్రజలు అత్యంత హీనంగా కనబడతారు. కాని సమైక్యంగా వుంచాలనేసరికి ఒకేజాతి అని గుర్తుకు వస్తుంది.

    ReplyDelete
  6. >>>ప్రోజెక్ట్‌ల కోసం ఏనాడైనా ఐక్యంగా ఉద్యమించారా?

    ఎప్పుడో ఎందుకు? సమైక్యత అని చెప్పేవారు కనీసం ఇప్పుడైనా పోలవరం కన్నా ప్రాణహిత ముందు చేపట్టాలని ఉద్యమిస్తారా? అసంభవం. పేరుకే సమైక్యత, మిగతాదంతా స్వార్థమే.

    ReplyDelete
  7. తెలంగాణ ప్రజలని హీనంగా అందరూ చూస్తున్నారనుకోవటం కొంత మంది విపరీతార్ధం మాత్రమే. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం వాళ్ళు ఇతర ప్రాంతాలని గౌరవంగా చూస్తారో చెప్పు? శ్రీకాకుళం అంటే ఓహో సికాకులమా అని ఎంత మంది తెలెంగానా వాళ్ళు నవ్వరు ? అసలు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అంటేనే నీరసం కదా...
    ఇక సినీ పరిశ్రమ దృష్టిలో...

    విలను :- తెలంగాణా లేదా రాయలసీమ యాస
    హీరో : శుభ్రమైన తెలుగు
    హీరోయిన్ : వచ్చీ రాని తెలుగు
    ముష్టోల్లు, పనిమనుషులు, రిక్షావోల్లు, మెల్లకన్నోళ్ళు : ఉత్తరాంధ్ర యాస

    ఎప్పటి నుంచో ఇదే కదా ఈక్వెషను :-)

    పంజాబీ వాళ్ళ మీదా దేశమంతా జోకులేస్తారని మాకోక దేశం ఇవ్వమని వాళ్లూ అడగరు. ఏటి సికాకులమా అంటే రోషం తెచ్చుకుని మాకోక రాష్ట్రం కావాలని వాళ్ళూ అడగాలేదు.రాజధాని ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండటం ఎవడికి మాత్రం సరదా ? చచ్చి చెడి వచ్చి అమీర్పేట రోడ్ల మీద తిరుగుతూ యాసను బలవంటానా చంపుకుని, ఇరుకు హాష్తళ్లలో నరకం ఎవడికి మాత్రం ఇష్టం ?

    రాజకీయ నిరుద్యోగుల కల తెలంగాణ...
    రాజకీయ నేరగాళ్ల వల : సమైక్యాంధ్ర

    ఏది వచ్చిచినా చచ్చిన ఎక్కడి గొంగళి అక్కడే...కొన్ని రిజర్వేషన్ వర్గాలకు వుద్యోగాలు మాత్రం పెరుగుతాయి...కొంత మంది కోట్లు గడిస్తారు.

    దోచుకునేది కూడా మా తెలంగాణ వాడే అయ్యిండాలి అని అనుకుంటే తప్పులేదు...కానీ కొన్నాళ్ళ పోయాక అసలు సమస్య సమైక్యమా, తెలంగాణ కాదురా అని అనిపించక మానదు.

    ReplyDelete
  8. రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఆ మాటకొస్తే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా వున్నాయి?

    అన్ని సమస్యలు పరిష్కారం కావు కదా అని వదిలేస్తే ఇప్పటివరకు ఏ ఒక్క సమస్యా పరిష్కారం అయ్యుండేది కాదు.

    రాష్ట్రం ఏర్పాటు వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినా కొన్ని అవుతాయి. ఆ కొన్ని తెలంగాణా ప్రాంతం వారికి ముఖ్యమైన సమస్యలు. దోపిడీ పూర్తిగా అంతం కాకపోవచ్చు, కాని ప్రాంతీయ దోపిడీ మాత్రం వుండే అవకాశం లేదు.

    ReplyDelete
  9. సినిమావాళ్ళకి లోక జ్ఞానం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఎవరూ సికాకులం అని పలకరు. సినిమావాళ్ళు కొత్తగా కనిపెట్టిన పదం అది. సినిమావాళ్ళకి లోక జ్ఞానం లేకపోతే అది మా ప్రాంతంవాళ్ళ తప్పు కాదు కదా. గోదావరి, కృష్ణా & గుంటూరు జిల్లాలలో కులగజ్జితో పాటు ప్రాంతీయ గజ్జి కూడా ఎక్కువే ఉంది. అందుకే ఆ జిల్లాల నుంచి వచ్చిన నిర్మాతలు ఇతర ప్రాంతాలవాళ్ళకి కించపరిచే సంభాషణలు, సన్నివేశాలు పెడతారు.

    ReplyDelete
  10. ///గోదావరి, కృష్ణా & గుంటూరు జిల్లాలలో కులగజ్జితో పాటు ప్రాంతీయ గజ్జి కూడా ఎక్కువే ఉంది. అందుకే ఆ జిల్లాల నుంచి వచ్చిన నిర్మాతలు ఇతర ప్రాంతాలవాళ్ళకి కించపరిచే సంభాషణలు, సన్నివేశాలు పెడతారు./////
    correct ga cheparu.....
    manaku GAMATHU ga anipistundi kani...epudu kinchaparchalani alochana radu...kevalam cinema prabavame thapa...maroti kadu.....

    ReplyDelete
  11. KALASI PORADITHE VACHEDI TELANGANA
    INKA ANDHRA VARI GODUGU KINDHA UNDI VARI CHETHILO KEELU BOMMALLA NALIGI POTHUNNARU MANAVARU MUNDHU VEERINI BAYATAKU THISUKA RAVALI TELANGANA BANNER MATHRAME KANABADALI ATHMA HATHYALU VADHU PORADI THESHUKUNDAM TELANGANA
    EDI MANADI

    ReplyDelete