Thursday, October 6, 2011

విశాలాంధ్ర వాదుల అబద్ధాల పరంపర

తెలంగాణా ఏర్పాటు దగ్గర పడుతున్న కొద్దీ సమైక్య వాదుల పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. దాంతో వారు ఏమి రాస్తున్నారో వారికే తెలియడం లేదు. ఏదో ఒక న్యూస్ పేపర్ కటింగ్ దొరగ్గానే ఆవురావురు మనుకుంటూ తెచ్చి పెట్టి దానికో పిచ్చి ఆర్గ్యుమెంటు జత చేస్తారు. తమ అబద్ధాలకు ఏవో వంకర సాక్ష్యాలను జోడిస్తే అవి నిజమని భ్రమింప జేయవచ్చని వారిదో వెర్రి ఆశ.

ఆ పరంపరలో వచ్చిందే ఈ వ్యాసం. రెండు ఆంద్ర పత్రిక పేపరు కటింగులు సంపాదించి 1956 లో ఆంధ్రా తెలంగాణా ఆదాయాలు రెండింటిలోనూ లోటు వుందని నిశ్చయించేశారు. వారు నిశ్చయించారు కాబట్టి తెలంగాణా ఆదాయాన్ని ఆంధ్రావారు కొల్లగొట్టారని చెప్తున్న వాదన తప్పని తేల్చే ప్రయత్నం చేస్తూ, పనిలో పనిగా వారికి మాత్రమే సహజమైన అవాకులూ, చవాకులూ కూడా పేలారు. దానికి సమాధానంగా శ్రీ మల్లికార్జున శర్మ గారు భార్గవ కమీషన్ రిపోర్టు ఉదాహరించారు. దానిలో క్రింది విధంగా వివరించబడి వుంది.

1. Revenue Surplus of Telangana area
During the Third Plan period 24.18
2. Shortfall of Capital Expenditure in the Telangana area compared to one-third of the total capital expenditure in the State 6.56
TOTAL 30.54

9. The decision was communicated to the Chairman, TRC through a letter of 17-06-1968 from Finance Secretary. The Chief Minister also agreed that on this basis the balance of the Second Plan surpluses of Rs. 3.70 crores would be provided – Rs. 2.80 crores in 1968-69 and about Rs. 90 lakhs thereafter. Therefore, in all about Rs. 34.24 crores (Rs. 30.54 + 3.70 crores) would have to be provided for the Telangana region over and above its one-third share.     


పై నివేదికలో ఏమి తెలుస్తుంది? రెండవ పంచవర్ష ప్రణాళిక (1956-61) లో రూ 3.70 కోట్లు, మూడవ పంచవర్ష ప్రణాళిక (1961-66) లో రూ 30.24 కోట్లు, మొత్తం కలిపి రూ 34.24 కోట్లు తెలంగాణా ఆదాయాన్ని ఆంధ్రాలో వినియోగించారని. ఆ ఆదాయాన్ని తిరిగి నాలుగో పంచవర్ష ప్రణాళికలో తెలంగాణలో కర్చు పెట్టాలని. కాని ప్రతిసారి నిధులు అటు మల్లిన్చాదమే అలవాటుగా పెట్టుకొన్న పక్షపాత పాలకులు తర్వాత TRC నే రద్దు చేశారు. TRC ఉన్నప్పుడే ఈ విధంగా ప్రవర్తించిన వారు, అది రద్దయిన తర్వాత ఏవిధంగా ప్రవర్తిస్తారో ఊహించలేని విషయం కాదు. దానికి తర్వాతి పరిణామాలే సాక్షి.

నిజాలు ఇలా బట్టబయలయ్యే సరికి తాము ఉదహరించింది హైదరాబాదు స్టేటు బడ్జెట్ అని, తెలంగాణా ఆదాయం గురించి కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూ పలాయన మంత్రం చిత్తగించారు చివరి వ్యాఖ్యలో. మరి తెలంగాణా ఆదాయం గురించి కానప్పుడు తెలంగాణా వారిని అబద్ధాలు చెపుతున్నారంటూ ఆడిపోసుకోవడం ఎందుకు? 

ఇక పొతే వారు ఇంకో పోస్టులో వారికి హైదరాబాదులో వున్న భవనాలపై ఏమాత్రం కన్ను ఉండేది కాదని, అసలు వారికి ఆ భవనాల గురించే తెలియదని, వారికి కేవలం ఓరుగల్లులోని దేవాలయాలు తప్ప మరేమీ తెలియదని చెప్పుకొచ్చారు. దానికి ఎలుక సాక్ష్యంగా 1956 మార్చి 7 వ తేదీ మూడో పేజీ బొమ్మ వేశారు. వీరి తర్కం ప్రకారం సదరు మూడో పేజీలో చెప్పక పొతే ఇక వారికి హైదరాబాదు గురించి కానీ, అక్కడి భవనాల గురించి కాని తెలియనట్టే నట! మరి ఇలాగే వుంటాయి సమెక్కుడు నంగనాచి కబుర్లు.   

1956 ఫిబ్రవరి 1 న నీలం సంజీవరెడ్డిగారు ఆంధ్రా అసెంబ్లీలో చేసిన ప్రసంగపాఠం చూడండి...

ఇక ఇప్పుడు ‘ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా పెడతాం, 5 ఏండ్ల తర్వాత అలోచిస్తాం’ అనే సమస్యను కొందరు లేవదీస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులున్నాయో హైదరాబాద్‌లోని మన మిత్రులకు తెలియకపోలేదు. మద్రాసులో మన ఆఫీసులు, ఇంకో చోట కొన్ని ఆఫీసులు చిందర వంద రగా ఉండటం వల్ల, మద్రాసులోని మన ఆఫీసుతో ప్రభుత్వానికి సంబం ధం లేకుండా ఇప్పటికి రెండున్నర సంవత్సరాలనుండి ఎన్నో ఇబ్బందు లకు గురయ్యాం. ఇప్పటికిప్పుడే ఈ కర్నూలు పట్టణంలో రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 5 ఏళ్ల వరకూ మన ఆఫీసులన్నీ మద్రాసులో ఉంచుకొని, ఈ కర్నూలులో ఉండి ఈ ప్రభుత్వం ఈ రకంగా అవకతవకలుగా ఉండడమేనా? ఈ ప్రభుత్వం ఆంధ్రుల శ్రేయస్సుకోసం అంతా కలిసి ఒకే చోట ఉంటే, మన ప్రభుత్వం నడుపుకోడానికి విశాలాంధ్ర రాష్ట్రం త్వరగా రావడం ఎంత మంచిదో ఆలోచించుకోమని కోరుతున్నాను. ఐదు ఏళ్ల పాటు ఇక్కడ ఉండవలసి వస్తే, మరొక మూడు కోట్లు ఖర్చుపెట్టి, అనవసరంగా వృధాగా ఖర్చుపెట్టి 5, 6 ఏళ్ల తర్వాత మూట ముల్లె కట్టుకొని హైదరాబాద్‌ పోవడం ఎవరికి వచ్చిన లాభమో ఆలోచించమని అడుగుతున్నాను.

పై ప్రసంగంలో ఏం తెలుస్తుంది? విశాలాంధ్ర ఏర్పాటు కోసమై వారి తహతహ ఎందుకోసమో వివరంగా తెలియడం లేదూ? హైదరాబాదులో తెరగా భవనాలు ఉన్నాయనే విషయం తెలియకుండానే వారు ఆ విధంగా ప్రసంగించారంటారా? దటీజ్ సమైక్య వాదం!


11 comments:

  1. మిడతల దండు లా వచ్చి తెలంగాణా మీద పడి తెలంగాణా ప్రజల ఉసురు పోసుకుంటున్న ఆంధ్రుల ను
    చూస్తే అసహ్యం వేస్తోంది. ఇంట స్వాభిమానం, ఆత్మగౌరవం లేని పరాన్న జీవులు ప్రపంచం లోనే వుండరు.
    కానీ ఇప్పుడు వాళ్ళ మీద కంటే తెలంగాణా లోని లత్తకోరు రాజకీయ నాయకులను చూస్తేనే ఎక్కువ అసహ్యం వేస్తోంది.
    ఎం కుక్క బతుకు వీళ్ళది. ప్రజల్లో ఉండాల్సిన వాళ్ళు చంద్ర (ఆంద్ర ) బాబు చంకలో కొందరు , డిల్లీ గల్లీల్లో మురికి కాల్వల వెంట
    మరికొందరు ఎంత దిక్కుమాలిన నీచాతి నీచమైన బతుకుతూ బతుకుతున్నారు.
    ఆనాడు ఇట్లాంటి నేతల వల్లనే తెలంగాణాను ఆంద్ర వాళ్ళు తేలిగ్గా కబలించ గలిగారు
    ఈనాడు తమ బానిస మనస్తత్వం, పదవి లాలస , ఇతర్ల మోచేతి నీళ్ళు తాగే అలవాటు కారణంగా తెలంగాణా రాకుండా
    అడ్డుపడుతున్నారు.
    ఇప్పుడు ఇక ఆంద్ర కుక్కలా గురిం ఛి కాదు తెలంగాణా నక్కల గురించి ఆలోచించాలి !
    ఇట్లాంటి వెధవలను రాజకీయాలనుంచి నిర్మూలించక పొతే తెలంగాణాకు విముక్తి లేదు.
    రాజేష్ హైదరాబాద్

    ReplyDelete
  2. కోటి మోసపు మాటల మూట నా సమైక్యాంధ్ర

    ReplyDelete
  3. Whatever you write on separate state..it's not going to happen..continue your fighting...

    this is just a false moment.....try to teach some good things to society. Do some good work to society and people..rather than fighting..

    ReplyDelete
  4. inkaa telangaana erpatu endira bhai.. kallu musukuni enta kalam kalalukantaavu.. aada ivvadam kudaradu morro antunte nuvendi erpaataitaandi ani gee ghosha.

    ReplyDelete
  5. http://visalandhra.blogspot.com/2011/10/blog-post_4402.html

    ReplyDelete
  6. పొరపొచ్చాలేమీ లేనిరోజుల్లో అందరమూ మైత్రీభావంతో ఉన్నరోజుల్లో జరిగిన/ అన్న విషయాలకి ఈనాటి అవగాహనకి అనుగుణంగా భాష్యాలు చెప్పడం సరికాదు. ఆ రోజుల్లో ఆ మూడ్ సరిగానే ఉన్నట్లు అనిపించింది అందరికీ. అందుకే అప్పుడు అవి వివాదాస్పదం కాలేదు. సఖ్యంగా ఉన్న రోజుల్లో "అన్నయ్యా ! ఒకే ఊళ్లో ఉంటూ ప్రత్యేకంగా ఎందుకు ? మా యింటికొచ్చి ఉండరాదా ?" అని తమ్ముడంటాడు. "మా యింటికి రా తంబీ " అని అన్న అంటాడు. అదే ఆ తరువాత తన-పర వ్యత్యాసాలు పెరిగిపోతే "అన్ని సంవత్సరాలు మా యింట్లో పడి తిన్నారు, ఒళ్ళు హూనమయ్యేలా చాకిరీచేశాం" అని పరస్పరం ఆరోపించుకుంటారు, పిలిచింది తామేనని మర్చిపోయి.

    సంబంధాలు చెడిపోయాక గతంలో అన్నవీ/ జరిగినవీ అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. హైదరాబాదుని రాజధాని చేయాలనేది పెద్దమనుషుల ఒప్పందంలో ఒక భాగం.

    ReplyDelete
  7. 1952-53 నుండి హైదరాబాదు రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉంది. 1951-52 లో 92 లక్షల మిగులులో ఉన్న బడ్జెట్టు, 1955-56 నాటికి 5 కోట్ల 32 లక్షల లోటు చూపించింది. 1955-56 లో ఆ రాష్ట్ర నికరాదాయం 21 కోట్ల 62 లక్షలు! ఖర్చు 26 కోట్ల 94 లక్షలు. ఏమిటి దీనర్థం?

    ReplyDelete
  8. 1956 ki mundu vunna ardhika paristhiti paper cutings lo vundi. sarma gaaru refer chesindi 1966ni. rendoo okati kaadu

    ReplyDelete
  9. Date : Nov-01-2025
    Place : Telengana Gharjana , Karimnagar

    Poraatalathone telengana saadhinchukundaam - KCR

    ReplyDelete
  10. @చదువరి

    రాష్ట్రం ఏర్పడక ముందు వున్న బడ్జెట్లు కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కువ ఆదాయం వచ్చింది, ఎక్కడ ఎక్కువ కర్చు పెట్టారు అనేది సమస్య. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంఘాణాకి సంబంధించిన నిధులు ఆంధ్రాకి దారి మళ్ళాయని, ఆ విషయం ఒప్పుకుంటూ రాత పూర్వకంగా అప్పటి TRCకి నివేదించినట్టు భార్గవ కమిటీ నివేదికలో స్పష్టంగా వుంది. ఆ తర్వాత TRC లేదూ, లెక్కలు చెప్పే అవసరమూ రాలేదు. లెక్కలు పాలకుల ఇష్టారాజ్యంగా మారాయి. అందుకే తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల వారీగా ఆదాయం, కర్చు సంబధించిన లెక్కలు అడిగినప్పుడు పక్షపాతాంధ్ర ప్రభుత్వం ఇవ్వకుండా మొహం చాటేసింది.

    ReplyDelete
  11. కూరిమి విరసంబైనను
    నేరములే తోచుచుచుండు నిక్కము సుమతీ

    అని శతకకారుడి నీతివచనం. ఈఆ రోజున అలాగే కనిపిస్తోంది మన ప్రవర్తనల తీరు. విడివిడగా ముక్కలు చెక్కలయితేనే అభివృధ్ధి కలుగుతుందనుకొనే మహానుభావులకు హితబోధలు చేయాలని చూసి తిట్లు తినకండి. అన్నదమ్ములలో ఇకరి తలలో పురుగు దూరినా కొంపకు చేటే. విధివ్రాత అనుకోవడమే తప్ప చేయగలిగింది యేమీలేదనిపిస్తోంది!

    ReplyDelete