నాలుగు లక్షల మంది ఉద్యోగులు, వాళ్లకు సంఘీభావంగా నాలుగు కోట్లమంది ప్రజలు ఉద్యమిస్తున్నా, ఈ తోలుమందం ఆంధ్రా బాజీ గవర్నమెంటుకు చీమ కుట్టుత లేదు. దోపిడీ శక్తులకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వానికి గాంధేయ వాదం పనికి రాదనీ అర్థమయ్యింది.
కాబట్టి ఉద్యమ దిశను మరో కోణం లోకి మార్చవలసిన అవసరం వచ్చింది. ఒకవైపు గాంధేయవాదాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఉద్యమం వలన కలిగే నష్టం తెలంగాణా ప్రజలకు కాక, దోపిడీ శక్తులకు, వాటికి కొమ్ము కాసే ప్రభుత్వాలకు ఆ నష్టాలు బదిలీ కావాలి. ఉద్యమాల రూపకల్పన ఆ విధంగా వుండాలి.
నలభై ఎనిమిది గంటల రైల్ రోకో కార్యక్రమం అలాంటి కార్యక్రమాలలో ఒకటి. దీనితో ఉద్యమమ తీవ్రత, ప్రభావం ఒక్క తెలంగాణాపై కాక పూర్తి దక్షిణ భారత దేశం పై పడింది. జాతీయ మీడియా ఎలాగూ దోపిడీ శక్తుల కొమ్ము కాస్తూ, ఉద్యమ వార్తలను ప్రసారం చేయడం లేదు. కాబట్టి తోటి భారతీయులకు ఉద్యమం గురించి తెలియ జెప్పాలంటే అంతర్రాష్ట్రీయంగా ప్రభావం చూపే పద్ధతులను అవలంబించడం తప్పని సరి.
ఇక పొతే ఏ హైదరాబాదుపై అలవి కాని నిర్లజ్జా పూరితమైన మక్కువతో సమైక్య శక్తులు రాష్ట్ర విభజనను అడ్డగిస్తున్నయో, ఆ హైదరాబాదుకి సీమాంధ్ర నుండి వచ్చే అన్ని మార్గాలను దిగ్బంధించి నిరవధికంగా మూసి వేయాలి.
హైదరాబాదులో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కబ్జాకోరుల ఆస్తులలో జెండాలు పాతాలి. తెలంగాణా ప్రజలు అలాంటి ఆస్తులు జప్తు చేసుకొని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా హైదరాబాదును అప్పనంగా దోచుకోవడం కలలో కూడా వీలుకాదు అనే భావన ఈ దోపిడీ శక్తులకు కలుగ జేయాలి.
ఇంకా ఇలాంటి పోరాట రూపాలను తెలంగాణా వచ్చే వరక్కు నిరంతరంగా రూపొందిస్తూనే వుండాలి.
:)
ReplyDelete"ఆ హైదరాబాదుకి సీమాంధ్ర నుండి వచ్చే అన్ని మార్గాలను దిగ్బంధించి నిరవధికంగా మూసి వేయాలి?" రైళ్ళలోనూ బస్సుల్లోను వచ్చేది సామాన్యులే... వాళ్ళని బెదిరించి ఆపగాలావ్. నువ్వన్న ఆ పెట్టుబడిదారులు కబ్జ్జ కోరులు సొంత విమానాల్లోనైన వస్తారు. వారినేట్ల ఆపుతావ్?
ReplyDelete"హైదరాబాదులో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కబ్జాకోరుల ఆస్తులలో జెండాలు పాతాలి".
వాళ్ళ లిస్టు నీ దగ్గర ఉంటే ఈ బ్లాగ్ లోనే పోస్ట్ చెయ్యి. ఇంతకి అలా ఆక్రమించుకుని కేసుల్లో ఇరుక్కునే జనాల్లో తమరు ఉంటారా..లేక మనకేందుకుచిన గోలలే అని ఇలాగె బ్లాగులు రాస్తూ రోజులు గడిపెస్తారా?
"తెలంగాణా ప్రజలు అలాంటి ఆస్తులు జప్తు చేసుకొని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి"
ఈ లైన్ బాగుంది , మంచి ఊపుమీద రాసునట్టున్నారు. కే సి ఆర్ ఇచ్చే హమిలలో ఇది కూడా చేర్చండి. ఇప్పుడు ఎవడు ఏది ఆక్రమించుకుంటే, తెలంగాణా వచ్చాక అది వాడిదే అని చెప్పండి, అప్పుడు ఉద్యమం రూపు మీరు చెప్పినట్టే మారుతుంది.
రాజ్ భవన్, అసెంబ్లీ, మంత్రులు, అధికారుల ఇళ్ళకు, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు కోసేస్తే దెబ్బకు దయ్యం దిగుతది. లేదంటే పెట్రోల్ బ్యాంకులు మూసేస్తే అంద్రోల్లు దిగి వస్తరు.
ReplyDeleteఉద్యమ స్వరూపం ఎప్పుడెప్పుడు మారుతుందా ఎప్పుడు అణచి పారెద్దామా అని వంద బెటాలియన్ల బలగాలతొ, ఎకె 47 లతో ప్రబుత్వం కూడా ఎదురు చూస్తోంది.
ReplyDeleteకాబట్టి నిజంగా ప్రత్యెక రాష్త్రం కావలనుకునెవారు ఇప్పతి అద్భుత శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తూనె రాబొయె ఎన్నికలలొ కర్రు గాల్చి వాత పెట్టే ప్రణాళికను సిధ్ధం చేయాలి .
ఎన్నికలు వోట్లు సీట్లు తప్ప ఈ మూడుకోతుల ప్రభుత్వానికి మరె ప్రజాస్వామిక ఆకాంక్షా అర్ధం కాదు,
Rajesh
రాజీలేని పోరాటాలూ, మిలిటెంట్ భావనలూ అసలుకే ఎసరు తేవొచ్చు. తెలంగాణవాదులు మిలిటెంట్ అయితే అది చరిత్రలో సువర్నాక్షరాలతో నిలిచిపోతది తప్ప తెలంగాణ రాదు. తెలంగాణవాదులు ఏ మేజర్ పొరపాటు చేస్తారా అని గమనిస్తూ కాసుక్కూసున్నారు ఆంద్రోల్లూ, సర్కారూ ! వాల్లు నిజాం కన్నా, బ్రిటిశోల్ల కన్నా బలవంతులు. ఏమైనా చెయ్యగలరు. అనుకోకుంట ఏదైనా పొరపాటు జరిగి ఉద్దెమం దారితప్పుతే వేలాది చావులు చూడాల్సి వస్తది. ఆ తరవాత ఏముంటది, తెలంగాణని శాస్వతంగా మర్చిపోవడమే.
ReplyDeleteభువనేస్వరో ఢిల్లీ నో చేన్నైయో వెళ్లల్సినవాడు తెలంగాణా వాళ్ళు చేసే రైల్ రోఖో కారణంగా వాడి పనులు చెడిపోతే, వాడు మనల్ని తిట్టుకుంటూ పోతాడ ? లేక దిగి వచ్చి మనల్ని ఉద్ధరిస్తాను అంటాడ?
ReplyDeleteమా రాష్ట్రాన్ని మేము విడకోట్టుకోవాలి.. తోటి భారతీయులు అందరు సహకరించండి అని అడిగే వాళ్ళకి జోహార్లు.
"అంతర్రాష్ట్రీయంగా ప్రభావం చూపే పద్ధతులను అవలంబించడం తప్పని సరి" అంటే ఏమిటో ఎలాగో కూడా సెలవిస్తే మంచిది. లేకుంటే మన ఔత్సాహికులు ఏ బెంగళూరు లోనో, చెన్నై లోనో వెళ్లి రైల్ రోఖో అంటూ దిగితే అక్కడ నాయకులకి ఆంధ్ర మరియు తెలంగాణా వోట్లతో పనిలేదు కాబట్టి, తగిన చర్యలు తీసుకోవటం మొదలు పెడితే మన హరీష్ రావు కి ఢిల్లీ AP BHAVAN లో జరిగిన పరాభవమే వీళ్ళకి దక్కేది.
రాసేదేదో పనికొచ్చేల ఉండాలి గాని ఇంకా నిప్పు రాజేసేది గ ఉండకూడదు. తోక అంటించి తమాషా చూద్దాం అనుకుంటే తగలబడేది మన లంకే.....
శ్రీకృష్ణకమిటీ చేసిన ఆరు సూచనల్లో ఒకదానికి - అంటే ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాన ఉన్న ఆరుజిల్లాలతోనే తెలంగాణ ఏర్పరచడానికి తెలంగాణవాళ్ళు ఒప్పుకుంటే ఈ క్షణంలో తెలంగాణ వచ్చేస్తుంది. ఎటొచ్చీ దాని రాజధాని వరంగల్ లో ఉంటుంది.
ReplyDeleteఅయ్యా శ్రీకాంతాచారి గారు చాలా నిరాశలొ మావోష్టులలాగా ఉద్రేకపడిపొతూ తీవ్రంగా అలోచిస్తూ రాతలు రాస్తున్నావు.శాంతం,సహనంతోనే ఎమైనా సాధించాగలం.
ReplyDeleteఏమి చేతకానివాడే ఉద్యమాలంటడు,మూర్ఖుడు మిలిటెంట్ దౌర్జన్యమంటడు, స్వంత అలోచన లేకుండా రాజకీయనిరుద్యోగుల మాటలు విని అవేశపడేవాడు "గోడలమీద పటాలు"గా మారి "600"చిల్లర కాకిలెక్కల గుంపులోకలసిపోతాడు.
విజ్ఞానం,వివేకం,సృజన కలిగినవారు "మెధా ఇంగ్లీష్ చిరంజీవి"లాగా(వరంగల్లు), ఫిల్మ్ డైరెక్టర్లు "దశరధ్"(ఖమ్మం),సురెంద్ర రెడ్డి(వరంగల్లు),"దిల్ రాజు-ప్రొడ్యూసర్"(నిజామాబాదు),ఉత్తెజ్,ఉదయభాను-ఆంకర్(కరీమ్నగర్),వేణుమాధవ్, "నితిన్-హీరో"(నిజామాబాద్), సుద్దాల అశొక్తేజ,పాటల రచయిత,(తెలంగాణా ప్రాంతం),చంద్రబోసు(తెలంగాణా ప్రాంతం), స్రీనివాసరెడ్డి-మిమిక్రీ,నటుడు,(తెలంగాణా ప్రాంతం), ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్,ఎడిటర్ వేమూరి రాధాక్రిష్త్న, జ్ఞానపీఠ పురస్కారవిజేత "డాక్టర్.సి.నారాయణ రెడ్డి గారు(కరీం నగర్ జిల్ల, అనుకుంటా(క్షమించాలి,ఈ మహానుభావుని వూరు పేరు సరిగా తెలియనందుకు)", చివరాకరికి "భారతదేశపు ప్రధానమంత్రిగా ఐదుయేల్లు పరిపాలించి దేశానికి దశ-దిశ చూపించిన రాజనీజ్ఞుడు శ్రీ పి.వి.నరసిమ్హారావ్" లాగ ఎంతో ఎత్తుకు వెళ్ళవచ్చు.
చూసావా ఇంతమంది తెలంగాణా ముద్దుబిడ్డలు సమైక్యాంద్రప్రదేశ్ లోనే విజయాలు సాధించారు, ఇంకా సాధిస్తున్నారు.పాజిటివుగా అలోచించు :)
మీ జీవితములో మీరు సాధించిన ఒక చక్కని విజయాన్ని చెప్పు,చూపించు ఈ ప్రపంచానికి(కనీసం మీ తల్లి,తండ్రులకైనా!).మీ మీద ద్వేషముతోనొ,వెటకారంగానో,మిమ్ములని దెప్పిపొడవాలని రాయలేదు మిత్రమా. ప్రమాణ్పూర్వకంగా సానుకూల దృక్పధముతోనే ఇదంతా వ్రాసాను(పోస్టు చేసిన సమయం గ్రహించు,ఎంత ఓపికగా టైపు చేసి కేవలం మీ కోసమే వ్రాసాను, నమ్మండి,నమ్మక పొండి మీఇష్టం).
"శాంతం సముద్రముకన్న గొప్పది". మీరు తిడతారొ,తప్పంటారొ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. :)
సూటిగా,
ReplyDelete"చూసావా ఇంతమంది తెలంగాణా ముద్దుబిడ్డలు సమైక్యాంద్రప్రదేశ్ లోనే విజయాలు సాధించారు, ఇంకా సాధిస్తున్నారు.పాజిటివుగా అలోచించు"
ఆంగ్లేయుల పాలనలో ఇంతకు మించిన మహానుభావులే జన్మించారు. మరి స్వాతంత్రం వద్దన్నామా?
"మీ జీవితములో మీరు సాధించిన ఒక చక్కని విజయాన్ని చెప్పు,చూపించు"
చూడండి, మీరు భ్రమల్లో వున్నట్టున్నారు. విజయం, అపజయం అనేవి మనం ఎంచుకునే ప్రాధాన్యతలని బట్టి ఆధార పడి వుంటాయి. మీరు అనుకునేవే విజయాలు అనుకుంటే, జయప్రకాష్ నారాయణ్ గారు రాజీనామాయే చేయవలసిన అవసరం లేదు. మహాత్మా గాంధీ న్యాయవాద వృత్తి వదల వలసిన అవసరం లేదు.
విజయం ఒక్కటే మన జీవితానికి కొలబద్ద కూడా కాదు. అదే కొలబద్ద అయితే కొలంబస్ అనుకున్న విజయం సాధించకుండానే మరణించాడు. అంత మాత్రాన అతన్ని చరిత్ర మరిచి పోలేదు. మీరేదో శ్రమ తీసుకుని వ్రాశానన్నారు కాబట్టి మీకు ఈ సమాధానం.