హైదరాబాద్: ప్రజాసంఘాలజేఏసీ నేత గజ్జల కాంతం సీమాంధ్రులకు తొత్తుగా మారాడని మాలమహానాడు నాయకులు, తెలంగాణవాదులు విమర్శించారు. తెలంగాణకోసం ఏనాడూ పోరాడని నీకు తెలంగాణకోసం అహర్నిషలూ కృషిచేస్తున్న కోదండరాంను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. ప్రజాసంఘాలపేరుతో తెలంగాణకు ద్రోహం చేస్తున్న నీలాంటి వాల్లు తెలంగాణవాదుల ఆగ్రహానికి గురికాకముందే పద్ధతి మార్చుకోవాలన్నారు.
ఇదీ న్యూస్ ఐటం.
మొన్న ఏదో ఒక చానెల్లో సకల జనుల సమ్మె విరమణ పై డిస్కషన్ పెట్టారు. దాంట్లో గజ్జెల కాంతం వాదన ఇలా వుంది.
"సకల జనుల సమ్మె కోదండరామిరెడ్డి ఎందుకు పెట్టినట్టు? తెలంగాణా ఉద్యోగులు, ప్రజలు ఎంతో నష్ట పోయారు. సరే, నష్టపోయినా ఫరవాలేదు. మరి ఎందుకు ఆపినట్టు? తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందే ఎందుకు విరమించారు?"
దళిత సంఘాలకు ప్రతినిధిని అని చెప్పుకునే ఈయన, కోదండరాంని కోదండరామిరెడ్డి అని సంబోధించడమే ఒక విచిత్రం. ఆయన పదే పడే అదేవిధంగా ఆయన పేరుని వ్యవహరించారు. జన్మతః రెడ్డి అయినా కోదండరాం తనంత తానుగా కులనామాన్ని పరిత్యజించారు. ఆయన వదిలేసినదాన్ని నొక్కి పలుకుతూ సగటు తెలంగాణా వ్యతిరేకుల్లా వ్యవహరించారు గజ్జెల కాంతం. ఆయనకు కోదండరాం తీసుకున్న నిర్ణయాలను గాక, ఆయన్ను వ్యక్తిగతంగా నిందిచే ఉద్దేశమే ఎక్కువగా వున్నట్టు కనపడింది.
ఇక పొతే సకలజనుల సమ్మె గురించి కాని దాని విరమణ గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన వున్నట్టు కనపడలేదు. ఒక వైపునుండి సమ్మె ఎందుకు మొదలు పెట్టినట్టు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సమ్మె వాళ్ళ ఉద్యోగులు, ప్రజలు నష్టపోయారు అని చెప్తారు. మళ్ళీ ఆయనే, నష్టపోయినా ఫరవాలేదు అంటారు. ఎందుకు విరమించారు అని ప్రశ్న వేస్తారు. ఈయన ధోరణికి ఆ చర్చ నిర్వహిస్తున్న సీమాంధ్ర శల్యునిగా పేరుపడిన ఒక ప్రముఖ యాంకరే ఆశ్చర్యపోవడం జరిగింది.
ఏ సమ్మె అయినా ఆశావహ దృక్పధంతో ఏదైనా సాధించాలనే చేస్తారు. ప్రభుత్వం మొండికేస్తే ఉద్యోగులు ఎంతకాలం సమ్మె చేస్తారు? అందుకనే కొన్ని విభాగాలు సమ్మె విరమించాయి. అలాగే విద్యార్థులు నష్టపోతున్నారని భావించి టీచర్లు కూడా సమ్మె విరమించారు. అయినా కూడా ఇంకా 135 యూనియన్లతో కోడిన ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలు సమ్మెలోనే వున్నాయి. ఒక వేళ ప్రభుత్వ ప్రలోభాలకు లోని సమ్మె విరమింప జేస్తే అందరినీ విరమింప జేయాలి కదా? మరి వీరంతా సమ్మెలో ఎందుకున్నట్టు? ఎంతకాలం సమ్మెలో కొనసాగాలన్నది ఆయా సంఘాల నిర్ణయానికే వదిలేసినట్టు దీన్ని బట్టి తెలుస్తూనే వుంది.
ఇలా ద్వంద్వప్రమాణాలతో మాట్లాడుతూ గజ్జెలకాంతం వ్యవహరిస్తున్న తీరు, పై ఆరోపణలు నిజమని తెలియజెప్పడం లేదూ?
ఇంకా అనలేదేంటా అని చూస్తున్నా.
ReplyDeleteసమైక్య వాదులు చేసే వాదనలే మక్కీకి మక్కీ చేసేవారు, సమైక్యవాదులం అని చెప్పుకుంటే కొంత బాగుంటుంది. అలా కాక ఒక వైపు మేమే నిఖార్సైన తెలంగాణా వాదులమని చెప్తూ, చేసేవి సమైక్యవాదులకు బలం చేకూర్చే వాదనలైనపుడు, అనకుండా ఎలా వుండగలరు?
ReplyDeleteప్రభుత్వం తెలంగాణా ఉద్యమాన్ని లిక్విడేట్ చెయ్యడానికి మొదటి నుంచి కులగజ్జిని ప్రోత్సహిస్తూనే ఉంది. వరంగల్ సభకి మంద కృష్ణని పంపించింది. మంద కృష్ణ కులగజ్జి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి దేశపతి శ్రీనివాస్‌పై దాడి చెయ్యించాడు. తరువాత కంచ ఐలయ్య అనే మేతావి చేత తెలంగాణా ఉద్యమం వెలమ దొరల ఉద్యమమని ప్రచారం చెయ్యించారు. మన్యసీమ జెఎసి పేరుతో ఇంకో సంస్థ ఏర్పాటు చెయ్యించి ఖమ్మంలో సకల జనుల సమ్మె విరమించాలని ర్యాలీ చెయ్యించారు. తెలంగాణా ఉద్యమాన్ని లిక్విడేట్ చెయ్యించడానికి పాలక వర్గంవాళ్ళకి కులం ఒక అస్త్రం.
ReplyDeletesuper praveen
ReplyDeleteప్రాంతీయ గజ్జితో కులగజ్జి కలిస్తే ఇలాగే ఉంటుంది.
ReplyDeletePraveen well said
ReplyDeleteIndia lo KULA GAJJI tho adukunnantha/gokkunnantha kaalam ilaage vuntundi,
ReplyDeletePraveen, I appreciate U.
Sridhar.
తెలంగాణముని దక్షిణ పాకిస్తానము అని సంబోధించిన ఒక ఆంధ్రా బింధ్రన్‌వాలే గారి భాష చూడండి: http://vizaghost.net/images/andhra_bhindranwale.png
ReplyDeleteఅవును, ఇలాంటి వారికి కలిసున్నంత కాలం south pakisthaniల మాదిరిగా కనబడతాం. అదే విడిపోతామనగానే మాత్రం తెలుగుజాతి గుర్తుకు వస్తుంది.
ReplyDeleteహైదరాబాద్ ఎలాగూ తమ చేతి నుంచి పోదు అనిపించినప్పుడు తెలంగాణావాళ్ళని దక్షిణ పాకిస్తానీయులనే తిడతారు, హైదరాబాద్ తమకి చెందకుండా పోతుందనిపించినప్పుడు తెలంగాణావాళ్ళు తమ సోదరులు అని అంటారు.
ReplyDeleteSrikant, Praveen:
ReplyDeleteIt was "Karunasri" Jandhyala Papayya who wrote "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" in 1969. The "poet" who shed "tears" for flowers was callous towards fellow humans.