Friday, October 14, 2011

హైదరాబాదు తెలంగాణాది, కాకపోతే ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు


హైదరాబాదు ఎవరికీ చెందాలి అనే టపా పెట్టగానే లోపల హైదరాబాదు మీద కోరిక పెట్టుకుని పైకి సమైక్యాంధ్ర అని మాట్లాడే కొంతమందికి కోపాలు వచ్చినట్టున్నాయి. వారి కోపతాపాలను తోచిన విధంగా ప్రకటిస్తున్నారు. వారి భాష, అందులోని పనికిరాని చెత్త పదాలన్నిటినీ తీసివేసి వారి ఆక్రోశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సహజంగా చెత్త విమర్శలకి మనం సమాధానాలివ్వం. కాని గురుడు హైదరాబాదు మీద తనకు హక్కే లేదని బాధ పాడుతుండే సరికి నా వివరణ వ్రాయాలనిపించింది.  

ఈ దేశంలోని ఏ నగరమైనా ఎవరిది? ఈ దేశంలోని ప్రతి ఒక్కరిది. అంటే ఈ దేశంలోని ప్రతి ఒక్కరు తమకు నచ్చిన చోటికి వెళ్లి బ్రతకవచ్చన్న మాట. అంతవరకే ఈ నగరం అందరిదీ.

అంతే కానీ బొంబాయి నగరం నాది, దాన్ని మా రాష్ట్రంలో కలపాలి అంటే? అది తెలివిలేని తనం తప్ప మరోటి కాదు. మనం ఒక నగరంలోకి వెళ్లి జీవించే, వ్యాపారం చేసుకునే హక్కు వేరు, ఆ నగరమే నాదనే హక్కు వేరు. నేను వ్యాపారం చేసుకున్నాను కాబట్టి ఆ నగరం నాదే అనడమయితే మూర్ఖత్వానికి పరాకాష్ట. సరిగ్గా మన సమైక్యవాద సోదరులు చేసే వాదన అదే.

ఏ ప్రాంతం వారైనా ఎక్కడికైనా వెళ్లి చట్టబద్ధంగా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు తప్పకుండా వుంటుంది. కాని ఈస్టిండియా కంపెనీల మాదిరిగా వ్యాపారాలతో మొదలు పెట్టి ప్రాంతాన్నే గుప్పెట్లో పెట్టుకుందాం. శాశ్వత కాలనీగా మారుద్దాం. ఆ ప్రాంతపు ప్రజల హక్కుల్ని కాలరాద్దాం ఆంటే ఊరుకునే సమస్యే లేదు. 

ప్రాంతం ఆంటే అదేదో చిన్నా చితకా ప్రాంతం కాదు. చిన్నా చితకా ప్రాంతమే అయ్యుంటే న్యాయమో అన్యాయమో నోర్మూసుకొని పది ఉండేది. కాని తెలంగాణా నాలుక్కోట్ల జనాభా గల ఒక పెద్ద ప్రదేశం. దేశంలో వున్న పద్దెనిమిది రాష్ట్రాల కన్నా వైశాల్యంలోనూ, జనాభాలోనూ పెద్దది. 

కానీ దురదృష్ట వశాత్తూ దానికన్నా పెద్ద రాష్ట్రమైన ఆంధ్రాకి కాలనీగా మారింది. మందబలం ఆంధ్రాది కాబట్టి తెలంగాణాకి చెందవలసిన ప్రజాస్వామిక హక్కులు తృణీకరించ బడుతున్నాయి. పెద్దమనుషుల ఒప్పందాన్ని మొదలుకొని ఒక్కొక్కటిగా తెలంగాణాకి చెందిన అన్ని హక్కులు వమ్ము చేయబడ్డాయి. ఆ హక్కులను కాపాడుకోవడం కోసమే తెలంగాణా వాదులు అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో అంతర్భాగంగా వున్న హైదరాబాదు కూడా ఆ హక్కుల్లో ఒకటి. అన్ని హక్కులతో పాటు ఆ హక్కు కూడా తెలంగాణా ప్రజలు సాధించుకుని తీరతారు.

24 comments:

  1. "మందబలం ఆంధ్రాది కాబట్టి తెలంగాణాకి చెందవలసిన ప్రజాస్వామిక హక్కులు తృణీకరించ బడుతున్నాయి. "
    మరే పాపం. నాలుగు కోట్ల మంది తెలంగాణా వాళ్ళు గాజులు తోడిగించుకుని కూర్చున్నారు. ఎంతకాలం ఇలా ఏడుస్తారు చారీ?

    ReplyDelete
  2. ప్రజాస్వామ్యంలో వోట్లు, సీట్లు వుంటాయి కాని గాజులు, తొడగడాలు వుండవ్. తమరు ఆకారణంగానేగా మద్రాసు నుండి పారిపోయి వచ్చింది. సరిపోయిందా చెంపమీద దెబ్బ!

    ReplyDelete
  3. "ప్రజాస్వామ్యంలో వోట్లు, సీట్లు వుంటాయి కాని గాజులు, తొడగడాలు వుండవ్"
    మరి మంద తక్కువుండి ఏం పీకలేని మీరు ఎవరో ఏదో దోచేసారని ఏడవడం ఎందుకు? మీ నాయకులు వెధవలు అన్న విషయం ఒప్పుకోలేక పక్కోడికి పడి ఏడ్చే మీరు ఎన్నటికీ ఎదగలేరు. గూబ గుయ్య్ మందా చారీ?

    ReplyDelete
  4. ఎవరి గూబ గుయ్యిమందో చదివే వాళ్ళకు తెలుస్తుందిలే. నీకు నువ్వే కొట్టుకోవడమెందుకు చెంపదెబ్బ!

    ప్రజాస్వామ్యం, వోట్లు, సీట్ల గురించి నీ కోడి బుర్రకు అర్థం కాదుగానీ, మందబలం వున్న తమిళులపై అధికారం గెలవలేక మీ ఆంధ్రా నాయకులు జై ఆంధ్రా ఉద్యమం చేసిన విషయం వివరాలు తెలుసుకునిరా. అప్పుడు మాట్లాడుకుందాం. ఆ ఉద్యమం చేసిన మీ నాయకులు వెధవలని నేనైతే అనను, ఎందుకంటే మీలాంటి వాళ్ళకంటే ఆ నాయకులు వందరెట్లు బెటరు కనక. వాళ్ళకు ప్రజాస్వామ్యం, వోట్లు, సీట్లు, మందబలం గురించి కనీస అవగాహన వుంది కనుక!

    ఎంత గూబ గుయ్యిమనిపించుకోవాలని నీకున్నా, నాకు సమయం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ రాస్తే ప్రచురించను.

    ReplyDelete
  5. >> అన్ని హక్కులతో పాటు ఆ హక్కు కూడా తెలంగాణా ప్రజలు సాధించుకుని తీరతారు.

    మొదలు కామెంట్ యే ప్రచురించకుండా భయపడే వాళ్ళు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది ప్రచురిస్తే తమ వాదం ఎక్కడ బలహీనమవుతుందో అని గింజుకునే వాళ్ళు హక్కులు సాధించటం గురించి ఊదరగొట్టటం.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. carry on...

    ReplyDelete
  6. హైదరాబాద్ ఇంకా మన రాష్ట్రం లోనే ఉంది. అందుకే మనది అనుకున్నారు - మాది అని మీరు అంటున్నారు. మనది అనుకోడానికీ, "మాది" అని అహంకరించడానికీ చాలా తేడా ఉంది. మా రాష్ట్రంలో బొంబాయిని కలపమని ఎవ్వరూ అడగలేదు. మన రాష్ట్రాన్ని విడగొట్టద్దు అని మాత్రమే అంటున్నారు.

    తెలంగాణా వారి ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తే, "సమ్మె" హక్కు ఎందుకు కాలరాయబడలేదు? హైదరాబాదు మీ హక్కు అంటున్నారు, ఉమ్మడి ఆస్తిలో ఒక్కరికే హక్కు ఎప్పటికీ ఉండదన్న విషయం మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

    భౌగోళికంగా హైదరాబాదు మీది అని మీరు అనుకుంటున్నారు, మానసికంగా మన రాజధాని అని రాష్ట్రం మొత్తం అనుకుంటోంది. హైదరాబాదు ఏమీ ఆంధ్రా కాలనీ కాదు, మన రాష్ట్ర రాజధాని. 4 కోట్ల తెలంగాణా వారికి మాత్రమే కాదు, మిగతా 6 కోట్ల తెలంగాణేతరులకి కూడా రాజధాని. మద్రాసు నుంచీ పారిపోయి ఇక్కడకి ఎవరూ రాలేదు. మన రాజధాని కనుక, మన తెలుగు రాష్ట్రం లో అందరికీ రాజధాని కనుక ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర రాజధాని అవబట్టే అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి. రాష్ట్ర రాజధాని కనుకనే అందరికీ ఈ ఊరితో అనుబంధం ఏర్పడింది. తెలంగాణా ప్రాంతంలో కాక మిగతా ప్రాంతంలో మరో నగరం రాజధాని అయ్యి ఉంటే అప్పుడు, ఆ రాజధానితో మీకు అనుబంధం ఏర్పడి, ఆ ఊరు మీది కాదు, అంటే అప్పుడు మీకు తెలిసేది ఆ బాధ ఏమిటో.....!!

    దౌర్జన్యంలో మీకు పోటీ ఎవరు రాగలరు? సాటి తెలుగువారిని మీరు అవమానించగలరు - ఆఖరికి అన్నమయ్యనే విరగ్గొట్టగలరు!! మీ ప్రాంతంలో పుట్టి పెరగని వారు (ఒక్కో సారి ఇక్కడ పుట్టి పెరిగినా, తాత ముత్తాతలు కూడా ఇక్కడ పుట్టని వారు )మీకు మనుషుల్లా కనపడరు - అదీ మీ తెలంగాణా వాదం. తెలంగాణా ని విడగొట్టద్దన్న ప్రతీవాడూ తెలంగాణా ద్వేషి. వాడిని ఏమైనా చేసే హక్కు మీకు ఉంటుంది -- మీకు తప్ప ఇతరులకి ఏహక్కూ లేకుండా చేస్తూ, మీ హక్కులని కాల రాసారని చెప్పడం విపరీతంగా లేదూ?

    ReplyDelete
  7. AnonymousOct 14, 2011 06:38 PM

    పేరుతో ఐడెంటిఫై చేసుకోలేనివారు ఎదుటివారు భయపడుతున్నారని చెప్పడం విచిత్రంగా లేదూ?

    ముందు సవ్యంగా వ్రాయడం నేర్చుకుని ఇక్కడికి రండి. తప్పకుండా ప్రచురిస్తాం.

    ReplyDelete
  8. నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యకుండా కేవలం హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేశాడు. అది కూడా తాను, తన భార్యలు, ఉంపుడుగత్తెలు & తన పిల్లల భోగ విలాసాల కోసం. రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా ఫర్వా లేదు, హైదరాబాద్ అభివృద్ధి చెందితే చాలు అనుకుంటున్న సమైక్యవాదులకి నిజాం ఆదర్శం కాదా? తెలంగాణా ప్రజలవి బాంచన్ దొర అని కాలు మొక్కే బతుకులు అని విమర్శించే అధికారం సమైక్యవాదులకి ఎక్కడిది? నిజాం మనవడికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తే నలమోతు చక్రవర్తి లాంటివాళ్ళు తెగ సంతోషిస్తారులే. వాళ్ళకి కావలసినది నిజాం వారసత్వమే కదా.

    ReplyDelete
  9. విరజాజి,

    మీరు పొరబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా వున్నంతవరకూ హైదరాబాదు మాది అన్నా తెలంగాణా మాది అన్నాకూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కాని హైదరాబాదు మాకివ్వండి, అప్పుడు మీరు విడిపోయినా ఫరవాలేదు. హైదరాబాదు మాకుంటే మాదీ వేర్పాటువాదమే, లేకుంటే మాత్రం మనం అన్నదమ్ములం, మాది సమైక్యవాదం అనే తప్పుడు వాదాలనే మేం దెప్పిపొడిచేది.

    >>>తెలంగాణా వారి ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తే, "సమ్మె" హక్కు ఎందుకు కాలరాయబడలేదు?

    అది కూడా చేసే వారు, మనం ప్రజాస్వామ్యంలో వున్నాం గనకా, పైన కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టూ అనేవి వున్నాయి గనకా, అతికష్టం మీద నిగ్రహించుకుంటున్నారు కానీ, లేకపోటే ఈ పాటికే రజాకార్లను మించి పోయేవారనడానికి సాక్షి ఉస్మానియాలో జరిగిన ఘటనలు. ఉస్మానియాలో జరిగిన దానికి కోర్టులు మొట్టికాయలు వేస్తే గానీ (రాష్ట్ర) ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.

    వెయ్యేందుకు, సాక్షాత్తూ భారత ప్రభుర్వ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ మీటింగు పెడితేనే, మన సమెక్కుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వక పోతే, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవలసి వచ్చింది.

    నిజాం ఆంధ్ర మహాసభలకు అనుమతిచ్చాడు కానీ, ఈ నయా ఆంధ్రా నిజాంలు పూర్తి అధికారం వుంటే మాత్రం ఏలాంటి అనుమతులు ఇవ్వరు అనేది సుస్పష్టం.

    >>>ఆ ఊరు మీది కాదు, అంటే అప్పుడు మీకు తెలిసేది ఆ బాధ ఏమిటో

    ఎవరన్నారు? చక్కగా ఉండండి మీ వూరైన హైదరాబదులో, తెలంగాణా రాష్ట్రంలో.

    >>>దౌర్జన్యంలో మీకు పోటీ ఎవరు రాగలరు? సాటి తెలుగువారిని మీరు అవమానించగలరు - ఆఖరికి అన్నమయ్యనే విరగ్గొట్టగలరు!!

    ఎందుకండీ అనవసరమైన మాటలు! నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు చెప్పిస్తారు నాతో? ఫ్యాక్షనిజానికి రౌడీయిజానికి పుట్టిల్లు ఎవరిదో రమగోపల్ వర్మను అడగాల్సిన అవసరం లేదు, ఐదేళ్ళ పిల్లవాడు కూడా చెప్తాడు.

    రాష్ట్రం కోసం మేం ఉద్యమాలు మాత్రమే చేస్తున్నాం, లూటీలు చేసి గణతికెక్కిందెవరో ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. తేడా అర్థమౌతుంది.

    >>>మీ ప్రాంతంలో పుట్టి పెరగని వారు మీకు మనుషుల్లా కనపడరు

    మళ్ళీ అదే వరస. మీకు తెలంగాణా ప్రజలే అసలు మనుషులుగా కనపడరు. అమాయకత్వం నటించకండి. కాని మేం మీలాగ కాదు, అవహేళనలు అనుభవించాం కాబట్టి మాకు తెలుసు మానవత్వం అంటే ఏమిటో. అది వదిలేసి డబ్బు, పెట్టుబడుల గురించి మాత్రమే ఆలోచించే వారు మీరు.

    ReplyDelete
  10. Well said Praveen గారు,

    బలహీనమైన తెలంగాణాలో వున్న బలమైన హైదరాబాదు ఆవిధంగా 1956లో సమెక్కుడు వాదుల కంటపడింది. మిగతా కథ అందరికీ తెలిసిందే.

    ReplyDelete
  11. చర్చింటానికి పేరు ముఖ్యమా, విషయం ముఖ్యమా చారీ? అలాంటప్పుడు anonymous ఆప్షన్ ఎందుకిచ్చినట్లు? నా పేరు ఫలానా అని తెలిస్తే నీ చర్చ కి వచ్చే లాభం? పోనీ నువ్వు ఏ శ్రీకాంతాచారో ఎవడికి తెలుసు? how it makes the difference between some unknown sreekanthachari and anonymous? పైగా నీ చేష్టలు కప్పిపుచ్చుకోవటానికి సవ్యం గా వ్రాయలేదని వంకలా? నేను ఆ టపా లో వ్రాసిన మిగిలిన వ్యాఖ్యలు చూసిన ఎవరికైన తెలుస్తుంది నువ్వు ప్రచురించని దాన్లో ఏమైనా తప్పు పదం ఉండే అవకాశం ఉన్నదో లేదో.

    చివరగా.. నేను నా పేరు మాత్రమే దాచిపెట్టాను.. నువ్వు విషయాన్నే కప్పిపెట్టావ్. భయమెవరికో తెలుసులే.. ఇదీ ప్రచురిస్తావని నమ్మకం లేదు.. కాని నీ ఆత్మవంచన తెలియచెప్పటానికే..

    ReplyDelete
  12. అదే మరి, నేనేవరైనా నాకు ఒక ID వుంది. నేనేదో భయపడుతున్నానన్నావు చూడు, అందుకని అలా అనవలసి వచ్చింది.

    >>> నేను ఆ టపా లో వ్రాసిన మిగిలిన వ్యాఖ్యలు

    అదే జోకంటే, ఐడీతో రాయకుండా మిగిలిన వ్యాఖ్యలంటే నేనెక్కడ వెదుక్కునేది?

    >>>నువ్వు విషయాన్నే కప్పిపెట్టావ్. భయమెవరికో తెలుసులే.. ఇదీ ప్రచురిస్తావని నమ్మకం లేదు.. కాని నీ ఆత్మవంచన తెలియచెప్పటానికే.

    ఇప్పుడు తెలిందిగా భయమెవరికో. సమైక్యవాదమని చెప్తూ హైదరాబాదు అడగడం, జై సమైక్యాంధ్ర అంటూ ఆంధ్రాలో పోయినేడాది స్కూళ్ళెగ్గొట్టి, ఇప్పుడు తెలంగాణాలో చదువులు పాడైపోతున్నాయని వాపోవడం, ఇలా చెప్పాలంటే చాలా వున్నాయి, వీటికన్నా ఆత్మవంచన ఏమైనా వుంటుందా ఈ లోకంలో?

    ReplyDelete
  13. అంత అమాయకత్వం నటించనక్కర్లేదు లే.. మరి ఇంతకు ముందు నేను వ్రాసిన కామెంట్ ఆ పైన వాటితో ఎలా పోల్చుకోగలిగావు? ఒక కామెంట్ sequence ఉన్నప్పుడు ఎవరు వ్రాసారో అర్ధమవుతుంది.. పైగా కొన్ని కామెంట్లు కనీసం ఒక్క తప్పు పదం లేకపోయినా edit చెసావో లేదో నీ మనస్సాక్షి కి తెలుసు.. నువ్వేమి వెతుక్కోనవసరం లేదు.. వాటి timeline చూసిన అర్ధం అవుతుంది. నీ బ్లాగేమి high hit-ratio ఉన్నదేమి కాదుగా.. సెకన్ల గ్యాప్ లో 10 మంది అనానిమస్ లు వ్రాయటానికి.

    అంత అమాయకత్వం నటించనక్కర్లేదు లే.. మరి ఇంతకు ముందు నేను వ్రాసిన కామెంట్ ఆ పైన వాటితో ఎలా పోల్చుకోగలిగావు? ఒక కామెంట్ sequence ఉన్నప్పుడు ఎవరు వ్రాసారో అర్ధమవుతుంది.. పైగా కొన్ని కామెంట్లు కనీసం ఒక్క తప్పు పదం లేకపోయినా edit చెసావో లేదో నీ మనస్సాక్షి కి తెలుసు.. నువ్వేమి వెతుక్కోనవసరం లేదు.. వాటి timeline చూసిన అర్ధం అవుతుంది. నీ బ్లాగేమి high hit-ratio ఉన్నదేమి కాదుగా.. సెకన్ల గ్యాప్ లో 10 మంది అనానిమస్ లు వ్రాయటానికి...

    సమైక్యవాదమని చెప్తూ మేము హైదరాబద్ అడగలేదు.. ఆత్మగౌరవం అంటూ ఒక నగరం కోసం దాన్ని తాకట్టు పెట్టే pseudo self respect గురించి ఆలోచించుకో..

    ReplyDelete
  14. @AnonymousOct 14, 2011 08:22 PM

    తమ సమాధానంలోనే తెలుస్తుంది తమ తెలివితేటలేమిటో. సెకన్ల లెక్కతో అది నువ్వో, ఇంకోడో నేను తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోవాలి? ఇలాంటి పిచ్చి రాతలు డిలెట్ చేయడం బెటర్ కాదూ!

    >>>సమైక్యవాదమని చెప్తూ మేము హైదరాబద్ అడగలేదు.

    దేశమంతా తెలుసు, మీరేం అడుగుతున్నారో. ఇలాంటి అర్థం పర్థం లేని వాగుడు వాగితే రిప్లై కూడా ఇవ్వను. దీనికైనా ఏదో ఏడుస్తున్నావు కదా అని రిప్లై ఇస్తున్నాను. అర్థవంతమైన చర్చ జరిపితేనే ఎవరితోనైనా చర్చించేది. Now you may please get out of here.

    ReplyDelete
  15. శ్రీకాంతాచారిగారూ,
    ఎవరిని యెవరూ దుమ్మెత్తిపోసుకోవటం వలన సమస్యలు పరిష్కారం కావు. ప్రతివారూ యెదుటివారే సమస్యకు మూలం అని నమ్మటం వల్ల వ్యర్ధవాదాలు తప్ప యేమీ జరగవు. ఎవరి వైపు యెంత సత్యం ఉందన్న విషయం అటుంచి మీరు వాడు తున్న భాష కొంత అభ్యంతరకరంగా ఉంది. తరచు మీరు ఆవలివ్యక్తిని యేకవచన ప్రయోగంతో పిలుస్తున్నారు. అది అంత ఉచితం కాదని నా మనవి. సమైక్య అన్న సరైన పదం మీకు సుపరిచితమే నని మీ రాతల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయనా ఎకసెక్కెంగా 'సమెక్కుడు' అన్న పదం కేవలం ఆవలి పక్షం వారిని అవహేళన చేయటానికే వాడుతున్నారు. అది సబబు కాదని నా అభిప్రాయం. ఎలాంటి దూషణలు, దుర్భాషలు, హేళనలు లేకుండా వ్యాఖ్యానించే వారికే ఆహ్వానం అని మీరు మీ బ్లాగు గురించి పరిచయంలో రాసుకున్నారు. చాలా సంతోషం. మీరే హేళనాస్వరంతో ప్రసంగించదగునా చెప్పండి. కేవలం హేళనలకు జవాబు చెబుతున్నా ఆవలివారి పధ్ధతిలోనే అంటారా - అదీ సబబుకాదు. మీరు సంయమనం కోల్పోయి మీరే వద్దన్న దుర్భాషలు చేయనవుసరం లేదు. ఇరుపక్షాలూ సబామర్యాదలు ఉల్లంఘింకుండానే విమర్శలూ ప్రతివిమర్శలూ భేషుగ్గా చేసుకోవచ్చును. శేషం కోపేన పూరయేత్ అన్నట్లుగా యెవరూ హద్ధు మీర నవుసరం లేదు. తెలంగాణా వాదాన్ని తెలుగువారికి బలంగా వినిపించేందుకు ఉద్దేశించిన బ్లాగు కాబట్టి మీరు అది సమర్ధంగా చేయగలరని తెలుస్తోంది కాబట్టి, ఒక సలహా. మంచి భాషలో, మంచి ధోరణిలో కేవలం విషయానికే పరిమితం అయతే బాగుంటుంది. కాదూ తెలంగాణా వాదాన్ని తెలంగాణావారికే బలంగా వినిపించేందుకు ఉద్దేశించిన బ్లాగు యిది తెలంగాణేతరులు యేమాత్రం మాట్లాడకండి అంటారా మంచిది. అలాగే. తెలుగువారికి అని ఆంధ్రజాతిమొత్తాన్ని ఉద్దేశించి నప్పుడు మీకు అభిందనలూ నిరసనలూ కూడా వస్తాయి మరి. కోపం వదలి యితరుల అపోహలను చేతనయినంత సామరస్యంగా తొలగించే ప్రయత్నం చేయండి. నిరసించే వాళ్ళందరూ నికృష్టు లన్నట్లు మాట్లాడటం ఉచితంగాదు.

    ఇక్కడ నడుస్తున్న పధ్ధతి నచ్చక నేను యింక మౌనం వహిస్తున్నాను.

    ReplyDelete
  16. ఈ 'Now you may please get out of here' లాంటి మాట మీ చేత అనిపించుకొనే ముందే నేనే స్వయంగా 'get out of here' అయపోతున్నాను, ఒక క్షణం ముందే నేను చెప్పిన ముగింపు వాక్యం యెంత మంచిదయింది! సెలవు.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. మీరు శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి కామెంటినందుకు, శ్రమ తీసుకుని సందేశం ఇచ్చినందుకు చాలా సంతోషం శ్యామలీయం గారు.

    మీరు వ్రాసిన సుదీర్ఘ వ్యాఖ్య చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం 'సమెక్కుడూ అనే పదం ఉపయోగించినందుకు తమరు మిగుల బాధ పడ్డారని.

    మెక్కే వారే సమైక్యత కోరుతున్నారని మా నిశ్చితాభిప్రయం. అందుకే అలంకార యుక్తంగా సమెక్కుడు అని వ్రాశాం. అది మీకు తిట్టుగా అనిపిస్తే చేయదగింది లేదు.

    మరో మాట, మీరు ఆవుతోలు కప్పుకొని ఇక్కడికి వచ్చి వ్యాఖ్యానించినా, మీరు ఏయే బ్లాగుల్లో ఎలా బ్రాగుతున్నది చూడడం లేదనుకోకండి. అలాగే KCRని, తెలంగాణాని, తెలంగాణా ప్రజలని ఇష్టం వచ్చినట్టు తిడుతున్న బ్లాగుల్లో మీరు ఆనందంగానే కామెంట్లు పెడుతున్నారు తప్ప, ఎక్కడా మీ "సమైక్యతా స్ఫూర్తి" ని ప్రదర్శించినట్టు, అలాంటి వారిని వారించినట్టు కనపడనందుకు మిగుల విచారిస్తున్నాను.

    చివరగా మీరు ఈరోజే చేసిన వ్యాఖ్యల్లో కొన్ని భాగాలు.

    క.చ.రాగారు చెప్పినట్లు తెలంగాణా వాళ్ళందరికీ (యెంతమంది మిగిలుంటే అందరికీ) అక్షరమ్ముక్క చదవుకోకపోయినా ఆఫీసరు ఉద్యోగాలొచ్చేస్తాయి

    ప్రత్యేక తెలంగాణావాద భండాసురులు మరిదేనికీ ఒప్పుకోరే

    తమరు కచరా అనే పద ప్రయోగం ఏ వుద్దేశంతో చేశారో తెలియనంత అమాయకులు కారు తెలంగాణా వారు. "భండాసురులు" అని మీరు ఏ వుద్దేశంతో అన్నా మాకు మాత్రం తిట్టులాగానే వినబడినందుకు విచారిస్తున్నాను.

    చివరగా తమరే సెలవిచ్చిన మరో మణిపూస.

    తిట్లపురాణం ప్రారంభించి అవుతలివాళ్ళు తిట్టటం మాత్రం రెచ్చగొట్టటం అని రంకెలేస్తే యెలా?

    అది కేవలం సమైక్య వాదులకే వర్తిస్తుంది కాబోలు. ఇంతటి జాణతనం చూపించే మీరు సమెక్కుడు అన్నందుకే అంతలా బాధపడి పోతున్నరంటే ఆశ్చర్యంగా వుంది. ఆ పదం సమైక్యత పేరు చెప్పి మెక్కే వారి నుద్దేశించింది. ఇలాంటి ప్రయోగాలు ఈనాటి జర్నలిజంలో మామూలే. మీరు భుజాలు తడుముకుంటానంటే అభ్యంతరం లేదు.

    అనానిమస్‌గా వస్తూ నన్ను పేరు పెట్టి ఏకవచనంతో సంబోధిస్తూ రాసినవారి కామెంట్లు మీకు కనిపించలేదు. వారికిచ్చిన సమాధానం మాత్రం మీకు కనబడుతుంది. మీ సమైక్య తత్వం ఏమిటో బాగానే అర్థం అవుతుంది. "సమైక్యత" అంటే ప్రాంటీయ పక్షపాతం అన్నమాట! భేష్!!

    తాలిబాన్లతో పోలుస్తూ సాటి తెలుగువాళ్ళని "తెలబాన్" అని సంబోధించే బ్లాగుల్లో తమరు హాయిగా విహరించి వస్తూ, ఇక్కడికొచ్చి మాత్రం కుహనా సమైక్యవాదం బొధించాలని అనిపించిందా మీకు? ఈ బొధనలు ముందు అక్కడ చేయండి.

    మీరు గాంధారీ వ్రతం పూని మౌనం వహిస్తున్నందుకు విచారించడమైనది.

    ReplyDelete
  19. >>>ముగింపు వాక్యం యెంత మంచిదయింది! సెలవు.

    తలంటు ముండే వూహించారన్న మాట, శుభం!

    ReplyDelete
  20. నేనైతే హైదరాబాద్ మీద బెంగతో లేను మిత్రమా :) మీ నాలుగున్నర కోట్ల మంది కలిసినా ఒక్క సీమాంధ్ర వ్యక్తిని కూడా బయటికి పంపలేరు.తల్లక్రిందులుగా తపస్సు చేసినా,దౌర్జన్యం చేసినా కూడా.కావాలంటే ప్రయత్నించి చూడు. ఫలితమెలాగ వుంటుందో. మేము సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాం. ఇక్కడ ఎవరూ అస్తిత్వం కోసం పొరాడం లేదు.మీరే లేని హక్కులు వూహించుకుని పగటికలలు కంటున్నారు. మీరు కనీసం హైదరాబాదులో ఆటోలని(తెలంగాణా వారివైనా కూడా) ఒక వారం పాటు తిప్పకుండా ఆపండి చూద్దాం(రాత్రుళ్ళు కూడా). సకల జనుల సమ్మె జరుగుతుంటే తెలంగాణా వారి స్కూళ్ళు ఎలా నడుస్తున్నాయ్.సెట్విన్ బస్సులు ఎలా తిరుగుతున్నయ్! బార్లు,సారాయి దుకాణాలు,సినిమాలు ఎందుకు నడుస్తున్నయ్. దమ్ముంటే సమాధానం చెప్పు.
    అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంటే అక్కడ విదేశీయులని కూడా బయటికి పంపలేరు.సిటిజన్‌షిప్ వస్తే పూర్తి హక్కులు వస్తయ్ అక్కడి అమెరికా పౌరులకి మల్లె.5-6 యేళ్ళ క్రితం వెళ్ళి సిటిజన్షిప్ సంపాదిస్తేనే అక్కడి ప్రభుత్వం, ఎవరూ ఏమి చేయలేనప్పుడు. నేను లేదా సీమాంధ్రులు ఎందుకు హైదరాబాదు మీద తెలంగాణా మీద దిగులు పెట్టుకుంటామో నాకైతే భారత పౌరుడిగా, ఒక తెలుగు వాడిగా,ఆంధ్రప్రదెశ్ వాడిగా ఎంత ఆలోచించిన అర్థం అవటం లేదు. మీరే గట్టిగా తెలంగాణా అడిగితే ఎక్కడ హైదరాబాద్ లేకుండా తెలంగాణా ఇస్తారేమో అని అభద్రతాభావంతో ఉలికి పడుతున్నారు. చివరాకిరిగా ఎవరి స్వంత బ్లాగులలో వారు ఇష్టమొచ్చినట్లు వ్రాసుకోవచ్చు, చిక్కేమిటంటే కామెంట్లని స్వీకరించడం,సమాధానాలు ఇవ్వడమే చాలా కష్టం మరీ ముఖ్యంగా అబద్దపు పోస్టులు వ్రాసి నప్పుడు :)

    ReplyDelete
  21. >>> మీ నాలుగున్నర కోట్ల మంది కలిసినా ఒక్క సీమాంధ్ర వ్యక్తిని కూడా బయటికి పంపలేరు.

    పంపుతామని ఎవరన్నారు? చివరకు మీరు తిట్టే కేసీయార్ కూడా ఎన్నో సార్లు చెప్పాడు, ఇక్కడ సెటిలైనోళ్ళు ఇక్కడే భేషుగ్గా బతకొచ్చని. మీరు వినమని భీష్మించుకుంటే ఎవరేం చేసేది?

    >>>.తల్లక్రిందులుగా తపస్సు చేసినా,దౌర్జన్యం చేసినా కూడా.కావాలంటే ప్రయత్నించి చూడు.

    ఇదింకో అనవసర ప్రసంగం.

    >>>ఫలితమెలాగ వుంటుందో.

    అహా! మరి ఇవే ఎక్స్ట్రాలంటే. మహా చిలిపి!


    >>>మీరు కనీసం హైదరాబాదులో ఆటోలని(తెలంగాణా వారివైనా కూడా) ఒక వారం పాటు తిప్పకుండా ఆపండి చూద్దాం.

    మీ పచ్చకామెర్ల కళ్ళకు జరిగే సమ్మె కనపడదు. బస్సులాపితే రైళ్ళాపాలి. రైళ్ళాపితే మందుకొట్లాపాలి. అవీ ఆపితే ఆటోలాపాలి. అసలు తెలంగాణా మొత్తం ఆగిపోతే అదో వెర్రి సరదా మీలాంటోళ్ళకు. మేం సమ్మె చేసేది ఏదో ఒకటి ఆపడానికి కాదు, మా వాణి ప్రభుత్వం చెవికెక్కడానికి. ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు.

    మీలాగా రాష్ట్రం పేరు చెప్పుకొని దొమ్మీలు, లూటీలు చేయం లెండి.
    http://kotiratanalu.blogspot.com/2011/10/blog-post.html
    http://kotiratanalu.blogspot.com/2011/10/2.html
    ఆ హామీ నాది. సరేనా?

    >>>(రాత్రుళ్ళు కూడా)

    ఒహో! ఒకేళ పగలు మొత్తం ఆపినా ఆపుతారేమోనని అనుమానం వచ్చి ఈ కండిషను పెట్టారా! భలే భలే! బహుషా అంతవరకు రాకపోవచ్చు లెండి.

    >>>నేను లేదా సీమాంధ్రులు ఎందుకు హైదరాబాదు మీద తెలంగాణా మీద దిగులు పెట్టుకుంటామో నాకైతే భారత పౌరుడిగా, ఒక తెలుగు వాడిగా,ఆంధ్రప్రదెశ్ వాడిగా ఎంత ఆలోచించిన అర్థం అవటం లేదు.

    ఆలోచించ వలసిన అవసరం కూడా లేదు. నిర్భయంగా వుండండి, ఈ హైదరాబాదు మీదే, ఈ తెలంగాణా మీదే. అక్కడ వుండి పక్షపాత పాల్న రుద్దేవోళ్ళమీదే మాపోరాటం. మీరు ఆ బాపతు కాకపోతే సరే.

    >>>మీరే గట్టిగా తెలంగాణా అడిగితే ఎక్కడ హైదరాబాద్ లేకుండా తెలంగాణా ఇస్తారేమో అని అభద్రతాభావంతో ఉలికి పడుతున్నారు.

    ఉలికి పడడాలు, వేచి చూడడాలూ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణా వచ్చే వరకు తెగించి పోరాడుడు మాత్రమే.

    >>>చిక్కేమిటంటే కామెంట్లని స్వీకరించడం,సమాధానాలు ఇవ్వడమే చాలా కష్టం

    అవును, ఇలాంటి చెత్త కామెంట్లకు సమయం వృధాచేసి పద పదానికి సమాధానం ఇవ్వవలసి రావ్డం వుంది చూడూ, అది చాలా కష్టం. అయితే మా గోడు కొంతన్నా మీకు అర్థమౌతుందేమోనన్న చిన్న ఆశ.

    >>>మరీ ముఖ్యంగా అబద్దపు పోస్టులు వ్రాసి నప్పుడు

    ఎవరిది అబధ్ధం, ఎవరిది నిజం నిర్ణయించడానికి తమరు కృష్ణ పరమాత్మ వేషం వేశారా? నేను వ్రాసిన దాంట్లో ఇదీ అబద్ధం అని ఒక్క విషయం చెప్పలేని వారు, చివరగా ఏక మొత్తంగా అబద్ధం అని తేల్చడం చూస్తే తెలియడం లేదూ ఎవరివి అబద్ధాలో?

    చివరిగా: ఈసారైనా అబద్ధాల డొంకతిరుగుళ్ళు వదిలేసి కాస్త "సూటిగా" వ్రాయడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు. :)

    ReplyDelete
  22. సమ్మె అయిపోయింది. సీ యం ముందే గట్టి చర్యలు తీసుకొని ఉంటె ఎప్పుడొ ముగిసి పోయేది.
    స్వామి గౌడ్ కి ఞానోదయం అయ్యింది. మిగతా వారికి త్వరలో అవుతుంది.
    సమ్మెలో సాధారణ ప్రజలు ఎవ్వరూ లేరు. టీఆరెస్ కార్యకర్తలు తప్ప.

    ఆర్టిసి ని వదిలేసారేం బాబూ..తెలంగానా వచ్హెసిందా ?

    ReplyDelete
  23. నా తెలంగానా మూగబోయిన వీణ !

    ReplyDelete
  24. సూటిగా,

    మీ కామెంటులో కొన్ని అభ్యంతరకరమైన పదాలున్నందున తొలగించబడింది.

    ReplyDelete