తనకు వోటు వెయ్యని వారిని పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేయడం అభ్యంతర కరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరికైనా వోటు వేసే హక్కు వుంటుంది. ఆ క్రమంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి వోటు వేస్తే తప్పేంటి?
నిజానికి పోచారానికి గత ఎలక్షన్ల కంటే ఇప్పుడు రెట్టింపు మెజారిటీ వచ్చింది. అప్పుడు కూడా తెలుగుదేశం, తెరాస కలిసి పోటీ చేశాయి. అయినా కూడా ఇప్పుడు రెట్టింపు వోట్లు వచ్చాయంటే అది కేవలం ఉద్యమ తీవ్రతవల్ల మాత్రమే.
నిజానికి తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు పోచారం ఆ ప్రాంతంలో తెలంగాణా వాదులకు, తెలంగాణా పేరెత్తిన వారికి చేసిన సన్మానాలు ఇంకా చాలామంది మరచి పోలేదు. అయినా కూడా పెద్ద మెజారిటీతో గెలిపించారంటే కారణం ఆయన్ను చూసి కాదు, తెలంగాణా వాదాన్ని గెలిపిద్దామని మాత్రమే. ఆ క్రమంలో కొంత వ్యతిరేక వోటు పక్కవాడికి పడడంలో ఆశ్చర్యం కనిపించదు. పోచారం ఈరోజు పార్టీ మారి తెరాస తీర్థం పుచ్చుకోగానే సిసలైన తెలంగాణా వాదిగా మారిపోయాడని అందరూ నమ్మాలనేముంది?
ఇక్కడ గమనించ వలసిన ఇంకో విషయమేమిటంటే, అక్కడ పోటీ చేసింది ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీనివాస గౌడ్ కూడా తెలంగాణా ఇచ్చేదీ తెచ్చేదీ మేమే అంటూ బలంగా ప్రచారం చేయడం ఇక్కడ గమనిచాల్సిన విషయం. అటువంటప్పుడు పోచారానికి వ్యతిరేకంగా పడ్డ వోట్లు తెలంగాణాకి వ్యతిరేకంగా పడ్డట్టు ఎలా అవుతాయి?
దీనికి తోడు అక్కడ గిరిజనుల జనాభా కూడా ఎక్కువగానే వుంది. అమాయకులైన గిరిజనులు వారి నేతలు ఏం చెప్తే అదే వింటారు. ఆ గిరిజన నాయకులను కాంగ్రెస్ డబ్బుతో కొనడం పెద్ద విషయం కాదు. ఇలాంటివి నివారించాలంటే తెలంగాణా ఆవశ్యకత గిరించి మరింత లోతుగా వారికి వివరించే ప్రయత్నం చేయాలి తప్ప వారిని ద్వేషించడం పరిష్కారం కాదు.
తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరగానే తెలంగాణావాది ఐపోడని, తెలంగాణా నిజాయితీగా పోరాడినప్పుడే ప్రజల విశ్వాసం చూరగొంటాడని ఇప్పటికైనా పోచారం గ్రహిస్తే మంచిది.
బాగా చెప్పారు.
ReplyDeleteప్రజల్లో వున్నబలమైన తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను
ఏ పోరాటాలు, ఏ త్యాగాలు చేయని నేతలు కాష్ చేసుకుంటున్నారు.
అహంకారం తో కూడిన మాటల ద్వారా ఉద్యమానికి చేటు చేస్తున్నారు.
కెమెరాల ముందు మాట్లాడేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకోవడం నేర్చుకోవాలి.
తప్పుడు కూతలు కూసినప్పుడు మీలాగే తెలంగాణా వాదులు వారిని హెచ్చరించాలి.
టీ ఆర్ ఎస్ తెలంగాణా ఉద్యమానికి ఎంత మేలు చేసిందో ఈ తొందరపాటు మాటలతో అంత కీడు చేస్తోంది.
శత్రువు బలంగా వున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి.
తస్మాత్ జాగ్రత్త
Raju, Hyderabad
One of the sane posts from this blog. Keep it up
ReplyDeleteSettlers supported Telangana even in 2010 bye-elections, when Pocharam & co. did Babli drama along with Babu.
ReplyDeletenice post
ReplyDeleteThis is the good post from you I very much like this post
ReplyDelete