Wednesday, October 12, 2011

ఉద్యమం, లాభ నష్టాలు

సకల జనుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో సమ్మె కారణంగా కనీసం తెలంగాణా ప్రాంతంలో ప్రభుత్వం స్తంభించి పోయింది. మొదట సమ్మెవల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు అని బుకాయింప జూసిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, సెగ కేంద్రానికి తాకి, వారు గట్టిగా నిలదీసేసరికి ఒప్పుకోక తప్పలేదు. పర్యవసానంగా కేంద్రంతో క్లాసు పీకిన్చుకోక తప్పలేదు. మొదటే సమ్మె తీవ్రతని కేంద్రానికి నివేదించి నిజాలను వివరించి వుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. 

కాని రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న సమైక్యవాదులు సమ్మె సెగ కేంద్రం వరకూ వెళ్ళకుండా చేయగాలిగినంతా చేశారు. కాని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి లేదని ఎలా బుకాయించ లేరో, అలాగే నాలుక్కోట్ల మంది ప్రజలు జరుపుతున్న సకలజనుల సమ్మె తీవ్రత కేంద్రం దృష్టికి రాకుండా చేయలేక పోయారు.

ఇన్ని రోజులుగా ఉత్పత్తి సంస్థలు, విద్యాలయాలు, గర్వర్నమెంటు కార్యాలయాలు మూతబడి వుంటే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా? మరి సమైక్యవాదుల నిర్వచనం ప్రకారం బాధ్యత ప్రభుత్వాలది కాదు, సమ్మె చేసేవారిదే నట!

ఎవరైనా సమ్మె ఎందుకు చేస్తారు? తమ కోరికలు ప్రభుత్వం విననప్పుడు, విన్నా పట్టించుకోనప్పుడు, తమ కోరికల తీవ్రతని తెలియజేయడానికి సమ్మె చేస్తారు. అటువంటప్పుడు ప్రభుత్వం సమ్మె చేసే వారిని ప్రభుత్వం పిలిచి చర్చలు జరపడం, తగిన హామీలివ్వడం ప్రభుత్వం కనీస బాధ్యత. కాని, ఇంతవరకు ప్రభుత్వం చర్చలకు పిలిచింది లేదు, ఎలాంటి హామీ ఇచ్చింది లేదు. మరి సమ్మె చేసేవారు ఎలా ఆపుతారు?

ఈలోపు ప్రభుత్వం చేత ప్రేరేపించబడ్డ కొంతమంది విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని గోల పెట్టడం మొదలు పెట్టారు. నిజమే, విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యార్థులకే కాదు, రైతులకు, కూలీలకు, సామాన్య ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఇది ఏ ఉద్యమంలోనైనా జరిగేదే. ఆ మాటకొస్తే రెండేళ్ళ క్రితం జరిగిన సమేక్కుడు ఉద్యమంలో స్కూలు పిల్లలను రోడ్లపై ఎండలో నిలబెట్టి మానవ హారాలు కట్టి నానా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు కోకొల్లలు. 


అప్పుడు ఏ నలమోతు చక్రవర్తికి గాని, పరకాల ప్రభాకర్ కి కాని విద్యార్థుల చదువుల విషయం గుర్తుకు రాలేదు. తమ ప్రాంతం వారి చదువులకు నష్టం కలుగుతున్నప్పుడు పట్టించుకోని వారు, తెలంగాణా ఉద్యమం సందర్భంగా ఏర్పడుతున్న అదే రకమైన నష్టాలను ఎత్తి చూపడం ఏరకంగా అర్థం చేసుకోవాలి? ఒక వేళ నిజంగా వారికి తెలంగాణా విద్యార్థులపై వారికి అంత ప్రేమే వుంటే ఉద్యమకారులని కాక వారు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా? వీరికి ఉన్నది తెలంగాణా విద్యార్థులపై ప్రేమ కాదు, వీరి ప్రేమ తెలంగాణా వనరులను దోచుకోవడం పైనే అన్నది సుస్పష్టం.

ఇక పొతే విద్యార్ధు చదువులకి నష్టం కలిగించడం వ్యక్తిగతంగా ఎవరికీ ఇష్టం కాదు. విద్యార్థులు ఎవరో కాదు, ఉద్యమంలో పాలు పంచుకుంటున్న వారి పిల్లలే. ఇప్పుడు ఇంట ఉధృతంగా సమ్మె జరుగుతుండడం వల్లనే ఏడు సంవత్సరాలుగా నానుస్తున్న సమస్యపై గత వారం రోజులనుండి కేంద్ర ప్రభుత్వం పాతిక సమావేశాలు జరిపి చర్చించింది. ఈ దశలో ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కి తగ్గినా, ఉద్యమం చల్లారి పోయిందనీ, ప్రజలు సమైక్య వాదాన్ని కోరుకుంటున్నారనీ ఊదరగొట్టుతూ విషప్రచారం చేయడానికి సమెక్కుడు మీడియా సదా సిద్ధంగా వుంటుంది. అంతా సవ్యంగా ఉంటుందని చెప్పడానికి, తద్వారా తెలంగాణా సమస్యను మరో ఏడు సంవత్సరాలు వెనక్కి నెట్టడానికి కొంతమంది దళారీలూ, సమైక్యవాద ప్రభుత్వమూ సిద్ధం.

ఈ కుట్రలో భాగంగానే విశాంధ్ర చక్రవర్తులూ, దళిత మేధావులూ, చదరంగంలో పావుల్లాగా రంగంలోకి దించబడుతున్నారు లేదా దిగుతున్నారు. కాని తెలంగాణా ఉద్యమం ఇప్పుడు నిర్ణయాత్మక దశలో వుంది. కోదండరాం గారి నాయకత్వంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు దారి తీయకుండా, సంయమనం కోల్పోకుండా దేశ చరిత్రలో కనీ విననటువంటి విధంగా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ దశలో వెనక్కు తగ్గడం ఉద్యమానికి ఆత్మహత్యా సదృశమే.

అయితే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించి తెలంగాణా సమస్యపై చర్యలు తీసుకోక ఎక్కువ రోజులు కాలయాపన చేస్తే మటుకు, ఉద్యమం దిశను మార్చి మరో విధంగా కొనసాగించ వలసి వుంటుంది. ఎందుకంటే ఉద్యమంలో ప్రభుత్వాలకంటే ఎక్కువగా ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు జరిగే నష్టమే ఎక్కువ. 


9 comments:

  1. శుభం. ఎలాంటి హింసా లేకుండా ఉద్యమాలు జరిగితే మంచిదే. కాని, అది నిజమా? తెలంగాణా ఉద్యమంలోని భయంకరహింస కేవలం తెలంగాణా ఉద్యమకారులమని చెప్పుకొనే వాళ్ళకు మాత్రమే కనబడదు. ఇతరులకు వాక్స్వాతంత్ర్యం ఉండటాన్నికూడా అంగీకరించని ఉద్యమం నిరశించ దగ్గది కాదా? ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోదని గోలచేసే వీరి వైఖరి మాత్రం పరమమొండిది గాదా? తామేదో అమృతం చిలుకుతూ పలుకుతున్నట్లు యితరుల వన్నీ విషప్రచారా లనేయడమేనా? భలే!

    ReplyDelete
  2. ఆ భయంకర హింస ఏమిటో తమరు సెలవిస్తే బాగుండేది.

    ఎవరు వాక్స్వాతంత్ర్యం లేకుండా వున్నది? రోజూ హైదరాబాదులో ఎంతమంది తెలంగాణా వ్యతిరేకులు తిరగడం లేదు?

    ఎక్కడ వాక్స్వాతంత్ర్యం లేకుండా వున్నది? ముక్కుసూటిగా విజయవాదలో లగడపాటిని ప్రశ్నించిన విలేఖరికి పట్టినగతి మరిచారా? విజయవాడలో ప్రత్యేకాంధ్ర సాధన సమితి ఏర్పాటు చేయబోయిన సభకి ఏగతి పట్టిందో మరిచి పోయారా.

    ఒక్కటి మాత్రం నిజం, ఉద్యమావేశంతో రగిలి పోతున్న తెలంగాణ ప్రజల మధ్యకు ఊకదంపుడు మాటల నాయకులు రావడానికి ప్రయత్నిస్తే తన్నులు పడతాయి. అదే ప్రజలు ఆంధ్రాలో నాయకులను వాస్తవాల గురించి ప్రశ్నిస్తే ప్రజలకు తన్నులు పడతాయి.

    ReplyDelete
  3. అధ్యక్షా,
    బడులు మూసేసారు. మీ వివరణ కూడా బావుంది.
    మరి బ్రాందీ షాపులూ, బహుళ అంతస్తుల షాపింగు కాంప్లెక్సులూ, సినిమా థియేటర్లూ ఎందుకు మూతబడటం లేదు. అవన్నీ సీమాంధ్ర - తెలంగాణా వ్యతిరేకులవని మాత్రం అనవద్దు.

    ReplyDelete
  4. తెలంగాణాలో ఎవడైనా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే భౌతిక దాడులు చేస్తాం అని టీఆర్ఎస్వీ వాళ్ళు, తెలంగాణా లాయర్లు బహిరంగంగా ప్రకటించడం, ఆ విధంగా దాడులు చేయడం ఏ వాక్ స్వాతంత్రాన్ని గౌరవించినట్టు? మీరు చెప్పిన విజయవాడ ఘటనకి ముందే హైద్ లో ప్రెస్ క్లబ్ లో అప్పట్లో నల్లమోతు చక్రవర్తి మీద జరిగిన దాడిని శాంతియుత నిరసన అంటారా? లేక ఉద్యమావేశంలో ఉన్మాదుల్లా ప్రవర్తించడాన్ని సమర్ధిస్తారా?

    ReplyDelete
  5. ఎక్సైజు ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల్లో ఆటోమేటిగ్గా షాపులూ మూత బడతాయి, ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో పెట్టించి అమ్మిస్తే తప్ప. మధ్యలో రెండు రోజులు సినిమా హాళ్ళు కూడా బంద్ పాటించాయి. వ్యాపారాలు అన్నీ బంద్ చేయడానికి పిలిపునిచ్చినపుడు అవీ బంద్ అవుతాయి.

    ReplyDelete
  6. slap on the face,

    అంతకు ముందు హైదరాబాదులో ఒక సంఘటన జరిగితే విజవాడలొ జరిగింది ఒప్పై పోతుందా? మీరు ఇలాంటి విషయాలు తెలంగాణా వాదులకే పరిమితమని మాట్లాడుతున్నారు. కాని ఇవి సర్వత్రా జరుగుతాయి, ఫక్షన్ రౌదీయిజం ఉన్న చోట్లలో ఒకింత ఎక్కువే జరుగుతాయి.

    మరి నిన్ననే నలమోతు ఇంకో ప్రెస్‌మీట్ పెట్టాడుగా హైదరాబాదులోనే? దానిగురించేం చెప్తారు? దాన్నెవరూ అడ్డుకోలేదే?

    తెలంగాణా వారు ఇంత వరకు ఒక్క ఆంధ్రా మనిషి మీద భొతిక దాడి చేసి గాయపరచిన సందర్భం చూపెట్టండి.

    అదే ఆంధ్రాలో సమైక్యవాదులమని చెప్పుకునే వారు తెలంగాణా వారిని (తెలంగాణా వాదులమని చెప్పుకున్నవారు కూడా కాదు, కేవలం తెలంగాణా వారే) వెంట పడి తరిమి మరీ హింసించిన సంఘటనలు, గర్భవతి అని చూడకుండా మహిళ కడుపులో తన్నిన సంఘటనలు ఇంకా పాతబడలేదు.

    ఇలాంటి వాటిని పట్టుకొని వాక్స్వాతంత్ర్యం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనవసరం.

    ReplyDelete
  7. "మరి నిన్ననే నలమోతు ఇంకో ప్రెస్‌మీట్ పెట్టాడుగా హైదరాబాదులోనే? దానిగురించేం చెప్తారు? దాన్నెవరూ అడ్డుకోలేదే?"
    అయ్యా శ్రీకాంతా చారి గారూ తమరు టీవీలు చూడట్లేదా లేక చూసినా చూడనట్టు నటిస్తున్నారా? నిన్న అక్కడ తెలంగాణా లాయర్లు చేసిన గొడవ రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి (అన్ని ప్రాంతాల వారూనూ). తమకెందుకు కనబడలేదో? పైగా హైదరాబాద్ లో సమైక్యవాదం వినిపించే ఎవర్నైనా ఇలాగే అడ్డుకుంటాం అని ఆ లాయర్లు ఆవేశంగా వార్నింగులు కూడా ఇచ్చారు. (మరి చట్టం తెలిసిన ఆ మహానుభావులకి ప్రాధమిక హక్కుల గురించి తెలియదో ఏమో)

    "తెలంగాణా వారు ఇంత వరకు ఒక్క ఆంధ్రా మనిషి మీద భొతిక దాడి చేసి గాయపరచిన సందర్భం చూపెట్టండి."
    మొన్న కోదాడ దగ్గర బస్సుల్లో రాళ్ళ దెబ్బలు తిన్నవాళ్ళనొ, ఆర్టీవో ఆఫీసులో యువ తెలబాన్ సుమన్ చేతిలో దెబ్బతిన్న అధికారినో అదీ చాలకపోతే ఆంధ్రాభవన్ లో హరీష్ రావ్ చేసిన వీరంగాన్నో గుర్తుతెచ్చుకుని ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అన్నీ తెలిసి అడుగుతారు మీరు. చిలిపి.

    "అదే ఆంధ్రాలో సమైక్యవాదులమని చెప్పుకునే వారు తెలంగాణా వారిని (తెలంగాణా వాదులమని చెప్పుకున్నవారు కూడా కాదు, కేవలం తెలంగాణా వారే) వెంట పడి తరిమి మరీ హింసించిన సంఘటనలు"

    ఇవేం ఖర్మ, నమస్తే తెలంగాణాలో ఇంకా ఆసక్తికరమైన కథనాలు కల్పించారుగా అవి కూడా చెప్పండి.

    ReplyDelete
  8. ఎన్ని రాళ్ళేశారు? ఎంత మందికి తగిలాయి?

    నాకు తెలిసి ఒక CIకి రాయి తగిలింది. మీకు TV చూసే అలవాటే వుంటే అదే రోజు నెల్లూరు లొ SEZలకు వ్యతిరేకంగా జరిగిన గొడవలో CI (అక్కడా CIయే) తల పగిలిన విషయం తెలిసే వుండేది. తెలంగాణా చానెల్ కాదు అన్ని చానెళ్ళలోనూ.

    అదే మరి! మన తప్పులైతే తెలంగాణా వారి తప్పుడు ప్రచారం. లేక పోతే వాక్స్వాతంత్ర్యం.

    తెలంగాణా ప్రజలకు వ్యక్తి స్వాతంత్ర్యం మీద గౌరవం వుంది కాబట్టే నిరసన ప్రదర్షనలతో సరి పెడుతున్నారు. తమరు జై ఆంధ్రా సందర్భంగా తమ పూర్వీకులు చేసిన విధ్వంసాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే వాస్తవాలు బోధపడతాయి.

    ReplyDelete
  9. I hope those andhera guys cribbing about wine shops will be happy with the following news (http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=35466):

    రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ కంపనీలపై తెలంగాణవాదులు దాడి చేశారు. మద్యం బాటిళ్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. శంశాబాద్, సాతంరాయి లిక్కర్ కంపనీలపై దాడి చేశారు

    ReplyDelete