Tuesday, October 25, 2011

సమ్మె విఫలమైందా?


సకల జనుల సమ్మె ముగిసింది. దీన్ని తెలంగాణా ఉద్యమానికే ముగింపుగా వర్ణిస్తూ కొంతమంది నిర్హేతుక, నిరర్థక, నిష్ఫల వ్యాఖ్యలు చేయడం అప్పుడే మొదలుపెట్టారు.

ముందుగా గమనించ వలసిన విషయం సమ్మెకి, ఉద్యమానికి ఉన్న తేడా. ఇప్పుడు జరిగిన సమ్మె కొన్నివర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు మొత్తానికి మొత్తంగా సమ్మెలో పాల్గొని, దాదాపు నలభైరెండు రోజులు రాష్ట్రాన్ని స్తంభింప జేయడం. వారు దీన్ని తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా చేశారు.

ఇంత భారీ సంఖ్యలో ఒక ప్రాంతపు ప్రజలు మొత్తానికి మొత్తంగా నలభై రెండురోజులు సమ్మె చేయడం మన దేశ చరిత్రలోనే ఎన్నడూ వినని విషయం. చివరికి భారత స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఇంతటి తీవ్రమైన సమ్మె జరగ లేదు. సమ్మె సఫలం కాకపోవచ్చు, కాని అది విజయవంతం అయిందనడానికి ఈ ఒక్క విషయం చాలు.

దాదాపు 180 ఉద్యోగ సంఘాలు, ఏడు లక్షల మంది ఉద్యోగులు తెలంగాణా ఏర్పాటుకోసమై తమ ఆకాంక్షను ఏకకంఠంగా ఎలుగెత్తి చాటారు. సహజంగానే ఇది సమైక్య పక్షపాత మీడియాకు, కొన్ని ప్రజాకంటక శక్తులకు రుచించని విషయం. అందుకే వారు సమ్మె విఫలమైనట్టు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు.

ఈ సమ్మె విఫలమే అయిందని అనుకుంటే, గాంధీజీ తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పుసత్యాగ్రహం కూడా విఫలమైనట్టే. ఆ ఉద్యమాల వల్ల కూడా మనకు స్వాతంత్ర్యం రాలేదు కదా! మరి ఎందుకు పుస్తకాల్లో వాటి గురించి ఊదర గొట్టుకుంటున్నాం?

సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటాలు ఎక్కడా ఒక కొలిక్కి రాకుండానే ముగిసాయి. అంతమాత్రాన అవి గొప్పవి కావని ఎలా అనగలం?

మొదటి స్వాతంత్ర్య సంగ్రామం దారుణంగా అణచి వేయబడ్డ విషయం వాస్తవం కాదా?

పై పోరాటాలన్నీ ఎలాంటి ప్రయోజనాలు లేనివే అయితే ఈ సమ్మె కూడా అలాంటిదే అనుకోవాలి. కాని ఎనిమిదో తరగతి చదివిన పిల్లాడికి కూడా తెలుసు, పై పోరాటాలు పూర్తిగా వ్యర్థం కాదనీ, అవి ఒకదానికి ఒకటి స్పూర్తి నిచ్చుకుంటూ తరవాతి తరాలకు ఉద్యమ స్పూర్తిని రగిలించాయనీ.

నిజంగా ఈ సమ్మెవల్ల ఏ ప్రయోజనం సమకూరలేదా?

ప్రజా ప్రతినిధుల రాజీనామాలు కుయుక్తులతో ఆమోదించకుండా ఆపివేసి, పచ్చ బాబుతో కుమ్మక్కై మైనార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకుంటూ, ఇక ఇప్పట్లో ఎలాంటి సమస్యా ఉండబోదనుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తన్నిలేపింది ఈ సమ్మె.

తెలంగాణా పై ఏనాడూ గంట కూడా చర్చించని కాంగ్రెస్ కోర్ కమిటీ దాదాపు ముప్పై సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆజాద్ నివేదిక, ప్రణభ్ నివేదిక మూలవిరాట్టుకు చేరింది. ఇంకా ఈ విషయంపై జాగు జరిగితే అది కేవలం మూలవిరాట్టు మాత్రమే కారణం తప్ప మరే కారణం లేదని ప్రజలకు అర్థమైంది.

పైకి 'జై తెలంగాణా' అంటూ, లోల్లోపల సమైక్యవాదుల మోచేతి నీళ్ళకోసం ఆశపడుతూ,  జనాన్ని మోసం చేస్తున్న రాజకీయ నాయకులు నగ్నంగా ప్రజలముందు నిలబడ్డారు.

తెలంగాణా ఏర్పాటు మాచేతుల్లో లేదని ఒకవైపు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళబేరానికి వచ్చి, జీతాలు, స్పెషల్ లీవులు, బోనసులూ ఇచ్చి ఉద్యోగుల చేత సమ్మె మాన్పించిన పద్ధతే సమ్మె విజయవంతమైందో కాదో చెప్తుంది. ఇక వేరే సాక్ష్యం కావాలా? ఇంత జరిగినా గుర్తించని వారికి సమ్మె గురించైనా తెలియక పోవాలి, లేదా తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తుండాలి.

తెలంగాణా ఉద్యోగులు సమ్మె విరమించ వచ్చు. మళ్ళీ చేస్తామనే బెదిరింపును అట్టే పెట్టుకున్నారు. సమ్మెకు తాత్కాలిక విరమణ జరగ వచ్చు. కాని ఉద్యమానికి మాత్రం విరమణ లేదు, తెలంగాణా వచ్చే దాకా. రక రకాల రూపాలతో అది ప్రజా వ్యతిరేకుల కళ్ళు బైర్లు కమ్మిస్తూనే వుంటుంది.

10 comments:

  1. meerannadi nijam
    malli samme cheyyavachu malli mugimcha vachu malli cheyyochu malli mugimcha vachu
    raitulu vidyardulu nasanam ayina parvaledu malli samme chesi prabutvam medalu vanchi jeetam teesuko vachu

    tu naayala KCR gadini 80 seatla lo gelipimchandira telangana enduku raado choodam
    antekani Logic leni sollu enduku
    On February 17, 2011
    300,000 government employees and caused a loss of Rs 8 billion per day in revenue to government

    caused 14,000 crore Rupees loss in the 25 day strike in September

    created current and Crop problems Those not earned any thing and Make Loss Lot to Andhrapradesh

    srikanth gaaru if you want telangana KCR must win
    i am not a telangana supporter and not a opposer
    But the Logics are missing Here thats i am feeling

    ReplyDelete
  2. ఢిల్లీ వెళ్ళి ముడుపులు బొక్కి దశలవారీగా సమ్మెని విరమింపజేశారు TRS వాళ్ళూ, కోదండరాముడూ ! అసలువాళ్ళకి లేని బుసలు మనకెందుకని ఉద్యోగులు కూడా ఈ నిరర్థక నిష్ప్రయోజన సమ్మెనుంచి విరమించుకుని తమక్కావాల్సిందేదో అది చూసుకున్నారు. దానికి మీరు ఉద్యమానుకూలంగా ఇలా వక్రభాష్యం చెప్పుకుంటున్నారు. ఆ మాత్రం ఆత్మసంతృప్తి. ఆత్మసాంత్వన ఉండాలి. కాదనట్లేదు. కానీ అవతలివాళ్ళకి అది ఆత్మవంచనలా కనిపిస్తే ఆ తప్పు వారిది కాదు. కిందపడ్డా గెలుపు మాదేనని వాదిస్తున్నారు. శుభం. మళ్లీ ఇలాంటి సమ్మె చేయలేమని, చేయబోమనీ, శుద్ధ దండగ అనీ నిజానికి తెలంగాణవాళ్ళే చెప్పుకుంటున్నారు.

    పైగా దీన్ని స్వాతంత్ర్యోద్యమంతో పోలుస్తారేంటి ? మొదట్నుంచీ ఇదే కన్‌‍ఫ్యూజన్ సృష్టిస్తున్నారు తెలంగాణవాదులు. అది విదేశీయుల మీద సార్. ఇదేమో సాక్షాత్తూ సొంతవాళ్ళ మీదే. వాక్చాతుర్యంతో జాతీయతలు మారిపోవు గదా.

    ReplyDelete
  3. >>>పైగా దీన్ని స్వాతంత్ర్యోద్యమంతో పోలుస్తారేంటి?

    ఎందుకు పోల్చగూడదు? పోనీ, "జై ఆంధ్రా" తోనో, "ప్రత్యేకాంధ్ర" తోనో పోలుద్దామా?

    >>>అది విదేశీయుల మీద సార్.

    దోపిడీ చేయడానికి ఎవడైతే నేంటి? స్వదేశీకి exceptions ఎందుకు? మరి నిజాం నవాబు స్వదేషీ నవాబు కాబట్టి పోరాడి వుండకూడదా?

    >>>ఢిల్లీ వెళ్ళి ముడుపులు బొక్కి దశలవారీగా సమ్మెని విరమింపజేశారు

    మీకేమైనా తెలుసా? అంటే ఈరోజు నుండి వారు తెలంగాణా గురించి మాట్లాడరన్న మాట, మీ లెక్కన? మరి పోలవరం టెండర్లు కాన్సిల్ చేయాలని KCR ఎందుకు లేఖ వ్రాసినట్టు? మరి మీ పచ్చ బాబులు అదేపని ఎందుకు చేయలేక పోతున్నారు?

    >>>కిందపడ్డా గెలుపు మాదేనని వాదిస్తున్నారు.

    అలా వాదించడం లేదు. పూర్తి సాఫల్యత రానంత మాత్రాన సమ్మె గురించి తక్కువ చేసి మాట్లాదవద్దనే కోరుతున్నాం. అలా మాట్లాడే వారు ఇంతకన్నా పెద్ద సమ్మె ఎక్కడన్నా జరిగి బుంటే చూపమని మాత్రమే అడుగుతున్నాం.

    >>>tu naayala KCR gadini

    Please avoid such phrases on any person, henceforth they will not be published.

    >>>But the Logics are missing Here thats i am feeling

    In any strike, someone or other will be at loss. Even Jayaprakash Narayan who was opposing all these things now organising rallies, deekshas, realizing that is the only way to draw attention.

    Andhra media is very cunning for its manipulations. If there is no explicit movement, it will say there is no movement at all, and if there is a movement, then it will make a hue and cry that it is a loss to common public. But the Telangana movement is balancing both ends and creating enough pressure to center. That is the real reason why mercurial levels are up among samaikya-vadis.

    ReplyDelete
  4. అదిరించి బెదిరించి జై తెలంగాణా అని అనటం అనిపించటం, ఒకవేళ అలా అనకపోతే ఆంధ్రా తొత్తులని,వాజమ్మలని, నపుంసకులని,సరైన నెత్తురు ప్రవహించటం లేదని.....ఇంకా కొంచం ముందుకువెళ్ళీ దాడులు చేయటం అదేమంటె ఉద్యమమ్లో చెదురుమదురు సంఘటనలవి వీటిని ఖండిస్తున్నామంటారు.మరుసటి ఎన్నికలప్పటికి ఈ ఉద్యమ స్పూర్థి ఏమిటో అసలు ప్రజలు కోరుకునెది ఏమిటో తెలుస్తుంది. ఈ తెలంగాణా ప్రజాస్వామ్యం లో వేరే అభిప్రాయానికి తావెక్కడిది? క్షమించాలి.... జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

    ReplyDelete
  5. @Chandramouli Balakrishna

    ఎవరండి అదిరిస్తున్నది, బెదిరిస్తున్నది? అదిరించడానికి బెదిరించడానికి అధికారం, పోలిస్ ఫొర్సు లేదే! కాకపోతే తెలంగాణా వాదానికి ప్రజాబలం వుంది. ప్రజలు పైకి జై తెలంగాణా అంటూ, లోపల సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తుతూ, తెలంగాణా వోట్లకోసం మాత్రం మళ్ళీ ప్రజలదగ్గరికి రావాలని ప్రయత్నించే వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్పుతారు. 2004లో కాంగ్రేస్, 2009లో తెలుగుదేశం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయి. ఇక ముందుకూడా అలాగే జరుగుతుందని అనుకోవడం కేవలం మీ భ్రమ. వేచి చూడండి తెలుస్తుంది.

    ReplyDelete
  6. http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_26.html

    ReplyDelete
  7. @Chandamouli Balakrishna: నిన్నటికి నిన్న విశాఖలో బండారు దత్తాత్రేయ గారిని అడ్డుకున్నది ఎవరు? ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉండాలని వాదిస్తున్నది ఎవరు?

    ReplyDelete
  8. 2004లో కాంగ్రేస్, 2009లో తెలుగుదేశం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయి. ఇక ముందుకూడా అలాగే జరుగుతుందని అనుకోవడం కేవలం మీ భ్రమ. వేచి చూడండి తెలుస్తుంది.
    kaani 2009 ennikalalo TDP ki bagane seats vachayi kada kani TRS ki matrame 46 places lo poticheste 10 enduku gelichimdi
    TRS Telangana porata party kada mari enduku odimdi
    telangana prajalaku TRS istam ledu anukovala leka samaikyandra istam anukovala leka TRS kante TDP ne better anukovala
    monna bansuwada ennikalalo gelichina taruvata pocharam oka mata annadu TRS ki otu veyyani varu setilars ani mari 2009 lo TRS ki otu veyyani varu andaru setilarsena mari Evaru setilars Evaru Telangana vallu

    Naaku chinna Question ki samadanam cheppandi chaalu ippudu unna partylalo TRS okkate nijam ga Telangana kosam poradutundi (chelamandi Telangana supporters manasulo) kaani enduku TRS ekkuva seatlu geluchukoleka pothundi.

    ReplyDelete
  9. Nenu kachitam ga cheppagalanu KCR 80 seatlu geliste Telangana vastundi leda TRS vi dramalu ani Telustai Edo okati telutundi appudu ayite Rastram bagupadutundi leda rendu Rastralu bagu padatai kani Logic leka pote em ledu

    Logic ante Andra Media ni Manage cheyyadam kaadu Telangana prajalu telangana ni entaga korukuntunnaro rajakeeyam ga teliyacheyyadam TRS 80 seatlu geliste samaikya vaadulaku kooda matlada taniki chansu vundadu kaani bussulu baddalu kotti,schools bandh cheste repu Telangana valle tiraga bada vachu

    ReplyDelete
  10. @jai
    Mari ade mata TRS ki enduku vartimchadu istam lekunna Raajinaamalaku enduku pattupadutundi malla ennikalalo enduku poti chestundi

    ReplyDelete