అసలు ఈ ప్రశ్నే ఒక పెద్ద తెలివి తక్కువ ప్రశ్న. ఎందుకు? ఏ నగరమైనా దేనికి చెందుతుంది? ఆ నగరం ఏ భూభాగంలో వుందో ఆ భూభాగానికి. ఆ నగరం ఆంద్రప్రదేశ్ లో వుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందుతుంది. అలా కాకుండా ఏ కర్నాటక వాడో, మహారాష్ట్ర వాడో వచ్చి 'ఒకప్పుడు మా వాళ్ళు కొందరికి హైదరాబాదు రాజధానిగా వుంది కాబట్టి హైదరాబాదుని మాకిచ్చేయండి' అంటే ఎలా వుంటుంది?
హైదరాబాదు రాష్ట్రం విభజింప బడినపుడు హైదరాబాదు పట్టణం గురించి చర్చ ఎందుకు రాలేదు? అప్పుడు కూడా అది దేశంలో ఐదవ అతిపెద్ద నగరం. ఇప్పుడు కాదనుకోండి. ఇప్పుడు బెంగులూరుతో ఆ హోదా పంచుకోవలసి వస్తుంది. కాని అప్పట్లో అది దేశంలో ఐదో పెద్ద నగరం. మరి మహారాష్ట్రీయులు అంత సులభంగా ఎందుకు వదిలి పెట్టారబ్బా? పోనీ మహారాష్ట్రులకు ముంబాయి వుంది కాబట్టి వదిలి పెట్టారనుకుందాం. మరి కర్నాటక వారు ఎందుకు వదిలి పెట్టినట్టో? వారికి అప్పట్లో అంత పెద్ద నగరం లేదు కదా మరి? ఎందుకంటే వారికి మన సమైక్య వాదులమని చెప్పుకు తిరిగే సోదరులకున్నంత తెలివితేటలు లేవు గాబట్టి.
లేకపోతే వాళ్ళూ అనే వాళ్ళేమో, 'హైదరాబాదులో మా పెట్టుబడులున్నాయి, కాబట్టి హైదరాబాదు మాదే' అని. కాని వాళ్ళు అనలేదు. బహుశా తమ భూభాగంలో లేని నగరం తమదని అడగోచ్చన్న ఇంగిత ఙ్ఞానం లేకపోయినా ఉండొచ్చు. లేదా వారికి సమైక్యవాదం ముసుగులో ఇతరుల నగరాల మీద గాలం వేసే విద్య తెలియక పోవచ్చు. ఏదైనా అదిప్పుడు చరిత్ర. ఆ సంగతి వదిలేద్దాం.
అసలు ఇప్పుడు ఆవు తోలు తీసేసి తోడేలు కోరలు బయటికి చూపించడం మొదలు పెట్టిన సమైక్యవాదుల మని చెప్పుకొనే భాగ్యనగర వాంఛాపీడితులు చెప్పేదేమిటో చూద్దాం.
ఇది రాజధాని అనుకుని ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు ఉన్నపళంగా పొమ్మని అంటే ఎక్కడికి పోతాం?
ఎవరైనా పెట్టుబడులు పెట్టేది స్వలాభాలకోసం. రాజధానికోసం పెట్టుబడులు పెట్టామంటే ఎవరూ నమ్మరు. రాజధాని వుందని కాక లాభాలు ఎక్కువ వచ్చే ప్రాంతంలోనే పెట్టుబడులు పెడతారు. అందుకే దేశ రాజధాని ఢిల్లీకన్నా ముంబై, చెన్నై, బెంగుళూరులలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు.
ఇలాంటి వాదనలు చేసే వారిలో పెద్ద ఘనాపాటి అయిన లగడపాటి 'పదమూడు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టానని' స్వయంగా ప్రకటించాడు. అంతెందుకు? ఏంటో మంది మన దేశంలో కాక విదేశీ నగరాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు.
ఏ పట్టణంలో నైనా లాభాల కోసం పెట్టుబడులు పెట్టాక లాభాలే కోరాలి, అంతే కాని న్యూయార్కులో పెట్టుబడులు పెట్టాం కాబట్టి న్యూయార్కు నాదనో, ముంబాయిలో పెట్టుబడులు పెట్టాం గాబట్టి ముంబాయి నాదనో వాదిస్తే ఎలాంటి ఎలాంటి వడ్డింపు జరుగుతుందో ఇక్కడ కూడా అలాంటి వద్దిమ్పే జరుగుతుందని గ్రహించాలి.
ఇక్కడికొచ్చి దీన్ని అభివృద్ధి చేశాం.
ఏ నగరమైనా దానికి సహజ వనరులతో అభివృద్ధి చెందే అవకాశం వుంటే అది అభివృద్ధి చెందుతుంది. అలాంటి వెసులుబాటు లేకపొతే ఎన్ని పెట్టుబడులు పెట్టినా అది కాలగర్భంలో కలిసి పోతుంది.చరిత్ర పరిశీలిస్తే ఎన్నో ప్రాచీన నగరాలకన్నా అతివేగంగా అభివృద్ధి చెందినా నగరం హైదరాబాదు. ముందే చెప్పినట్టు అరవై ఏళ్ల క్రిందటే అది దేశంలో ఐదో పెద్ద నగరం. ఇప్పడు ఆరో స్థానం. అభివృద్ధి చెందినా నగరాన్ని చూసి పెట్టుబడులు పెడితే నగరాన్ని అభివృద్ధి చేసినట్టు కాదు, నగరం వాళ్ళ అభివృద్ధి చెందినట్టు అవుతుంది.
నిజంగా అంత అభివృద్ధి చేయాలనే తపన గలవారు, చేయగల సత్తా ఉన్నవారే ఐతే ఇప్పుడు తమ ప్రాంతంలో మరో పల్లెటూరుని రాజధాని చేసుకొని దాన్ని నిరభ్యంతరంగా అభివృద్ధి చేయవచ్చు. అప్పుడు అభివృద్ధి చేశామని జబ్బలూ చరచుకోవచ్చు.
ఇది ఉమ్మడి రాజధాని కాబట్టి అభివృద్ధి చెందింది. ఇంత అభివృద్ధి చెందినాక చూస్తూ చూస్తూ మీకు వదులుకోవడానికి మాకు చేతులెలా వస్తాయి?
వదులు కోవడానికి మీరెవరు? మీరు వచ్చేటప్పుడు ఈ నగరాన్ని మీతో తీసుకు రాలేదు. ఇప్పుడు వెళ్లి పోయేటప్పుడు ఎలా మీతో తీసుకు పోగలమనుకుంటున్నారు?
ఇది మొదటి నుండి దేశంలో వున్న పెద్ద నగరాల్లో ఒకటి. దీని మీద వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదశలో కూడా హైదరాబాదు రెవెన్యూ రాష్ట్రానికి ఉపయోగ పడిందే కానీ, రాష్ట్రం రెవెన్యూ హైదరాబాదు ఉపయోగించుకోలేదు. ఫెడరల్ వ్యవస్థ కాకపోవడంవల్ల మన దేశానికి ఈ సదుపాయం వుంది. ఆ కారణంగానే సమైక్యవాదుల చేత నడప బడుతున్న రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ప్రాంతాల వారీ జమా ఖర్చులు అడిగినప్పుడు ఇవ్వలేదు. ఆ లెక్కలు బయటికి తీస్తే, అప్పుడు తెలుస్తుంది, హైదరాబాదు రాబడెంతో, ఖర్చెంతో.
అంతెందుకు? హైదరాబాదు ఆదాయం మీది ఆశతోనే కదా సమైక్యవాదులం అని చెప్పుకొనే వారు హైదరాబాదు మీద మాత్రమే పట్టుబట్టేది? అందుకే గదా సగం మంది సీమాంధ్రులు హైదరాబాదేతర తెలంగాణలో వున్నా, కేవలం హైదరాబాదులో వున్న సీమాంధ్రుల భద్రత గురించి మాత్రమే బాధపడేది? ఇతర పార్టీల హామీలంటే లెక్క లేదు. మరి మజ్లిసువారు, దానం వారు కూడా హైదరాబాదులోని సీమాంధ్రుల భద్రత పైన ప్రత్యేక హామీలిస్తున్నారు మరి! అవి కూడా పట్టించుకోరు. హైదరాబాదేతర సీమాన్ద్రులను మాత్రం తెరాస వారి దయాదాక్షిన్యాలకే వదిలేస్తామంటారు. ఇదంతా ఎందుకు? హైదరాబాదు ఆదాయమ్మీది ఆశతో కాదా?
తెలంగాణా మీద అంత ప్రేమ వున్నవారు హైదరాబాదుని మీరే వదులుకోవచ్చు కదా?
ఎందుకు వదులుకోవాలి? మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు కాబట్టి వదులుకోవాలా? హైదరాబాదు నగరం తెలంగాణాలో సహజసిద్ధమైన అంతర్భాగం. అది అంతర్భాగంగానే వుంటుంది. ఆంద్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఎలా ఐతే అది రాష్ట్రంలో అంతర్భాగంగా వుందో ఇప్పుడూ అలాగే అది భౌగోళికంగా ఏ రాష్ట్రంలో వుందో ఆ రాష్ట్రంలోనే అంతర్భాగంగా వుంటుంది.
భౌగోళికంగా తెలంగాణలో అంతర్భాగంగా వున్న హైదరాబాదు లేకుండా తెలంగాణా రాష్ట్రం వుండదు. ఇంతవరకు అలాంటి రాష్ట్రం మన దేశంలో ఎప్పుడూ ఏర్పడలేదు. ఇక ముందు కూడా ఏర్పడే అవకాశం లేదు.
ఏ రాష్ట్రంలో వుందో ఆ రాష్ట్రంలోనే అంతర్భాగంగా వుంటుంది హైదరాబాదు. అలాగే. ఘనతవహించిన కేంద్రం వారు తలుచుకుంటే విడిగా కూడా ఉండగలుగుతుంది. నిక్షేపంగా. యేది యెలా జరగాలో మీరే నిర్ణయించేసుకొని అలా జరగకుండా యావత్ప్రపంచమూ కుట్ర చేసేస్తోందని గోల చేయటం వలన యేమీ ప్రయోజనం లేదు. హైదరాబాదు భారీ ఆర్ధిక కేంద్రం కాబట్టి మాకే కావాలని పట్టుబడుతున్నారంతే. రాష్ట్రం ఒకవేళ విడిపోతే తెలంగాణేతర ఆంధ్ర పెట్టుబడిదారుల సంస్థలన్నీ తెలంగాణాకు బోలెడేసి పన్నులు చెల్లించి ఖజానా నింపుతుంటాయని దురాశ పడకూడదు యెవ్వరూ. అలా జరుగదు. పోతే ఇంకా బోలెడు పరిశ్రమలున్నాయికదా హైదరాబాదులో - అవన్నీ బంగారు బాతులే. అయితే తెలంగాణాకు వాటికి భత్రత కల్పించేంత సత్తా ఉండొచ్చు ఉండకపోవచ్చు - అదొక భయం. యేది యెలా జరిగినా దుమ్మెత్తి పోసుకుంటూ యేమీ సాదించలేరు. తప్పుడు మాటలు వాడకండి దయచేసి.
ReplyDeleteపగటి కలలకి హద్దులేదు - మీ బ్లాగులో రాతలకి అడ్డులేదు. కుమ్మేయ్ అన్నా కుమ్ము :)
ReplyDelete>>> ఘనతవహించిన కేంద్రం వారు తలుచుకుంటే
ReplyDeleteఘనత వహించిన కేంద్రం ఏం చేసినా ఊరుకుంటారా తమరు? మరి డిసెంబరు 9 తర్వాత గొడవలెందుకు చేసినట్టో? నీతులు మాకేనా, మీక్కూడా వర్తిస్తాయా? మీరు ఏ విషయం చెప్పబోయినా అది మీరు యేళ్ళ క్రితమే తుంగలో తొక్కివుంటారు.
ఇక పోతే కేంద్రం ప్రజల చేత ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ. అంతే కానీ దానిష్టం వచ్చినట్టు చేసే రాచరిక వ్యవస్థ కాదు. అది తెలుసుకోండి ముందు.
మీరు పక్కోడి హక్కులు హరించడానికి కేంద్రాన్ని ప్రభావితం చేయగా లేనిది, మేం మా హక్కులు సాధించుకోలేమా? అదీ చూద్దాం.
@సూటిగా
ReplyDeleteచూద్దాం ఎవరివి పగటి కలలో.
"ఆంద్రప్రదేశ్ లో వుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందుతుంది." అని మీరే వ్రాసి మళ్ళి సమైక్యవాదులదంతా దురాశ అంటారేమిటి. ఇంకా రాష్ట్రం విడిపోలేదు కదా? తమ రాజధాని కాబట్టి వారు దానిని ఉపయోగించుకున్నారు...
ReplyDelete"హైదరాబాదు రెవెన్యూ రాష్ట్రానికి ఉపయోగ పడిందే కానీ, రాష్ట్రం రెవెన్యూ హైదరాబాదు ఉపయోగించుకోలేదు"
రాష్ట్ర రాజధాని కావున ఏ జిల్లాలో జరిగిన లావాదేవీలైనా అవి రికార్డెడ్‌గా కనపడేది హైదరాబాదులోనే. అది చూసి హైదరాబాదు ఆదాయం అనుకుంటే పొరపాటే.
సరే మొత్తం మీద నచ్చిన మాటేమిటంటే హైదరాబాదుని సీమాంధ్రులు అడగ కూడదని... అవును నీజమే, సీమాంధ్రులు అలాంటి మరొక నగరం వారి ప్రాంతంలో తయారు చేసుకొనే అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే కేపిటల్ పెడితే ఎటువంటి ఊరైన మహా నగరంగా మారిపోతుంది. ఉదాహరణకి; ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. అప్పట్లో కటక్కు ఒక్కటే పెద్ద నగరం మరియు రాజధాని. మరొక నగరం తయారు కావాలంటే మార్గం కేపిటల్ని తరలించటమే అని భువనేశ్వర్ని ఏర్పాటు చేసారు. అలాగే మైసూరు నుండి బెంగళూరు కూడా... ఇంతకీ రాష్ట్రం విడిపోవల్సి వస్తే సుమా....
కోస్తా జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎకరం యాభై వేలు ఖరీదు చేసిన రోజుల్లో గచ్చిబౌలి కొండ గుట్టలో ఎకరం పదివేలు. అది తమరి ఘనత వహించిన నగరం యొక్క స్థితి ఆనాడు.. ఆనాడు మద్రాస్ లో ఉన్న చిత్రపరిశ్రమ ని బతిమాలి తీసుకొచ్చింది చెన్నారెడ్డి కాదా? అప్పుడు కొండల్లో ఉన్న, ఎందుకూ కొరగాని భూమినిస్తే వాటిల్లోనే వారు పెట్టుబడులు పెట్టి స్టూడియోలు కట్టి అభివృద్ది చెందలేదా? అలాంటి భూమిని మీరేదో గొప్పగా దానం చేసినట్లు మీ భూమి దోచుకున్నారని పొలి కేకలు మళ్ళా? ఇక్కడే మరొక కామెడీ.. పద్మాలయ భూముల గురించి రచ్చ చేసిన హరీష్ రావు జీ తెలుగు చానెల్లో తెలంగాణ అనుకూల వార్తలు ప్రసరించేసరికి గప్‌చుప్.. మరల ఎప్పుడూ ఆ ఊసే లేదు..
ReplyDeleteఉన్న మార్కెట్ ధరకన్నా రెండింతలు ఎక్కువ పెట్టి వేలం లో కొనుక్కున ల్యాంకో భూముల దగ్గరకెళ్ళి వక్ఫ్ భూములని గగ్గోలు పెట్టి జెండాలు పాతే బదులు అవే వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం దగ్గరనించి ఉచితంగా పొందిన మైక్రోసాఫ్ట్, ఇన్‌ఫోసిస్, విప్రో లాంటి కంపెనీల్లో పాతితే తెలుస్తుంది తమ మహానగరానికి ఉన్న గొప్పదనం..
ఈ రోజు హైదరాబాద్ లో ఏదో సీమాంధ్ర పాలకులు వచ్చి పరిశ్రమలు నాశనం చేశారు అని అడ్డగోలు వాదాలు చేసే వాళ్ళు బీజేపీ హయాం లో పెట్టుబడుల ఉపసంహరణకి ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే నియమించినప్పుడు ఎందుకో ఆ ఊసెత్తలేదు?
ఇంకొక విషయం.. పెట్టుబడి దారుడు ఎవరైన లాభం కోసమే పెడతాడు అని వాదించే తెలంగాణా వాదులు మరి ఉద్యోగాల విషయం లో ఎందుకో ఈ విషయం ఒప్పుకోరు. పెట్టుబడి దారుడు ఎవరైనా టాలెంట్ ఉన్నవాడినే తీసుకుంటారు అని మాత్రం అర్ధం చేసుకోరు.. అందర్ని కావాలనే సీమాంధ్ర నించి తెచ్చుకుంటారు అని విచిత్ర వాదన చేస్తారు.
హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టిన ఆంధ్ర ప్రాంతం వారు కేవలం ఏదో దీనంత పొడిచే నగరం లేదని పెట్టలేదు... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ఇది రాజధాని కాబట్టే, మన ప్రాంతం అనే భావన తోనే పెట్టారు. లేకుంటే ఈనాడు ఇక్కడున్న పరిశ్రమల్లో కొందరివైన అప్పుడు వేరే ప్రాంతాల్లో ఏర్పాటు అయ్యుండేవి. అంతేకాదు.. ఈ రోజు విద్యా సౌకర్యల పరంగాను జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు రావటం, ఫార్మా, ఐటీ రంగాలు అభివృద్ది అవ్వటం తద్వారా వాటి చుట్టూ అనుభంద పరిశ్రమలు ఏర్పడటం, లోకల్ గా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వటం కూడా హైదరాబాద్ ని ప్రమోట్ చేసిన ఫలితమే.. అంతేకాని ఒక బిల్‌గేట్స్ హైదరాబాద్ లో తీసుకొచ్చి తన డెవెలప్మెంట్ సెంటర్ పెట్టాడంటే ఏదో తమరి 'గొప్పా నగరం చూసి కాదు.. ఇంతకన్నా అనువైనవి ఆయనకు ప్రపంచం లో కనిపించకా కాదు.
అలానే 1972 లో హైదరాబాద్ కి సెంట్రల్ యూనివర్సిటి వచ్చిందంటే అది కేవలం 6 సూత్రాల పధకం వల్లా, ఉమ్మడి రాజధాని అవ్వటం మూలంగానే.. ఈ రోజు హైదరాబాద్ లో మూడు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. మరి మిగత ప్రాంతం లో ఒక్కటీ ఎందుకు లేదు? ఇది అందరి రాజధాని అవ్వటం వల్ల కాదా? అలానే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం focus on plaaned development of hyderabad city జరగాలి అని పొందుపర్చటం మూలంగా జిల్లాల నించి నిధులు హైదరాబాద్ అభివృద్ది కి బదిలీ అవ్వలేదా?
లగడపాటి 13 రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాడన్న విషయం చెప్పారు. మరి లగడపాటి పెట్టుబడి పెట్టిన ఉత్తరాంచల్ లాంటి ప్రాంతాలు విభజింపబడ్డాయి. మరి మీ లెక్క ప్రకారం పెట్టుబడుల కోసమే విభజన ని వ్యతిరేకిస్తే ఆయా రాష్ట్ర విభజనను ఆయన అడ్డుకునేవాడేగా? పైగా విభజనకు అంగీకరిస్తే ఈ వెర్రి తెలంగాణ వాదులు అన్నీ మర్చిపోతారు. (జీ తెలుగు లాగా) తను ఇదే హైదరాబాద్ లో కేసీయార్ లానే జనాల్ని వెధవల్ని చేసి మరింత బిజినెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా తను ఆంధ్ర ప్రదేశ్ విభజన కాకుండా ఎందుకు పోరాడుతున్నట్లు? ఇది తన స్వంత రాష్ట్రం, 'మన ' అనే భావన ఉండటం వల్లనే కాదా..
ఏంటబ్బా హైదరాబాద్ లో ఉన్న సహజ వనరులు? ఇది ఏమైనా చెన్నై, ముంబై నగరాల్లాగా సముద్ర తీరప్రాంతం అయ్యుండి ఎగుమతి దిగుమతి రవాణ కి అవకాసాలున్నాయా, లేక మిగతా మహనగరాల్లాగా హైదరాబాద్, దాని చుట్టు ఉన్న తెలంగాణ ప్రాంతం లో గొప్ప మానవ వనరులు ఉన్నాయా, లేక సారవంతమైన నేలలా, జీవనదులు పారే ప్రాంతమా? కేవలం ఎందుకు పనికిరాని, ఎవ్వడూ పట్టించుకోని కొండలు, గుట్టలు ఉన్న ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతం.. అంతే.
అవును.. అభివృద్ధి చేయగల సత్తా ఉంది కాబట్టే మద్రాస్ లో ఆనడు చేసి చూపించాం. కొయంబత్తూరు లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించగలిగాం, ఇంకా సత్తా ఉన్నవాళ్ళు 13 రాష్ట్రాల్లో విస్తరించగలిగారు. ఈ రోజూ చెయ్యగలం. మరి మీ సంగతో? ఆంధ్ర ప్రాంతం వారిలాగా చెన్నై, కొయంబత్తూరు, బెంగుళూరు లాంటి ఇతర నగరాలకెళ్ళి వ్యాపార, రాజకీయాల్లో నెగ్గుకురావటం తర్వాత సంగతి.. కనీసం హైదరాబాద్ లో మీరు చేసిన అభివృద్ది ఏంటి? మీరు పెట్టుబడులు సృష్టించి కల్పించిన ఉపాధి ఏమిటి? ఏదో ఏ కాడికి ప్రభుత్వం ఏదైన ఆల్ ఫ్రీ గా వస్తే అనుభవిద్దామనే యావ తప్పితే.. లేకపోతే మా(?) నిజాం భవానాలు కట్టాడు అది మావే అని మురిసిపోవటం తప్పితే ప్రైవేటు రంగం లో సాధించిందేమిటి.. చేతకాని తనానికి అమాయకులం అని ట్యాగు తగిలించుకోవటం మినహా..
ReplyDeleteమహరాష్ట్ర వాళ్ళు, కన్నడ వాళు హైదరాబాద్ ని వదులుకున్నారు, ఆంధ్రులు మద్రాస్ నగరాన్ని వదులుకున్నారు, 1972 లో హైదరాబాద్ ని వదులుకొని విడిపోటానికి సిద్దమయ్యారు, గుజరాతీలు బొంబాయి ని వదులుకున్నారు, ముస్లింలు ఢిల్లీ నగరాన్ని వదులుకున్నారు పాకిస్తాన్ కోసం.. ఎందుకంటే మంచో, చెడో ఆయా ఉద్యమాలకు ఒక greater cause, ఒక పవిత్ర లక్ష్యం ఉన్నవై వారు ఒక identity కోసం తపించారు.. మీలా ఏ లక్ష్యం లేకుండా కేవలం ఉమ్మడి అభివృద్ది ని దోచుకుందాం అనే ఒకే ఒక్క స్వార్ధం తో, తమ చరిత్ర కి, సంస్కృతి కి నిలువెల్లా పాతరేసి, తమపై అరాచకాలకు చిహ్నమైన నగరం పై దురాశాపూరిత ప్రేమ తో చేసే ఉద్యమాల కథలు కంచికి చేరవు.
అయినా తెలంగాణ గురించి తెలంగాణ వాళ్ళు తేల్చుకుంటే, హైదరాబాద్ గురించి వివాదం అక్కడి వాళ్ళు తీర్చుకుంటారు లే చారి. నీకేల అంత నొప్పి.
RADHAKRISHNA
ReplyDeleteఆంధ్రప్రదేశ్‌లో ఆంతర్భాగంగా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందుతుంది. అంత మాత్రాన అది ఆంధ్రా వారి సొత్తు ఐపోదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అది తెలంగాణాలో అంతర్భాగంగా వుంటుంది తప్ప ఆంధ్రాలో కాదు. అందుకేగదా కొంతమంది కుహనా సమైక్యవాదం మొదలుపెట్టింది!
హైదరాబాదులో ఎలాంటి ఎగస్ట్రా కాపిటల్ పెట్టలేదని గ్రహించండి. హైదరాబాదు కాపిటలే ఏ కాలంలోనైనా రాష్ట్రానికి ఉపయోగ పడింది తప్ప, హైదరాబాదుకి రాష్ట్రం నుంచి పెట్టిన కాపిటల్ ఏమీ లేదు.
మొదటి అనామకులు,
ReplyDeleteమొదట మీరు తెలుసుకోవలసిన విషయం, బతిమాలితే ఎవరూ రారు, ముఖ్యంగా పెట్టుబడి దారులు, అవకాశాలు వుంటేనే వస్తారు. ఆ అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులో వచ్చిన ఆదాయం కన్నా పైసా ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే ఆ వివరాలు ఇవ్వండి. హైదరాబాదు నుంచి ఆదాయం వచ్చింది. దాన్ని ఖర్చు పెడితే మరిన్ని వనరులు చేకూరాయి. దాంతో మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. అందరు వ్యాపారుల్లాగానే కొంతమంది ఆంధ్రా ప్రాంతం పెట్టుబడిదార్లు కూడా వారి స్వంత లాభాలకోసం మాత్రమే హైదరాబాదు వచ్చారు.
కాకపోతే ఆంధ్రా పెట్టుబడిదారులకి, ఇతర పెట్టుబడిదారులకి వున్న పెద్ద తేడా ఏమిటంటే, వీరే ప్రభుత్వం, ప్రభుత్వమే వీరు. ఆ విధంగా రాజకీయాలను, వ్యాపారాన్ని కలగలిపి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని నేనంటాను. అలా జరిగిందనడానికి వంద ఉదాహరణలు ఇవ్వగలను. తాజా ఉదాహరణ http://telangaanaa.blogspot.com/2011/10/blog-post_13.html
రెండో అనామకులు
ReplyDeleteసరిగ్గా ఇలాంటి అహంకారం ప్రదర్శిస్తూనే మీరు మాకు శాశ్వతంగా దూరం అయిపోయారు. మీరు ఉన్న నగరాలకోసం పోట్లాడడమో, దేబిరించడమో తప్ప, ఒక్క అంగుళం కూడా అభివృద్ధి చేయలేరని చరిత్ర నిరూపించింది. అంతటి సత్తా గలవారైతే, మీ కర్నూలునే అభివృద్ధి చేసుకునే వారు. అంటేకాని దేబిరించుకుంటూ, ఒప్పందాలకు కట్టుబడ్డట్టు నటిస్తూ మాతో కలవడానికి తహతహ లాడేవారు కాదు.
కరక్టే, హైదరాబదు విషయం హైదరాబాదు వారే తేల్చుకోవాలి, మరి మీ ఆంధ్రా వారికెందుకో నొప్పి!
>>ముఖ్యంగా పెట్టుబడి దారులు, అవకాశాలు వుంటేనే >>వస్తారు. ఆ అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులో >>వచ్చిన ఆదాయం కన్నా పైసా ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే >>ఆ వివరాలు ఇవ్వండి.
ReplyDeleteకేవలం అవకాశాలమాటే అయితే హైదరాబాదుకన్నా ఎక్కువ అవకాశాలు, మెఱుగైన మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉన్నాయి. సదుపాయాలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందదు. వాటి గురించి తెలియజెప్పి, ఆకర్షించి పెట్టుబడులను తీసుకువచ్చి, వారి విశ్వాసం చూఱగొంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ నగరం భారతదేశంలో ఒక్క సాఫ్ట్ వేర్ రంగం తీసుకుంటే మూడవ స్థానంలో ఉంది. ఈ స్థానం ఎలా వచ్చింది? ఎవరి చొఱవ వల్ల వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. కేవలం హైదరాబాదు గొప్ప తనం వల్ల వస్తే, భారతదేశంలోనే ఇంతకంటే మెఱుగైన నగరాలు ఉన్నై.
>>>సదుపాయాలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందదు. వాటి గురించి తెలియజెప్పి, ఆకర్షించి పెట్టుబడులను తీసుకువచ్చి, వారి విశ్వాసం చూఱగొంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు.
ReplyDeleteహైదరాబాదు ఆకర్షణ ఇప్పటిది కాదు. కొత్తగా విశ్వాసం చూరగొనాల్సిన పనీలేదు. నిజాం నిర్బంధ కాలంలో కూడా ఎందరో వ్యాపారులు ఆకర్శించ బడ్డారు. మీరుకూడా లా ఆకర్శించ బడేగా వచ్చింది! మీ సమైక్య పాలకులు చేసిందేమీ లేదు, హైదరాబాదును పోల్యూషన్ అడ్డాగా, మురికి కూపంగా మార్చటం తప్ప. అసలు మీరు దయచేసి వుందక పోతే హైదరాబదు దేశంలోనే నలుగోదో, మూడోదొ స్థానంలోకి ఎగబాకి వుండేది. హైదరాబాదు నిధులని దారి మళ్ళించి దాన్ని ఆరోస్థానంలోకి దిగజార్చిన ఘనత మాత్రం మీదే.
ఉంటుందో, ఉంటుందో, అసలంటూ తెలంగాణ ఏర్పడే సూచనలే లేవూ.. అందులో హైదరబాద్ సంగతి దేవుడెరుగు.. ముందే కూసిన కోయిల లాగ తొందరేల చారి..
ReplyDeleteఅవును.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆంధ్రా వారి అందరి సొత్తు.. ఆంధ్రప్రదేశ్ నించి విడిపోయేప్పుడు ఎవరికి ఏమి చెందాలని ఆంధ్ర వారందరు నిర్ణయిస్తారు..
హైదరాబాద్ లో ఏముందని అడిగిన దానికి సమాధానం లేదుగానీ దాని క్యాపిటల్ ఉపయోగపడిందని ఊదరగొట్టేస్తున్నావ్.
పెట్టుబడిదారులు అవకాశాలుంటేనే రారు. అవకాశాలు సృష్టించి కూడా అభివృద్ది చెందగలరు. అసలు పెట్టుబడి పెట్టకుండానే ఆదాయం ఎక్కడొస్తుంది చారి? ఉదాహరణ కి చిత్ర పరిశ్రమ తీసుకో.. ఆనాడు అది చెన్నై నగరం లో స్థిరపడి ఉంది. కాని మన రాష్ట్రం అన్న కారణం తో వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టటం జరిగింది.. మరి ఈ రోజు ఆ పరిశ్రమ చుట్టూ ఏర్పడ్డ అనుబంధ పరిశ్రమల వల్ల ఎవరు అభివృద్ది చెందారు చారీ? ఏ నగరానికి గుర్తింపు వచ్చింది? అదే ఉమ్మడి రాష్ట్రం లో లేకుంటే వాళ్ళు ఇదే పరిశ్రమ ని మరో చోట అభివృద్ది చేసే వారు కాదా? అప్పుడు అక్కడ స్థానికంగా అనుభంద పరిశ్రమలు వచ్చేవి కాదా? అలానే హోటల్ రంగంలోనూ, రవాణ రంగం లోనూ పెట్టుబడులు రావటానికి ఇక్కడున్న ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చిన కారణం గా కాదా? 1972 లో ఈ సమస్య కు శాస్వత పరిష్కారం లభించిందన్న కారణం తోనే ఇది అందరి నగరం అనుకోబట్టే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ది జరిగింది.
ఏ నగరం అయినా అభివృద్ది చెందాలంటే ముందుగా అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కొంత పెట్టుబడులు పెట్టటం ద్వారా బయటి వ్యక్తులకి కొంత నమ్మకాన్ని create చెయ్యగలగాలి. మరి హైదరాబాద్ అభివృద్ది లో తెలంగాణ వాళ్ళ పెట్టుబడి ఏంటి? ఇక్కడ ఉపాధి కల్పించిన వ్యక్తులెవరు? సూటిగా అడిగితే సమాధానం చెప్పలేక అహంకారం అంటూ చిందులు తొక్కుతావు. ఇది ఏ రంగానికి ప్రసిద్ది? నగరాలకోసం దేబిరించటమా? హహ.. ఇంతకన్నా కామెడీ లేదు.. దేశం లో ఏ ప్రాంతానికైనా వెళ్ళు.. తెలుగు వాళ్ళ పెట్టుబడులుంటాయి. రాజకీయ రంగం లోనూ స్థానికంగా ఎదగగలిగారు. మీ సంగతేంటి? కనీసం ఒక రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టలేకపోయారు. ఏ సరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే ఉప ప్రాంతీయ పార్టీలు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టటం బావి లో కప్పలు లాగా ప్రవర్తించటం వినా వారు చేసిందేమిటి?
అవును.. తెలుగు వాళ్ళు కలవాలని దేబిరించింది దాశరధి గారు, రావి నారయణరెడ్డి గారు, స్వామి రామానంద తీర్ధ, మాడపాటి హనుమంత రావు వంటి వాళ్ళు తెలంగాణ కు శత్రువులు.. అదే పదవుల మీద ఆశతో విద్వేష వాదాన్ని సృష్టించిన కేవీ రంగారెడ్డి, చెన్నా రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ అభివృద్ది కారకులు.
అనానిమస్,
ReplyDeleteతమరి ప్రశ్న: హైదరాబాదులో ఏం వుంది?
జవాబు: హైదరాబాదులో వున్నదే వుంది, లేనిది లేదు. ఏం వుందని తమరు 1956లోనూ, ఇప్పుడూ తహతహలాడుతున్నారో అదేవుంది హైదరాబాదులో.
ఇకపోతే హైదరాబాదులో క్యాపిటల్ పెట్టినవారు లాభాలకోసం పెట్టారు. వారి లాభాలు వారు తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే వుంటారు. క్యాపిటల్ పెట్టామని "క్యాపిటల్" మాదంటే కాలరుచ్చుకుని గెంటేస్తారు. తెడా తెలుసుకోండి.
ప్రైవేటు పెట్టుబడులకు ప్రభుత్వ పెట్టుబడులకు గల తేడా తెలుసుకో ముందు. 1956కే హైదరాబదు ఒక మహానగరం. అన్ని మహానగరాల మాదిరిగానే హైదరాబదుకి పెట్టుబడులు వచ్చి పడ్డాయి. దామాషాలో చూస్తే ఇంక రావాల్సిన దానికన్నా తక్కువే వచ్చాయి, సమైక్య పాలకులు హైదరాబాదు నిధులు మళ్ళించి తమ ప్రాంతంలో కర్చు చేసుకోవడం వల్ల. హైదరాబాదును చూసి పెట్టు బడులు వచ్చాయి గాని, రాజధానో, మరోటో అనే ప్రేమతో గాదు. బిజినెస్‌లో ప్రేమా దోమా లాంటివి వుండవని ముందు తెలుసుకో.
ఇక్కడ పెట్టుబడి పెట్టినవారిలో తెలంగాణా వారెంత అనే లెక్కలు కావాలా? లెక్కలు అడిగే ముందు ఇక్కడ పెట్టిన ఆంధ్రా పెట్టుబడుల శాతమెంతో ముందు చెప్పు. సినిమా, ఫార్మా తప్ప మీరు పెట్టిన పెట్టుబడులేమైనా వున్నాయా? ఒక వేళ ఏమైనా పెట్టినా గర్వర్నమేంటును లొంగదీసుకుని ఒకటికి పదిరెట్లు, కాకపోతే వెయ్యి రెట్లు (సినిమా స్టూడియోల భూములు, ఉదాహరణకు) లాభాలు పొందినవే వుంటాయి. లేకపోతే Maytas Metro లాంటి మోసపు కంపెనీలే వుంటాయి.
బిజినెస్ లో ప్రేమా, దోమా ఉండవని వాదించేవాళ్ళు మరి ఉద్యోగాల్లో అందరూ ఆంధ్రోళ్ళనే పెట్టుకుంటున్నారని ఆరోపణలేంటి? ఎవడికి టాలెంట్ ఉంటే వాణ్ణి తీసుకుంటారు అని ప్రేమా, దోమా ఉండవని సర్దుకుపోవచ్చుగా.. మీకు టాలెంట్ లేదని ఒప్పుకోవచ్చుగా..
ReplyDeleteఅవును.. ప్రభుత్వ పెట్టుబడులు దామాషాలో రావాలి. మరి ఇదే ఉమ్మడి రాజధాని కాకుంటే ఈ పాటికి సగం పెట్టుబడులు దామాషా ప్రకారం ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పాటయ్యేవి కదా..
ReplyDelete1953 లో ఆంధ్ర ప్రాంతం గురించి ఉద్యమం జరుగుత్న్నప్పుడు మాడపాటి గారు ఒక మాట అన్నారు.. ఆంధ్రులు మద్రాస్ ని గురించిన ఆందోళన విరమించాలి. ఎప్పటికైన విశాలంధ్ర కి హైదరాబాద్ రాజధాని గా ఏర్పడాలి అని.. ఎవరు తహతహలాడారో తెలుస్తుందిగా.. 1972 లో unconditional విడిపోతాం అని అడిగినప్పుడు మౌనం వహించి ఎవరు తహ తహలాడారో తెలుసు కదా..
దేనిలో గొప్ప అంటే చెప్పవు గానీ మహ నగరం, సుందర ప్రదేశం, 5వ నగరం, 3, 2 అని ఊదరగొట్టేస్తావ్ చారీ..
@AnonymousOct 14, 2011 07:56 PM
ReplyDeleteతమరు నేనన్న విషయాల గురించి చర్చిస్తే గాగుంటుంది. ఎక్కడో, ఎవరో అంటే వివరాలతో సహా రంది, చర్చిద్దాం.
ఒకవేళ ఎవరైనా అన్నా, అహో మేం దెవలప్ చేషాం, ఉద్యోగాలు తీసుకొచ్చాం అంటే, మీ పక్షపాత బుద్ధి ఎండగట్టడానికి అనుండొచ్చు.
ఇక టాలెంట్ అంటావా? అదుంటే ఇలాగెందుకు మాట్లాడతావ్? టాలెంట్ అనేది ఒక జాతికి గుత్త సొత్తని భావించే వాడివి టాలెంట్ కాదుగదా, నీకు basic knowledge గూడా లేదని తెలుస్తూనే వుంది.
Anonymous Oct 14, 2011 08:03 PM
ReplyDeleteమన రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ వచ్చే ప్రాంతం హైదరాబాదు. సమైక్య రాష్ట్రం కాకుంటే, హైదరాబాదు రెవెన్యూ హైదరాబాదుకి, దాని శివారు ప్రాంతానికి ఉపయోగించబడేవి. హైదరబాదు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేది. దానితో పాటు తెలంగాణా కూడా అభివృద్ధి చెండేది.
కాని హైదరాబదు నిధులు గత యాభై సంవత్సరాలుగా ఆంధ్రా దారి పట్టాయి. హైదరాబాదుకు చెందిన లక్ష ఎకరాల భూములు అధికరికంగా కబ్జా చేయబడ్డాయి, అమ్మబడ్డాయి, ఆ డబ్బులు మళ్ళా ఆంధ్రాకే తరలించ బడ్డాయి. ఇడుపులపాయే తాజా ఉదాహరణ.
అంతెందుకు, లెక్కలు తీయమను ప్రభుత్వాన్ని ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఆంధ్రాకు, తెలంగాణాకు కేటాయించిన వాటా యెంతో? జస్టిస్ శ్రీకృష్ణ అవే లెక్కలు అడిగితే తోక ముడిచింది కాదా ఈ సమెక్కుడు ప్రభుత్వం.
1969 లో భార్గవ కమిటీ రిపోర్టు ఏం చెప్పిందో చూడండి.
1. Revenue Surplus of Telangana area
During the Third Plan period 24.18
2. Shortfall of Capital Expenditure in the Telangana area compared to one-third of the total capital expenditure in the State 6.56
TOTAL 30.54
9. The decision was communicated to the Chairman, TRC through a letter of 17-06-1968 from Finance Secretary. The Chief Minister also agreed that on this basis the balance of the Second Plan surpluses of Rs. 3.70 crores would be provided – Rs. 2.80 crores in 1968-69 and about Rs. 90 lakhs thereafter. Therefore, in all about Rs. 34.24 crores (Rs. 30.54 + 3.70 crores) would have to be provided for the Telangana region over and above its one-third share.
ఆ తర్వాత TRC లేదూ, మషానమూ లేదూ, ఇష్టం వచ్చినట్టూ దోపిడీ తప్ప.
ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి డబ్బుల గురించి తహతహ లాడారో.
మరీ విచిత్రంగా మాట్లాడొద్దు. మరి మేమే అంతగా తహతహ లాడుతుంటే, మరి మా కండిషన్లు ఒప్పుకుంటూ మీరెందుకు ఒప్పందం రాసిచ్చినట్టో!
>>>దేనిలో గొప్ప అంటే చెప్పవు గానీ
అదే పిచ్చి వాదన మళ్ళీ. ఇంత చెప్పాక దేనిలో గొప్పో తెలియడం లేదూ? మరీ అమాయకత్వం నటించకండి.
నువ్వు భార్గవ రిపోర్ట్ టాపిక్ తెచ్చినందుకు సంతోషం. ఇదే రిపోర్ట్ లో హైదరాబాద్ ఖర్చు కి సంభందించి 1956 నించి 1961 వరకు హైదరాబాద్ లో ఏర్పరచిన నూతన భవనాల ఖర్చు పూర్తిగా ఆంధ్ర ప్రాంతం వారే భరించారని (ఎందుకంటే అప్పటికే ఉన్న భవనాలు తెలంగాణ వారి contribution గా భవించి) ఆ తర్వాత 1961 నుండి 1969 వరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం వారు 2:1 నిష్పత్తి లో హైదరాబద్ ఖర్చు పంచుకున్న విషయం తమరి కళ్ళకి కనపడలేదా చారీ? ఇప్పుడు చెప్పు హైదరాబాద్ లో పెట్టుబడి ఎవరిదో? అద్దె కొంపలు అని వక్ర భాష్యాలు, అబద్దపు ప్రచారాలు చేసేది ఎవరో..
ReplyDeleteఇదే భార్గవ కమిటి లో తెలంగాన లో 1966-67, 67-68 మధ్య కాలం లో తెలంగాణ వాటా కన్నా అధికంగా నిధులు కేటాయించిన విషయం కనపడలేదా? అంతేకాదు.. భర్గవ కమిటీ ఎక్కడా నిధులు ఆంధ్ర కి మరలించిన విషయం పేర్కొనలేదు.. those are 'unspent' reserves of telangana అని మాత్రమే చెప్పింది.
The figures contain in annexure G1-G12 indicates that in almost all years during this period the expenditure on development in telangana has been in excess of its due proportion that a sum exceeding Rs 11 crore out of the previously unspent surplus was utlized.
ఆ unspent reserves ఎప్పుడు కర్చు పెట్టారో రుజువులు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ఆ తర్వాత TRC లేదు, ఎవడికీ లెక్కలు చూపాల్సిన ఆగత్యమూ రాలేదు. అస్మదీయులకు అడ్డగోలు పంపకాలు తప్ప.
ReplyDeleteతాజా ఉదాహరణ.
మహాత్మా గాంధి యూనివర్సిటీ(నల్లగొండ), యోగి వేమన యూనివర్సిట్Y(కడప) ఒకేసారి శంకుస్థాపన జరిగాయి. ఈ రెండింటి నిర్మాణానికి పంచబడిన నిధులు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 29.5 కోట్లు,
యోగి వేమన యూనివర్సిటీ: 300 కొట్లు.
TRC అనేది ఎలాగూ లేదు, విచ్చలవిడి అధికారం వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు కర్చు పెట్టారు. పైన ఇచ్చిన వివరాలను ఏవిధంగా సమర్ధిస్తారు?
కళ్ళు తెరవ వలసింది నేను కాదు, మీరు. అప్పుడు ఆంధ్ర, తెలంగాణా ప్రజల జనాభా దామాషా 2:1 అని తమకు తెలియదులావుంది. ఆ విషయంగురించి కూడా వివరంగా వ్రాశారు రిపోర్టులో. తమరు చదివి ఉంటే అర్థం అయ్యుండేది. ఆ దామాషా ప్రకారమే ఉమ్మడి కర్చును భరించారు. అదనంగా ఒక్క పైసా విదిల్చింది ఏమీ లేదు. పైగా హైదరాబాదు భవనాలను వాడుకోవడం మాత్రం పూర్తిగా ఉచితం.
రెండు పాళ్ళు సొమ్ములు ఆంధ్రాలో కర్చు పెట్టి, కనీసం ఒక్కపాలు కూడా తెలంగాణాలో కర్చు పెట్టలేక బకాయి పడ్డారనే భార్గవ కమిటీ చెప్పింది. ఇంకా ఎందుకు మొండిగా వాదిస్తారు?
ఇంకో విషయం, చారీ, చారీ అని చనువుగా ఏకవచనంతో పిలిచే వారు తమ పేరుతో వ్యాఖ్యలు వ్రాస్తే అంతే చనువుగా జవాబు ఇవ్వడానికి వీలవుతుంది.
If you resort to the adopt the same style being anonymous, the comment will be simply deleted
>>>ఇదే భార్గవ కమిటి లో తెలంగాన లో 1966-67, 67-68 మధ్య కాలం లో తెలంగాణ వాటా కన్నా అధికంగా నిధులు కేటాయించిన విషయం కనపడలేదా?
అయ్యా, తమరెవరో గానీ (ఆడో, మగో కూడా తెలియదు, అయినా అయ్యా అని సంబోధిస్తున్నాను, తప్పయితే మన్నించండి), నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఒకవైపునుండి తెలంగాణాకి కర్చుపెట్ట వలసిన రెండింట ఒకవంతు నిధులే కర్చు కాలేదని భార్గవ కమిటీ చెపితే, మీరు వక్రభాష్యాలు చెప్తుంటే ఎలా? మీరు చెప్పే విషయం ఏ పేరాలో వున్నది వివరిస్తారా?
నిజానికి అప్పుడు తెలంగాణా జనాభా రాష్ట్రంలో మూడింట ఒకవంతు కన్నా ఎక్కువే(65:35), కానీ ఆ ఒకవంతు కూడా కర్చు పెట్టలేదని భార్గవ కమిటీలోనే వుంది, చూసుకోండి.
>>>భర్గవ కమిటీ ఎక్కడా నిధులు ఆంధ్ర కి మరలించిన విషయం పేర్కొనలేదు.. those are 'unspent' reserves of telangana అని మాత్రమే చెప్పింది.
కమిటీ unspent అని చెప్పిందనడానికి రుజువులున్నాయి. మరి వాటిని ఎప్పుడు కర్చు చేసిందో తమరు రుజువు చేయగలరా? అవి అప్పటి రోజులు కాబట్టి కొద్ది మొత్తంలో మళ్ళింపు జరిగింది. కాని తర్వాత్తర్వాత మళ్ళింపు బారీ మొత్తాల్లోనే జరిగిందనడానికి యూనివర్సిటీ కేటాయింపులే ఉద్యాహరణ (300: 29.5). రాష్ట్ర ప్రభుత్వం అంతా సవ్యంగా చేస్తే ఆ లెక్కలు శ్రీకృష్ణ కమిటీకి ఎందుకు ఇవ్వలేక పోయింది?
Srikanth kummesav Naakaite Em ardam Kaala Okka andhra valla valla nasanam ayipoyam antam tappa 109 mandi undi empikutunnaro ardam kaadu meeru enduku Tara taraluga andhra valla chetilo nasta potunnaro ardam kaadu intiko rastram iste gaani meeru bagu padaru leka pote repoddanna uttara telangana vaadu dochesadu ano dakshina telangana vaadu dochesadano antaru
ReplyDeletemee vaallu mukya mantriga chesinappudu empikaledu
pradana mantriga chesinappudu em pikaledu enduko ardam kaadu
kaani neeku maatram maa baga ardam ayi untadi
@krishna
ReplyDelete>>>109 mandi undi empikutunnaro ardam kaadu
అవతలి పక్క 173 మంది వుంటే 119 మంది ఏం పీకుతారు? అందుకే గదా మారాష్ట్రం మాకు కావాలని చెప్పేది? అంతెందుకు? ఎక్కువ ఎమ్మెల్యేలున్న మద్రాసుతో ఏం పీకలేకే గదా మీరు బయటికి వచ్చింది? అప్పుడే మరిచి పోయారా?
>>>mee vaallu mukya mantriga chesinappudu empikaledu
pradana mantriga chesinappudu em pikaledu
మా వాళ్ళను ముఖ్యమంత్రులుగా ఎప్పుడు వుండనిచ్చారు? సంవత్సరం తిరిగేలోపు దొంగ ఉద్యమాలో, లాబీయింగులో చేసి దింపేయడమేగా మీపని?
తెలంగాణా ప్రధానమంత్రి దేశానికే దశ తిప్పాడు. అంతే కాని నా ప్రాంతం, నా జిల్లా అని చూడలేదు, ఫలానా వాళ్ళలాగ! అదీ తప్పేనా?
మీ ముఖ్యమంత్రుల్లాగా మా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ప్రాంతీయ గజ్జితో వ్యవహరించలేదు. ఒకవేళ ఎవరైనా అలా వ్యవహరించినా మెజారిటీ మీవాళ్ళది కాబట్టి దించేస్తారు. కాబట్టి మీతో మాకు పొసగదు.
"కాబట్టి మీతో మాకు పొసగదు."
ReplyDeleteపోసగదేంటి? చారి గారూ? ఇది సమైక్య ఆంధ్ర ప్రదేశ్. సమైక్యంగా ఉన్నంత వరకూ అంతా కలిసి ఉండి తీరాల్సిందే.మరో మాట లేదు.
ఇక అప్పట్లో హైదరాబాద్ ఐదో మహానగరం అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద ఐదో మహానగరం? నిజాం సంపద ప్రాతిపదికగానా? లేక కొండలు గుట్టలతో నిండిన ఊరనా? లేక అప్పట్లో హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి ఏమన్నా ఉన్నాయనా? చెప్పండి చారీ.
ఒక్క మాట చెప్పండి చారీ. తెలంగాణా సాధన క్రెడిట్ కోసం ఒకరితో ఒకరు కొట్టుకోకుండా అంతా కల్సి ఎప్పుడైనా ఉంటారా? పీతల జాడీకి మూత అనవసరం చారి గారూ. ఒకటి పైకి ఎక్కుతుంటే పది దాన్ని కిందకి లాగేస్తాయి. కాబట్టి ఎప్పటికీ ఏ పీతా బయటకి రాదు. ఇలాగే ఉంటే ఎప్పటికీ తెలంగాణా కూడా రాదు. మీరు అనవసరం గా ఖంగారు పడి తోటి తెలుగు వాళ్ళని తిట్టకండి. మళ్ళీ జీవితాంతం వాళ్ళతోనే కలిసి ఉండాలి.
@SLAP ON THE FACE
ReplyDeleteమీకు తెలుగు అర్థం కాదులా వుంది. ఈ సమైక్యాంధ్ర ప్రదేశే పొసగడం లేదంటున్నాను. నేను కుదరదంటే, మీరు కలిసి వుంది తీరాల్సిందే అనడం లేదూ? అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి పొసగడం లేదనడానికి?
అదేమరి! కొండలు గుట్టలతో నిండిందనే నేమొ మీ తాతలు దేబిరించుకుంటూ వచ్చారు ఇక్కడికి! పోయి అడిగి తెలుసుకోండి వారిని. మేం పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నారు. ఆ షరతులు వమ్ము చేశారనే ఇప్పుడు మీతో పొసగదంటున్నాం.
>>>ఒక్క మాట చెప్పండి చారీ. తెలంగాణా సాధన క్రెడిట్ కోసం ఒకరితో ఒకరు కొట్టుకోకుండా అంతా కల్సి ఎప్పుడైనా ఉంటారా?
పనిలేక వచ్చి మొఖం మీద గుద్దిచ్చుకోవడం కాకపోతె, మా గొడవ మీకెందుకు చెప్పండి, అతితెలివితేటలు కాకపోతే! మేం గొడవ పెట్టుకుంటే మీకు మరింత మంచిది కదా! మాకే నష్టం కదా?
>>>తోటి తెలుగు వాళ్ళని తిట్టకండి.
తోటి తెలుగువాళ్ళ ఆవేదన అర్థం చేసుకోలేనివాళ్ళు, మళ్ళీ తోటి తెలుగువాళ్ళు అని ఎలా అనగలుతారు?
>>>మళ్ళీ జీవితాంతం వాళ్ళతోనే కలిసి ఉండాలి.
సోదరా! మేం అందరితో కూడా కలిసే బ్రతగ్గలం. తెలంగాణాని చూడు అందర్నీ ఆదరిస్తుంది. అదే ఆంధ్రాకి తెలంగాణా వాడే కాదు, ఎవడూ రాడు ఎందుకో మరి, అలోచించు.