గత రెండుమూడు రోజులుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణా సమస్యపై ఎడతెగని చర్చలు జరుపుతూ, ఒక నిర్ణయం తీసుకునే దిశలో నడుస్తున్నట్టు కనపడింది. తెలంగాణా సమస్యపై నిర్ణయం తీసుకోవడమంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి కాదు. ఒకవేళ తెలంగాణా ఇవ్వకూడదనుకుంటే కేంద్రం ఎలాంటి చర్చలు జరప నవసరం లేదు, ఎలాంటి నిర్ణయాలూ తీసుకోనవసరం లేదు. పీవీ గారి సూత్రమైన నిర్ణయ రాహిత్యమే గొప్ప నిర్ణయమని భావించి మన్ను తిన్న పాములా ఉండొచ్చు. ఇప్పటిదాకా చేస్తున్న పని కూడా అదే కదా?
ఇలా కేంద్రం తెలంగాణా సమస్యపై అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టె సరికి సమైక్యవాదుల గుండెల్లో గుబులు మొదలైంది. శక్తి వంచన లేకుండా తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక్కడ సమైక్యవాదులంటే మరెవరో కాదు, రాష్ట్ర పాలకులే. రాష్ట్రం గత అరవై ఏళ్ళ నుంచీ సమైక్యవాదుల చేతుల్లోనే ఉందన్నది విస్మరించలేని విషయం.
అందులో భాగంగానే కూకట్ పల్లి లోని NRI కాలేజీ మీదకి కొంతమంది సీమాంధ్రులను ఉసిగొల్పి, కాలేజీలను తెరిపించాల్సిందిగా డిమాండు చేయించారు. అలా అప్రతిహతంగా నడుస్తున్న సమ్మెలో పగుళ్ళు తెప్పించి, క్రమంగా పగుళ్ళు పెద్దవి చేసి, డిల్లీలో సమ్మె అసలే లేదని చెప్పుకోవాలని వారి రాష్ట్ర పాలకుల వెర్రి ఆశ!
అంతేకాదు, శాంతి యుతంగా సింగరేణి పర్యటన జరుపుతున్న కోదండరాం ని, ఇతర JAC లీడర్లను అరెస్టు చేశారు. కాని ప్రజాగ్రహం బద్దలయ్యేసరికి విడిచి పెట్టవలసి వచ్చింది. ఎందుకు అరెస్టు చేశారో, ఎందుకు విడిచి పెట్టారో కూడా చెప్పలేని పరిస్థితి మన ప్రభుత్వానిది.
తాజాగా సమ్మెలో పాల్గొంటున్న APSRTC యూనియన్ అయినటువంటి NMU ని ప్రభావితం చేసి సమ్మె ముగిస్తున్నట్టుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. కానీ తెలంగాణా NMU వారు తాము సమ్మె విరమించ లేదని, JAC లో భాగంగా వున్నామని ప్రకటిస్తూ తామే సదరు యూనియన్ నుండి వైదొలగడం కొసమెరుపు.
ఈ విధంగా సకలజనుల యొక్క కఠోరమైన మానసిక బలం ముందు సమెక్కుడు వాదుల కుట్రలు ఒక్కటొక్కటిగా బద్దలవుతున్నాయి. అయినప్పటికీ తెలంగాణా వాదులు రాబోయే వారం పది రోజులు అత్యంత అప్రమత్తంగా మెలగ వలసిన అవసరం వుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా సమైక్యవాద డేగలు ఉద్యమాన్ని కబళించాలని చూస్తాయి.
అందులో భాగంగానే కూకట్ పల్లి లోని ణృఈ కాలేజీ మీదకి కొంతమంది సీమాన్ద్రులను ఉసిగొల్పి, కాలేజీలను తెరిపించాల్సిన్డిగా డిమాండు చేయించారు.
ReplyDeleteఈ సంగతి ఏమో కానీ పిల్లల చదువులు నాశనమైపోతున్నాయి. దయ చేసి స్కూళ్ళు నడపండి
పిల్లల చదువులే కాదు ప్రాణాలే గాలిలో కలసి పోతున్నాయి.
ReplyDeleteఇప్పటికే దాదాపు ఏడు వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు
ఇంకా పిల్లల చదువులు ఎందుకు నాశనం కావాలి
ఇంకా ఎందరు చావాలి
త్దయసుసి వెంటనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి
పిల్లల చదువులు పాడు కాకుండా
ఇంకా ఎవ్వరూ ప్రాణాలు తీసుకోకుండా చూడండి
స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకూ ఇరవై కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి
ఒక్క తెలంగాణా విషయం లోనే ఇంట రాద్దాంతం ఎందుకు'
అదీ ఒకప్పుడు ప్రత్యెక రాష్ట్రం గా వున్న తెలంగాణాను ప్రకటించడానికి ఇంత
తాత్సారం ఎందుకు
ఇది ప్రజాస్వామ్య దేశామేనా
Rajesh
/* తెలంగాణా సమస్యపై నిర్ణయం తీసుకోవడమంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి కాదు */
ReplyDeleteabba cha raastrapati paalana kooda ayi vunda vachukada oka samasya vachinappudu daniki charchimchi andariki aamodayogyamaina pariskaram kaavali antekaani nenu cheppimde cheyyali ante adi moorkatvame avutundi.
/*సీమాన్ద్రులను ఉసిగొల్పి, కాలేజీలను తెరిపించాల్సిన్డిగా డిమాండు చేయించారు. */
nenu cheste neeti pakkodu cheste vyabicharam baavundi.mee problems meekunte tallidandruluga vaalla pillala bavisyattu meeda vaaallaku bayam untundi
naaku telangana meeda vyatirekata ledu kaani meeru cheppedi mari sollulaga undi maaku maatrame hakkulu untai migilina vaariki hakkulu undavu anela undi .
meeru mee demand kosam samme chestunnaru prajala kshemam kosam prabutvam udayamalanu addukovalasi undi adevidamga prabutvam samasyanu pariskarimcha valasi undi.
ఉద్యమం అన్న తర్వాత కొన్ని నష్టాలు తప్పవు. ఆ మాటకొస్తే 1972 జై ఆంధ్ర ఉద్యమంలోనూ, మొన్నటి కుహనా సమెక్కుడు ఉద్యమంలోనూ కూడా చదువులు దెబ్బతిన్న విషయం వాస్తవం కాదా? అయినా తెలంగాణా మొత్తంలో ఎక్కడా లేకుండా కూకట్‌పల్లి లోని ఒక కాలేజీయే ఎందుకు ప్రత్యేకమో అలోచించాలి.
ReplyDeleteపిల్లల ఆత్మహత్యలు, ఫ్లోరీన్ నీళ్ళతో ఛిద్రమైన బతుకుల గురించి ఏమాత్రం ఆలోచించలేని వారికి పిల్లల చదువులపై విపరీతమైన ప్రేమ పుట్టుకురావడం ఆలోచించదగ్గ విషయమే!
అంత కఠోరమైన మానసిక బలం ఉంటే, మద్యం షాపులూ సినిమాలని ఎందుకు ఆపుజేయటం లేదు? ఇంతమందిపై బందులు రుద్దుతున్న వీరు, వాళ్ళు కూడా తెలంగాణా వాళ్ళని మర్చిపోయారా? లేక వీరి ప్రభావం వాళ్ళపై పనిచేయదా? స్కూళ్ళు తెరవమంటే కుట్రగా కనిపించే మీకు, కవిత, కోమటిరెడ్డి కోదండరాం లాంటి చాలా మంది తెలంగాణా లీడర్ల పిల్లల చదువులు ఆగకుండా సాగుతుండడం న్యాయంగా కనిపిస్తోందా? నాయకుల పిల్లల చదువులేమో బవుండాలీ, సామాన్యుల పిల్లల భవిష్యత్తు నాశనమైపోవాలి. అడిగినవాడిది కుట్ర, చల్లగా చదివించుకునేవాడిది ఉద్యమం? కుట్ర మనదా వీళ్ళదా? స్కూలు పిల్లలకి, తెలంగాణా వొస్తే చదవకుండానే మార్కులేస్తామని చిన్నారులను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణా వొస్తే ఇలానే ఉంటుందా? ఇంత మోసం మనలో పెట్టుకుని ఎవరిదో కుట్ర అనటం మోసం కాదా? కుట్ర చేస్తుంది మన నాయకులే.
ReplyDeleteParent,
ReplyDeleteమీక్కూడా పై సమాధానమే వర్తిస్తుంది. ఎలాంటి నష్టం లేకుండా ప్రపంచంలో ఎక్కడా ఉద్యమం జరుగదు. జయప్రకాష్ నారయణ్ ధర్నాలు మీటింగులు, రోడ్డుషోలు పెట్టినా, అన్నా హజారే దీక్షలు చేసినా ప్రజలకు ఎంతో కొంత మేరకు ఆటంకాలు కలగడం సహజమైన విషయం. నాలుగు కోట్లమంది ప్రజల ఆకాంక్షలు తెలిసినా కూడా, తెలియనట్టు నటిస్తున్న ప్రభుత్వాన్ని కదిలించడానికి మరింత ఉధృతమైన ఉద్యమం తప్పనిసరి అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం మొండికేస్తే ఇంకా దూరం వెళ్ళే అవకాశం వుంది. తప్పు ప్రజల ఆకాంక్షలని పట్టించుకోని ప్రభుత్వానిదే అవుతుంది కాని ప్రభుత్వాన్ని పట్టించుకొమ్మని అడుగుతున్న ప్రజలది కాదు.
The KPHB "protest" is instigated by Nalamotu Chakravarthi & Loksatta
ReplyDeleteఅంత కఠోరమైన మానసిక బలం ఉంటే, మద్యం షాపులూ సినిమాలని ఎందుకు ఆపుజేయటం లేదు?
ReplyDeleteఇంతమందిపై బందులు రుద్దుతున్న వీరు, వాళ్ళు కూడా తెలంగాణా వాళ్ళని మర్చిపోయారా? లేక వీరి ప్రభావం వాళ్ళపై పనిచేయదా?
స్కూళ్ళు తెరవమంటే కుట్రగా కనిపించే మీకు, కవిత, కోమటిరెడ్డి కోదండరాం లాంటి చాలా మంది తెలంగాణా లీడర్ల పిల్లల చదువులు ఆగకుండా సాగుతుండడం న్యాయంగా కనిపిస్తోందా?
నాయకుల పిల్లల చదువులేమో బవుండాలీ, సామాన్యుల పిల్లల భవిష్యత్తు నాశనమైపోవాలి. అడిగినవాడిది కుట్ర, చల్లగా చదివించుకునేవాడిది ఉద్యమం? కుట్ర మనదా వీళ్ళదా?
ఇంతకీ ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గరా సమాధానం లేదు.
Anonymous
ReplyDeleteఅవీ ఆపే రోజొస్తది. ఉద్యమం తమరు చెప్పినట్టు కాదుకదా నడిచేది? వేచి చూడండి.
>>>ఇంతమందిపై బందులు రుద్దుతున్న వీరు...
ప్రజల మద్దతు లేకపోతే ఎవరూ రుద్దలేరని గ్రహించండి. గుంటూరులో తెలంగాణా వారికి కాపీ కొట్టి పోటీ "వంటా వార్పు" నిర్వహిస్తే డజను మంది కూడా రాలేదు. ఏ వుద్యమం అయినా ప్రజలకు ఇష్టం లేకపోతే ఒక్కరోజు కూడా నడవదు.
>>>నాయకుల పిల్లల చదువులేమో...
తమరు అంత ఆవేదన చెందక్కర్లేదు. ఏ వుద్యమమయినా ఇలాగే వుంటుంది. చివరికి స్వాతంత్ర్య ఉద్యమమైనా సరే. రేపు మీ ఉద్యమం కూడా (చేస్తే గీస్తే).
సమస్య ప్రజలకీ, ప్రభుత్వాలకీ మధ్య జరుగుతున్నప్పుడు, అమాయక పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టే హక్కు వీళ్ళకెవడిచ్చాడు? మా అందరి నిర్ణయాలూ వీళ్ళే తీసేసుకుంటారా? ఎవరెంత త్యాగం చేయాలో వీళ్ళే నిర్ణయిస్తారా? స్కూళ్ళు బందు చేయ్యమని పిలుపిచ్చింది ప్రభుత్వాలా? నాయకులా? ఈ రోజు, పనిచేద్దామనుకుంటున్న స్కూళ్ళకి బెదిరింపు కాల్స్ ప్రభుత్వం చేస్తోందా? తలుపులు తీసిన కాలేజీ అద్దాలపై రాళ్ళేసిన వాళ్ళు ప్రభుత్వోద్యోగులా? నష్టం, పిలుపిచ్చిన జేయేసీలు చేస్తుంటే, తప్పంతా ప్రభుత్వానిదని సరిపెట్టుకొమ్మంటే, తలూపడానికి మేమేమైనా ఒకటో క్లాసు పిల్లలమనుకున్నారా? లేక అమాయక ఊరి జనమనుకున్నారా? ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు పల్లెటూళ్ళల్లో చేయ్యండి, మా దగ్గర కాదు. పిల్లల భవిస్యత్తు నాశనం అయినా పరవాలేదనేవాళ్ళకి పిల్లలు లేకుండానైనా ఉండాలి, లేక వాళ్ళ చదువులు ఐపోయి కడుపు నిండైనా ఉండాలి. మీరంతా కడుపులు నిండి తమాషా చూస్తున్నారు, మేమేమో కడుపులు మండి అల్లాడుతున్నాం. మీరు మీ ఉద్యమాలూ మీ ఇష్టం. పిల్లల భవిష్యత్తు నాశనమౌతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేం.
ReplyDeleteసమస్య ప్రజలకీ, ప్రభుత్వాలకీ మధ్య జరుగుతున్నప్పుడు, అమాయక పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టే హక్కు వీళ్ళకెవడిచ్చాడు? మా అందరి నిర్ణయాలూ వీళ్ళే తీసేసుకుంటారా? ఎవరెంత త్యాగం చేయాలో వీళ్ళే నిర్ణయిస్తారా? స్కూళ్ళు బందు చేయ్యమని పిలుపిచ్చింది ప్రభుత్వాలా? నాయకులా? ఈ రోజు, పనిచేద్దామనుకుంటున్న స్కూళ్ళకి బెదిరింపు కాల్స్ ప్రభుత్వం చేస్తోందా? తలుపులు తీసిన కాలేజీ అద్దాలపై రాళ్ళేసిన వాళ్ళు ప్రభుత్వోద్యోగులా? నష్టం, పిలుపిచ్చిన జేయేసీలు చేస్తుంటే, తప్పంతా ప్రభుత్వానిదని సరిపెట్టుకొమ్మంటే, తలూపడానికి మేమేమైనా ఒకటో క్లాసు పిల్లలమనుకున్నారా? లేక అమాయక ఊరి జనమనుకున్నారా? ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు పల్లెటూళ్ళల్లో చేయ్యండి, మా దగ్గర కాదు. పిల్లల భవిస్యత్తు నాశనం అయినా పరవాలేదనేవాళ్ళకి పిల్లలు లేకుండానైనా ఉండాలి, లేక వాళ్ళ చదువులు ఐపోయి కడుపు నిండైనా ఉండాలి. మీరంతా కడుపులు నిండి తమాషా చూస్తున్నారు, మేమేమో కడుపులు మండి అల్లాడుతున్నాం. మీరు మీ ఉద్యమాలూ మీ ఇష్టం. పిల్లల భవిష్యత్తు నాశనమౌతుంటే మాత్రం చూస్తూ
ReplyDeleteఊరుకోలేం.
Parent,
ReplyDeleteమీకు చాలా ఆవేదన వున్నట్టుందే, పిల్లల భవిష్యత్తు గురించి? ఆవేదన మీ పిల్లల గురించా, తెలంగాణా పిల్లల గురించా? మీ పిల్లలగురించే అయితే భేషుగ్గా TC తీసుకెళ్ళి మీ ఆంధ్రాలో చేర్పించుకోండి, అక్కడ బళ్ళు నడుస్తూనే వున్నాయిగా!
తెలంగాణా పిల్లలగురించి మాత్రం మాట్లాడే హక్కు మీకు లేదు. APPSC పరీక్షల్లో ఏకపక్షంగా వ్రాత పరీక్షలో 85 శాతం మర్కులు వచ్చిన తెలంగాణా వారికి మౌఖిక పరీక్షలో 30 మార్కులు మాత్రమే వేసి వారికి ఉద్యోగాలు రాకుండా నిరోధించి, 50 మార్కులు వచ్చిన ఫలానా వారికి మౌఖిక పరీక్షలో 90 మార్కులు వేసి ఉద్యోగాలు దోపిడీ చేసినప్పుడు మీరు మట్లాడారా?
610 GO అమలుకాకుండా పాతికేళ్ళుగా మోకాలడ్డినప్పుడు తమరెక్కడున్నారు?
సీమాంధ్రలో దిద్దబడ్డ పేపర్లు 0 మార్కులు వేయబడితే, రీవాల్యుయేషన్లో 80 మార్కులు వచ్చినప్పుడు మీరేమైపోయారు.
ఇలా ఒక్కొక్క విషయానికీ ప్రతీరోజూ పోరాటాలు చేసి చేసి తెలనంగాణా ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు చేసేది నిర్ణయాత్మక పోరాటం. గెలిచే వరకూ చేసే పోరాటం. మా మధ్యకు వచ్చి శకుని పాత్ర నిర్వహించే మీలాంటివారు తాత్కాలికంగా అంతిమ విజయాన్ని వాయిదా వేయించ గలగ వచ్చేమో కాని, ఆపడం మాత్రం మీ వల్ల కాదు.
ప్రశ్నించే ప్రతీ వారిని ఇలా ముద్ర వెయ్యటం తగదు. అన్ని సంఘాల వారు కలసి కట్టుగా సమ్మెలో పాల్గొన్నారు.
ReplyDeleteకానీ విద్యాసంస్థలని ఎందుకు బంద్ చెయ్యాలి? ఇది ఏ పేరెంట్స్ ఒప్పుకున్నారు? మా పిల్లలు చదవకపోయినా పర్లేదు అని ఎవరు చెప్పారు?
కొన్ని సంఘటలని పట్టుకుని అసలు తెలంగాణా లో యే విద్యార్ద్ధి చదువుకోలేదు అన్నట్టు చెయ్యటం ఎందుకు?
అప్పుడు ఎక్కడ ఉన్నారు లాంటి ప్రశ్నలు నిరర్ధకం. తెలంగాణా కావాలి అనటం నా వరకు పూర్తిగా సమ్మతం. కానీ పిల్లల్ని వదిలెయ్యండి.
http://ranjeeth.wordpress.com/2011/10/10/over-to-indifference-escaping-from-the-t-turmoil/
ReplyDelete