Wednesday, October 12, 2011

తెలంగాణా ఏర్పాటుకు, గూర్ఖాలాండ్ కు సంబంధం లేదు - గూర్ఖా జన ముక్తిమోర్చా


డార్జిలింగ్, అక్టోబర్ 11 :తెలంగాణవాదులు కోరుకుంటున్నట్లుగా తాము ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం లేదని గూర్ఖా జనముక్తి మోర్చా ప్రకటించింది. ప్రస్తుతం డార్జిలింగ్‌లో పర్యటిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిజంగా ఇది శుభవార్తే. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తక్షణ ప్రభావంగా బెంగాల్‌లో గూర్ఖాలాండ్ డిమాండ్ ముందుకు వస్తుందని, కనుక యూపీఏ భాగస్వామ్యపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతుందని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో జీజేఎం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. "తెలంగాణ, డార్జిలింగ్ రెండూ భిన్న దృక్కోణాలు" అని గూర్ఖా జనముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి రోషన్‌గిరి మంగళవారం పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. తెలంగాణ అంశం, డార్జిలింగ్ అంశం ఒకే రకంగా ఉన్నప్పటికీ.. వాటిని వేర్వేరుగా చూడాల్సి ఉంటుందని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిన పక్షంలో మీ పార్టీ వైఖరి ఏంటన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినట్లయితే తమకు ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఇవ్వాలని జీజేఎం గతంలో పట్టుబట్టింది. "మేం కలిసి జీవించగలం. రాష్ట్రంలో కలిసి ఉండగలం" అని జీజేఎం కేంద్ర కమిటీ సభ్యుడు, కలింపాంగ్ ఎమ్మెల్యే హర్కా బహద్దూర్ ఛత్రీ కూడా చెప్పారు. ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతంలోని సిలిగురి, జల్పాయిగురి జిల్లాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మమతాబెనర్జీ పనిచేయగల సామర్థ్యం కల మహిళ. ఆమెను మేం విశ్వసిస్తాం" అని ఛత్రీ చెప్పారు. గతంలో వామపక్ష పాలన సందర్భంగా కొండ ప్రాంతాల ప్రజలకు, మైదాన ప్రాంతాల ప్రజలకు మధ్య విభజన సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు.

6 comments:

  1. అప్పుడపుడు ఒపీనియన్సు ఛేంజ్ చేస్తుంటేగాని పొలిటీషియన్సు గారు.

    ReplyDelete
  2. తెలంగాణాతో పోలిస్తే గూర్ఖాల్యాండ్ చాలా చిన్న ప్రాంతం. అందుకే గూర్ఖాల్యాండ్ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం లేదు.

    ReplyDelete
  3. Gorkhas don't speak Bengali. Their first language is Nepali. On the other hand, the national language of Bangladesh is Bengali.

    Taking linguistic fanaticism to its logical conclusion, Gorkhaland should be merged with Nepal. The rest of Bengal should join Bangladesh. This will make idiots like Parakala Prabhakar, LBS Tadepalli, Nalamotu Chakravarthi & Mallikarjuna Sharma happy.

    ReplyDelete
  4. I condemn the Anonymous said at October 12, 2011 12:48 PM. I think this person is not aware of Nepal and Bangladesh are not in Indian states. They are countries.

    ReplyDelete
  5. Above anonymous,

    He infered only about the linguistic fanaticism of those vishaandha people. The one language one state argument is impractal and never implemented in India in toto. See the Hindi speaking states.

    ReplyDelete
  6. నలమోతు చక్రవర్తి ఏమీ భాషాభిమాని కాదు. పాలకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసినది కేవలం గ్లోబలైజేషన్ పేరుతో ఒక మోడల్ చూపించడానికి. నలమోతు చక్రవర్తి పక్కా గ్లోబలైజేషన్‌వాది కనుక అతను తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తునాడు. దానికి భాషాభిమానంతో ఏమీ సంబంధం లేదు. నిజానికి నలమోతు చక్రవర్తి నల్లగొండ జిల్లా నుంచి వచ్చినవాడే. అతను ప్రాంతీయ అభివృద్ధి & అస్తిత్వం కంటే గ్లోబలైజేషనే ముఖ్యమనుకుంటున్నాడు. అందుకే తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు. తెలంగాణా ప్రజలు తెలుగు కాకుండా ఇంకో భాష మాట్లాడినా నలమోతు చక్రవర్తి లాంటి వాళ్ళు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఒప్పుకోరు.

    ReplyDelete