Friday, October 7, 2011

ఇచ్చట సమైక్యవీడియోలు తీయబడును

తెలంగాణా ఉద్యమం మీద రాళ్ళేయడానికి కుహనా సమైక్య వాదులు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగమే ఈ యూట్యూబ్ వీడియో. దీనిలో ఒక ముసలావిడ చేత ఉద్యమాన్ని అపహాస్యం చేయిస్తూ పనిలో పనిగ KCRని కోదండరాంని యధేచ్చగా తిట్టించారు. కాని వీరు చేసిన ఒకే ఒక పొరపాటు, సరైన మనిషిని ఎంచుకోక పోవడం. ఆవిడ తన పేరు, ఊరు చెప్పుకోక పోవడం అటుంచితే, ఆవిడ కృష్ణా జిల్లా యాస అసలు విషయం మొత్తం బయట పెట్టింది. ఇంకా దీన్ని గురించి చర్చించడం అవసరమా?

17 comments:

  1. అందులో ఆవిడ తనది ఖమ్మం జిల్లా అని చెబుతున్నారుగా. ఖమ్మం జిల్లా యాస లో కృష్ణా యాస కలవక కరీం నగర్ యాస కలుస్తుందా? అసలు మతుండే మాట్లాడుతున్నారా?

    ReplyDelete
  2. అమె పేరు, వూరు ఎందుకు, వెళ్ళి "అడ్డంగా నరుకుతవా",నాలుక చీరెస్తవా, ముందు వాస్తవాలని గ్రహించు. ప్రపంచమంతా మీకు వ్యతిరేకమనే జాడ్యం నుండి బయటికి రా!

    ReplyDelete
  3. సూటిగా,

    చీరెయ్యడంలో నరికెయ్యడంలో మీకన్నా సాటి ఎవరు? ప్రపంచమంతా మాకు అనుకూలమే, కొంతమంది సమెక్కుడు దొంగలు, వారి మోచేతినీళ్ళు తాగే సూటిగా చూడలేని రెండుకళ్ళ సిద్ధాంతులు తప్పితే.

    ReplyDelete
  4. Anonymous

    యాస కలవడం వేరు, అదే యాస కలిగి వుండడం వేరు. తమరోసారి కమ్మం వెళ్ళి చూడండి మతిగల్లవారూ.

    ReplyDelete
  5. వూరు, పేరు చెబితే తెలంగాణా ద్రోహి ముద్ర కొడదామనా? కృష్ణా జిల్లా పొరుగున వున్న ఖమ్మం జిల్లాలో చాలమందికి ఆయాస వాసనలు తగలడం సహజమే. మీ వీర తెలంగాణా వాదుల్లో చా.........లా మంది మొన్నటిదాకా స్వచ్చమైన తెలుగుమాట్లాడినోళ్ళే. (T-News లో మొత్తం వాక్యం స్వచ్చమైన తెలుగులో చెప్పి, చివర్లో ’అన్నరు’, ’చెప్పిర్రు’, ’వచ్చిర్రు’, ’పోయిర్రు’ అన్నట్లు.

    ReplyDelete
  6. వెలమకన్ని కోదండరాంOctober 7, 2011 at 11:53 PM

    జై తెలంగాణ జై జై తెలంగాణ

    ReplyDelete
  7. చెంబు,

    తెలంగాణా ద్రోహం చేయడానికి ఆ ముసలావిడ దాకా ఎందుకు లెండి. అసెంబ్లీ, సెక్రెటేరియట్ ఛాంబర్లలోనే కావలసినంత మంది వున్నారు.

    తెలుగు యాసలు వేరయినా శిష్ట వ్యావహారికం అనేది ఒకటి వుంటుందని గ్రహించండి. మీకు T-న్యూస్ వార్తలు కృష్ణాయాసలాగా అనిపించిందా?

    ReplyDelete
  8. "తెలుగు యాసలు వేరయినా శిష్ట వ్యావహారికం అనేది ఒకటి వుంటుందని గ్రహించండి."
    ఆ శిష్ట వ్యావహారికాన్నేగా మీరు రెండున్నర జిల్లాల భాష అని ఏడుస్తున్నారు? కాదంటారా? మరి తమరే చెప్పండి శిష్ట వ్యావహారికం అంటే అదెలా ఉంటుందో?

    ReplyDelete
  9. ఆ శిష్ట వ్యావహారికాన్నేగా మీరు రెండున్నర జిల్లాల భాష అని...


    మీరు ఆ రెండున్నర జిల్లాలవారో కాదో తెలియదు, కాని శిష్ట వ్యావహారికం, ఆ రెండున్నర జిల్లాలలో సామాన్యులు మాట్లాడే యాసలు ఒకటి కాదు.

    తెలంఘాణా వాదులు అభ్యంతరం చెప్పింది శిష్ట వ్యావహారికంలోకి తెలంగాణా మాండలిక పదజాలం రాకుండా కొందరు ప్రాంతీయ విషనాగులు అణగదొక్కడాన్ని మాత్రమే. KCR కోదండరాంతో సహా తెలంగాణా నాయకులు మాట్లాడేది శిష్ట వ్యావహారికమే అని గ్రహించండి. అంట మాత్రాన వారు మాట్లాడే యాస కోస్తా యాస అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే.

    ReplyDelete
  10. మా తెలంగాణ మాగ్గావాలె అనే వాళ్లంతా మహారాష్ర్టలో కలిసి ఉన్న మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలో కలిసున్న బీదర్ ప్రాుతం కూడా ఒకప్పటి తెలంగాణ అన్న సంగతి ఎందుకు మరిచారో...

    ReplyDelete
  11. nEnu khammam jillalo padi samvatsaralu daka unnanu. so mikante ekkuva akkadi bhasha yasa naku telusu. miru anukune maree grandhikamaina yasa akada undadu. krishna jilla mariyu agency sarihaddu avadam valla mixed untadi. krishna ki daggaralo unna urullo krishna yase untadi. asalu acceptance anede lekunda vitandavadam chestunte ettaa.

    ReplyDelete
  12. ఖమ్మం భాష ఎలా ఉంటుందో నాకు తెలుసు. కరీంనగర్‌లో చదువుకునే రోజుల్లో రేవాన్ అనే నా స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ సొంతూరు ఖమ్మం. అతను ఎన్నడూ కృష్ణా యాసలో మాట్లాడలేదు. రెండున్నర కాదు, రెండుంపావు జిల్లాల భాష అయిన ఆ భాషని అధికారికం చేసినది గురజాడ గారు. గుంటూరు ప్రాంతం నుంచి వలస వచ్చి విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలలో స్థిరపడిన నియోగి బ్రాహ్మణ కుటుంబం అతనిది.

    ReplyDelete
  13. ఆమెది ఖమ్మం జిల్లా , అది వాస్తవం . సమ్మె చెస్తున్న వాళ్ల లొ రాజకీయనాయకులకు మాత్రమె వచ్చాయి.

    ReplyDelete
  14. పనికి మాలిన వీడియో...అది...

    తెలంగాణా సమర యోధురాలు అని Title లో నిస్సిగ్గు గా అబద్ధం రాసిన ఆ బ్లాగర్ కి దండేసి దణ్ణం పెట్టాలి,...

    ReplyDelete
  15. khammam jillalo konni mandalalaku krishna,godavari jillalato sambandhalu ekkuva. bhumi sarihaddu avatam valana. pakka pakka jillalavatam valana.

    khammam jilla lo mottam oke rakamaina yasa undalanukovatam avivekam.

    telanganalo ekkuva jillalakante khammam jillaku krishna/godavari jillalato ekkuva sarupyata , sambandhalu unnai.

    ReplyDelete
  16. Date : 01-Nov-2020
    Place : Telengana Gharjana Meeting in Usmania Arts college ground.

    Poraatala thone Telengana Saadhinchukundaaam - prof:kodandaram

    Telengana kosam Avaramaithe malla raajinaamalu chesthaamu : KCR

    ReplyDelete
  17. కూరిమి వరసంబైనను
    నరములే తోచుచుండు నిక్కము సుమతీ.

    అన్నదమ్ములలో ఒకరి తలలో పురుగుదూరినా కొంపకు నిప్పే!
    విడిపోవడమే అభివృధ్ధి మార్గమని తలచేవారికి మంచి చెప్పి తిట్లు తినడం వృధా శ్రమ. విధివ్రాతను తప్పించలేమనిపిస్తోంది.

    ReplyDelete