మేధావి ముదిరితే చాదస్తుడు అవుతాడేమోనని అనుమానం కలుగుతుంది కంచె ఐలయ్యగారి రాతలు చూస్తుంటే. తెలంగాణా ఉద్యమం విషయంలో ఒకవైపు తానూ వ్యతిరేకం కాదంటూనే మొదటి నుండి శల్యసారధ్యం వహిస్తున్న మేధావి ఐలయ్యగారు. ఆయన కలంలోంచి తాజాగా జాలువారిన వ్యాసం - గాంధీ తాతా నువ్వే చెప్పు!.
ఆయన సదరు వ్యాసంలో కొన్ని ఆలోచించ దగిన విషయాలు ప్రస్తావించారు. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రంలో వెలమల ఆధిపత్యం మొదలవుతుందనే ఆలోచన ఆయన రాతల్లో కనిపిస్తుంది. తెలంగాణా పోరాటంలో వేలమలె అగ్రభాగాన వుంది నాయకత్వం వహిస్తుండడం అందుకు ముఖ్య కారణం.
మన దేశచరిత్ర గమనించి నప్పుడు ఎప్పుడూ కొన్ని ప్రతి సందర్భంలోనూ కొన్ని కులాల ఆధిపత్యం కనబడుతూనే వుంది. బ్రిటిష్ వారికాలంలో రాజ్యాలు కలిగిన క్షత్రియులు, రెడ్లు, చదువు కలిగిన బ్రాహ్మణులు అగ్రభాగాన నిలిచారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత క్షత్రియుల, బ్రాహ్మల ప్రాభవం తగ్గి, కమ్మలు, రెడ్లు ఇప్పటిదాకా ఆధిపత్యం వహిస్తూ వచ్చారు. అలాగే తెలంగాణా ఏర్పడ్డ తర్వాత ఈ సమీకరణాలు మరింత మారితే ఆశ్చర్య పడవలసిందేమీ లేదు.
ఇప్పుడు రాష్ట్రంలో రెడ్లు, కమ్మలు ఆధిపత్యం వహిస్తున్నారని ఐలయ్యగారే ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు వారితో పోల్చినపుడు వెలమలది రెండోవరుసే. మరి రెండో వరుసలో వున్నవాడు మొదటి వరుసలోకి రావాలనుకోవడంలో తప్పేముంది? దానికి ఐలయ్యగారికున్న అభ్యంతరం ఏమిటి? అభ్యంతరం వుంటే గింటే ఆయన వ్యాసాలూ అచ్చేస్తున్న పసుపు మీడియాకో, పచ్చ మీడియాకో వుండాలి.
కొన్ని కులాలకన్నా అగ్రభాగాన వున్నారు కాబట్టి వెలమలు వారికన్నా పైకులాలపై ఎందుకు పోటీ పడకూడదు? ఆ సూత్రాన్నే అనుసరిస్తే, దళితులకన్నా అగ్రభాగాన వున్నారు కాబట్టి, బీసీలు అగ్రవర్గాలపై పోటీ పడకూడదు. మాదిగలకన్నా అగ్రభాగాన వున్నారు కాబట్టి మాలలు పైకేదగాలనుకో కూడదు. గిరిజనులకన్నా అగ్రభాగాన వున్నారు కాబట్టి మాదిగలు సంతృప్తి చెందాలి. అదేనా మరి ఐలయ్యగారి నీతి?
ఒకవేళ వెలమలు మాత్రమే దుష్టాతి దుష్టులైన కులంగానూ, కమ్మలూ, రెడ్లూ సాధుకులాలుగా భావిస్తున్నారా ఐలయ్యగారు? ఆ విషయం పై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అలానే భావిస్తున్న పక్షంలో చుండూరు, కారంచేడు సంఘటనలు ఐలయ్యగారు గుర్తుకు చేసుకుంటే మంచిది.
కమ్మలు, రెడ్లు వెలమల కంటే బలమైన కులాలని, ఈ సమైక్య రాష్ట్రంలో వెలమలు వారిని మించి వెళ్ళగలిగే శక్తి లేనివారని ఐలయ్యగారే చెప్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన చెప్పినట్టుగా వెలమకులం బలం పుంజుకున్నప్పటికీ, మరి అగ్రకులాధిపత్యం పైన దళితులు పోరాటం చేయవలసి వస్తే ఎవరిని ఎంచుకుంటారు? విశాలమైన రాష్ట్రాన్ని శాసించ గలుగుతున్న పెద్ద కులాలమీదా? లేదా చిన్న రాష్ట్రంలో అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న కులాధిపత్యం మీదనా?
రాష్ట్రం పెద్దదైతే కాంట్రాక్టులు పెద్దవి వుంటాయి. అవి మనదేశంలో పెద్దలకే వస్తాయన్నది కఠోర వాస్తవం. అప్పుడు పెద్దరాష్ట్రంలోని పెద్దవాడు మరింత పెద్దవాడుగా మారతాడు. మరింత బలం పుంజుకుంటాడు. రాష్ట్రంలో జరిగిన రాజశేఖర్ రెడ్డి పాలనే దీనికి అద్భుతమైన ఉదాహారణ. పై ఉదాహరణను అనుసరించి, చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు పెట్టుబడి దార్లు బలపడే త్వరణం కూడా తక్కువగానే వుంటుంది. తక్కువ కులాలవారు వారిపై పోటీ పడడానికి, గెలవడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అదే పెద్ద రాష్టాలలో దళితులు అగ్రకులాల వారిపే ఎప్పటికీ నేగ్గలేరు. అదే అంబేద్కర్ చెప్పిన సూత్రం.
నిజానికి కులాధిపత్యమ్మీద చేసే పోరాటం ప్రాంతాల కతీతంగా దేశం మొత్తం చేయవలసిన పోరాటం. ప్రతి దళిత బహుజనుడు తన వోటు ప్రాధాన్యతని గ్రహించి నప్పుడు అది తప్పక సాఫల్యం చెందుతుంది. కాని తెలంగాణా పోరాటం అలాంటి పోరాటం కాదు. ఎక్కువ జనాభా, వైశాల్యం, గలిగిన ప్రాంతం ఆదిక్యతపై తమ ప్రాంత అస్థిత్వం కోసం కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటున్న పోరాటం. ఇంతటి ఐకమత్యంతో కూడిన పోరాటం దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూసిందీ, విన్నదీ లేదు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుపై ఐలయ్యగారి భావాలు ఎలా వున్నా ఆయన వ్రాసే వ్రాతలు మాత్రం తెలంగాణా పోరాటానికి వెన్నుపోటు పొడిచేవిగానే వున్నాయి. అందుకే ఆయన వ్యాసాలంటే పసుప్పచ్చ మీడియాకు అంత మక్కువ. విచిత్ర మేమంటే దళితవాదంమీద ఐలయ్యను వ్యతిరేకించే కొందరు సమెక్కుడు వాదులు ఆయన తెలంగాణా సమస్యపైన వ్రాసే వ్యాసాలకు మాత్రం పెద్దపీట వేయడం.
svayam prakatita medhaavulu ilaane maatlaadutaaru
ReplyDeleteika ailayyagaariki kulamkamte mata pichchekkuva adi manasulo umchukuni paikedo chebutumtaadu
బ్రిటిష్‌వాళ్ళు పోయినా కుల వ్యవస్థ పోలేదు కాబట్టి బ్రిటిష్ పాలనే బాగుందనుకుందామా?
ReplyDelete"అదే పెద్ద రాష్టాలలో దళితులు అగ్రకులాల వారిపే ఎప్పటికీ నేగ్గలేరు."
ReplyDeleteHasn't Mayavati come to power in Uttarpradesh on own strength, with out the support of any, socalled Manuvaadi parties?
ఐలయ్య gurinchi telusu.
ReplyDeleteayanaki anni baadhale, SC/ST vaallu padinantha.
Ailaiah gaaru,
sorry, nenu emi BRAHMANUDINI KAADU,
kaani manusmrithi gurinchi kuda baaga telusu.
Sridhar
@andhrudu garu,
ReplyDeleteTwo points.
1. Uttarpradesh is result of split from old Uttarpradesh and Uttarakhand. Only after the state split there came the possiblity of Maya coming into power...
2. And if you really follow politics of Uttarpradesh you'll know that Maya roped in brahmins support to come into power. A strange and unbelievable alliance.