Sunday, December 8, 2013

తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ స్వార్థం?

సమైక్యవాద దోపిడీ శక్తులు మరొక్క సారి తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ముప్పేట దాడిని మొదలు పెట్టాయి. ఆ దోపిడీ భూతానికి గల మూడుచతుర్ముఖాలు చంద్రబాబు, జగన్, కిరణ్ రెడ్డి మరియు జయప్రకాశ్ నారాయణ్. దాని చేతిలో వున్నా ముళ్ళగద సీమాంధ్ర మీడియా. దానికి గల చోదక శక్తి సీమాంధ్ర పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్ల నల్ల ధనం.

వీరందరూ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏమంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి మాత్రమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొడుతుంది అని.

కాంగ్రెస్ ఇంతవరకు వారి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. బహుశా రాహులే అనుకుందాం. ఏ పార్టీ అయినా తన అభ్యర్థి ప్రధానో, ముఖ్యమంత్రో కాకూడదని ఎందుకు అనుకుంటుంది? ప్రజాస్వామ్య మూల సూత్రం అదే కదా?
అధికారం లోనికి రావాలంటే ప్రజోపయోగమైన పనులు చేయాలి. అవి చేస్తేనే వోట్లు పడతాయి. వోట్లు పడితేనే అధికారం లోనికి వస్తారు ఎవరైనా. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.

చంద్రబాబుకు , జగన్ కు ఆ విషయం తెలియదా? జగన్ సంగతేమో కాని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ అధికారానికి అర్రులు చాచే కదా 2008లో తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రణబ్ కి లేఖ పంపింది? కాని చివరి నిముషంలో (తెలంగాణలో ఎన్నికలు అయ్యాక) 'వీసా సిద్ధాంతం' బయటికి తెచ్చి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నెత్తిమీద నీళ్ళు కుమ్మరించాడు, అది వేరే సంగతి.

జగన్ మాత్రం ఈ విషయంలో ఏం తక్కువ తిన్నాడు? ప్లీనరీలో తెలంగాణా ఉద్యమం మీద సానుభూతి ప్రకటించ లేదా? ఆర్టికల్ మూడు అనుసరించి రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇవ్వలేదా? ఇవన్నీ వోట్లకోసం కాదా? ఒక వేళ వోట్లకోసం కాకుంటే అందులో న్యాయం వుండడం వల్ల అయ్యుండాలి. అది వోట్ల కొసమైతే అదే పని కాంగ్రెస్ చేస్తే తప్పేమిటి? అలా కాక తెదేపా, వైకాపా ఆయా సమయాలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు హేతుబద్ధమైనవే అయినట్టయితే మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పేమిటి? ఇవి వారివద్ద సమాధానం దొరకని ప్రశ్నలు.

జగన్ అయినా, చంద్రబాబు అయినా తమ కుహనా తెలంగాణా అనుకూల వాదంతో ఆ ప్రాంత ప్రజలను మోసం చేయాలనున్నరన్నది ఇప్పుడు బయట పడ్డ వాస్తవం! వారికి ఏ సమయంలోనూ రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచన లేదు. తెలంగాణా ప్రజలను మోసం చేసి ఎలా వోట్లు దండుకుందామన్న ఆలోచన తప్ప!

ఈ మోసగాళ్ళకు గుణపాఠం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్భజన నిర్ణయం తీసుకుంది! తాము తీసుకోలేక పొతే బిజెపి ఎలాగైనా తెలంగాణా ఇస్తామంటుంది. ఆ క్రెడిట్ దానికి దక్క కుండా చేయడం కూడా కారణం కావచ్చు. కారణాలు ఏవైనా ఈ కుట్రబాజీ నాయకులకు సోనియాని గాని, కాంగ్రెస్ ను గాని విమర్శించే అర్హత లేదు!

తెలంగాణాను ఇవ్వడం ద్వారా 25 సీట్ల ఆంధ్రాను కాదని 19 సీట్ల తెలంగాణాను ఎంచుకోవడం వల్ల కాంగ్రెస్ పెద్ద రిస్కే చేసింది. నిజానికి ఇన్ని రోజులు, సమైక్య వాదులు చెపుతున్న వోట్లు, సీట్లు చూసే తెలంగాణా వాదంలో ఎంత నిజాయితీ వున్నా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెనుకాడింది. ఎప్పుడైతే తెలంగాణా వాదంపై సానుభూతి ప్రకటించిన లంచగొండి జగన్ ను ఆంద్ర ప్రాంత ప్రజలు గెలిపిస్తూ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేశారో, అప్పుడే తెలంగాణా ఏర్పాటుకు బీజం పడింది. అది ఆంధ్ర ప్రజలు చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధం! అప్పుడే సమైక్యవాదంపై ఆంధ్ర ప్రజలకి ఎంత నిబద్ధత వుందో అధిష్టానానికి అర్థమైంది!

తెలంగాణను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి స్వార్థం ఉంటే ఉండవచ్చు, ఆ స్వార్థం మిగతా పార్టీలకి ఉన్న లాంటిదే తప్ప వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని స్వార్థంతో ప్రకటించినా, మరోలా ప్రకటించినా, అది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందే తప్ప వేరు కాదు.

Tuesday, December 3, 2013

హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా?

శ్యామలీయం గారి బ్లాగు పోస్టుకు నా సమాధానం :)



వ. ఓ సీమాంధ్రప్రజలారా,

మీరిక హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా?

మన మందరము తెలుగువారము, అయినను మీరు మమ్ము చిన్న చూపు జూసి తెగనాడితిరి. మా భూముల, ఉద్యోగాల, నీళ్ళను కాజెసితిరి. మీరు మా సోదరులు, యీ రాజధాని మన తెలుగువా రందరిది యని నేటి వరకు భావించి మోసపోతిమి గదా! మించినది లేదు, ఇపుడైనను మీరు స్వార్థ చింతనను వీడి ఆంధ్ర రాష్ట్రమును అభివృద్ధి చేసికొనుట యుత్తమము గదా!

సీ. రాజభోగములకే రాజధాని యటంచు
     భావించు కొనుటయే తమరి తప్పు
ఆంధ్రదే యూరని యతినమ్మకంబున
     పీల్చివేయగ జూడ పెద్దతప్పు
ఇటురమ్ము యనగనే నీ‌ భాగ్యనగరమ్ము
      మన దను భ్రాంతితో మనుట తప్పు
ఇచట చేరిన వార లెల్లరి వలెకాక
     కబ్జాల కొడిగట్ట గాంచ తప్పు

తే.ఇన్ని తప్పులు చేయుట యెందువలన
ఇన్ని నిందలు మోయుట యెందువలన
ఇన్ని నాళులు తెలియలే దెందువలన
అసలు తెలగాణ్యు లుదారు లందువలన!

సీ. మన యైకమత్యంబు మహనీయ మనిచెప్పి
     మా  నోళ్ళలో మీరు మన్ను గొట్టి
మా యతి నమ్మక మను బలహీనత
     మా భూములను దోచి మహలు గట్టి
దుర్భుద్ధితో యూరు దోచుకొనగ నెంచి
     ప్రాంతీయ ప్రజలపై పగనుబట్టి
మన నీరు మన నిధుల్ మనభూము లనుదోచి
     మా నోళ్ళలో మీరు మన్ను గొట్ట

తే. అకట కర్నూలులో మీర లమర లేక
దక్షిణాదిలో నత్యంత దండి యైన
పట్టణం బని హైదరాబాదు మీద
మరులు గొని వచ్చి రాంధ్రులు మట్టు బెట్ట

తే. హైదరాబాదుపై మీకు హక్కు లేదు
హైదరాబాదు మీ కొక యద్దెకొంప
గెలిచి మిముమేము బయటికి గెదమ లేదె?
గడుపు డిచటనే మీయూరు కట్టు వరకు!

కం. తగునే యూటీ చేయుట
తగునే యీ యూరిపైన తమ పెత్తన మ
ట్లగుచో కబ్జా భూములు
మిగిలించను పైరవీలు మిక్కిలి జేయన్

కం. కాలము జడమది కాదుర
చాలును మీనాటకములు చాలించుడికన్
మేలగు మీకిపుడైనను
కాలముతో నడచుటెల్ల గౌరవముకదా!
 
కం. నమ్ముట కైనను జాలదు
హమ్మా, తెచ్చితిరె మీరు హైదర బాదున్
ఉమ్మడి యూరది యెట్టుల?
ఇమ్మని మీ రిట్టు లడుగు టేమి యుచితమౌ?

కం. ఇచ్చెడు వారలు గలిగిన
ముచ్చటగా భూమి నెల్ల మోమోటము లే
కచ్చముగా మా కిండని
హెచ్చిన గరువమున గోర నెంచెదరు గదా!

కం. దినదినమును సీమాంధ్రులు
పనిగొని నిందించి యిట్లు పరమానందం
బును బొందుచుండి నందుట
నొనగూరెడు లాభ మొక్కటి గలదే?

కం. ఇక దేనికి మీ వగపులు
ప్రకటంబుగ కాలమహిమ వలనన్ రాష్ట్రం
బిక చీలుటయే తథ్యం
బకటా పగ లుడిగి శాంతులై యుండదగున్

Sunday, December 1, 2013

రాయల తెలంగాణా, సరికొత్త రాగం


రాష్ట్ర విభజన చివరి దశలో ఉన్న సమయంలో రాయల తెలంగాణా అంశం ముందుకొచ్చింది. కర్నూలు, అనంతపూరు జిల్లాల్లోని రాజకీయ నాయకులు అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ ఇది ఎప్పటి నుండో కోరుతున్నారు. కేంద్ర కాంగ్రేస్  నాయకత్వం కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అందుకు ఒప్పిస్తున్నట్టే కనిపిస్తుంది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ రెండు జిల్లాల లోని ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం ఇంకా తెలియడం లేదు. ఆ ప్రాంతపు నాయకులు మాత్రం తాము ప్రజల ఆకాంక్షలనె ప్రతిబింబిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణా ప్రాంతపు ప్రజాసంఘాలు, JAC లు మాత్రం తాము పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప దేనికి ఒప్పుకోమని నిర్ద్వందంగా చెప్తున్నయి. 

ఒప్పుకోక పొతే హైదరాబాద్ ను UT చేస్తామనే బూచిని చూపి కేంద్రం తెలంగాణా వాదులను ఒప్పించ వచ్చు. సీమలోని ఆ రెండు జిల్లాలు కలవడం వలన శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే నీటిని, కరెంటును వేరొక రాష్ట్రంతో పంచుకో వలసిన పరిస్థితి తప్పి పోతుంది. ఆ ప్రాజెక్టుపై, పరిసర కృష్ణ, తుంగభద్రా బేసిన్ పై పూర్తీ హక్కులు తెలంగాణా ప్రభుత్వానికి దాఖలు అవుతాయి. అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా పేరొందింది. ఇక తెలంగాణా మొత్తం మెరక ప్రాంతమే. కాబట్టి ఇతర తెలంగాణా జిల్లాలతోబాటు అనంతపురం అభివృద్ధి బాధ్యతలు కూడా తీసుకోవడం దానికి శక్తికి మించిన బాధ్యత అవుతుంది. సస్య శ్యామల ప్రాంతమైన సీమాంధ్రకు అనంతపురం బాధ్యత తీసుకోవడం పెద్ద కష్టం కాక పోవచ్చు. కాని ఆ జిల్లా ఆంధ్రలో కలిపితే  మరింత అనాధ అయ్యే ప్రమాదం వుంది. గత అనుభవాల ప్రకారం చూస్తినట్టైతే ప్రాబల్యం కలిగిన కోస్తావారు తనకు మాలిన ధర్మంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ జిల్లాని అభివృద్ధి పరుస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఆ రెండు జిల్లాలు తమను తాము ఆంధ్రరాష్ట్రంతో మమేకం చేసుకోలేక పోతున్నాయి!

గడిచిన ఐదు దశాబ్దాలుగా, అధిక జనాభా కలిగి, 175 అసెంబ్లీస్థానాలతో సీమాంధ్ర ప్రాంతం తెలంగాణాపై రాజకీయ ఆధిపత్యం సాధించి, తెలంగాణను ఒక వలస ప్రాంతంగా మార్చ గలిగింది. తెలంగాణా రాజకీయ మనుగడ కష్ట సాధ్యం అయింది. కాని కేవలం రెండు జిల్లాలను కలుపుకోవడం వల్ల తెలంగాణా రాజకీయ అస్తిత్వానికి కలిగే చేటు ఏమీ ఉండక పోవచ్చు. కేవలం రెండు జిల్లాల వారు పది జిల్లాల ప్రాంతంపై రాజకీయ ఆధిపత్యం సాధించే అవకాశం చాలా తక్కువ, వారి ఫ్యాక్షనిస్టు మూలాలను పరిగణ లోనికి తీసుకున్నప్పటికీ. 

కాని ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణా సంస్కృతి, వ్యవహారాలలో ఏవిధంగా మమేకం కాగలరు? అది ఆ రెండు జిల్లాల వారు వేసుకోవలసిన ప్రశ్న. వారు కలిసినంత మాత్రాన తమ సంస్కృతీ చిహ్నమైన 'తెలంగాణా' పదాన్ని 'రాయల తెలంగాణా' గా మార్చుకోవడానికి తెలంగాణా ప్రజలు ఏమాత్రం ఇష్టపడరు. కలిస్తే, గిలిస్తే వారు తెలంగాణా రాష్ట్రంలో భాగంగా కలవ వలసిందే, రాయల తెలంగాణాగా కాదు.  

ఇప్పుడు తెలంగాణలో కలుద్దామనుకుంటున్న రెండు జిల్లాల వారు, గడిచిన  కొన్ని దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు స్వరాష్ట్రం కోసం చేస్తున్న పోరాటాలపై ఏమాత్రం సానుభూతితో ప్రవర్తించ లేదు. పైగా వారి నాయకులు తెలంగాణా వాదులను అనేక మార్లు తూలనాడారు, హేళన చేశారు. ప్రతి సందర్భంలోనూ కోస్తా ప్రాంత పెట్టుబడి దార్లకు వంతపాడారు తప్ప, తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలం చెందారు. అటువంటి వారు, ఇప్పుడు తెలంగాణాలో కలుస్తామని అడగడం ఎంతవరకు సమర్థనీయం? తెలంగాణా సమాజం ఏవిధంగా ఆదరించ గలదు?

Friday, November 22, 2013

ధన్యవాదాలు

గుండె ఘోష రెండు లక్షల హిట్లు సాధించిన సందర్భంగా ఆదరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణా ఉద్యమాభివందనలు.

చరిత్రను కూడా వదలని దుర్మార్గులు

11/22/2013 8:11:26 AM (నమస్తే తెలంగాణా)
తెలంగాణ మ్యూజియంలో దొంగలు పడ్డారు

- బ్రిటీషోళ్లను తలదన్నుతున్న సీమాంధ్ర దోపిడీ
- సంపదనేకాదు.. చరిత్ర అవశేషాలను దోచేశారు
- తెలంగాణలో దొరికిన అపురూప శిల్ప ప్రతిమలు
- అమరావతి మ్యూజియంలో కనువిందు
- విజయవాడలో తేలిన ఖమ్మం జిల్లా బుద్ధ విగ్రహాలు
- తరలిపోయిన యుద్ధసామక్షిగికి అంతేలేదు
- నిజాం వేయించిన అజంతా చిత్రాలూ అక్కడే
- సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న బౌద్ధుల ‘కాలచక్ర’


తెలంగాణ మ్యూజియంలో దొంగలు పడ్డారు! ఒకనాడీ దేశాన్ని పాలించిన బ్రిటీషోళ్లు మన దగ్గర నుంచి కోహినూరు వజ్రం, నెమలి సింహాసనం సహా అనేకానేక చారిత్రక విశిష్టతలు కలిగిన సంపదను దోచుకుపోయి.. తమ అలమరాల్లో భద్రం చేసుకున్నట్లు! సరిగ్గా అదే పద్ధతి! కాకపోతే ఇప్పుడు దొంగలు మారారు! తెలంగాణలో మట్టి నుంచి తవ్వి తీసిన అపురూపమైన.. అచ్చెరువొందించే అనేకానేక శిల్ప ప్రతిమలను.. భారీ ఫిరంగులను.. కత్తులు, కటార్లు మొదలైన యుద్ధ సామాగ్రిని.. పురాతన కాలం నాటి అవశేషాలను.. గుర్తులను.. గమ్మత్తులను గుట్టుగా ఏం ఖర్మ.. బాహాటంగా తరలించుకుపోయారు! ఇప్పుడవన్నీ సీమాంధ్రలోని మ్యూజియాల్లో చేరి.. ఆయా ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి! వాటి అసలు హక్కుదారైన తెలంగాణ మాత్రం ఖాళీ మ్యూజియాలతో సరిపెట్టుకుంటున్నది! ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగిన.. జరుగుతున్న దోపిడీ కాదు! ఏకంగా ఆరు దశాబ్దాలుగా తెలంగాణ చరిత్ర.. వలసపాలకుల దోపిడీకి గురవుతున్నది!

AP-Arca

హైదరాబాద్, ఖమ్మం, నవంబర్ 21 (టీ మీడియా) :పిడికెడు మట్టిని పెకలిస్తే..చరిత్ర పరిమళం వెదజల్లే నేల తెలంగాణ! భూమిని తవ్వితే ప్రతి పొరకూ ఒక చారిత్రక ప్రాధాన్యాన్ని చాటి చెప్పే గడ్డ! ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన ఎన్నో ఐతిహాసిక అవశేషాలను సీమాంధ్ర పాలకులు నిస్సిగ్గుగా తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. చరిత్ర, మ్యూజియం, పురావస్తుశాఖలకు బాధ్యత వహించిన మంత్రుల్లో ఆనాటి భాట్టం శ్రీరామమూర్తి నుంచి ప్రస్తుత వట్టి వసంతకుమార్ వరకు, ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నీలం సంజీవరెడ్డి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డివరకు పురావస్తుశాఖను సీమాంధ్ర ప్రయోజనాలకోసం ఉపయోగించుకున్నారన్న యథార్థ సత్యాలను ఆర్కియాలజీ శాఖ రూపొందించిన నివేదికలు ఘోషిస్తున్నాయి.

నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం వంటి తెలంగాణ జిల్లాలలో లభించిన శిల్పాలు, యుద్ధసామాగ్రి, మర ఫిరంగులు, కత్తులు, బల్లేలు, నిజాం కాలం నాటి యుద్ధసామాగ్రి, నాటి తాళపత్ర గ్రంథాలు, కాకతీయుల శిల్ప కళావైభవానికి చిహ్నమై నిలిచిన శిల్ప కళాతోరణాలు, సాలభంజికలు, అపురూపమైన శిల్పప్రతిమలు, పంచలోహ విగ్రహాలు చాలా వరకూ ఇప్పుడు ఈ ప్రాంతంలో లేవు.

nature 

బ్రిటిష్ పాలకులు లండన్ మ్యూజియంలో అమరావతి బ్లాక్ ఏర్పాటు చేసుకున్నట్లు, గుంటూరు జిల్లా అమరావతిలో కాలచక్ర పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంలో కొలువుదీరాయి. 2006లో టిబెటన్ల మతపరమైన క్రతువు ‘కాలచక్ర’ను 2006 జనవరిలో గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన సమయంలో తెలంగాణ చారిత్రక సంపద దోపిడీ మరింత ఊపందుకుంది. టిబెటన్ల మతగురువైన దలైలామాను సంతృప్తిపర్చేందుకు కాలచక్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అమరావతిలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో తెలంగాణ నుంచి అనేక బుద్ధ విగ్రహాలను, బౌద్ధ ప్రాంతాల్లో తవ్వితీసిన అవశేషాలను పెద్దమొత్తంలో అమరావతి తరలించేశారు. ప్రధానంగా వాటితో ఏర్పాటు చేసినదే కాలచక్ర మ్యూజియమని తెలంగాణ చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకోసం నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియం, పానగల్లు, మహబూబ్‌నగర్, కరీంనగర్ మ్యూజియంల నుంచి బుద్ధ విగ్రహాలను, బుద్ధుడి భౌతిక అవశేషాలను అమరావతి తరలించారు. దక్కన్ ఆర్కియాలజీ ఎండ్ కల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ రచయితల వేదిక, ఇన్‌టాక్ వంటి సంస్థలు తెలంగాణ చరిత్రను వెంటనే హైదరాబాద్ స్టేట్ మ్యూజియంకు తీసుకురావాలని దశాబ్దాలుగా విజ్ఞాపనలు చేస్తున్నప్పటికీ, ఉద్యమిస్తున్నప్పటికీ సర్కారు పట్టించుకున్న దాఖలాలు లేనేలేవు.

తెలంగాణ భూగర్భంలో అద్భుత చరిత్ర అవశేషలు
తెలంగాణలో 1932 నుంచి 1942 వరకు, 1961 నుంచి 1974 వరకు, 1981 నుంచి 1992 వరకు పురావస్తు తవ్వకాలు జరిగాయి. వీటిలో మహోన్నతమైన, అరుదైన, అద్భుతమైన చరిత్ర అవశేషాలు లభించాయి. ప్రధానంగా నల్లగొండ జిల్లా వర్ధమానుకోటలో 1941లో జరిపిన తవ్వకాలలో క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన పాలనా కాలంనాటి ఐదు అడుగుల బుద్ధ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని చూసి 1942లో శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్ చరిత్రకారులు మహదానందాన్ని, సంభ్రమాశ్చర్యాన్ని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లు ఈ అపురూప విగ్రహాన్ని స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారు. కానీ.. ఆ తర్వాత దానిని గుంటూరు జిల్లాలో నిర్మించిన నందికొండ మ్యూజియానికి మార్చేశారు.

stone1

చరిత్ర పుట్ట.. వర్థమానుకోట వర్ధమానుకోటలో ఇంకా తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉన్నదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. శాతవాహనుల కాలంలో వర్థమానుకోట అద్భుతమైన వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లినదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ తవ్విన కొద్దీ చరిత్ర లభిస్తుందని చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఇప్పటివరకు మళ్లీ ఇక్కడ తవ్వకాలు జరిపిన దాఖలాలు లేవు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలను క్రీ.శ. 1వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకు రెండు వేల సంవత్సరాల వరకు ఏలిన శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండినులు, బృహత్‌పలాయనులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు పరిపాలించిన కాలాల నాటి చరిత్ర ప్రాముఖ్యాన్ని తెలియచేసే విశేషాలన్నీ సీమాంధ్ర మ్యూజియాలకు ఎత్తుకెళ్లారు.

నిజాం వేయించిన చిత్రాలూ దక్కలేదు
నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు సయ్యద్ అహ్మద్, జలాలుద్దీన్ అనే ఇద్దరు ప్రపంచ ప్రసిద్ధ చిత్రలేఖన నిపుణులు అజంతా గుహలకు వెళ్లి, ఆ గుహల్లోని చారిత్రక కుడ్య చిత్రాలకు నమూనాలు అంతే సొగసుతో, వాస్తవికతతో చిత్రించారు. వాటిని నిజాం నవాబుకు అందజేశారు. అప్పట్లో అజంతాకు వెళ్లడానికి దారులు లేకపోవడంతో నిజాం అక్కడి వరకు రోడ్డు కూడా వేయించాడు. ఈ చిత్ర లేఖన నిపుణులు అహర్నిశలు శ్రమించి అజంతా గుహలలోని పెయింటింగ్స్‌తో పోటీపడగల.. కోట్ల రూపాయలతోనూ వెల కట్టలేని 150 నమూనా చిత్రాలను రూపొందించారు. బుద్ధుడి జాతక కథలకు, బుద్ధుడి జన్మవృత్తాంతాలకు సంబంధించిన ఈ చిత్రాలన్నింటినీ సీమాంధ్ర ప్రాంతంలోని అమరావతి, విశాఖ, గుంటూరు, విజయవాడల్లోని మ్యూజియాలకు తరలించారు. స్టేట్ మ్యూజియంకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాగరాగిణి పెయింటింగ్‌ను తరలించుకుపోయారు. హిందుస్థానీ రాగాలకు చిత్రమాలికలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్తరువులు ప్రపంచ చిత్రలేఖన సంపదలోనే అపురూపమైనవని కాపురాజయ్య వంటి మహనీయులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

stone2

సాలభంజికల అపహరణ
1981 నుండి 1992 వరకు పాలకొండ (వరంగల్), ఫణిగిరి (నల్లగొండ), ధూళికట్ట (కరీంనగర్), కీసరగుట్ట (రంగారెడ్డి), కోటిలింగాల (కరీంనగర్), నేలకొండపల్లి (ఖమ్మం), మహబూబాబాద్ (వరంగల్), బూసరెడ్డిపల్లి, రేకులపాడు (ఆదిలాబాద్)తోపాటు.. జాకారం, రామానుజపురం, గణపవరం త్రికూట దేవాలయాలు, కటాక్షపురం ఆలయాలు, బస్తాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండపర్తి, బైరాన్‌పల్లి, అయినవోలు (మల్లికార్జున దేవాలయం) తదితర వరంగల్ జిల్లాల దేవాలయాలలో, పానగల్లు, రామన్నగూడెం, పిల్లలమర్రి నల్లగొండ దేవాలయాల సమీపంలో లభించిన అపురూపమైన చరిత్ర సంపదను, వరంగల్‌కోటలో, రామప్ప దేవాలయ సమీపంలో లభించిన సాలభంజికలను, శివుడి, కేశవుడు, సూర్యుడు కలిసి ఉండే గొప్ప దేవప్రతిమలను విజయవాడ మ్యూజియంకు ఎత్తుకెళ్లారు. రామప్ప దేవాలయంలో లభించిన నీటిలో తేలియాడే ఇటుకలను కూడా పట్టుకెళ్లారు. వీటితో పాటు ఆయా తవ్వకాలలో శివ వైష్ణవ దేవాలయాకు చెందిన ద్వారపాలక విగ్రహాలు, శిల్పాలు, బంగారు, వెండి నాణేలు వారి మ్యూజియాల్లోనే ఉన్నాయి. రామలింగేశ్వరస్వామి, రుద్రేశ్వరస్వామి విగ్రహాలను దొంగిలించుకుపోయారు. నాగర్జునసాగర్ నిర్మాణంలో పూర్వపు మిర్యాగలగూడ, దేవరకొండ తాలూకాలోని 40 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి.

ప్రాజెక్టు తవ్వకాల సందర్భంగా సదరు గ్రామాల కింద అపురూపమైన సంపద వెలుగు చూసింది. ఈ సంపదతోనే గుంటూరు జిల్లాలో నందికొండ మ్యూజియం ఏర్పాటు చేశారు. నందికొండవద్ద, ఏలేశ్వరం వద్ద ముంపునకు గురైన నల్లగొండకు చెందిన గ్రామాలలో లభించిన అపురూప చరిత్ర సంపదతో నల్లగొండ జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిజాల రంగారావు, కాంచనపల్లి పెద్ద వెంకటరామారావు ఆనాటి సీఎం నీలం సంజీవరెడ్డిని అభ్యర్థించారు కూడా. ఈ అభ్యర్థనను ఆయన ఖాతరు చేయకుండా గుంటూరులో మ్యూజియం నిర్మించారు. ఇదే వరుసలో హైదరాబాద్, పానగల్లు, ఫణిగిరి, నల్లగొండ మ్యూజియంలకు చెందిన బుద్ధుడి అవశేషాలను, నాగార్జునసాగర్-గుంటూరు మధ్యన బుద్ధవనం పేరుతో నిర్మిస్తున్న భవనాలలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

stone5

1.10. 2003 నుండి 2012 ఏప్రిల్ వరకు పరిపాలించిన పురావస్తుశాఖ అధికారులు సీమాంధ్ర ప్రాంతానికి ఈ సంపద మొత్తం తరలిపోతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్రమేమిటంటే ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి ఇనగాల పెద్దిరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గీతారెడ్డి వంటి నాయకులు పురావస్తుశాఖలకు బాధ్యులుగా వ్యవహరించారు. ఏ ప్రాంతంలో లభించిన చరిత్ర సంపదతో ఆ ప్రాంతంలోనే మ్యూజియంలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆయా ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర పురావస్తుశాఖ ప్రాథమిక నిబంధనలను, రాజ్యాంగ సూత్రాలను, సహజన్యాయ సూత్రాలను ఉల్లఘించి తెలంగాణ చరిత్ర సంపదలతో సీమాంధ్ర ప్రాంతంలో మ్యూజియంలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాకలో 12 వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల శిల్ప సంపద లభించింది. ఈ శిల్పాలన్నింటితో అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టరుకు చేసిన నివేదికలను బుట్టదాఖలయ్యాయి. సందట్లో సడేమియా మాదిరిగా వాటిని స్టేట్ మ్యూజియంకు తరలిస్తున్నామని చెప్పి హైదరాబాద్ వరకు తీసుకువచ్చి ఇక్కడి నుండి విశాఖ పట్టణం మ్యూజియానికి చేర్చారు.

stone3

ఖమ్మం నుంచి తరలిపోయిన ఆరు పాలరాతి బుద్ధ విగ్రహాలు
గతంలో బౌద్ధ క్షేత్రంగా వర్థిల్లింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతం. ఇక్కడి బైరాగిగుట్టలోని బౌద్ధస్తూపం దక్షిణ భారతదేశంలో అతిపెద్దది. ఒకప్పుడు బౌద్ధవిగ్రహాల తయారీ కేంద్రం నేలకొండపల్లిలో నిర్వహించినట్లు సమాచారం. పాండవులు, కౌరవులు బైరాగిగుట్ట సమీపంలో యుద్ధాలు చేశారని, కీచక గుండం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అపారమైన పురావస్తు సంపద బయటపడింది. బైరాగిగుట్ట సమీపంలో గల వాగులో ఓ జాలరికి రూ. 2కోట్ల విలువ చేసే కంచు బుద్ధవిగ్రహం దొరికింది. దానిని ప్రస్తుతం సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. బౌద్ధస్తూపం తవ్వకాలలో ఆరు పాలరాతి బుద్ధవిగ్రహాలు లభించాయని, వాటిని విజయవాడ మ్యూజియంకు తరలించారని నేలకొండపల్లికి చెందిన ఫారెస్ట్ రిటైర్డ్ ఉద్యోగి రాజపుత్ర విఠల్‌రాసింగ్ తెలిపారు.

ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే చారిత్రక ఆధారాలు పుష్కలంగా లభ్యమవడమే కాకుండా, విలువైన సంపద కూడా దొరుకుతుందని భావించి, రహస్యంగా తవ్వకాలు చేపట్టే ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ ప్రాంతంతో పాటు ఇల్లెందు సమీపంలోని గుండాలలో సైతం మానవ శిలాజాలు బయల్పడ్డాయి. జిల్లా కేంద్రంలో ఇలాంటి పురాతన వస్తువుల ప్రదర్శనకు ఎలాంటి మ్యూజియం లేకపోవడంతో వీటిని వేరే ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గుండాల ప్రాంతంలో బయల్పడిన ఆదిమానవుని శిలాజాల్లో కొన్నింటిని ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌ఆర్ బీజీఎన్‌ఆర్ కళాశాలలోనే భద్రపరిచారు. వీటిపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతాయని ప్రకటించినా, ఇప్పటి వరకు వాటి ఊసేలేదు. అయితే వాటిని తరలించే ప్రయత్నాలు దొంగచాటుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, పాల్వంచ, మధిర ప్రాంతాల్లో సైతం ఇలాంటి పురావస్తు సంపద ఉన్న ప్రాంతాలపై సీమాంధ్రులు కన్నువేసి వాటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తరలించినవాటిని తిరిగి తెప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు.

ఇది తాజా ఉదంతం...:
వారం రోజుల క్రితం వరకు ఆర్కియాలోజీ డైరక్టర్‌గా వ్యవహరించిన పుల్లారావును నిజామామాద్ మ్యూజియంలోని విగ్రహాలను వెంటనే నిజామాబాద్‌లోని హరిత హోటల్‌కు తరలించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖన్ ఆదేశించినట్లు తెలిసింది. ఆయన లిఖిత పూర్వకంగా జీవో జారీ చేసినట్లయితే ఆదేశాలను పాటిస్తానని తెలియ చేయడంతో ఆగ్రహించిన చందనాఖన్ ఆయనను వెళ్లిపొమ్మని హూంకరించారని సమాచారం. నిజామాబాద్‌లోని హరిత హోటల్‌కు తరలించిన తర్వాత ఆ విగ్రహాలకు ఎక్కడికి పోతాయని పుల్లారావు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ తెలంగాణ వాదుల ప్రశ్నలే. ఈ క్రమంలోనే 1956 నుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు తవ్వకాలు జరిపారు? ఎక్కడెక్కడ జరిపారు? ఏ విధమైన చరిత్ర సంపద లభించింది? ఈ సంపద ఎక్కడ ఉన్నది? తదితర విషయాలన్నింటితో శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.

విలువైన విగ్రహాలు తరలించారు....
ఎంతో చారిత్రత్మాక సందప కలిగిన నేలకొండపల్లికి చెందిన బౌద్ధవిగ్రహాలు విజయవాడ తరలించారు. బైరాగిగుట్ట వద్ద ఎంతో విలువైన బంగారు విగ్రహాలు ఉన్నట్లు సమాచారం. మైనింగ్ చేస్తుంటే నేను కొంతమంది బైరాగిగుట్ట క్వారీస్ నిలిపివేశాం. చారిత్రక స్తూపం కాపాడాలి, తెలంగాణ నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని ఏర్పాటుకి కేంద్రంగా అభివృద్ధి చేసి చారిత్రక సంపదని కల్పించాలి.

రాజపుత్ర విఠల్ రాసింగ్, (నేలకొండపల్లి రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి)

రాయల తెలంగాణా కావాలెనట!

జేసి దివాకర్ రెడ్డి కొత్త రాగం అందుకున్నడు. రాయల తెలంగాణా కావాలెనట! అంటే రాజసీమ లోని కర్నూలు, అనంత పురం జిల్లాలు కూడా తెలంగాణాల కలుపాలె అని ఆయన భావం.

ఈ మాట అనేటందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. రాయల తెలంగాణా పెరుతోని హైదరాబాదులోని కబ్జా భూములు, అక్రమ వ్యాపారాలు, సక్రమ వ్యాపారాలు కాపాడుకునే టందుకు ఇదొక ఉపాయం కావొచ్చు. కాని అక్కడి ప్రజల్లో వున్న భావన కూడా కొంత వరకు ప్రతిఫలిస్తుండవచ్చు.

కర్నూలు, అనంతపురం జిల్లాలు నీటికోసం పూర్తిగా కృష్ణా, తుంగభద్ర జలాల మీద ఆధార పడ్డాయి. అనంతపురం దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతం. తెలంగాణాల కలిస్తే వారి భవిష్యత్తుకు, మిగులు జలాల పేరుతొ పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పుడు తరలిస్తున్న నీటి వాటాకు ధోకా ఉండదనేది వారి భావన కావచ్చు.

ఏదేమైనప్పటికి ఈ రకమైన వాదన చేసే సమయం ఎప్పుడో దాటిపోయి విభజన అంకం చివరి దశకు చేరుకున్నది. ఇప్పుడు ఇటువంటి వాదనలు చేసుడంటే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపుల్లలు వేసుడుగానే తెలంగాణా ప్రజలు భావిస్తరు. గతంలో వారు ఇటువంటి అడ్డుపుల్లలు ఎన్నో వేసి వున్నరు కాబట్టి అట్లా అనుకునేటందుకే ఎక్కువ అవకాశం వుంది.

తెలంగాణా ప్రజలు మొదటినుండి తమ పదిజిల్లాల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటునే కొరుతున్నరు. అంతకు మించి వారికి ఒక్క ఊరు కూడా ఎక్కువ అవసరం లేదు. గత అనుభవాల వలన, కొత్తగా వచ్చిన ఈ  రాయల తెలంగాణా డిమాండును వారు మరో రకం కుట్రగా మాత్రమె చూస్తరు తప్ప, తమపై ప్రేమతో వచ్చి సదరు జిల్లాల వారు కలుస్తున్నరని భావించే అవకాశం లేదు.

ఆ రెండు జిల్లాల వారు కూడా ఇప్పటివరకు సీమాంధ్రలో భాగంగానే భావిస్తు వస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా వారు జరిపిన సమైక్యాంధ్ర పేరుతొ జరిపిన ఉద్యమమే అందుకు సాక్ష్యం. ఇప్పటి వరకు తెలంగాణా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, రేపు తెలంగాణా ప్రజలతో మమేకం అవుతారని అనుకోలేం.

నిజంగా ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణాల కలుస్తందుకు అభిలషిస్తున్న వారు అయితే, వారు మొదటి నుండి తెలంగాణా ఉద్యమం లో పాల్గొన వలసింది. లాఠీ దెబ్బలు తిని ఉద్యమాలు చేయక పోయినా కనీస నైతిక మద్దతు అన్నా ఇచ్చి ఉండ వలసింది. అదేమీ చేయకుండా పైపెచ్చు సమైక్య వాదనతో, తెలంగాణా ఏర్పాటు వ్యతిరేకులతో అంట కాగి, ఇప్పుడు విభజన తప్పదన్న పరిస్థితుల్లో, 'మేం కూడా మీతో కలుస్తాం' అని వస్తే తెలంగాణా ప్రజలు సంతోషిస్తరని అనుకోలేం.

ఏదేమైనప్పటికీ ఇటువంటి వాదనలు చేసే సమయం ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు ఉన్న కొద్ది సమయంలో పది జిల్లాల తెలంగాణా ఏర్పాటు తప్ప తప్ప మరో విపర్యం లేదు.  

Monday, November 18, 2013

ఏం కతరా బై!

గాళ్ళ కత ఏందో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

యాభై మూడుల వాళ్ళు పోతం పోతం అంటే ఎల్లి పొండ్రి అని సాగనంపిన్రు తమిళ తంబిలు. ఉండున్రి మాతోనే అని ఒక్క మాటన్న అనలేదు!

యాభై ఆర్ల కలుస్తం కలుస్తం అంటే ఒద్దు మొర్రో అన్నరు తెలంగానోల్లు. అయినా కేంద్రాన్ని, హైదరాబాదు రాష్ట్రంల వున్న మరాటా, కన్నడులను అడ్డం పెట్టుకొని పైరవీలు చేసి కలిసి పోయిన్రు.

కలిసిన తెల్లారి నుండి ఒక్కటే గోల, మీరొద్దు బై మీరొద్దు బై అనుకుంట ...

అప్పటికన్నా మంచిగుంటే బాగుండే, కాని ఆ ఎవ్వారాలు చూసినంక కేంద్రమే విభజన చెయ్యాల్నని నిర్ణయించే!

ఇగసూడు ...

భద్రాచలం వాళ్ళు, మునగాల వాళ్ళు మేం వాల్లతోని కలవం మొర్రో అని ఒక్కతీర్గ మొత్తుకుంటున్నరు!

కనీసం కర్నూలోల్లు, అనంతపురపోల్లు కూడ వాల్లొద్దు, మీరే ముద్దు అన వట్టిన్రు!

మనుషులన్న తర్వాత నలుగురు కలిసె తట్టుండాలె... సూస్తే పారి పోయేటట్టు గాదు!

ఒకడు రాజ్యాంగం మార్వాలె నంటడు. ఒకడు ఆర్టికల్ 3 మార్వాలె నంటడు. ఇంకోడు నక్సలైట్లంటడు. మరోడు దేశ సమగ్రత అంటడు. గిట్ల ఆకుకు పోకకు అందని మాటలు మాట్లాడుతరు కాబట్టే ఎవ్వడు దగ్గరికి రాడు.

 చెప్పే అబద్ధాలు ఇనలేక జనం నవ్వుతున్నా సిగ్గు రాదు!

నీళ్ళు వృధాగా సముద్రంల కలుస్తయంటరు... అదే నోటితోని నీళ్ళు లేక కరువొస్త దంటరు.

తెలంగాణాను అభివృద్ధి చేసిన మంటరు... బొగ్గు మీదైతే ప్రాజెక్టులు మాదగ్గరున్నై, మీకు 50% కూడా కరెంటు రాదంటరు!!

ఒక్క ఉద్యోగం గూడ అన్యాయంగా తీసుకోలే దంటరు, విభజన వల్ల లక్ష మంది రోడ్డున పడుత రంటరు!!!

అయ్యా మీ అబద్ధాలు మీవోల్లే ఇప్పుడు నమ్ముదు బంద్  చేసిన్రు, ఇంకా మమ్ములనేం నమ్మించ చూస్తరు? ఇప్పుడన్నా జరంత నేల  మీద నడువున్రి... కనీసం మీవోల్లన్న నమ్ముతరు!


Sunday, November 3, 2013

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి బాంబు వెలిగించండి!

Thursday, October 31, 2013

పోలీస్ కమిటీకి తప్పుడు లెక్కలు

విజయకుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న పోలీస్ కమిటీకి సదరు విభాగం వారు భారీ ఎత్తున తప్పుడు లెక్కలు ఇస్తున్నట్టు వార్త. ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్, డీజీపీ ఆఫీస్ మదలైన రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో పని చేస్తున్న సిబ్బందిలో 80% వరకు ఆంధ్రా ఉద్యోగులు ఉండగా దాన్ని తగ్గించి 60%, 40% గా చూపెడున్నట్టు సమాచారం అందింది.

ప్రాంతీయ పక్షపాతంతో మొదటినుండి తెలంగాణా ప్రాంతానికి ద్రోహం చేస్తున్నవారు తప్పుడు లెక్కల సహాయంతో రాష్ట్ర విభజనలో వీలైనంత లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇది ఒక్క పోలీస్ విభాగానికే పరిమితం కాబోవడం లేదు.  అన్ని కార్యాలయాలలోనూ ఆంద్ర ప్రాంతానికి చెందిన అధికారులను, ఏవోలనే ముందస్తుగా నియమించుకొవడం ద్వారా ఇటువంటి తప్పుడు లెక్కలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది.

అయినా కరడు గట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం, దానికి పనిచేసే అధికారుల కార్యాచరణ ఇంతకన్నా అద్భుతంగా వుంటుందని ఊహించలేం. వీళ్ళు ఏం చేసినా రేపు తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఉద్యోగి సర్వీస్ రికార్డులు పునస్సమీక్షించడం జరుగుతుంది. అప్పుడైనా వీరు చేసే ఘోరాలు బయట పడక మానవు. మరి ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేయడం అంటారా? మోసాలు చేసే వాడికి మరో రకంగా ప్రవర్తించడం రాదుగా? అందుకని!

Monday, October 21, 2013

బ్రహ్మాస్త్రం


చాలా కాలం కింది మాట. ఆ వూర్లో నీటి ఎద్దడి ఉండేది. మంచి నీళ్ళకు మరింత కొరత. ఊరి సర్పంచి ట్యాంకరు ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీటి పంపిణీ చేయించాడు. ఆ పంపిణీ ఇంటిలో ఉన్న జనాభా ప్రాతిపదికన జరిగేది. అలా సాగుతుండగా ఒక రోజు ఒక ఇంటి నుంచి పేచీ వచ్చింది.

వారిదో ఉమ్మడి కుటుంబం. అన్న, తమ్ముడి కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి వుంటున్నారు. సర్పంచి తమ్మున్నడిగాడు, "ఏమిటి యాదగిరి, ఎందుకు పంచాయితీలో పేచీ పెట్టావ్?"

"ఏం చెప్పేదయ్యా? మీరుండగా ఈ వూళ్ళో అన్యాయం జరగదనుకున్నాను. కాని పరిస్థితి వేరుగా వుంది. ఎవరిపైనా ఆరోపణలు చేయ దలుచుకొలేదు. మా అన్నదమ్ములను వేరుపాటు చేయండి, చాలు".

సర్పంచి సాలోచనగా తల పంకించాడు. "కారణం చెప్పకుండా వేరుపాటు ఎలా కుదురుతుంది? ఎందుకు వేరు పడాలను కుంటున్నావు?"

యాదగిరి చెప్ప సాగాడు, "కారణాల కేం చాలానే వున్నాయి. మచ్చుకు ఒకటి చెప్తాను, వినండి... మీరు ఊరి బాగుకోసం మంచి నీటి ఏర్పాటు చేశారు, బాగానే వుంది. కాని దానివల్ల నా కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు జనాభా ప్రాతిపదికన మా ఇంటికి ఐదు బిందెల నీరు కేటాయించారు. కాని నా కుటుంబానికి మాత్రం దాంట్లో ఐదు గ్లాసుల నీళ్ళు కూడా మిగలటం లేదు. నీళ్ళు మొత్తం మా అన్నగారి కుటుంబానికే సరిపోవటం లేదు", విషయం చెప్పాడు యాదగిరి.

సర్పంచి అన్న వైపు ప్రశ్నార్థకంగా చూశాడు, "ఏం సుబ్బయ్యా? మీ ఇంట్లో ఉన్న పది మందికి ఐదు బిందెలని నేనే లెక్క గట్టాను. మరి ఎందుకు సరిపోవడం లేదు?"

సుబ్బయ్య సర్పంచికి వంగి దండం పెట్టుకున్నాడు, "అయ్యా, ధర్మ ప్రభువులు, మీరు సరిగానే నిర్ణయించారయ్యా, దాంట్లో తప్పులేదు. కాని ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకున్నాక ఇంటి అవసరాలకు తగ్గట్టు పంచుకుంటాం కాని ఇలా వీధిన పడతామేవిటండీ? మీరే మా తమ్ముడికి గట్టిగా బుద్ధి చెప్పండయ్యా."

సర్పంచి చిరాగ్గా మందలించాడు. "సుబ్బయ్యా, ఊకదంపుడు మానేసి అడిగిన దానికి సమాధానం చెప్పు. నీరు ఎందుకు సరిపోవడం లేదు?"

"ఎం చెప్పమంటారయ్యా? మా కుటుంబానికి అవసరాలు ఎక్కువ. మా చంటి దానికి మంచి నీళ్ళతోనే స్నానం చేపించాలి. నాకేమో కాళ్ళ తిమ్మిర్లు... వేడి చేసిన మంచి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొమ్మని నాటు వైద్యుడు చెప్పాడు. మా ఆవిడకి ఉప్పునీళ్ళ తో స్నానం చేస్తే దుద్దుర్లు వస్తాయి, కాబట్టి మంచి నీళ్ళే కావాలి. ఇవికాక మిగిలిన నీళ్ళు మా వంటకు సరిగ్గా సరిపోతాయి. అయినా కూడా మేం కొంచం తగ్గించుకుని అప్పటికీ అర బిందె నీళ్ళు మా తమ్ముని కుటుంబానికి ఇస్తున్నాం. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఎలాగోలా సద్దుకోవాలి కాని, ఇలా పేచీలు పెడితే ఎలాగయ్యా?"

సర్పంచికి విషయం అర్థమయ్యింది. "దీంట్లో నా తప్పు కూడా వుంది. ఇంటి అవసారాలకు తగ్గట్టు నీటి సరఫరా చేస్తున్నాననుకున్నాను కాని, ఇంటిలోని కుటుంబాలకు అవి సరిగా చేరుతున్నాయో లేదో అని చూడలేదు. గుమస్తాగారూ, సుబ్బయ్య కుటుంబానికి స్పెషల్ గా మన పంచాయితీ నియమాల పుస్తకంలో ఒక పేరా చేర్చండి... దాని ప్రకారం సుబ్బయ్య భార్యకు మూడు బిందెలు, అయన తమ్ముని భార్యకు రెండు బిందెలూ సపరేట్ గా నీళ్ళు అందించాలి."

గుమస్తా గ్రామ పెద్ద చెప్పినట్టు చేశాడు, "నియమాల పుస్తకం పేజీ నంబరు 371, ఐటం D ప్రకారం సభ్యుల సంఖ్య ప్రాతిపదికన సుబ్బయ్య భార్యకు 3 బిందెలు, యాదగిరి భార్యకు 2 బిందెలు అందించ వలసినదిగా ట్యాంకర్ డ్రైవరుకు ఆదేశాలు జారీ చేయడమైనది."

*****

కట్  చేస్తే ...

*****

నలభై సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయ్. తీర్పు చెప్పిన సర్పంచి, నమోదు చేసిన గుమస్తా గాల్లో కలిసి పోయారు. ఈసారి సుబ్బయ్య, యాదగిరి మధ్యన సర్దుకోలేనంతగా విభేదాలు పెరిగాయి. యాదగిరి విదిపోతానన్నాడు. సుబ్బయ్య కలిసి ఉండాల్సిందే అని మొండికేశాడు. వాదనలు విన్న పంచాయితీ యాదగిరి వాదనలో న్యాయం వున్నట్టు గ్రహించి, విభజన వైపు మొగ్గింది.

"సుబ్బయ్యా, ఇక మీ కుటుంబాలు కలిపి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయితీ సభ్యులం మీ కుటుంబం విడిపోవాలని నిర్ణయించాం, ఇక నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా?", సర్పంచి అడిగాడు.

సుబ్బయ్య కోపంతో ఊగి పోయాడు, "బయటివాళ్ళు మీరు ఎలా విడదీస్తారండీ, పచ్చని కుటుంబాన్ని? మీ తీర్పు చెల్లుబాటు కాదు."

"చూడు సుబ్బయ్యా గ్రామ నియమాలు మూడో పేజీలో కుటుంబాలు విడదీసే తీర్పులు చెప్పే హక్కు పంచాయితీకి ఉంటుందని స్పష్టంగా వుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొనే హక్కు మాకుంది, పైగా మీ తమ్ముడు విభజన కోరుతున్నాడు. ఆయన్ని ఒప్పించ లెంత వరకు నువ్వు విభజనను అడ్డుకోలేవు".

"మీకు తెలియని బ్రహ్మాస్త్రం నాదగ్గరొకటి వుంది!" కొంటె నవ్వొకటి నవ్వాడు సుబ్బయ్య. "నియమాలు 371 వ పేజీలో పేరా D చదవండి మీకే తెలుస్తుంది!! దాంట్లో సుబ్బయ్య ఉమ్మడి కుటుంబానికి 3:2 బిందెలు విడిగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన బడింది".

"ఐతే?"

"అది ఉన్న తర్వాత మూడో పేజీలోని నియమం చెల్లదు".

సర్పంచికి చిర్రెత్తు కొచ్చింది "నీ నక్క జిత్తులు నా వద్ద కాదు సుబ్బయ్యా! గతంలో నువ్వు చేసిన నీటి దోపిడీ ఆపడానికే ఆ నియమం చేర్చ బడింది. అయినా నీ దోపిడీలు ఆగక పోగా మరింత పెరిగినందుకే ఇప్పుడు విభజన చేస్తున్నది. ఆ నియమం చూపించి విభజన ఎలా ఆపగలవు? మీ కుటుంబం విడిపోగానే ఆ నియమం దానంత అదే రద్దై పోతుంది".

యాదగిరి పంచాయితీకి దండం పెట్టుకున్నాడు. సుబ్బయ్య ముఖం తెల్ల బోయింది!

Thursday, October 17, 2013

సమైక్య వాదుల చొప్పదంటు ప్రశ్నలు, సమాధానాలు



Sunday, October 13, 2013

RTC వారు విలీనం ఎందుకు కోరుతున్నారు?






సమైక్యత కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన సమ్మెలో RTC ఉద్యోగులు ముందునుంచీ పాల్గొన్నారు. సాధారణంగా RTC ఉద్యోగులు రాష్ట్ర ఇతర ఉద్యోగులతో కలిసి సమ్మెల్లో పాల్గొనడం బహు అరుదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారి సమస్యలే వారికి బోలెడన్ని వుంటాయి. వారి పని పరిస్థితులు (working conditions), వేతనాలకోసం చేసే సమ్మెలతోనే వారికి సరిపోతుంది. తెలంగాణాలో సకల జనులు సమ్మె చేసినా, RTC వారు ఏ కొద్ది రోజులో తప్ప ఆ సమ్మెలో పాల్గొనలేదన్న విషయం ఇక్కడ గుర్తించాలి.

అటువంటిది APNGOలతో భుజం కలిపి వారితో సమానంగా విధులను బహిష్కరించి సమ్మెలో RTC వారు పాల్గొనడం మొదటినుండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే వుంది. అయితే అందుకు గల కారణాన్ని RTC కార్మిక నాయకులు LB స్టేడియంలో జరిగిన మీటింగులోనే వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో RTC ఒక్క రోజులో మూత పడుతుందని వారు చెప్పారు. అక్కడి ప్రాంతంలో EPK (Earnings per Kilometer) తక్కువగా వుండడం దానికి కారణంగా వారు వివరించారు.

రాష్త్రం మొత్తం RTC ఒకటే సంస్థ అయినపుడు ఆ ప్రాంతంలో EPK తక్కువగా ఎందుకు వుంటుంది? ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే ప్రశ్న. దీనిపై అధ్యయనం జరిపినప్పుడు కొన్ని పాలకుల సీమాంధ్ర పక్షపాతానికి సంబంధించిన వికృత వాస్తవాలు బయటికి వచ్చాయి.

తెలంగాణా ప్రాంతంలో RTC బస్సుల వినియోగం ఎక్కువ. ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఆదరిస్తారు. రైల్వే నెట్‌వర్కు ఎక్కువగా వుంటుంది. నౌకా ప్రయాణాలు కూడా ఎక్కువే. కాబట్టి అక్కడ RTC బస్సుల వినియోగం తక్కువ. వ్యాపారి ఎక్కువ ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువ పెట్టుబడి పెడతాడు. కాని RTC వారు మాత్రం ఈ చిన్న వ్యాప్రార సూత్రాన్ని విస్మరించారు. ఆదాయానికి మించిన బస్సులు, డిపోలు సీమాంధ్రకు కేటాయించారు. దాని ఫలితమే నేటి సమస్య. ఆదాయానికి తగిన దామాషాలో పెట్టుబడులు వుండాలన్న విషయం RTC మేధావులకు తెలియదా?

ఎందుకు తెలియదు? కాని అంతటా జరుగుతున్న తంతే RTCలోనూ జరిగింది. నిర్ణయాలు తీసుకునే అధికారుల్లో సింహభాగం తస్మదీయులు కావడమే అందుకు కారణం. లాభాలను ఇస్తున్న తెలంగాణాను గాలికి వదిలేసారు. కొత్త బస్సులు, లగ్జరీ బస్సులు, వోల్వో బస్సులు ఎక్కువ భాగం ఆంధ్రా ప్రాంతానికి కేటాయించడం మొదలు పెట్టారు.

దీనికి కారణాలు లేక పోలేదు. ఎక్కువ బస్సులు వుంటే తమ ప్రాంత జనానికి ఎక్కువ సౌకర్యవంతంగా వుంటుంది. తెలంగాణాలో మాదిరిగా top service చేయాల్సిన అవసరం లేదు. హాయిగా సీట్లలో కూర్చుని ప్రయాణించ వచ్చు. ఎక్కువ బస్సులుంటే ఎక్కువ డిపోలు వేసుకోవచ్చు. ఎక్కువ సిబ్బందిని నియమించుకోవచ్చు. తద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మరి వీరందరికీ జీతాలు ఎక్కడినుండి వస్తాయి? ఇంకెక్కడినుండి? తెలంగాణా వారు బస్సు టాపు మీద ప్రయాణించి సమర్పించుకున్న డబ్బులనుంచి. సంస్థను సపోర్టు చేసేది ఒకడైతే భోగాలు అనుభవించేది ఇంకోడన్న మాట!

కథ ఇక్కడితో ముగిసి పోలేదు. ఆదాయానికి మించి బస్సులను, డిపోలను, ఉద్యోగాలను సీమాంధ్రకు కేటాయించడం ఒక ఎత్తయితే, బస్ సర్వీసులను కూడా సమన్యాయం పాటించకుండా కేటాయించడం మరో ఎత్తు.

ఉదాహరణకి హైదరాబాదు - మచిలీపట్నం మధ్యన రోజుకు నాలుగు సర్వీసులు ప్రయాణిస్తాయనుకుందాం. అప్పుడు న్యాయప్రకారంగా హైదరాబాదుకు రెండు, మచిలీపట్నానికి రెండు సర్వీసులు (లేదా వాటికి అవసరమైన బస్సులు) కేటాయించాలి. కాని కేటాయింపులు అలా జరగలేదు. మీరు హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషనుకు వెళ్ళి పరిశిస్తే ఇట్టే అర్థమవుతుంది, అన్ని బస్సులూ ఆంధ్రాకే కేటాయించిన విషయం. విమర్శలు రాకుండా అక్కడక్కడా ఒకటీ, అరా మాత్రం తెలంగాణాకి కేటాయించారు.

ఇప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారు, తమకు ఎన్ని బస్సులు వస్తాయో, అన్ని బస్సులూ తమ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి తిప్పుతామని అంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు వారు చెప్పుకుంటున్న EPK కన్నా కూడా వారి EPK మరింత తక్కువకు పడిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆంధ్రా ప్రాంతపు EPKలో వారు అక్రమంగా తిప్పుకుంటున్న, న్యాయంగా తెలంగాణాకు చెదవలసిన EPK కూడా కలిసివుంది.

అదనంగా అనుభవిస్తున్న బస్సులు, డిపోలు, ఉద్యోగాలు ఎలాగూ వదులుకోలేరు కాబట్టి సీమాంధ్రకు చెందిన RTC నాయకులు ప్రభుత్వంలో RTCని merge చేయమని కోరుతున్నారు. అలా విలీనం చేయడం వల్ల ఆ నష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది, తాము జవాబుదారీ కావలసీ అవసరం లేదని వారి వ్యూహంగా కనపడుతుంది. కాని వరల్డ్ బ్యాంక్ చేత శాసించ బడుతున్న ఈ ప్రపంచీకరణ రోజుల్లొ వారి కోరిక ఎంత వరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

Friday, October 11, 2013

ఏది సమన్యాయం?


ఎన్నొ అడ్డంకులను ఎదుర్కున్న తెలంగాణా ఉద్యమం చివరికి సాకారం కాబోతున్న దశలో కొన్ని విష సర్పాలు పడగలెత్తి విషం చిమ్ముతూ తమ చివరి ప్రయత్నంలో భాగంగా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఆ సర్పాల్లో ఒకటి జగన్ అయితే రెండోది చంద్రబాబు నాయుడు.

తెలంగాణా విషయంలో డజన్ల సార్లు 'U' టర్న్‌లు తీసుకున్న చంద్రబాబు ఢిల్లీలో దీక్ష డ్రామాలు ఆడుతూ, రాబోతున్న తెలంగాణాను ఆపడానికి కొంతమంది మూడో ఫ్రంట్ నాయకులతొ తెరవెనుక మంతనాలు చేస్తూ బిజీగా వున్నారు. ప్రజలను ప్రభావితం చేయగల నాయకత్వ పటిమ లేనటువంటి చంద్రబాబు, మొదటి నుండి తన రాజకీయ మనుగడకు కుట్రలను, కుతంత్రాలను ఆసరా చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.

కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు దాన్ని సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ, కొత్త రాజధానికి ప్యాకేజీని కోరుతూ ప్రకటన ఇచ్చారు. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లో విఫలం చెంది, చివరకు సమ న్యాయం అంటూ దొంగనాటకాలు ఆడడం మొదలు పెట్టారు. రాజ్‌దీప్ సర్ సర్దేశాయ్ అనే CNN-IBNకి చెందిన జర్నలిస్టు తెలంగాణా విషయంలో చంద్రబాబు భావ దారిద్ర్యాన్ని నగ్నంగా బహిర్గత పరచారు. ఆయన చేసిన ఇంటర్వూలో తన వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదని, తాను తెలంగాణా ఏర్పాటును కాని, సమైక్యవాదాన్ని కాని బలపరచ లేనని ఒప్పుకున్నారు. పైగా ఈ నిర్ణయం వల్ల తన పార్టీ దెబ్బతింటుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగానే సెలవిచ్చారు.

తెలంగాణా పార్టీ నష్టపోతుంది కాంగ్రెస్ నిర్ణయం వల్ల కాదు, కేవలం ఆ పార్టీ రాజకీయ జడత్వం వల్ల. సమస్యను గుర్తించి రాజకీయ పరిష్కారాన్ని అన్వేషించే విషయంలో అది ఘోరంగా విఫలమైంది. అటువంటి పరిస్థితిలొ పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఇంకో పార్టీని వ్యతిరేకించే నైతిక హక్కు అది ఎప్పుడో కోల్పోయింది. ఈ దీక్ష వల్ల తెలుగు దేశం పార్టీకి అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు మరోసారి తన రాజకీయ దివాళాఖోరు తనాన్ని బయట పెట్టుకోవడం తప్ప.

సమన్యాయం కావాలని కోరుతున్న చంద్రబాబు ఆ సమన్యాయం అంటే ఏమిటో నిర్వచించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. కారణాలు సుస్పష్టం. అందుకోసం తర్కించినకొద్దీ నిర్ణయాలు తెలంగాణాకు అనుకూలంగా మారుతాయే తప్ప సీమాంధ్రకు కాదు. అది చంద్రబాబుకు బొత్తిగా ఇష్టం లేని విషయం. ఏదో ఒక వంక చెప్పి రాష్ట్ర విభజనను ఆపడమే ఆయన ధ్యేయంగా కనపడుతుంది.

ఇంతకీ సమన్యాయం అంటే ఏమిటి? ఐదు దశాబ్దాలుగా అన్ని రకాలుగా దోచుకున్న తెలంగాణాకు ఏ విధంగా సమన్యాయం చేస్తారు? కేటాయింపులు లేక పోయినా లక్షల ఎకరాల్లో క్రిష్ణా జలాలను పారించుకుంటున్న విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు. వాటికై ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పక్కనే కృష్ణా పారుతున్నా తమ ప్రాంతీయ పక్షపాతంతో నల్లగోండ ప్రజలను దశాబ్దాలుగా ఫ్లోరీన్ వాతకు గురి చేసిన నేరానికి ఎంత పరిహారం చెల్లిస్తారు? తెలంగాణా ప్రాంతానికి చెందిన వేలాది ఉద్యోగాలను అక్రమంగా అనుభవిస్తూ, ఇక్కడి ప్రజలను అన్యాయానికి గురిచేసినందుకు ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పైగా ఇక్కడే తిష్ట వేస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారే!

చంద్రబాబుకు కానీ మరో సీమాంధ్ర నాయకునికి గానీ తెలంగాణాని ఆపాలని ఎంత కోరిక ఉన్నా, 'సమన్యాయం' అన్న వాదనను పట్టుకుంటే అది చివరికి తెలంగాణాకు ప్రయోజనం చేకూరుస్తుందే తప్ప సీమాంధ్రకు కాదు. కారణం న్యాయం తెలంగాణా వైపు వుంది కాబట్టి. సమైక్య వాదులు కోరుతున్నది ప్రాంతీయ దోపీడీని స్థిరీకరించడం కాబట్టి వారి కోరికలో న్యాయం లేదు. అంతకన్నా విభజనానంతరం సీమాంధ్రకు చేకూర వలసిన నిర్దిష్ట ప్రయోజనాలకోసం పోరాటం చేస్తే భవిష్యత్తులోనైనా వారు ఆ ప్రాంత ప్రజల మనస్సులను గెలుచుకో గలుగుతారు.


Tuesday, October 8, 2013

మనుషులైతె గిది చూసి బుద్ధి తెచ్చుకోండ్రి

గాయిన పేరు చెంద్రబాబు...

2008ల లెటరిచ్చిన నంటడు.

ఇప్పుడు తెలంగాణ ఇయ్యాల్నంటవా అనడిగితె "నో" అంటడు.

అసెంబ్లీల బిల్లు పెడితె సపోర్టు చేస్తవా అనడిగితె "నో" అంటడు.

పార్లమెంటుల బిల్లు పెడితె వోటేస్తవా అంటె "నో" అంటడు.

జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇర్వై తీర్ల అడిగినా గూడ, ఒక్క తీర్గ గూడ తెలంగాణాకు అనుకూలమని చెప్పడు.

గీ బాబునా మీరు పట్టుకొని తిరిగేడిది?

తెలంగాణ తెలుగు తమ్ముళ్ళూ, గిది చూసినంక గూడ మీకు బుద్ధి రాకపోతె మిమ్ముల నేమని పిలువాలె?

Friday, October 4, 2013

దొపిడీలొ ఎలాంటి మార్పూ వుండదా?

తెలంగాణా ఏర్పాటుపై సింపతీ వున్న కొందరు ఆంధ్రా ప్రాంతపు మధ్యేవాదులు కొత్త వాదనను లేవనెత్తుతున్నారు. అదేమంటే తెలంగాణా ఏర్పడిననంత మాత్రాన దోపిడీ పోదట! కేవలం ఆంధ్రా వారు చేసే దోపిడీని తెలంగాణా వారే చేస్తారట. అది నిజమే కావచ్చు. కాని దోపిడీలలో కూడా రకరకాల రూపాలుంటాయి. అన్నింటినీ కలగలిపి ఒకే గాటన కట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఇటువంటి వారు తాము కంఫ్యూజ్ అవుతూ ఇతరులను కన్‌ఫ్యూజ్ చేయడనికి ప్రయత్నిస్తుంటారు.

SC, ST వర్గాలు తమకు దామాషా ప్రకారం నిధులు వెచ్చించ బడడం లేదని సమ్మె చేశాయి. సబ్-ప్లాన్ సాధించుకున్నాయి అనుకుందాం. అంతటితో దోపిడీ ఆగుతుందా? ఆ సబ్-ప్లాన్ నిధులు మళ్ళీ కాంట్రాక్టర్లకే సమర్పించబడతాయి. అందులో సింహభాగం భోంచేయ బడతాయి. ఏ కొద్ది భాగమో కర్చు చేయ బడతాయి.

దోపిడీ ఆగలేదు కాబట్టి అసలు సమ్మేలే చేయొద్దంటారా? మొదటిది నిమ్న కుల/వర్గాలపై జరిగే దోపిడి. రెండోది అందరిపైనా ఏకమొత్తంగా జరిగే అవినీతి దోపిడీ. ఇక్కడ దోపిడీ అంటం కాకపోయినా రూపం మారిందని గమనించండి. అప్పుడూ దళితుడు తనపై మాత్రమే జరుగుతున్న దోపిడీని అరికట్ట గలిగాడు కాబట్టి, సకల జనులతో కలిసి అవినీతి పై పోరాడ గలుగుతాడు. అప్పుడు అవినీతిపై పోరాడే వారి సంఖ్య పెరుగుతుంది. అవినీతి కన్నా బలమైన దోపిడీ తనపైనే జరుగుతున్నప్పుడు ఆ దళితుడు తనకు మాలిన ధర్మంగా అవినీతిపై పోరాడడమనేది కల్ల.

అలాగే మహిళలపై అత్యాచారాలు, గృహహింస విపరీతంగా వున్నాయనుకుందాం. అదీ ఒకరకమైన దోపిడీయే. అప్పుడు మహిళలను "ముందు మీరు అవినీతిపై పోరాడండి, తర్వాత మీ సమస్యలు చూద్దాం" అంటే ఎలా వుటుంది? అది ఎంతవరకు సమంజసం?

మనసమాజంలో ఇప్పుడు మీరు చెప్టున్న ఆర్థిక దోపిడీయే కాక అంతకన్నా కౄరమైన అనేక దోపిడీ రూపాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక దోపిడీని అంతమొందించడం ఎంత అవసరమో, మిగతా రకాల దోపిడీలను అంతమొందించడం అంతకన్నా ఎక్కువ అవసరం. మీరు గమనించే వుంటారు... అన్నా హజారే మీటింగులకు ఇతరేతర దోపిడీలకు అతీతంగా వున్న వారే హాజరవుతుంటారు.

తెలంగాణా పై జరిగిన ప్రాంతీయ దోపిడీ కూడా అటువంటిదే. ఒకప్పుడు నీరు పల్లమెరిగి, ఆంధ్రాకు వస్తే మేమేం చేయాలి? అంటూ వగలు పోయినవారు, నేడు తెలంగాణా ఏర్పడితే తమప్రాంతం ఎడారిగా మారుతుందంటున్నారు.

ఒకప్పుడు కమీషన్లు లెక్కతేల్చిన వేలాది అక్రమ ఉద్యోగ నియామకలు బూటకాలని బుకాయించినవారు, నేడు, వేలకొద్దీ ఉద్యోగాలకు ప్రమాదం వస్తుందని గాభరా పడుతున్నారు.

తెలంగాణా సంస్కృతి పై దాడి, తెలంగాణా పండగలకు సెలవులుండవు. తెలంగాణా చరిత్ర text పుస్తకాల్లో వుండదు. తెలంగాణా యాసను విలన్లకు కమేడియన్లకు పెట్టి రాక్షసానందం పొండడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! ఇవాన్నీ కూడా దోపిడీకి రూపాలే!! ఒక ప్రాంతం మొత్తంగా మరో ప్రాంతం పై కొనసాగిస్తున్న దోపిడీ.

అధ్రా ప్రజలకు అర్థం కాకపోవచ్చు. వారు అనుభవించడం లేదు కాబట్టి. కాని తెలంగాణా ప్రజలకు ఈ ప్రాంతీయ దోపిడీ నుంచి విముక్తి పొందడం అత్యవసరం. అంతవరకూ వారు మిగతా రకాలైన దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఇతరులతో మమేకం కాలేరు.

Thursday, October 3, 2013

జయహో తెలంగాణ!

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పథంలో ఈరోజు రెండొ కీలకమైన మైలు రాయి దాటిన సందర్భంగా తెలంగాణా వాదులందరికీ అభినందనలు.

1969 ఉద్యమంలో తీవ్ర అణచివేతకు గురైన దరిమిలా, తెలంగాణా రాష్ట్రం అసలు ఎప్పటికైనా ఏర్పడుతుందా? అన్న శంకతో ఉన్న ప్రజలను తట్టిలేపి తన మార్గంలోకి రప్పించిన ఘనత మాత్రం KCRదే. అందుకే రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించే ప్రతి ఒక్కడూ ఆయన్ను తిట్టని తిట్టు లేదు.

KCR స్థాపించిన TRS పార్టీ ఇచ్చిన ప్రేరణ వల్ల అనేక ఇతర ప్రజా సంఘాలు JACలు, కవులు, కళాకారులు, నెటిజన్లు, బ్లాగర్లు ఇలా ఒకరేమిటి? ప్రతి ఒక్కరు నదులు, ఏర్లు, పిల్ల కాలువలై తెలంగాణా పోరాట స్రవంతిలో భాగంగా మారారు. తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. వారందరికీ నా ఉద్యమాభివాదాలు.

ఒకవైపు బలమైన శతృవులను నిర్భీతిగా ఎదుర్కుంటూ KCR అభిమన్యునిలా పోరాడుతుంటే, మరో వైపు ధర్మరాజులా తొణకని కుండలాంటి మూర్తిమత్వంతో కోదండరాం తెలాంగాణా పోరాటానికి వెలకట్టలేని నాయకత్వాన్ని అందించారు. వీరందరినీ మించి ఉద్యమంలో స్తబ్దత నెలకొన్న ప్రతీసారీ, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, పణంగా పెట్టి ఉద్యమ స్పూర్తిని రగిలించిన అమరవీరులది వెలకట్టలేని పాత్ర.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకై ఇప్పటివరకూ జరిగిందానితో పోలిస్తే ఇకముందు జరగాల్సింది నల్లేరు మీద బండి నడక. అయినా మనం అప్రమత్తంగానే వుందాం, సీమాంధ్ర నాయకుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కుందాం!

ఈ సందర్భంలో తలుచుకోవలసిన మరొక పేరు సోనియా గాంధీ. సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తొణక్కుండా ధీరవనిత అనిపించుకున్నారు! తెలంగాణా ఏర్పాటులో తన ప్రయోజనాలు తనకుండొచ్చు, కాని ప్రయోజనాలు లేకుండా ఎవరూ ఏమీ చేయరు. తెలంగాణా రాష్ట్రం సాకారమైన తర్వాత ఈ ప్రాంతపు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన పేరు ఆమెది.

ఇక పోతే సీమాంధ్ర ప్రజలకు ఒక విఙ్ఞప్తి. ఇప్పటికైనా కలవడానికి ఇష్టం లేని ప్రాంతాన్ని కలపుకోవడానికి చేసే దొంగ సమైక్యతా ఉద్యమాలు గుర్తింపుకు నోచుకోవని, ఉన్మాదంగా భావించబడతాయని తెలుసుకోండి. అలాగే, పరాయి ప్రాంత భూభాగాలను కబళించడం తప్పని ఇకనైనా గుర్తించి సొంత రాజధాని ఏర్పాటు కోసమై గట్టి ప్రయత్నం చేయండి. అందుకై కేంద్రంపై పోరాడండి. అందుకోసం తెలంగాణా వాదులం పూర్తి సంఘీభావం తెలుపుతాం.


Tuesday, October 1, 2013

స్టేజ్‌షోలా, ఉద్యమాలా? ఒక ప్రత్యక్ష అనుభవం!! పోస్టుకు కొనసాగింపు..


ఇది గత 26-సెప్టెంబర్ నాడు రాజమండ్రి లో జరిగిన ఒక APNGOల సమైక్యాంధ్ర రాల్లీ. కనిపించే పిల్లలంతా ఇక్కడ హైదరాబాదు నుంచి పోయిన తెలంగాణా కాలేజి పిల్లలు. ఎడ్యుకేషన్ టూర్ కు పోతున్న వాళ్ళను బలవంతంగా దింపి రాల్లీలో కొద్ది సేపు నడిపించిన్రు. మనోళ్ళను తీసేస్తే మిగిలింది పది పదిహేను మందే ఆ రాల్లీలో. అదీ మీడియా ఒస్తున్నదని తెలిసి అప్పటికప్పుడు చేసింది. మీడియా షూటింగ్ ఐపోగానే ఎక్కడివాళ్ళు అక్కడే గప్ చుప్.

Sunday, September 29, 2013

స్టేజ్‌షోలా, ఉద్యమాలా? ఒక ప్రత్యక్ష అనుభవం!!

కాలేజీ ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా సీమాంధ్రకు వెళ్ళి వచ్చిన నా మిత్రుని కుమారుడు శశాంక్ అనుభవాలు, ఆతని మాటల్లో...

--***--

అంకుల్,

గత సోమవారం మా కాలేజీవారు నిర్వహించిన ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా మేము సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ నేను చూసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

టూర్‌లో భాగంగా నేను వైజాగ్, కాకినాడ రాజమండ్రి విజిట్ చేశాను. ఒక్క RTC బస్సులు నడవక పోవడం తప్ప ఎక్కడా ఉద్యమ వాతావరణం కనిపించ లేదు. కాని సీమాంధ్ర చానెళ్ళలో చూపిస్తున్నట్టు వేలాది మంది నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక టెంటు, దానిలో నలుగురైదుగురు మనుషులు మాత్రం కనిపించే వారు. లేని దాన్ని ఉన్నట్టు ఎలా చూపిస్తున్నారా అని అనుకునేవాణ్ణి. నా అనుమానం తీరాడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

గత 26వ తేదీనాడు మేము రాజమండ్రిలో వున్నాం. ధవలేశ్వరం బ్యారేజీ దాటి గ్యాస్ ప్లాంటు విజిట్ కోసం మా బస్సు వెళ్తోంది. బ్యారేజీ దాటగానే ధవళేశ్వరం NGOలు మా బస్సును అడ్డుకున్నారు. కొందరు బస్సులోకి వచ్చి అందరినీ కిందికి దిగి వచ్చేయమన్నారు. మేం హైదరాబాదు నుండి ఇండస్ట్రియల్ టూర్ కి వచ్చామని మాలో ఉన్న కొందరు ఆంధ్రా ప్రాంతంవారు అక్కడి వారికి చెప్పారు. 'అయినా సరే, దిగాల్సిందే' అని వాళ్ళు పట్టు బట్టారు

'ఇదేం ఖర్మరా'! అనుకుంటూ మేం కిందికి దిగి చూట్టూ చూసే సరికి ఆశ్చర్య పడడం మావంతైంది. వారు ఆపుతున్నది మా ఒక్కరినే కాదని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఓ పదిమంది రోడ్డుకు అడ్డంగా నిలబడి అన్ని బస్సులూ, ఆటోలూ, సొంత వాహనాల వారినీ, పాదచారులనూ జబర్దస్త్‌గా ఆపేసి ర్యాలీగా నిలబెడుతున్నారు.

మేం గ్యాస్ ప్లాంటుకు వెళ్ళాలి, లేటవుతుంది అని వేడుకున్నా, వారు వినలేదు. 'మాకు మనుషుల్లేరు, ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చే సమయం అయింది. వారు వచ్చేవరకు ఎవరూ కదలడానికి వీళ్ళేదు ' అని చెప్పారు. పైగా 'జై సమక్యాంధ్ర ' నినాదాలు ఇవ్వమని ఫోర్స్ చేశారు.

ఇంతలో మీడియా వాళ్ళు రానే వచ్చారు. వివిధ కోణాల్లో వారు జనాన్ని వీడియోలు తీసుకున్నారు. ఒకరిద్దరు నాయకులతో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ ఎవరి వాహనాల్లో వారు వెళ్ళి పోయారు.

ఇదంతా చేస్తున్న సమైక్య ఉద్యమకార్లు మాత్రం (వారు దజను మంది కూడా లేరు) హాయిగా జోకులేసుకుంటూ తమ టెంటు లోకి దూరారు. ఇదీ నేను స్వయంగా చూసిన సమైక్య ఉద్యమ నిర్వహనా విధానం.

ప్రైవేటు వాహనాలతో సహా సకలం బంద్ అని ప్రకటించిన 26రో తేదీనే జనంలేని పరిస్థితి వుంటే ఇక వేరే రోజుల సంగతి చెప్పనవసరమే లేదు. ఒక్క RTC బస్సులు నడిస్తే ఎక్కడా ఉద్యమం ప్రభావమే ఉండదని అక్కడ అంతా అనుకుంటున్నారు.  రాజమండ్రి ఒక్కటే కాదు, నేను విజిట్ చేసిన ఇతర పట్టణాలు వైజాగ్, కాకినాడల్లో కూడా నాకు ఇంతకంటే ఎక్కువ ఉద్యమం కనపడలేదు.

శశాంక్

Saturday, September 28, 2013

కిరణ్ ఒక ట్రోజన్ హార్సా?


నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రంతో ఆడిన భీభత్సమైన క్రికెట్ మ్యాచ్ చూస్తే విస్తుపోవుడు విఫక్షాల వంతైంది. వరల్డ్ లో టాప్ ర్యాంక్ పేసర్ గల్లీ పోరనికి బౌలింగ్ చేస్తె వాని బ్యాటింగ్ ఎట్ల వుంటది? గట్లనే అనిపిచ్చింది కిరణ్ ఆట. గాయిన ఇదివరకు లీగు మ్యాచులన్న ఆడిండు గద? మరీ గంత అధ్వానంగ బ్యాటింగు చేసిండేంది అని అందరికి మస్తు డౌట్లు వస్తున్నయట.

ఒక్క తీర్గ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంట గీయన సాధించ గలిగేది ఏంది? అని పరేషానైపోతున్రు అపోజిషనోల్లు. ప్రెస్సోల్లేమొ, గీన కాంగ్రేస్ నుంచి బయటికొచ్చి కొత్త పార్టీ పెట్టి సీమాంధ్రల గెలువాలె నని చూస్తున్నడు... అంటరు. కాని స్వశక్తి తోని తన సొంత మండలంల గూడ గెలువలేనోడు, పార్టీ ఎక్కడికెల్ల పెట్టబొయిండు? అని చాన మంది ఆలోచన.

ప్రెస్ మీట్ల గీయన తరీక చూస్తె సీమాంధ్ర గల్లీ స్థాయి నాయకుని లెక్క మాట్లాడినట్టు కనిపిచ్చింది గని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క కాదు. పైనించి దిగ్విజయ్ సింఘ్ మీద గూడ సెటైర్లు వెయ్యబట్టిండు, సీమాంధ్ర ప్రజల మెప్పు పొందెటందుకు! మరి గదే సోనియా గాంధి మీద మాట్రం ఒక్క మాట గూడ మాట్లాడలేదు. పైనించి తన పదవి ఆ మాత పుణ్యమే అని చెప్పుకుండు.

ఇంకొక దిక్కేమో జగన్ జైల్లకెల్లి బయటికొచ్చిండు. గా జగన్ని సీమాంధ్రలకు కాంగ్రేసే ఒదిలిందని అందరు జెప్పుకునే మాట! మరి కాంగ్రెస్ జగన్ని ఏజంటుగ పెట్టుకున్నప్పుడు అధిష్టానానికి విధేయుడైన కిరణ్ గాయినకే సైడియ్యాలె గద? మరి సీమాంధ్ర సెంటర్ స్టేజికి రావాలెనని ఏందుకు ప్రయతిస్తున్నడు?

గియ్యన్ని చూస్తుంటె కాంగ్రెస్ సీమాంధ్రలకు ఒక్క ఏజెంటును కాదు, ఇద్దరు ఏజెంట్లను వదులుతున్నదని అర్థమైతంది. జగన్ అప్పుడే జైల్లకెల్లి బయటికి వచ్చి ఒకవైపునుండి దున్నుతున్నడు. ఇంక కిరణ్ గూడ బయటికి వచ్చి సీమాంధ్ర హీరోలెక్క పోజు పెట్టేటందుకు సిద్ధమైతుండు. ఇంత పెట్రేగి పోయినా అధిష్టానం సప్పుడు జేస్తలేదంటె గదే నిజమని అనిపిస్తంది.

రాష్ట్రాన్ని విభజించి TRSని తెలంగాణల కలుపుకోవాలె ననేది కాంగ్రేస్ ప్లాన్ లెక్క కనపడుతంది. గప్పుడు తెలంగాణల గెలవడం నల్లేరు మీది నడక. జగన్ని, కిరణ్ణి సీమాంధ్ర మీదకు వదులాలె. జగన్ సొంత పార్టీ తోని పోటీ చేస్తడు. కిరణ్ నాయకత్వంల సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ నుంచి గాని, కొత్త పార్టీ పెట్టి గాని పోటీ చేస్తరు.

రేపు సీమాంధ్రల ప్రజలముందుకు వెళ్ళెటందుకు ముఖ్యమంత్రి నాయకత్వంల సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నరు. నలుగురు ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం దానికి నాంది. తర్వాత సీయం, మంత్రులు, మార్బలం కూడా రాజీనామాలు చేస్తరని అనుకోవచ్చు. లేక పోతే, కోపం చేసినట్టు నటించి అధిష్టానమే కిరణ్ణి పీక వచ్చు. గట్ల జేస్తె మరింత మైలేజీ వస్తది.

ఈవిధంగ కాంగ్రెస్ సీమాంధ్రల కిరణ్‌కి, జగన్‌కి పోటి పెట్టింది. పోటీల ఎవడు గెలిస్తె వాడే సీయం. రాజ్యం వీర భోజ్యం అన్నట్టు! మొత్తానికి కాంగ్రేస్ ఆడుతున్న ఈ గేముల చంద్రబాబుకు చిప్ప మిగిలే పరిస్థితి కండ్లవడుతంది!

CM అబద్ధాలకు KTR జవాబు

Monday, September 16, 2013

Revenues from Hyderabad: Fact and fiction


By Gautam Pingle
The Indian Express, 28 August, 2013

There has been much controversy over the revenue figures for Hyderabad. This has become an unnecessary and irrelevant point in the discussion around the imminent de-merger of Telangana. Nonetheless, a lot of hot air, mixed with genuine emotion and concern, is being generated around the subject. For a division-wise (not district- wise) break-up, you have to consult the latest Andhra Pradesh Statistical Abstract 2011 where the latest figures given are for 2010-11.

In 2010-11, the total collection was Rs 29,434 crore is on account of Andhra Pradesh General Sales Tax (APGST) plus Central Sales Tax (CST). CST is not the state’s income, it only collects it for the Union government and it is levied on inter-state sales of enterprises registered in the state. However, it is estimated at about 20 pc of the total.

The share of Hyderabad division, which includes Ranga Reddy district, in both APGST and CST is Rs 21,714 crore (that is, 74 pc of the total), of which Abids and Secunderabad sub-divisions alone contribute Rs 15,692 crore.

The figure circulated by the Congress high command is ridiculous and does not match the published official figures. It claims “Hyderabad and Rangareddy districts (Greater Hyderabad or HMDA area) are contributing more than half of AP’s total tax collections.

While AP’s total tax collection in 2012-13 stood at Rs 69,146.5 crore, Greater Hyderabad area contributed Rs 34,100.73 crore to the exchequer. ‘’In two years, the revenues could not have gone up by so much!

Now, note the figure given is for ‘Greater Hyderabad or HMDA area.’’ The HMDA region covers a total area of 7,073 km with a population of over 7 million and comprises all of the GHMC (population 5.4 million), Sangareddy and Bhuvanagiri municipalities as well as 849 urbanising villages (population 1.9 million) falling within 52 mandals and located in Ranga Reddy, Medak, Mahbubnagar and Nalgonda districts.

So, if the figures are for HMDA, they have to include total figures for Hyderabad division (Hyderabad and RR districts), Nizamabad division (Nizamabad and Medak districts), and Nalgonda division (Nalgonda and Mahbubnagar districts). Thus, the estimate that HMDA provided 50 pc of the state’s revenues may be near-reality, especially if it includes CST figures and other taxes also _ as the Congress high command note says “total tax”. So there is no clarity on what state sales tax revenues in Hyderabad district alone yield.

It could be in the range of Rs 17,000 crore or 80 pc of the total collection in Hyderabad division. This is after deducting APGST for Ranga Reddy district and CST for the whole. However, it is clear that many commercial enterprises which have sales all over the united state (and country) are registered in Hyderabad. Nearly 3,000 head offices of major companies and manufacturing units are said to be located in Hyderabad and pay APGST and CST.

After de-merger of Telangana, what will happen to the APGST levied on sales in the Seemandhra region but collected in Hyderabad? That is the main concern to the Seemandhra interests. CST is not the issue. The following points will make the position clear.

1. Hyderabad division includes Hyderabad district as well as Ranga Reddy district with Abids and Secunderabad sub-divisions as the largest contributors

2. As of now, APGST paid by all enterprises which have registered offices in Hyderabad or Ranga Reddy will be credited to the Hyderabad division regardless of where the sales were made within the united AP state

3. On de-merger, if the enterprise registered office remains in Hyderabad division, then its sales to Seemandhra state will be treated as inter-state sales and attract Central Sales Tax (CST) for such sales, but not Telangana state sales tax.

4. If the enterprise shifts its registered office to Seemandhra state, its sales in Telangana state will likewise attract only CST but not Seemandhra state sales tax.

5. Enterprises selling across the whole undivided state will select the best current rate (CST or either of the two states’ ST) and move their registered office accordingly. This has nothing to do with government.

6. Even if the APGST on sales to Seemandhra districts is Rs 10,000 crore, the de-merger will mean these sales will attract CST and not Telangana or Seemandhra Sales Taxes.

Similar is the case with sales from Seemandhra to Telangana. This is what the two states need to discuss with the Government of India and get concessions and not quarrel with each other as there is nothing to gain from each other on this account.

So no great excitement is warranted and no quarrel needed over what will happen to state APGST revenues from the Hyderabad division when de-merger takes place.

The Union government will benefit through an increase in CST from both states. Here both the states can rationally and fairly ask that for the next five years any increase CST revenues be given back to the respective states which show an increase in CST after de-merger.

Saturday, September 14, 2013

జయప్రకాశూ!


అయ్యా జయప్రకాశూ!

శాన రోజులయింది సార్, నిన్ను చూసి!

తెలంగాణా ఉద్యమం నడిచినన్నాల్లు ఏ కలుగుల దాసుకుంటివో, కనపడ గూడ లేదు. మా నీళ్ళు తూములు బద్దలై పొర్లి పోతుంటే, మా ఉద్యోగాలు కొల్లగొట్టి, చివరికి 610 GO కూడ అమలు జెయ్యక పొతే, నువ్వెప్పుడు కండ్లవడక పోతివి! ఆ, మధ్యల ఒక్క సారి కానొచ్చినట్టు గుర్తు కొచ్చింది.

మిలియను మార్చి జరిగిన తెల్లారే, అసెంబ్లీల దర్శన మిచ్చినవు. ట్యాంకుబండు విగ్రహాలు కూలగొట్టిన్రని ఓ, ఒకటే అరుసుడు మొదలు వెట్టినవు. నీ వంకరబుద్ధి సహించలేక ఆవేశమొచ్చి మా మల్లేషన్న ఒకటి తగిలించనే తగిలించిండు. తన్నులు తిన్న నాగాని కన్నా బుద్ధి వచ్చింది గని నీకు రాలే! గది ప్రజాస్వామ్యం మీద దాడి అని ఒక్కతీరుగ ప్రచారం చేసుకుంటివి. మేం గూడ గా దాడిని ఖండించినం. 

గిప్పుడు తెలంగాణా ప్రకటన రాంగానే అందరు సీమాంధ్ర సమైక్యవాదు లోలె నీకు గూడ దుఖ్ఖమొచ్చింది. వ్యాను మీద కూసోని సీమాంధ్ర అంట తిరిగి వచ్చే తెలంగాణాకు అడ్డు పడాలెనని చూస్తున్నవు. ఇంగ నీకు వందకోట్ల జగను పార్టీ షర్మిలకు తేడా ఏముంది?

సీమంధ్రల సమెక్కుడు గూండాలు జాతీయ నాయకుల విగ్రహాలు తగుల పెడుతుంటే ఒక్క రోజన్న మాట్లాడ వైతివి! ఎట్లా మాట్లాడుతవులే? దాంట్ల కూడా నీ 'కమ్మ'ని మనసుకు ప్రజాస్వామ్య ఉద్యమమే కండ్లవడుతది. నావోడికి ఒక న్యాయం, మందోడికి ఒక న్యాయం... గిదా, నీ దృష్టిల ప్రజాస్వామ్యమంటే?

కేసీయార్ చెప్తుంటడు, లంకల ఉండేది రాక్షసులేలని, మేం నమ్మలే! కని నీ అసుమంటోల్లు మమ్ముల గా మాటలు  నమ్మేటట్టు జెయ్యబట్టిన్రు. నువ్వు చెప్పే తియ్యటి మాటలు విని తెలంగాణాల కూడా నిన్ను ఎంతో మంది అభిమానించిన్రు , కూకట్ పల్లి నుంచి నిన్ను ఎమ్మెల్యేగ గూడ గెలిపిచ్చినరంటే దాంట్ల తెలంగాణా వోట్లు కూడా ఉన్నయి. కాని నువ్వు మాత్రం బిడ్డా, నీ విషపు బుద్ధిని బాగనే బయట పెట్టుకున్నవు!

గిక్కడ ఉద్యమం జరుగుతన్నప్పుడు 'ఎందుకు ఉద్యమం జేస్తున్నారయా? హైదరాబాదుల ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు మెరిట్ మీద వస్తయి, తెలంగాణా వచ్చినా, రాకున్నా తేడా లేదు, తెలంగాణ నాయకులు మిమ్ముల మోసం చేస్తున్రు' అని పలికినవు . ఇప్పుడు ఆంధ్రల జేరి అదే నాలుక ఉల్టా తిప్పి 'తెలంగాణా ఏర్పాటు చేసే టప్పుడు, హైదరాబాదు ఉద్యోగాలల్ల ఆంధ్రా, రాయలసీమ వాటా తెల్చాలె' నంటవు.  మరి గిప్పుడు మెరిట్ ముచ్చెట పొయ్యి వాటా ముచ్చెట ఎందుకొచ్చింది తండ్రీ?

ఉద్యమం ఉడుకుతున్నప్పుడు తెలంగాణా సమస్యల మీద ఒక్కసారన్న నువ్వు ఉద్యమం చేసినవా, యాత్ర పెట్టినవా? గిప్పుడు ఆఘమేఘాల మీద ఉరుక్కుంట సీమాంధ్రల తిరుగుతున్నవంటేనే నీ వొంకర బుద్ధి ఏందో బయట పడ్డది. తిరిగితే తిరిగినవు గని మల్ల తెలంగాణా వైపు వచ్చేవు, ఈసారి అడుగడుగునా మల్లేషన్నలు ఎదురైతరు!

Friday, September 13, 2013

షో.. దో ఘంటే కా!!


9/13/2013 5:28:44 AM


-రెండు గంటల సమైక్యవాదం.. సీమాంధ్రలో జోరుగా కిరాయి ఆందోళనలు
-కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం సీమాంధ్ర నేతలు
-నిర్మాతలు.. రాజకీయ పెట్టుబడిదారులు!
 
 
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (టీ మీడియా): ‘హైదరాబాద్ మాకు కాకుండా పోతే మేమేం చేయాలి? ఇక్కడి పచ్చటి పొలాల్లో సెక్రటేరియట్  కట్టుకోమంటారా?’.. ఇది కృష్ణాజిల్లాలో సమైక్య రాష్ట్రాన్ని కాంక్షించే ఓ ఉపాధ్యాయురాలి స్వరం! ‘హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం.. దాన్ని తెలంగాణకు ఇచ్చేస్తామంటే ఎలా? తెలుగు జాతి అన్నదమ్ముల్లా.. ఐక్యంగా ఉండాలి’ ఇది మరో సమైక్యవాది అభిప్రాయం! పొట్టి శ్రీరాములు ఆశయాన్ని సాధిస్తామంటూ మరో ఆవేశపరుడి నినాదం.. 


నెలరోజులకు పైగా సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనల్లో వినిపిస్తున్న అభిప్రాయాల్లో ఇవి కొన్నే!! కేవలం రెండు మూడు గంటలకే పరిమితమవుతున్న ఈ ఆందోళనల్లో పాల్గొని.. తమ అభిప్రాయాలను టీవీ చానళ్లముందు ప్రకటించే సమైక్యవాదులు.. కార్యక్రమం పూర్తిగాకాగానే.. దులిపేసుకుని వెళ్లిపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీనికి సూత్రధారులుగా ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు, స్వార్థ రాజకీయ నాయకులు.. తమ ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా మభ్యపెట్టి.. మాయ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనిలోపనిగా.. సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహణ కోసమంటూ చోటామోటా నాయకులు ఎవరికి వారుగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించే పని చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. మరికొందరు నాయకులు రానున్న 2014 ఎన్నికల్లో తమ పోటీ అవకాశాలను మెరుగుపర్చుకునే పనికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం తాము తరలించే వివిధ సెక్షన్ల వారి సంఘాలకు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకూ చెల్లిస్తున్నారని తెలిసింది. ఇవికాకుండా హాజరైనవారికి వ్యక్తిగతంగా వంద నుంచి రెండు వందల వరకూ ఇస్తూ.. బిర్యానీ, మందు అందజేస్తున్నారని ఈ ఆందోళనలకు రెండు రోజుల పాటు వరుసగా హాజరైన ఒక వ్యక్తి చెప్పారు.

రెండు గంటల షో..
సమైక్య ఉద్యమాలు సినిమా షూటింగుల్లో ఏర్పాటు చేసే సెట్స్‌ను తలపిస్తున్నాయి. ఇంతాచేసి.. ఆ సెట్టింగులపై జరిగే ఆందోళన మాత్రం ఎటు చూసినా రెండు గంటలు మించడం లేదు. ఇందులో ప్రధాన పాత్రధారులు స్కూలు పిల్లలే. రంగు రంగుల యూనిఫారాల్లో ముచ్చటగా నడుచుకుంటూ వచ్చే విద్యార్థులు.. కాసేపు ఉత్సాహంగా నినాదాలు చేసి.. షో పూర్తికాగానే.. ఊస్సూరుమంటూ స్కూలు బస్సు ఎక్కి మళ్లీ బడికెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రహసనానికి ముందు సీమాంధ్ర మీడియా ఆధ్వర్యంలో మరో తతంగం నడుస్తుంది. ఫలానా రోజు ఆందోళన ఎక్కడ నిర్వహించాలో ముందే నిర్దేశించుకుంటారు. అవసరమైన ‘ఏర్పాట్లు’ పూర్తి చేస్తారు.

ఇక సమయం కాగానే.. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు.. తమ తమ స్కూలు బస్సుల్లో సదరు ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. తమ రాజకీయ అవకాశాలను పరీక్షించుకునే నేతల మందీమార్బలం కూడా అక్కడకు చేరుకుంటుంది. విద్యార్థులను క్రమపద్ధతిలో కూర్చొనేలా చూసే బాధ్యత ప్రైవేటు స్కూళ్ల టీచర్లదే! ఇక వేదికపై కొన్ని సంగీత నృత్య కార్యక్రమాలు! వాటికి చానళ్ల లైవ్ కవరేజ్! అదే సమయంలో కొందరు ఉద్యోగులు.. వృత్తిదారులు హాజరవుతారు.. గంటో రెండు గంటలో అక్కడ ఉండి.. కొన్ని నినాదాలు చేసి.. తిరిగి వెళ్లిపోతారు! షో పూర్తికాగానే.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ పాఠాలు చెప్పే పనిలో టీచర్లు నిమగ్నమైపోతుంటారని ఈ ఆందోళన క్రమాన్ని పరిశీలించినవారు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏలూరులో జరిగిన లక్ష జనఘోష కార్యక్రమానికి వివిధ స్కూళ్లనుంచి విద్యార్థులను తరలించారు. ఇందులో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.30 ముగిసిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలిపారు. ఇంతే కాదు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాలుగు రోజుల తరువాత తిరుపతిలో సినీనటుడు మోహన్‌బాబు తన విద్యాసంస్థల విద్యార్థులతో ఒక్కరోజు సమైక్యాంధ్ర ర్యాలీ చేయించారు. విశాఖలో అసలు ఆందోళనలే లేవని, ఆర్కే బీచ్‌లో సాయంత్రం పూట కాసేపు కాలక్షేపానికి సభలు పెట్టుకుంటున్నారని అక్కడివారు అంటున్నారు. విశాఖలో సమైక్య ఉద్యమం అంతా రెండు స్థానిక ఆధిపత్య సామాజికవర్గాల మధ్య పోటీగా మారిందని చర్చ జరుగుతోంది. కర్నూలు, అనంతపురంలోని పామిడి, ఏలూరు, తదితర పట్టణాలలో జరుగుతున్న లక్షజన గళార్జనకు రెవెన్యూ అధికారులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఏర్పా టు చేశారని సమాచారం. ఇంతచేసీ కాకినాడలో లక్ష గళార్చ నకు 40వేలమందిని కూడా తరలించలేకపోయినట్లు తెలిసింది.

సమైక్య ఆందోళనల్లో నష్టపోతున్నది బడుగుల పిల్లలే
సమైక్య ఆందోళనల్లో కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల చదువులకు ఏ మాత్రం భంగం కలగడం లేదు. కేవలం రెండు గంటల షోలో పాల్గొనే వీరు.. తిరిగి స్కూలుకు వెళ్లిన తర్వాత బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది కూడా రోజూ అన్ని స్కూళ్ల విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనరు. ఒక్కో రోజు.. ఒక్కో విద్యా సంస్థ వంతు! కానీ.. సర్కారీ బళ్లలో చదివే బడుగు వర్గాల పిల్లల్ని మాత్రం పట్టించుకునేవారే లేకపోయారు. ప్రభుత్వ టీచర్లు సమ్మెలో ఉండటంతో.. గవర్నమెంటు స్కూళ్లు మూతపడ్డాయి. సమ్మెపేరుతో టీచర్లు సెలవులను ఎంజాయ్ చేస్తుంటే.. పాఠాలు చెప్పేవారు లేక తమ పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ఆగం.. ప్రైవేటు లూటీ
సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెలో వ్యాపారస్తులు.. పెట్టుబడిదారులు తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నది రవాణా రంగం. సీమాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను దెబ్బతీసే విధంగా ఆర్టీసీని సమ్మెలో దించిన సీమాంధ్ర నేతలు.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా ప్రైవేటు ఆపరేటర్లు.. అందినకాడికి దోచుకుంటూ ప్రధాన నగరాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జేసీ దివాకర్‌డ్డి వంటివారి బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పైగా.. వీటిని ఎవరైనా ఆపితే.. నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇటీవల పొద్దుటూరులో కొందరు దివాకర్ బస్సులను ఆపేయడం తో పోలీసుల వేధింపులను ఎదుర్కొనాల్సివచ్చిందని తెలిసింది.

చివరకు పోలీసుల కాళ్లపై పడిన ఆందోళనకారులు.. ఇంకెప్పుడూ దివాకర్ బస్సు లు ఆపబోమని కాగితం రాసిచ్చి మరీ అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చిందని అంటున్నారు. కేశినేని, ఎస్‌వీఆర్, సూరి, ఎంఎం, కాళేశ్వరి తదితర ప్రైవేటు బస్సులుకూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నాయి. పైగా రెట్టించిన చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్నాయి. ఈ ట్రావెల్ బస్సుల ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.380 చార్జి ఉంటే.. ఏకంగా రూ.800 నుంచి వేయి రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆపరేటర్లు మాత్రం సీమాంధ్రలో ఎంతఎక్కువ కాలం సమ్మె జరిగితే తమకు అంత లాభమని చంకలు గుద్దుకుంటుండటం విశే షం. మరోవైపు ఆర్టీసీ బస్సులను రోడ్లపైకి రానీయకపోవడంతో సంస్థ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతున్నది.

ఉద్యమానికి దూరంగా ప్రజలు
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల్లో సాధారణ ప్రజలు పాల్గొంటున్న దాఖలాలు కనిపించడం లేదని పలువురు అంటున్నారు. కేవలం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, ఉద్యోగులతో మమ అనిపిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీఎన్‌జీవోలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొనడం లేదు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు ఆంధ్రా జర్నలిస్టు ఫోరమ్ ఏర్పాటు చేసుకున్నారు. విభజన జరిగిపోయిందని, సీమాంధ్ర రాజధాని అభివృద్ధి, నీటి సమస్యలపై కేంద్రంతో చర్చించి నిధులు తెచ్చుకోవాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని వారు అంటున్నారు. ఇదే విషయంలో ప్రకాశం జిల్లాకు చెందిన జర్నలిస్టులు స్థానిక ఎంపీని నిలదీశారు. ఈ ఆందోళనలతో చిన్న జీతగాళ్లే బాగా నష్టపోతున్నారు. వచ్చే జీతం తప్ప వేరే ఆదాయ వనరులు లేకపోవడంతో.. నెల జీతం రాక.. నానా అవస్థలు పడుతున్నారు.

ఇవన్నీ ప్రాయోజిత ఉద్యమాలే
రాష్ట్ర విభజన ఖాయమని తెలిసిన తర్వాత కూడా కావాలని తమ ప్రాంత నాయకులు విద్వేశాలు రెచ్చగొడుతున్నారు. మా ప్రాంతంలో జరిగేవన్నీ ప్రాయోజిత ఉద్యమాలు. తెలంగాణలో ఉద్యమాలపై విధించిన నిర్బంధాన్ని ఇక్కడా విధిస్తే.. ఒక్కరు కూడా రోడ్లమీదకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఉండి సమైక్య ఆందోళనలు చేయిస్తుంటే.. ఇక అడ్డే ముంటుంది?
- భోజ్యానాయక్, లంబాడ హక్కుల
పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రా ప్రాంత ఇన్‌చార్జి

Thursday, September 12, 2013

సిగ్గుతో సమైక్యాంధ్ర, సిగ్గు విడిస్తే హైదరాబాదు



విభజన కొరకై తెలంగాణా వాదులు లేవనెత్తిన ఏ ఒక్క కారణానికి కూడా బదులు చెప్పలేని సమైక్య వాదులు సమైక్య నినాదం అందుకుంటారు. అన్నదమ్ములం, తెలుగుజాతి అంటూ పడికట్టు పదాలను వల్లెవేస్తారు. కొంచెం ఆవేశం ఎక్కువ కాగానే సమైక్యం పక్కన పెట్టి హైదరాబాదు భాష మొదలవుతుంది. వాళ్ళ మనసులోని అత్యాశలు నగ్నంగా బయట పడతాయి.

ఈ సమైక్య వాదులకు తెలుగుజాతి భావన ఎప్పుడూ లేదు. అలా ఉన్నవారైతే తెలంగాణా వారు ఇన్ని సంవత్సరాలుగా లేవనెత్తుతున్న సమస్యలకు సానుకూలంగా స్పందించే వారు. మలిదశ ఉద్యమం మొదలైన గత పన్నెండు సంవత్సరాలలో నైనా రాష్ట్రం ఒక్కటిగా ఉంచడం ఎజెండాగా వారు ఒక్క మీటింగు కూడా పెట్టుకొని చర్చిన పాపాన పోలేదు. తీరా రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిందని ప్రకటించినాక మాత్రమె బజార్న పడ్డారు. అది కూడా వారికి జరుగబోయే(?) నష్టాలను ఏకరువు పెడుతున్నారు తప్ప, కలిసుంటే జరిగే ఒక్క మేలు కూడా చెప్పలేక పోతున్నారు.

హైదరాబాదు కోసం వీరు చేసే వాదనలు బహు విచిత్రంగా వుంటాయి. కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ సంస్థలను చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు నెలకొల్పేందుకు అనువైన ప్రదేశాలను చూస్తారు తప్ప అది రాష్ట్ర రాజధానా కాదా అన్న విషయం కాదు. ఆ పద్ధతిలోనే వైజాగ్ లో, పోర్టు, షిప్ యార్డ్, నావికాదళం, స్టీల్ ప్లాంట్ వగైరా... శ్రీహరికోటలో స్పేస్ స్టేషన్ ఏర్పడ్డాయి. నిజాం వెళుతూ వెళుతూ ఇచ్చి పోయిన లక్ష ఎకరాల సర్ఫ్-ఎ-ఖాస్ భూములు ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. అంటే కాని ఆ ఆంధ్రా నాయకుడో లాబీయింగు చేస్తే కాదు. కోల్పోయిన విలువైన భూములు తెలంగాణా వారివైతే, అందులో వచ్చే ఉద్యోగాలు అందరివీ.  

హైదరాబాదులో విలువైన ప్రభుత్వ భూములున్నాయి కాబట్టే వాటిని ప్రైవేటు వ్యాపారులకు అప్పనంగా పందేరం పెట్టి కమీషన్లు దండుకున్నారు ఆంధ్రా నాయకులు. చివరికి దాన్ని కూడా నిస్సిగ్గుగా తాము చేసిన అభివృద్ధిగా ప్రకటించు కుంటారు. హైటెక్ సిటీలో ఇప్పుడున్న సెజ్ ల ఒప్పందాలన్నీ కూడా పెట్టుబడిదారులకు మేలు చేసేవే తప్ప ప్రభుత్వానికి కాదు. కోల్పోబడ్డవి మాత్రం తెలంగాణా ప్రజలకు చెందినా విలువైన భూములు.

సాఫ్టువేర్ రంగంలో అయినా ఫార్మా రంగంలో అయినా జరిగిన అభివృద్ధి ఇక్కడి సమశీతోష్ణ వాతావరణం, కార్మికుల లభ్యత వల్లనే కాని నాయకుల వాళ్ళ కాదు. నాయకుల వల్ల జరిగే పనైతే విజయవాడ, విశాఖల్లో కట్టించిన సెజ్ లు కూడా అదే విధంగా అభివృద్ధి చెందేవి. 

హైదరాబాదు తెలంగాణా అంతర్భాగం. ఏ వైపునుండి చూసినా ఆంధ్రా నుండి హైదరాబాదు చేరుకోవాలంటే కనీసం 200ల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎవరైనా రాజధాని తమ భూభాగంలో ఉండాలనుకుంటారు, సిగ్గు లేని సమైక్యవాదం ముసుగు తొడిగిన హైదరవాదులు తప్ప. వీరు 1956లో తెలంగాణతో కలిసినప్పుడు హైదరాబాదు వెంట తీసుకు రాలేదు, ఇప్పుడు తీసుకెళ్ళడానికి.

విభజన ప్రక్రియ అంటూ మొదలైతే అన్ని లెక్కలో తేలుతాయి. హైదరాబాదు నుండి ఎంత రెవెన్యూ  వచ్చిందో, ఎంత కర్చు పెట్టారో? అదేవిధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి పట్టణాలు హైదరాబాదు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందాయో. హైదరాబాదు గురించి మరీ ఎక్కువ నీలిగితే ఇన్నాళ్ళూ తెలంగాణా మీద పడి తిన్న నిధులు, నీళ్ళు మొదలైన వాటి లెక్కలు కూడా తిరగదోడాల్సి ఉంటుంది.




  

Wednesday, September 11, 2013

సత్యవాణి


APNGOల సభలో సత్యవాణి అనే ఆవిడ చివరి ప్రసంగం చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో విసిగిపోయిన సభికులను తన వాక్చాతుర్యంతో, పురాణ పాత్రలతో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ చేసిన ఉపన్యాసంతో సభికులను ఆకట్టుకున్నారు. కాని ఆవిడ పోలికలలో ఎంత పసవుందో పరిశీలిద్దాం.

ప్రధానంగా ఆవిడ తెలంగాణా వాదులను మారీచుడితో పోల్చారు. కాని మారీచుడికి, తెలంగాణా వాదులకు గల లింకేమిటో వివరించడంలో విఫలమయ్యారు.

అసలు మారీచుడెవడు? మారీచుడు సీతను అపహరించ డానికి సహాయం అర్థించిన రావణుడికి నీతులు బోధించాడు. తన ప్రయత్నాన్ని విరమించుకొమ్మని రావణునంత వాడికి సలహా ఇచ్చాడు. చివరికి బంధు ప్రీతితో రావణునికి సహాయం చేశాడు. రామున్ని మాయలేడి రూపంలో మోసం చేశాడు.

యాభై ఆరు సంవత్సరాల కింద తెలంగాణా సీతమ్మను అపహరించడానికి ఆనాటి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మారీచులవలెనే ఆంధ్రావణునికి సహాయం చేశారు. మాయలేడి లాంటి పెద్దమనుషుల ఒప్పందంతో రాముడి లాంటి కేంద్రాన్ని మోసగించి, సీతమ్మ లాంటి తెలంగాణాను చెరబట్టేలా చేశారు. రాముడికి సీతమ్మను చెర నుండి విడిపించ దానికి పద్నాలుగేళ్ళు పడితే, తెలంగాణమ్మను విడిపించడానికి యాభై ఆరేళ్ళు పట్టింది.  పోలిక అంటే ఎలా వుంటుందో ఇప్పుడైనా తెలుసు కుంటారా వక్రవాణి గారూ?

ఈ సత్యవాణి వక్రవాణి గానే కాక అసత్యవాణిగా కూడా తనకు తాను రుజువు చేసుకున్నారు. దుర్యోధనుడు సూదిమొన మోపేటంత భూమి ఇవ్వక పొతే పాండవులు ఇంద్రప్రస్తాన్ని నిర్మించారని సెలవిచ్చారు. ఇక్కడ సమైక్య వాదులను పాండవులతో పోల్చాలని ఆవిడ కోరిక! ఈవిడ గారికి మహాభారతం తెలియదని అనుకోలేం, కాబట్టి కావాలనే అబద్ధాలు చెప్తున్నదని అనుకోవాలి.

అసలు పాండవులు ఇంద్రప్రస్తాన్ని నిర్మించుకొన్నప్పుడు సూదిమొన ఊసే లేదు. పాండవులకు ధృతరాష్ట్రుడు వానప్రస్తాన్ని పంచి ఇచ్చాడు. వానాప్రస్తంలో వారు ఇంద్రప్రస్తాన్ని హస్తినాపురం కన్నా మిన్నగా నిర్మించు కున్నారు, కాని నేటి ఆంధ్ర్ల్లా సమైక్యవాదుల్లా పక్కోడి రాజధాని కావాలని గీపెట్ట లేదు. ఇక పొతే పైన రామాయణంలో జరిగినట్టుగానే పెద్దమనుషుల ఒప్పందమనే మాయాజూదంతో పాండవులవంటి తెలంగాణా ప్రజలను మోసగించి వారి రాజ్యాన్ని కబళించారు దుర్యోధనులవంటి ఆంధ్రా నాయకులు.

యాభై ఆరు సంవత్సరాల అరణ్య అజ్ఞాత వాసాల తర్వాత, పాండవుల్లాంటి తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రాన్ని తిరిగి అడిగితే అడ్డం నిలువూ కాదంటూ ఒకవైపు మోసగిస్తూనే, చివరికి వీసా తీసుకో వలసి వస్తుంది, సూదిమొన మోపే భూమి కూడా ఇవ్వను తేల్చేశాడో అపర సుయోధన రాజన్న. సమైక్యవాదులనే కౌరవజనం వాడికి వంత పాడారు. చివరికి అధిక సంఖ్యాకులను ఎదిరించి పోరాటంచేసి, పాండవుల్లా అల్ప సంఖ్యాకులైన తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఒప్పుకుంటారా అసత్యవాణి గారూ, పురాణాల పోలికలు ఎవరిని ఏవిధంగా సూచిస్తున్నాయో? ఈసారైనా కాస్త గట్టిగా హొమ్ వర్కుచేసి రండి.

కొసమెరుపు:
సభ తర్వాత జరిగిన ఒక టీవీ చర్చలో సత్యవాణి గారు తానూ తెలంగాణా కోడలినని, బతుకమ్మ ఆడుతానని చెప్పారు. ఒక బతుకమ్మ పాట తెలిస్తే పాడమ్మా అని దేశపతి శ్రీనివాస్ గారు అడిగితే నీళ్ళు నమలడం ఆమె వంతయ్యింది!
  

Sunday, September 8, 2013

సమైక్యవాదమా? సామ్రాజ్యవాదమా?


మధ్య యుగాలలో తెలంగాణా మొఘలుల పాలనలో ఉండేది. రాజధానికి దూరంగా ఉండే ప్రాంతం కనుక పరిపాలించే సర్దార్లలో ఎవడో ఒకడు స్వతంత్రం ప్రకటించు కునేవాడు. అది తెలిసిన డిల్లీ సుల్తాన్ పెద్ద సైన్యంతో తిరిగి దండెత్తే వాడు. హైదరాబాదులో పెద్ద గుడారం వేసుకొని దర్బార్లు నిర్వహించే వాడు. గానా బజానా నెలల కొద్దీ సాగేది.   సైనికులు తిరుగుబాటు దార్లను  పట్టుకుని ఉరి తీసే వారు. ప్రజలమీద పది మాన ప్రాణాలను దోచుకునే వారు. ఆ విధంగా గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో అవిభాజ్య భాగమని, దాన్ని తన 'సమైక్య' రాజ్యం నుండి ఎవరూ  వేరు చేయలేరని మొఘల్ చక్రవర్తి ప్రపంచానికి చాటి చెప్పే వాడు.

నిన్న జరిగిన APNGO మీటింగును TV లో చూస్తున్నప్పుడు చరిత్ర నాకు మరోసారి స్పురణకు వచ్చింది. ఆంధ్రా ఉద్యోగులు బస్సులలో ససైన్యంగా దండయాత్రకు తమది కాని ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ తమది కాని ప్రాంతం అని ఎందుకంటున్నామంటే, వచ్చిన వాళ్ళలో కనీసం కొంత మంది అయినా ఈ ప్రాంతం వారు ఉండి  ఉంటే, ఆమాట అన వలసిన అవసరం వచ్చేది కాదు. కాని జరిగిన మొత్తం తంతులో ఈ ప్రాంతం వారి ప్రాతినిథ్యం శూన్యం. మొత్తం ఆ ప్రాంతానికి చెందినా వారే అయినపుడు, మీటింగు అక్కడే పెట్టుకోవచ్చును. కాని మధ్య యుగ ఫ్యూడల్ సామ్రాజ్యవాద మనస్తత్వం కలిగిన దోపిడీ దారుల ఆలోచనలు ఆవిధంగా ఉంటాయని ఊహించలేం.

ఈ మీటింగు APNGO లు నిర్వహించినా, దీని వెనుక చాలా శక్తులు పొంచి ఉన్నాయని స్వయంగా దాని అధ్యక్షుడు అశోక్ బాబే ఒప్పుకున్నాడు. వారందరికీ తెలంగాణాపై దాడి నిర్వహించడానికి ఇదొక కవచం మాదిరిగా సహాయ పడింది.

ఆ సభకు వారు పెట్టిన పేరు 'సేవ్ హైదరాబాద్'. కాని తీరా మొదలయ్యాక దానికి వారు పెట్టుకున్న పేరు "సమై'ఖ్యాం'ధ్ర పరిరక్షణ వేదిక". సమైక్యతను చాటి చెప్పడానికి వారు చేసింది శూన్యం. వారెంత సీపూ విడిపోవడం వల్ల వాళ్ళకు కలిగే(?) నష్టాలు ఏకరువు పెట్టారు తప్ప, కలిసుంటే తెలంగాణా వారికి కలిగే ఒక్క ప్రయోజనం గురించి చెప్పలేక పోయారు.

ఇంతకీ వాళ్ళు చెప్పినవి ఏమిటి?

విడిపోతే 40000 మంది గవర్నమెంటు ఉద్యోగులు ఆంధ్రాకు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. - అశోక్ బాబు

తెలంగాణా ఏర్పడ్డాక కూడా పదేళ్ళ పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఇదివరకే ప్రకటించారు. అంటే పదేళ్ళదాకా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాదు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి తిరిగివెళ్ళేది ఎవరు? వారెవరో ఇదివరకే గిర్గ్లానీ కమిటీ చెప్పింది. 610 GO చెప్పింది. మొన్న CM ఆ సంఖ్య 19000లని సెలవిచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 40000లని అశోక్ బాబు వెలువరించాడు. ఇంతకీ అశోక్ బాబు అబద్ధం చెప్తున్నాడా? CM అబద్ధం చెప్తున్నాడా? వీళ్ళిద్దరి కంటే ముందే తెలంగాణా వాదులు ఈ సంఖ్య గురించి, అక్రమంగా రిక్రూటై తిరిగి వెళ్ళాల్సిన వారి గురించి నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు. అపుడు ఆంధ్రా నాయకులు గాని, ప్రజలు గాని ఒప్పుకోలేదు, అలాంటి సంఖ్యే లేదని బుకాయించారు. ఇప్పుడు స్వయంగా వారే ఒప్పుకోక తప్పని పరిస్థితి!

విడిపోతే 10000ల RTC కార్మికులు (సీమాంధ్ర కు చెందిన) రోడ్డు మీద పడతారు.  - సీమాంధ్ర RTC JAC లీడరు

ఇది మాత్రం మనం కొత్తగా వినే సంగతి. ఈ మాటతో RTC లో ఇంతకాలం సీమాంధ్ర నాయకులు, అధికారులు ఇన్నాళ్ళుగా చేస్తున్న గూడుపుఠాని బయట పడింది.

సమైక్యంగా ఉన్నప్పుడు బాగుండే RTC ఆంధ్రా కార్మికులు విడిపోతే రోడ్డుమీద ఎందుకు పడతారు? అక్కడే ఉంది అసలు మతలబు. RTC బిజినెస్ ను EPK తో కొలుస్తారు. EPK (Earning per Kilometer) అంటే కిలోమీటరుకు RTC సంపాదించే ఆదాయం. అది ఆంధ్రాలో ఏవరేజి కన్నా తక్కువ. తెలంగాణలో ఏవరేజి కన్నా ఎక్కువ. అంటే విడిపోతే తెలంగాణలో మరుసటి రోజు నుండే RTC లాభాల బాట పడుతుంది. ఆంధ్రా నష్టాలలో కూరుకు పోతుంది. ఎంతగా అంటే 10000 మంది కార్మికులు రోడ్డున పడే అంతగా. అందుకే సదరు RTC నాయకుడు విడిపోయిన పక్షంలో RTCని ప్రభుత్వ డిపార్టుమెంట్ గా మార్చాలని స్పష్టంగానే చెప్పాడు. ప్రభుత్వ డిపార్టుమెంట్ గా మారిస్తే లాభ నష్టాలతో పని లేకుండా వేతనాలు ఇస్తారు, ఉద్యోగ భద్రతా ఉంటుంది, అదీ విషయం!

మరి ఈ పరిస్థితికి కారణమేమిటి?

అన్ని విభాగాల్లో ఉన్నట్టుగానే RTC లో కూడా సీమాంధ్ర డైరెక్టర్లదే ఆధిపత్యం. సీమాంధ్ర నాయకుల/ముఖ్యమంత్రుల జోక్యం షరా మామూలే.  కాబట్టి అక్కడ ఆదాయం తక్కువగా ఉన్నా, ఇబ్బడి ముబ్బడిగా బస్ డిపోలను స్థాపించారు. కార్మికులను రిక్రూట్ చేశారు. అదే తెలంగాణలో ఎక్కువమంది RTC వినియోగదారులు ఉంది, దాని అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. సరిపడే సంఖ్యలో డిపోలు/అదనపు బస్సులు వెయ్యని కారణంగా ఇప్పటికీ బస్సులపై వేలాడుతూ ప్రయాణించే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇప్పుడు విభజన కారణంగా ఈ వైరుధ్యాలు బయట పదుతున్నాయి. కాని ఇవి ఎవరు చేసిన పాపం? పుష్కరంగా తెలంగాణా వాదులు వివక్ష గురించి మొట్టుకున్నప్పుడు విన్నదెవడు? 

వారి ఉద్దేశం ఎప్పుడూ తెలంగాణా ప్రజల సమస్యలు తెలుసు కుందామనో, పరిష్కరించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యయుతంగా సమైక్య భావనను పెంపొందించడం కాదు. తమ మంద బలాన్ని ఉపయోగించి తెలంగాణాను చెప్పు చేతల్లో ఉంచుకోవడం. రాష్ట్రంలో వీలు కాకపొతే కేంద్రంలో తమ డబ్బు ప్రభావం చూపి తమ వలసలను తెలంగాణలో పటిష్ట పరచుకోవడం. అలాంటి మధ్యయుగ భావనల ఫలితమే ఇప్పుడు జరిగిన సీమాంధ్ర సభ. అది సీమాంధ్ర వలసవాద సభ మాత్రమె, సమైక్య భావన పెంపొందించే సభ కాదు. అది వాళ్ళు నిరూపించారు కూడా. 

వారు అశేష వాహనాలలో వచ్చి హైదరాబాదు ముట్టడించారు. జనం మీద దౌర్జన్యం చేశారు. దర్బారు ఏర్పాటు చేసుకుని గానా బజానా చేశారు. తమను వ్యతిరేకించే వారిని అవహేళన చేశారు, సవాళ్లు విసిరారు. అంతకన్నా వారు చేసిందేమీ లేదు.



Saturday, September 7, 2013

వీడొక ఆంధ్రా కసబ్




వీడొక ఆంధ్రా కసబ్. ఇదీ సమైక్య ఉద్యమం. 

Friday, September 6, 2013

సీమాంధ్రులు తప్పక చదవ వలసిన పోస్టు


సీమాంధ్రులు  తప్పక చదవ వలసిన పోస్టు ఇక్కడ నొక్కండి.

బంద్


ఈమధ్య బొత్తిగా ఇంటిపట్టున ఉండడం మానీసినావు మావా? నామీద కోపం గానీ వచ్చిందేమిటి? ఎప్పుడు చూసినా పనీ పనీ అంటూ పొద్దుళ్ళు, రేత్రిళ్ళు డ్యూటీ కాడికే పోతన్నావు!

అదేం కాదే ఎంకీ! కరెంటు ఉత్పత్తి పెంచేకని ఓవర్ టైం  డ్యూటీలు ఏత్తన్నారు. నాలుగు రాళ్లు దొరుకుతాయి గదా అని నేనూ ఎల్తన్నాను.

అలాగా? నువ్వేమో కరెంటు పెంచుతున్నా మని చెప్తున్నావు. మరి మనకేమో రోజుకు నాలుగ్గంటలు కోత  పెరిగిందేమిటి మావా?

కరెంటు ఉత్పత్తి పెంచేది మనకివ్వడానికేటే? పెద్దోళ్ళ వ్యాపారాలకి కరెంటు సరిపోటం లేదని మా సారు మూడు షిఫ్టులు పని చేయిత్తన్నాడు.

పెద్దోళ్ళ యాపారాలకి ఇప్పుడు కొత్తగా కరెంటు లోటెందు కొచ్చింది మావా?

నీదంతా ఎడ్డి ఎవ్వారం! గవర్నమెంటు పవర్ ప్లాంటు ఉద్యోగులు సమైక్య సమ్మె చేస్తున్నారు కదా?

అవునూ!

మరి కరెంటు ఉత్పత్తి తగ్గుతుంది కదా? పెద్దోళ్ళ యాపారాలు ఎట్లా నడుత్తాయి?

ఇంట సమ్మె జరుగి, పేదోళ్లకు తిండి కూడా దొరక్కుంటే,  పెద్దోళ్ళ యాపారాలు మాత్రం ఎందుకు నడవాలి మావా, తెలవక అడుగుతాను?

నీ పిచ్చిగానీ, పెద్దోళ్ళు తమ లాభాలను వొదులు కుంతారేటే? సినిమా, మందు యాపారాలతో సహా వాళ్ళ యాపారాలు సక్రమంగా సాగాలంతే. ఆగేది మాత్రం RTC బస్సులూ, గవర్నమెంటు స్కూళ్ళూ, ప్రభుత్వ ఆఫీసులూ!

అవును మావా! పక్కింటి పార్వతి సెప్తుండాది... వాళ్ళాయన RTC ఉద్యోగానికి వెళ్ళకుండా సమ్మె చేస్తూ, అదేదో బస్సుల కంపెనీలో ప్రైవేటు బస్సు నడుపుతున్నాడట!

అవునే! నీకు అసలు సంగతి తెలుసా? ఆ బస్సుల కంపెనీ ఓనరే సమైక్య ఉద్యమ నాయకుడు! తన బస్సులు డబల్ రేట్లకి నడుపుతాడు... RTC బస్సులు దగ్గరుండి బందు చేయిత్తాడు. అంతెందుకు? మా కరెంటు కంపెనీ ఓనరు కూడా సమైక్య ఉద్యమ నాయకుడే! ఆయన గవర్నమెంటు పవర్ ప్లాంటులు ఆపు చేసి, తనయి మాత్రం మూడు పొద్దులూ నడుపుతాడు. రాష్ట్రం ఎటు పోయినా వాళ్ళకు కావాల్సింది లాభాలేనే! లాభం వస్తుందనుకుంటే ప్రత్యెక ఉద్యమం కూడా చేపించగల మొనగాళ్ళు వీళ్ళు!!

వీళ్ళ అసాధ్యం గూలా? ఎంతకు తెగిస్తున్నారు మావా, వీళ్ళ బతుకు జెడ!!!

Thursday, September 5, 2013

AP NGO ల బాధ!


"పున్నయ్యా, ఈ ఫైలు అలమరలో పెట్టి తాళం వెయ్యవోయ్". హడావుడిగా డెస్కు సర్దుకో సాగాడు సూపర్నెంటు ఆనందం.

సరే సార్! ఏంటీ రోజీ ఎనిమిద్దాటితే కానీ కదలరు. ఈ రోజు నాలుగ్గంటలకే మూసేస్తున్నా రేంటి సార్?

హైదరాబాదులో మీటింగు కెల్లాలి కదోయ్? నువ్వు రావట్లా?

నాకెందుకు సార్, అయ్యన్నీ? రాష్ట్రం విడిపోతే నాకేంటి? కలిసుంటే నాకేంటి? నా ఉద్యోగం పోతుందా, ప్రమోషన్ పోతుందా?

అలాగంటా వేంటోయ్? ఉద్యోగులందరి బాధా నీకు పట్టదా?

అందరికీ మాత్రం ఉన్న బాదేంటండీ?

అదేనోయ్! రాష్ట్రం విడిపోతే మన సోదర ఆంధ్రా ఉద్యోగులు హైదరాబాదు వదిలి రావాలి కదా?

వాళ్ళు ఎలా వదిలి వస్తారు సార్? పది సంవత్సరాలు అక్కడే వుండి పని చేసుకోమన్నారుగా? ఆ లోపు 90% మంది రిటైరై పోరూ?

ఉండేవాళ్ళు ఉంటారనుకో! ఆప్షన్లు ఇచ్చి తిరిగొచ్చే వారు వస్తారు కదా?

వస్తే రానీండి. అప్శన్లిచ్చే వస్తారుగా! వాళ్లకు లేని బాధ మీకెందుకు?

అది కాదోయ్. వాల్లొచ్చేస్తే ఇక్కడ ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాలు గట్రా ఏమై పోవాలి? మనకు ప్రమోషన్లు రావక్కర్లేదా? మన చదూకున్న కుర్రోళ్ళకి గవర్నమెంటు ఉద్యోగాలు రానక్కర్లేదా?

అదేంటి సార్! అలాగంటారు? మన ఉద్యోగులేగా మనవద్దకు తిరిగి వచ్చేది? తెలంగాణా వారేం ఇక్కడికి రావడం లేదుగా?

"నీ కర్థం కాదు లేరా. అందులో చాలా మరలబులున్నాయి మరి!" బ్లడ్ ప్రెషర్ పెరిగింది ఆనందానికి. పక్కనే వున్నా బాటిల్ తీసుకొని రెండు గుక్కల నీళ్ళు తాగాడు.

తెలీకడుగుతా, ఏంటి సార్ ఆ మతలబులు?

నీలాంటి మట్టి బుర్రలకి విడమరచి చెప్పినా అర్థం కాదు లేరా! గొంతు నొప్పి తప్ప!

చెప్పండి సార్! అదేదో తెలుసుకుంటాను.

ఇప్పుడు తెలంగాణా జనాభా శాతమెంత?

42%.

సీమాంధ్ర శాతం?

తెలంగాణా పొతే మిగిలిందేగా? 58%.

మరి రేపు విడిపోతే తెలంగాణలో వుండేది 42% ఉద్యోగులేగా? మిగిలిన ఉద్యోగులంతా తిరిగి రావలసిందేగా?

తెలంగాణా వారు ఎక్కువగా వుంటే వాళ్ళు మనవడ్డకు ఎందుకొస్తారు సార్? అక్కడే వాలంటరీ రిటైర్ మెంతో, సూపర్ న్యుమరరీగా నో వుంటారుగా?

అదేగా బాధ! ఆ ఎక్కువగా ఉన్నోల్లంతా మనోళ్ళేగా? అంతే కాదు ఆ తెలంగాణా 42% శాతం లోనూ చాలా మంది మనోళ్ళే ఏడిశారు. తెలంగాణా వాళ్ళు పొమ్మంటే వాళ్ళు కూడా తట్టా బుట్టా సర్దుకొని రావాల్సిందే? అప్పుడు మన ప్రమోషన్లు కాదు, జీతాలివ్వ డానికి కూడా ప్రభుత్వానికి డబ్బులు సరిపోవు.

"అంటే ఇన్నాళ్ళూ తెలంగాణా వొళ్ళు చెప్తున్నది నిజమే నాన్న మాట! అలా చెప్పినందుకేగా తెలంగాణా వాళ్ళు అబద్ధాల కోర్లని అనేవారు కదా ఇప్పటిదాకా?" ఆశ్చర్యంతో నోరు వెళ్ల బెట్టాడు పున్నయ్య.

నువ్వు మరీ చాదస్తం మనిషివి పున్నయ్యా! ఈ కాలంలో వుండాల్సినోడివి కావు. అలా చెప్పక పోతే, వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగాలు దొంగిలిస్తున్నామని ఒప్పుకోమ్మంటావా ఏంటి?

&%*%$!!

కెసిఆర్ డౌన్ డౌన్


కెసిఆర్ దొంగ
కెసిఆర్ వేర్పాటువాది
కెసిఆర్ లంచగొండి
కెసిఆర్ డౌన్ డౌన్

ఏంట్రా ఓబులేసూ, ఏదో చదువుతున్నావ్?

ఏం లేదు బాబాయ్. ఈ కెసీఆర్ లేకపోతే ఎంత బావుణ్ణు? ఈ గొడవలన్నీ ఉండేవి కావుగా? ఊరోల్లంతా అదే అంటున్నారు. అందుకే కసిదీరా తిట్టుకుంటున్నా!

కెసిఆర్ ఏం చేశాడు?

ఇంకేం చేశాడు? తెలంగాణా నిప్పు రాజెయ్య లేదూ? ఉద్యమాన్ని కుటుంబ వ్యాపారంగా మార్చుకున్నాడు. డబ్బులు సంపాయించు కుంటున్నాడు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు కూడా కారణం అయ్యాడు.

అంటే కేసీఆర్ చెప్పాడని కాంగ్రెసు వారు రాష్ట్రాన్ని విభజిస్తున్నారంటావా?

అంతేకదా మరి? లేకపోతె వాల్లకేం పని?

కెసిఆర్ చెప్తే చేసే వాళ్ళయితే ఎప్పుడో ఆ పని చేసేవారుగా?

చెప్పినా చెప్పకపోయినా, కారణం కేసియారే కదా? ఆయన లేకపోతె ఈ విభజనే ఉండేది కాదుగా?

ఇందాక కెసిఆర్ ఉద్యమాన్ని కుటుంబ వ్యాపారంగా మార్చాడన్నావుగా? మరి అలాగైతే, ఉద్యమం ముగిసి తెలంగాణా రావాలని ఎందుకనుకుంటాడు? కలకాలం రాష్ట్రం సమైక్యంగా, ఉద్యమం చేస్తూ దండుకోవచ్చు అనుకుంటాడుగా?

అవును, అలా అనుకున్నాడు కాబట్టే, ప్రకటన రాగానే 'ఆప్షన్లు, గీప్షన్లు లేవు అంటూ' ఆంధ్రా వాళ్ళను రెచ్చగొట్టి వ్యతిరేక ఉద్యమం వచ్చేలా చేశాడట! ఊళ్ళో చెప్తున్నారు.

అలా ఐతే కెసిఆర్ కూడా లోలోపల సమైక్యవాదే నన్నమాట! మరి ఆయన్ని తిట్టు ఉద్యామాలెందుకు  చేస్తున్నారు? లేఖ ఇచ్చిన చంద్రబాబును, విభజనకు ఒప్పుకున్న జగన్ను, విభజించే కాంగ్రెస్ పార్టీ నేతలను వదిలేసి?

నిజమే బాబాయ్! ఎందుకంటావ్?

ఎందుకంటే మిగతా నేతలంతా 'మనసు ఆంధ్ర, మాట తెలంగాణా' టైపు. తెలంగాణా రాదు అనుకుంటే లేఖలు ఇచ్చి తెలంగాణా ఓట్లు దండుకుందామని చూస్తారు. వస్తుందనుకుంటే, సమైక్య ఉద్యమాలు చెస్తారు. మొత్తానికి U టర్న్ ల మీద U టర్న్ లు తిరుగుతారు.  కెసీఅర్ మాత్రం 2001లో పార్టీ పెట్టినప్పటి నుండీ తెలంగాణా తప్ప మరేదీ  ఒప్పుకోకుండా ఉద్యమం నడుపుతున్నాడు. ఆయన దేనికి పడిపోయే వాడైనా మన పెట్టుబడి దారులు మేనేజ్ చేసేవారే!

అవును బాబాయ్!