అయ్యా జయప్రకాశూ!
శాన రోజులయింది సార్, నిన్ను చూసి!
తెలంగాణా ఉద్యమం నడిచినన్నాల్లు ఏ కలుగుల దాసుకుంటివో, కనపడ గూడ లేదు. మా నీళ్ళు తూములు బద్దలై పొర్లి పోతుంటే, మా ఉద్యోగాలు కొల్లగొట్టి, చివరికి 610 GO కూడ అమలు జెయ్యక పొతే, నువ్వెప్పుడు కండ్లవడక పోతివి! ఆ, మధ్యల ఒక్క సారి కానొచ్చినట్టు గుర్తు కొచ్చింది.
మిలియను మార్చి జరిగిన తెల్లారే, అసెంబ్లీల దర్శన మిచ్చినవు. ట్యాంకుబండు విగ్రహాలు కూలగొట్టిన్రని ఓ, ఒకటే అరుసుడు మొదలు వెట్టినవు. నీ వంకరబుద్ధి సహించలేక ఆవేశమొచ్చి మా మల్లేషన్న ఒకటి తగిలించనే తగిలించిండు. తన్నులు తిన్న నాగాని కన్నా బుద్ధి వచ్చింది గని నీకు రాలే! గది ప్రజాస్వామ్యం మీద దాడి అని ఒక్కతీరుగ ప్రచారం చేసుకుంటివి. మేం గూడ గా దాడిని ఖండించినం.
గిప్పుడు తెలంగాణా ప్రకటన రాంగానే అందరు సీమాంధ్ర సమైక్యవాదు లోలె నీకు గూడ దుఖ్ఖమొచ్చింది. వ్యాను మీద కూసోని సీమాంధ్ర అంట తిరిగి వచ్చే తెలంగాణాకు అడ్డు పడాలెనని చూస్తున్నవు. ఇంగ నీకు వందకోట్ల జగను పార్టీ షర్మిలకు తేడా ఏముంది?
సీమంధ్రల సమెక్కుడు గూండాలు జాతీయ నాయకుల విగ్రహాలు తగుల పెడుతుంటే ఒక్క రోజన్న మాట్లాడ వైతివి! ఎట్లా మాట్లాడుతవులే? దాంట్ల కూడా నీ 'కమ్మ'ని మనసుకు ప్రజాస్వామ్య ఉద్యమమే కండ్లవడుతది. నావోడికి ఒక న్యాయం, మందోడికి ఒక న్యాయం... గిదా, నీ దృష్టిల ప్రజాస్వామ్యమంటే?
కేసీయార్ చెప్తుంటడు, లంకల ఉండేది రాక్షసులేలని, మేం నమ్మలే! కని నీ అసుమంటోల్లు మమ్ముల గా మాటలు నమ్మేటట్టు జెయ్యబట్టిన్రు. నువ్వు చెప్పే తియ్యటి మాటలు విని తెలంగాణాల కూడా నిన్ను ఎంతో మంది అభిమానించిన్రు , కూకట్ పల్లి నుంచి నిన్ను ఎమ్మెల్యేగ గూడ గెలిపిచ్చినరంటే దాంట్ల తెలంగాణా వోట్లు కూడా ఉన్నయి. కాని నువ్వు మాత్రం బిడ్డా, నీ విషపు బుద్ధిని బాగనే బయట పెట్టుకున్నవు!
గిక్కడ ఉద్యమం జరుగుతన్నప్పుడు 'ఎందుకు ఉద్యమం జేస్తున్నారయా? హైదరాబాదుల ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు మెరిట్ మీద వస్తయి, తెలంగాణా వచ్చినా, రాకున్నా తేడా లేదు, తెలంగాణ నాయకులు మిమ్ముల మోసం చేస్తున్రు' అని పలికినవు . ఇప్పుడు ఆంధ్రల జేరి అదే నాలుక ఉల్టా తిప్పి 'తెలంగాణా ఏర్పాటు చేసే టప్పుడు, హైదరాబాదు ఉద్యోగాలల్ల ఆంధ్రా, రాయలసీమ వాటా తెల్చాలె' నంటవు. మరి గిప్పుడు మెరిట్ ముచ్చెట పొయ్యి వాటా ముచ్చెట ఎందుకొచ్చింది తండ్రీ?
ఉద్యమం ఉడుకుతున్నప్పుడు తెలంగాణా సమస్యల మీద ఒక్కసారన్న నువ్వు ఉద్యమం చేసినవా, యాత్ర పెట్టినవా? గిప్పుడు ఆఘమేఘాల మీద ఉరుక్కుంట సీమాంధ్రల తిరుగుతున్నవంటేనే నీ వొంకర బుద్ధి ఏందో బయట పడ్డది. తిరిగితే తిరిగినవు గని మల్ల తెలంగాణా వైపు వచ్చేవు, ఈసారి అడుగడుగునా మల్లేషన్నలు ఎదురైతరు!
No comments:
Post a Comment