కాలేజీ ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా సీమాంధ్రకు వెళ్ళి వచ్చిన నా మిత్రుని కుమారుడు శశాంక్ అనుభవాలు, ఆతని మాటల్లో...
--***--
అంకుల్,
గత సోమవారం మా కాలేజీవారు నిర్వహించిన ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా మేము సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ నేను చూసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
టూర్‌లో భాగంగా నేను వైజాగ్, కాకినాడ రాజమండ్రి విజిట్ చేశాను. ఒక్క RTC బస్సులు నడవక పోవడం తప్ప ఎక్కడా ఉద్యమ వాతావరణం కనిపించ లేదు. కాని సీమాంధ్ర చానెళ్ళలో చూపిస్తున్నట్టు వేలాది మంది నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక టెంటు, దానిలో నలుగురైదుగురు మనుషులు మాత్రం కనిపించే వారు. లేని దాన్ని ఉన్నట్టు ఎలా చూపిస్తున్నారా అని అనుకునేవాణ్ణి. నా అనుమానం తీరాడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
గత 26వ తేదీనాడు మేము రాజమండ్రిలో వున్నాం. ధవలేశ్వరం బ్యారేజీ దాటి గ్యాస్ ప్లాంటు విజిట్ కోసం మా బస్సు వెళ్తోంది. బ్యారేజీ దాటగానే ధవళేశ్వరం NGOలు మా బస్సును అడ్డుకున్నారు. కొందరు బస్సులోకి వచ్చి అందరినీ కిందికి దిగి వచ్చేయమన్నారు. మేం హైదరాబాదు నుండి ఇండస్ట్రియల్ టూర్ కి వచ్చామని మాలో ఉన్న కొందరు ఆంధ్రా ప్రాంతంవారు అక్కడి వారికి చెప్పారు. 'అయినా సరే, దిగాల్సిందే' అని వాళ్ళు పట్టు బట్టారు
'ఇదేం ఖర్మరా'! అనుకుంటూ మేం కిందికి దిగి చూట్టూ చూసే సరికి ఆశ్చర్య పడడం మావంతైంది. వారు ఆపుతున్నది మా ఒక్కరినే కాదని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఓ పదిమంది రోడ్డుకు అడ్డంగా నిలబడి అన్ని బస్సులూ, ఆటోలూ, సొంత వాహనాల వారినీ, పాదచారులనూ జబర్దస్త్‌గా ఆపేసి ర్యాలీగా నిలబెడుతున్నారు.
మేం గ్యాస్ ప్లాంటుకు వెళ్ళాలి, లేటవుతుంది అని వేడుకున్నా, వారు వినలేదు. 'మాకు మనుషుల్లేరు, ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చే సమయం అయింది. వారు వచ్చేవరకు ఎవరూ కదలడానికి వీళ్ళేదు ' అని చెప్పారు. పైగా 'జై సమక్యాంధ్ర ' నినాదాలు ఇవ్వమని ఫోర్స్ చేశారు.
ఇంతలో మీడియా వాళ్ళు రానే వచ్చారు. వివిధ కోణాల్లో వారు జనాన్ని వీడియోలు తీసుకున్నారు. ఒకరిద్దరు నాయకులతో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ ఎవరి వాహనాల్లో వారు వెళ్ళి పోయారు.
ఇదంతా చేస్తున్న సమైక్య ఉద్యమకార్లు మాత్రం (వారు దజను మంది కూడా లేరు) హాయిగా జోకులేసుకుంటూ తమ టెంటు లోకి దూరారు. ఇదీ నేను స్వయంగా చూసిన సమైక్య ఉద్యమ నిర్వహనా విధానం.
ప్రైవేటు వాహనాలతో సహా సకలం బంద్ అని ప్రకటించిన 26రో తేదీనే జనంలేని పరిస్థితి వుంటే ఇక వేరే రోజుల సంగతి చెప్పనవసరమే లేదు. ఒక్క RTC బస్సులు నడిస్తే ఎక్కడా ఉద్యమం ప్రభావమే ఉండదని అక్కడ అంతా అనుకుంటున్నారు. రాజమండ్రి ఒక్కటే కాదు, నేను విజిట్ చేసిన ఇతర పట్టణాలు వైజాగ్, కాకినాడల్లో కూడా నాకు ఇంతకంటే ఎక్కువ ఉద్యమం కనపడలేదు.
శశాంక్

No comments:
Post a Comment