Wednesday, September 4, 2013

సమన్యాయం



ఒరే  ఓబులేసూ! సమన్యాయం అంటే ఏందిరా?

అదెక్కడ ఇనొచ్చావు బాబాయ్?

టీవీలో పొద్దాకా ఒక ఆడ కూతురూ, ఒక గడ్డం నెరిసినాయనా చెవికోసిన పిల్లుల్లాగా అరుత్తుంటేనూ... అదేందా అని అడుగుదామని అనిపిచ్చింది.

దాంట్లో తెలీక పోయిందేముంది బాబాయ్? సమన్యాయం అంటే సమానంగా న్యాయం చేయడం.

సమానంగా న్యాయం ఎలా చేత్తార్రా?

ఇప్పుడొక పండుందనుకో... దాన్ని సమానంగా రెండు ముక్కలు చేసి పంచడమే సమన్యాయం అంటే.

అంటే ఆ పండెవరిదయినా రెండు ముక్కలు చేయాలా?

అంటే?

ఆ పండు నీదనుకో. నేనొచ్చి అది నాదే అని వాదించాను. ఇద్దరం కోర్టు కెళ్ళాం. అప్పుడు కోర్టు సమన్యాయం ఎలా చేయాలి? ఆ పండు చెరిసగం కోసిస్తే సమన్యాయం అవుతుందా?

ఎలా అవుతుంది మావా? ఆ పండు నీది అయితే, అది నీకిస్తేనేగా సమన్యాయం అయ్యేది?

అదేరా నేను చెప్పేదీ! ఇప్పుడు చెప్పు హైదరాబాదు ఎక్కడుంది?

తెలంగాణలో!

మరి విడదీసి నప్పుడు అది తెలంగాణాకు చెందాలా, చెరిసగం పంచాలా?

న్యాయంగా తెలంగాణాకే ఇవ్వాలి. కాని మన జమీందార్లు అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినేసులు పెట్టుకున్నారు కదా? అయ్యేమై పోవాల?

ఏమై పోతాయి? న్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళకే ఉంటాయ్. దొంగ సొత్తు అయితే తెలంగాణా గవర్నమెంటు జప్తు చేస్తది.

మరి మలక్ పేటలో ఇస్త్రీ చేసుకుని బతుకుతున్న మన మద్దులేటిని ఎలగొడతారట గదా?

పొట్టలు గొట్టేవాన్ని ఎలగోడతారంటే నమ్మొచ్చు, కాయ కష్టం చేసుకుని బతికేవాన్ని ఎవరేమంటార్రా?

అయినా సరే! హైదరాబాదు వాళ్లకు వదిలి పెట్టాలంటే బాధేస్తుంది బాబాయ్! 

 ఒరే! తిరుపతి వెంకటేశుడికి కోట్ల ఆస్తి జమ పడింది కదా? అదంతా ఒక్క ఆంధ్రోల్లదేనా?

ఎందుకవుద్ది? తెలంగాణా వాళ్ళు, తమిళులు, కన్నడులు, ఉత్తర భారద్దేశం వాళ్ళు కూడా వచ్చి కానుకలు వేస్తారు కదా?

మరి మా ఆస్తులు ఇక్కడ పొగడ్డాయి కాబట్టి తిరుపతి మాదే అని ఎవరైనా అంటే ఎలాగుంటది?

రక్తం మరుగుద్ది? నాలుగు తన్నాలనిపిస్తది?

మరి హైదరాబాదు కావాలంటే వాళ్ళకే మనిపిస్తది?

నిజమే బాబాయ్!!

No comments:

Post a Comment