Saturday, August 3, 2013

KCR ఏమన్నాడు?

KCR ఆంధ్రోల్లని వెళ్లి పొమ్మని అన్నాడట. కాదు కాదు పంపించి వేస్తాం అన్నాడట. అది కూడా కాదు జాగో భాగో అన్నాడట. ఇదీ నిన్నటి నుంచి సీమాంధ్ర మీడియాలో మారు మోగుతున్న వార్త.

అసలు KCR అన్నదేంది?

NGO సంఘాలు రాష్ట్ర ప్రకటన వచ్చిన సందర్భంగా ఆయనను అభినందించడానికి వెళ్ళినప్పుడు ప్రసంగిస్తూ, వారిని ఉత్తేజ పరిచే సందర్భంలో అన్నమాటలు అవి. ఏమన్నాడో కింది వీడియో చూడండి.



ఇంతకీ ఆయన ఏమన్నాడు? రాష్ట్రాలు వేరు పడ్డ తర్వాత ఆంధ్రా ఉద్యోగులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలని. వారికి ఇక్కడే తిష్ట వేయడానికి ఆప్షన్లు ఏమీ ఉండవని.

దానిలో అంత అనకూడని విషయం ఏముందో సీమాంధ్ర మీడియాకే తెలియాలి. కోతికి కొరివి దొరికినట్టు ధర్నాలు చేస్తున్న ఆంద్ర ప్రాంతపు ఉద్యోగులకే తెలియాలి.

అంటే వీరి ఉద్దేశం ఏమిటట? ఇంతకాలం తెరగా తెలంగాణా కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలు వెలగబెట్టింది కాక రాష్ట్రం విడిపోయినాక కూడా ఇక్కడనే తిష్ట వేయాలనా? ఆప్షన్లు అడిగితే హైదరాబాదు వదిలి వెళ్ళడానికి ఒక్కడైనా ఆప్షను ఇస్తాడా? మరి ఆంధ్రా ప్రభుత్వం నడిచేదేట్లా?

అయినా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా పది సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా హైదరాబాదు ఉంటుందని CWC ప్రకటనలో చెప్పనే చెప్పారు. అంటే ఆంధ్రకి చెందిన ఉద్యోగులు కూడా అప్పటి వరకూ హైదరాబాదులోనే కదా ఉండేది? కాకపొతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్యాలయాలలో హైదరాబాదులోనే పనిచేస్తారు. KCR చెప్పింది కూడా అదే. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోనికి వెళతారు, కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు మిగులు పోస్టులలో ప్రమోషన్లు వస్తాయి అని ఆయన చెప్పారు. దానికి అంట రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమిటి? కనీసం హైదరాబాదులో వున్నా ఆంధ్రా కార్యాలయానికి కూడా మారరా?

ఉన్న ఉద్యోగులను అందరినీ తెలంగాణలో వదిలించుకొని, ఆంధ్రాలో మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి, తద్వారా లబ్ది పొందాలనేది సమెక్కుడు వాదుల దురాలొచనగా కనిపిస్తుంది. ఇప్పుడు KCR మాటలతో అది కాస్తా బయట పడింది! తెలంగాణా వాదులారా పారాహుషార్!! రాష్ట్రం నిజమయ్యే లోగా మరెన్నో ఇలాంటి కుట్రలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త.

6 comments:

  1. pakkodu kasthapadi sampadinchi, nirminchi develop chestae appanamga dobbadaaniki langa gaallu, gudumba gaalu, somberigaallu ready ga vuntaaru.

    ReplyDelete
    Replies
    1. పక్కోడు సంపాదించింది బుక్కడానికి అలవాటు పడ్డం కాబాట్టే విడిపోవాలంటే మాకు ఏడుపొస్తుంది మరి!

      Delete
    2. కే.సి.ఆర్ గారు ఆప్షన్స్ లేవు అనడంతో ఆంద్ర ఉద్యోగులు పుండుమీద కారం చల్లినట్లుగా భావించి విరుచుకు పడ్డారనిపిస్తున్నది!ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ మాదే అనే ధోరణిలోనే ఇంకా ఉన్నారు!అది మారడానికి కొంచం సమయం పడుతుంది!పార్లమెంట్ లో తెలంగాణారాష్ట్ర నిర్మాణం బిల్లు పాస్ ఐ చట్టం అయ్యేదాకా మనం మౌనం వహించడమే మంచిది!ఉండవల్లిగారు తమ వాక్ చాతురితో బిల్లు పాస్ కానేకాదని పిచ్చివాడిస్వర్గం లో విహరిస్తున్నారు!ప్రజలని పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు!అది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది!వారికి ఆ దిగులు అవసరం లేదు!

      Delete
    3. సూర్య ప్రకాష్ గారు,

      ఈ దశలో తెలంగాణా మౌనంగా వుంటే, ఆ మౌనాన్ని అర్థాంగీకారంగా తీసుకుని హైదరాబాదును మొత్తంగా కబళించగల ఉద్ధండులు సిమాంధ్రులు. 1956 సంఘటనలు ఒకసారి పరిశీలించండి, లాబీయింగులో వారికి గల సమర్థత విశదమౌతుంది.

      !ప్రజలని పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు!

      గతంలో కూడా మనం అలాగే అనుకున్నాం. కాని పర్యవసానాలు వేరేగా మారాయి. మనం బిల్లు పాసయ్యే దాకా కాంగ్రేస్‌ని గాని మరొకరిని గాని నమ్మవలసిన అవసరం లేదు. ఉద్యమాన్నే నమ్ముకుందాం.

      Delete
    4. Absolutely correct.

      Delete
    5. @ surya prkash garu. Ante aa roju KCR alaani anakunda vunte APNGO lo samme digaka pothunde ani merru namuthunnaraa ? meeru anukunnatlu APNGO vudhoygula nirsanaku KCR matalu emathram karnam kavu avi oka vankaa mathrame ....

      Delete