కుహనా సమైక్యవాద డ్రామాలు మళ్ళీ మొదలైనయి. దానికి తోడు సీమాంధ్ర మీడియా డప్పు వాయిన్చుడు కూడా మొదలైంది. కుహనా అని ఎందుకనవలసి వస్తుందంటే, సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రల జరుగడమే. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నరంట. మరి ఇక్కడ సమైక్యతా కొరకు ఒక సర్పంచి, ఒక వార్డు మేమ్బరి కూడా చెయ్య లేదే? మరి గదేమి సమైక్యత? ఒక్కవైపే ఉండే సమైక్యతా ఏందో ఆ సమైక్య వాదులమని చెప్పుకునే మట్టి బుర్రలకు తప్ప ఎవ్వరికి అర్థం కాదేమో!
స్కూలు పిలగాండ్లతోని ఊరేగించుకుంట వాళ్ళు చేస్తున్న తాటాకు చప్పుళ్ళని పులి గర్జనల లెక్క చూపిస్తందుకు ఆంధ్ర మీడియా పడే పాట్లు చూస్తుంటే నవ్వాల్నో ఏడవాల్నో ఆర్థం అయితలేదు. ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామాలు చేస్తున్నరని నిముష నిముషానికి ఇచ్చే ప్రకటనలు, రాష్ట్రం రెండు ముక్కల కింద బద్దలైతున్నట్టు చూపెడుతున్న ఆనిమేశన్లు... చెప్ప తరం గాదు వాళ్ళ బాధలు.
A ని A లెక్క చూపెట్టే టందుకు బాధ పడే అవసరం లేదు. కాని A ని B లెక్కనో D లేక్కనో చూపెట్టాలె నంటెనే కష్ట పడవలసి వస్తది. ఆ సినిమా కష్టాలే ఇప్పుడు సీమాంధ్ర మీడియా పడుతున్నది. కడుపు రాకుండానే బిడ్డను కనేతందుకు పురిటి నొప్పులు పడుతున్నది. కాని ఆ చెప్పుట్లనే, చూపెట్టుట్లనే వాళ్ళ ఉద్యమాల అసలు రంగు దానంతట అదే బయట పడుతున్నది.
రాజీనామా లేఖలు దిగ్విజయ్ సింగుకు ఇచ్చినరట! రాష్ట్ర మంత్రులు ముఖ్య మంత్రికి ఇచ్చినరట! కొంతమంది బొత్సకు ఇచ్చిన్రట. మరి కొంతమంది ఫ్యాక్సు చేసిన్రట! ఎవనిగ్గావాలే ఈ ఊక దంపుడు?తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని ఇప్పుడు పసి పిల్లగానికి కూడా ఎరుకే, రాజీనామా ఎవరికిస్తే ఏ పద్ధతిల ఇస్తే ఆమోదించ బడుతదో! మరి సిగ్గు లేని సీమాంధ్ర మీడియాకు ఎందుకు అర్థంగాదు?
మనుషులు రాకపోయినా ఉన్న కొద్ది మందినే క్లోజప్ ల చూపిస్తరు. ఎక్కడన్న దిష్టిబొమ్మ తగులబడితే దాన్నొక దావానలం లెక్క జూమ్ చేసి మరీ చూపిస్తరు. ఆంధ్రా అంటుకున్నదన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తరు. గత నలభై ఎనిమిది గంటల్లో ఈ చానళ్ళు సీమాంధ్ర, హింస అన్న పదాలను కలిపి ఎన్ని సార్లు వాడాయో లెక్క లేదు. వాటికి ఇప్పుడు సీమాన్ధ్రలో హింస కావాలె. అది జరుగుత లేనందుకు అవి పిచ్చెక్కి పొతున్నయి. ఎట్లనన్న రెచ్చ గొట్టాలె నని అవి చేయని ప్రయత్నం లేదు.
కాని వీటికి అతీతంగా మెజారిటీ సీమాంధ్ర ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నరు. ఒక ప్రాంతం ప్రజల వత్తిడి ద్వారా రెండు ప్రాంతాలను కలిపి వుంచడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనీసం ఆ ఒక ప్రాంతపు ప్రజల మద్దతు కూడా లేని ఇలాంటి సిగ్గు మాలిన ఉద్యమాలు ఎన్నటికీ కొసెల్ల జాలవు.
idantha self experience la vundi. meeru chesinadanta cheptunnava. atmahatyala donga lekkalu, hatyalu chesi, vaatini amaraveerula lekkalo choopinchidam, pakkavaadi meeda padi edvadam, pakkavaadu kastapadi sampadiste adi els laakuvovaala . chaala manci, goppa culture. these hallmarks of your culture taagubothu culuture
ReplyDeleteబ్రదర్,
ReplyDeleteతెలంగాణా వారు తమ రాష్ట్రం కొసం న్యాయ పోరాటం సాధించుకున్నరు. తమ రాష్ట్రం తాము బాగు చేసుకునే దమ్ము లేక పక్కవాడి మీద ఏద్చేది ఎవరో తెలియడం లే?
మీ సంపాదన ఎవరూ లాక్కోలేదు. పక్కోడి పొట్ట గొట్టి మెక్కడం అది సమెక్కుడు వాదుల యావ.
taagubothu culuture
తలసరి మందు వినియోగం ఎక్కడ ఎక్కువో తెలుసుకొని మాట్లాడు.
ఇక ఆత్మహత్యల సంగతి మాట్లాడే తాహతు మీకు లేదులే, పొట్టి శ్రీరాములునే పొట్ట బెట్టున్న మహానుభావులు మీరు!
taagubothugaadu aadina dramaki, hatyalu, atmahatylau, taagubothula chaavulu anni donga lekkalu, abaddhalu illekki aravadam pakkodi meeda padi edavadam langa galla culture. anduke nizam tokki moola koorchopettadu
ReplyDeleteఅరవై ఏళ్లుగా కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాదును కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే అనుభవించాలని కోరుకోవడం మీకు తప్పని అనిపించడం లేదు. ఇప్పటిదాకా తెలంగాణా వెనకబడిందనే నెపంతో ఉద్యమం చేశారు. వెనకబాటుతనం లేదని తేలడంతో ఆత్మ గౌరవమనే నినాదాన్ని అందుకున్నారు. తెలంగాణ ప్రజలు పట్టించుకోకపోవడంతో సీమాంధ్రులు దొంగలనీ, దోపీడీ దార్లని విషం కక్కారు. నిజంగా దోపీడీ జరుగుతుంటే అడ్డుకోలేనంత దద్దమ్మలు కాదు తెలంగాణా ప్రజలు. మీ నాయకులు ఉన్నారు. చట్టాలు ఉన్నాయి. కోర్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉంది. దోపీడీ జరిగిందన్న ఆధారాలు చూపించి నిలదీయండి, కేసులు పెట్టండి. జైళ్లకు పంపించండి. అవేమీ చేయరు. జస్ట్ మేం దొంగలనే ముద్ర వేస్తున్నాం అంటారు అంతే. రాష్ట్రం అంతా ఒకటిగా ఉన్నపుడు రాజధాని మనదేనన్న భావనతో ఇక్కడికి తరలి రావడం, ఇళ్లు, ఆస్తులు కొనుక్కోవడం తప్పెలా అవుతుంది? వాళ్ల కష్టార్జితంతో వాళ్లు బాగు పడుతుంటే చూడలేని ఓర్వలేని తనం మీది. మీలాంటి వాళ్లను ఉపయోగించుకుని కేసీఆర్ లాంటి దొరలు బాగుపడతారు. అయినా తెలంగాణా వచ్చేసిందిగా. మహా అంటే రెండేళ్లు, అప్పటికి మీకు వాస్తవాలు తెలిసి వస్తాయి. ఇంటికో ఉద్యోగం, భారీగా జీతాలు అంటూ అర చేతిలో వైకుంఠం చూపించిన సంగతి అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం అర్థం చేసుకుంటే మంచిది. చదువుకుంటే, ప్రతిభ ఉంటే ఎవరైనా ఎక్కడైనా బాగుపడతారు. ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయనే భ్రమల్లో బతక్కండి.
ReplyDelete@Anonymous
Deleteనువ్వు అరవయ్యెళ్ళ క్రితం అరవొళ్ళు తన్ని తగలేస్తె కర్నూలు టెంట్లలో బతకలేక వట్టి చేతులతో మా పనచన చేరినోనివి. చేరినోనివి ఊరుకోక మా మీదనే పెత్తనం చేసుకుంట మమ్మల్నే ముంచుడు మొదలు పెట్టినవు. మా నీళ్ళు, మా నిధులు కొళ్ళ గొట్టినవు.
మాది ఎప్పుడూ వెనుకబడ్డ నినాదం కాదు. మా సంపన్నమైన తెలంగాణాని దోపిడీ మూకలు కొళ్ళగొట్టాయన్నదే మొదటినుండీ మా నినాదం.
దోపిడీని అడ్డుకునే ధైర్యం, రాజకీయ చైతన్యం తెలంగాణాలో వున్నా, ఈ ప్రజాస్వామ్యంలో మంద మెజారిటీదె పై చెయ్యి. అందుకనే మా వాళ్ళు గత అరవై సంవత్సరాలుగా అసహాయంగా వుండి పోయారు, మీవాళ్ళు నీళ్ళు, నిధులు దోచుక పోతుంటే.
అరవై యేళ్ళకింద వట్టి చేతులతో ఇక్కడికి వచ్చినందుకే నీకు ఇంత బాధ కలిగితే, నాలుగొందలెళ్ళుగా మా రక్తం చెమట కలగలిపి నిర్మించుకున్న సిటీని మీరు పందికొక్కుల్లాగ తొలుస్తుంటే మాకెంత బాధ కలగాలి? దాని ఫలితమే తెలంగాణా ఏర్పాటు.