Tuesday, August 20, 2013

సమైక్యత అంటే?

సమైక్యత కోసం గత కొన్ని రోజులుగా సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమాలు మిథ్యమాలే అన్న విషయం బట్ట బయలు కావడం ఒక కోణమైతే, కనీసం వాటినయినా ఎందుకు చఎతున్నారన్నది బయట బడడం మరో కోణం.

సమైక్యవాద ఉద్యమ కాలులమని చెప్పుకునే వారు మాట్లాడే మాటల్లో సమైక్యత అన్న పదం మొదటి వాక్యంతోనే ఆవిరయి పోతుంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆకాంక్ష రెండో వాక్యంలో తొంగి చూస్తుంది. ఇక మూడో వాక్యంలో 'హైదరాబాదు మాదే' అన్న సామ్రాజ్యవాద రాక్షసత్వం గోచరిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు, నీళ్ళు నిధులు అన్న పదాలు అలవోకగా తొంగి చూస్తుంటాయి.

ఇంకా అర్థం కాలేదా? సమైక్యత అంటే వీరి దృష్టిలో హైదరాబాద్, ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు. సరే, వారు చెప్పే వాటిలో ఎంతవరకు నిజాయితీ వుందో పరిశీలిద్దాం.

హైదరాబాదును వారు ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకు రాలేదు ఇప్పుడు అడగడానికి. అది తెలంగాణాప్రాంతం యొక్క అంతర్భాగం. అంతర్భాగం గానే వుంటుంది. వారు ఇక్కడికి వచ్చేటపుడు హైదరాబాదును చూసే వచ్చారు. హైదరాబాదు లేక పొతే కనీసం కలిసే ఆలోచన కూడా చేసేవారు కాదు. హైదరాబాదులో వున్న రాజభవనాలపై ఎంత మక్కువ చూపెట్టారో ఆనాటి ఆంధ్రా అసెంబ్లీలోని ప్రసంగాల పాఠాలను గమనిస్తే అర్థమౌతుంది. హైదరాబాదు పై మక్కువతో కొన్ని షరతులకు అంగీకరించి ఇక్కడికి వచ్చినవారు, ఆ షరతులను నిలబెట్టుకోలేక పోయారు. అందుకే వారు నేడు వెనుదిరిగి పోవాల్సి వస్తుంది.

ఇక ఉద్యోగుల విషయంలో వారు ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణా ఏర్పడ్డాక ఎవరి ఉద్యోగులు వారి ఆఫీసులలో పని చేయొచ్చు గదా? ఇక్కడనే వుంది అసలు కిటుకు! అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడి 80%కి పైగా అన్ని ఆఫీసులలోను వారే తయారయ్యారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రా ప్రభుత్వంలో అందరికీ చోటు లేకపోతే వారి గతేమిటి? కొత్త ప్రభుత్వం అధిక మొత్తంలో ఉన్న ఉద్యోగులను భరిస్తుందా? లేక రిట్రెంచి చేసి తీసి వేస్తుందా? ఈ విధ్యమైన భయాందోళనల వలన ఈ సమైక్య ఉద్యమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొంటున్నారు.

నిజానికి వారి ఆందోళనలో న్యాయం వుంది. కాని నిజాయితీగా వారి భయాలను వెల్లడించినప్పుడే దానికి విలువ కలుగుతుంది. కాని వారిది  'ఇదీ' అని చెప్పుకోలేని బాధ. చెప్పుకుంటే ఇన్నాళ్ళు తాము తేరగా అనుభవించిన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల అవకతవకల వ్యవహారాలు నిజమే నని ఒప్పుకొవాలి. ఒకవైపు అవినీతి పెంటమీద కూచుని, న్యాయం చేయమని ఎలా డిమాండు చేయగలరు? అందుకే వారు మాట్లాడగలిగిన ఒకే ఒక మాట 'సమైక్యాంధ్ర'. ఉంగరం ఆఫీసులో పోగొట్టుకొని వీధిలో వెతికితే దొరుకుతుందా? అలాగే వారి సెక్రెటేరియట్ రహస్యాలు బద్దలు కాకుండా న్యాయం జరగడం అసాధ్యం.

ఇక పొతే నీళ్ళ గురించి వాళ్ళు చేసే వాదన. సమైక్యంగా ఉన్నన్ని రోజులు తెలంగాణా వాదులు 'మా నీళ్లన్నీ మీరే దోచుకుంటున్నారు బాబో' అని అరుస్తున్నప్పుడు, తాపీగా 'నీరు పళ్ళానికి పారక పొతే మెరక మీదకు పారుతుందా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టే వెసులు బాటు లేక పొతే ముఖ్యమంత్రులు మాత్రం ఏం చేయగలరు?' అని పలికారు. ఇప్పుడేమో, తెలంగాణా ఏర్పడితే కృష్ణ, గోదావరి నదులు బిరడలు వేసి బిగిస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అప్పుడు వీలు కాని ప్రాజెక్టులు ఇప్పుడెలా వీలవుతాయో మాత్రం చెప్పరు. దానర్థం ప్రాజెక్టులు కట్టే వెసులుబాటు ఉండీ  తెలంగాణాను ఇంతకాలం ఎండబెట్టామని ఒప్పుకున్నట్టే కదా? వారి అసలు బాధ ఏమంటే అలవోగ్గా పారించుకుంటున్న అదనపు జలాలను ఇప్పుడు తెలంగాణాతో దామాషా ప్రకారం పంచుకోవలసి రావడమే.

ఇక పొతే నిధుల విషయం. రాష్ట్ర ఆదాయంలో 35% హైదరాబాదు నుండే వస్తుంది. అదీ వీరి పాయింటు. ఈ విషయంలో వారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కాదు 1956లో హైదరాబాదు కలిసినప్పుడు కూడా భారత దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. అంతే కాక హైదరాబాదుకు మరో ప్రత్యేకత వుంది. హైదరాబాద్ చుట్టూతా, లోపలా నిజాం ముందు చూపుతో ఏర్పాటు చేసిన సర్ఫేకాస్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ విలువైన భూముల వలననే అనేక ప్రాజెక్టులు హైదరాబాదుకు వచ్చాయి. ఒక వేళ అలాంటి భూములు మరేదైనా సీమాంధ్ర పట్టణంలో వుండి వుంటే తప్పకుండా అక్కడే అభివృద్ధి జరిగి వుండేది.

సీమాంధ్ర నాయకులు చేసిందల్లా అలాంటి విలువైన భూములను పందేరం పెట్టి, తమ అనుయాయులకు ఉపభోక్తం చేయగా మిగిలిన దానిలో కొంత పెట్టుబడిదారులకు రిబేటుగా ఇవ్వడమే. అదీ తాము చేసిన అభివృద్దే అని చెప్పుకుంటే అంతకన్నా అపహాస్యం మరోటి ఉండబోదు.

ముందే చెప్పుకున్నట్టు 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. ఇప్పుడు ఆ ఐదో సస్థానానికి బెంగుళూరుతో పోటీ పడవలసిన దుస్థితి. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో ఎప్పుడూ హైదరాబాదుడి సింహభాగమే. కాబట్టి హైదరాబాదు ఆదాయాన్ని ఆంధ్రాలో కర్చు పెట్టి ఉంటారు తప్ప, ఆంధ్రానుంచి తెచ్చి హైదరాబాదుకి ఒక పూచిక పుల్ల కూడా కర్చు పెట్టి ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయవలసి వస్తే తెలంగాణాకే సీమాన్ధ్రులు ఎదురిచ్చుకోవలసి వస్తుంది.

ఇప్పుడు బోధపడి ఉంటుంది కదూ సమైక్యత అంటే ఏమిటో? సమైక్యత అంటే వెళ్లేముందు అందినంత దోచుకొని వెళ్ళడం. దానికోసమే ఈ పెట్టుడు మిధ్యమాలు. 

3 comments:

  1. చాలబాగా చెప్పారు. కాని వాస్తవాలను ఎ ప్రాంతం వాళ్లు ఒప్పుకోవటం లేదు. 1956 లో హైదరాబాదు పెద్ద నగరమే కావచ్చు, కాని అభివృద్ధిలో మాత్రం కాదు. నిజాములు నగరాన్ని నిర్మించారే కాని అభివృదికి దోహదపడే రకంగా పరిపాలన అందించలేదు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ప్రతి సంస్థ విలీనం తరువాత వచినవే. విలీనం కాకపోతే కూడా వచ్చేవి అంటారా? తప్పకుండ వచ్చేవి. కాని ఇప్పుడు ఉన్న సంక్యలో కాదు. ఆ నగరం అన్ని ప్రాంతాల వారి శ్రమ పలితమే. కాకపోతే అందరికి అది సమానంగా అందలేదు.
    ఇక హైదరాబాదు ఆదాయం అంటారా. అది 2012లొ $11 billion.per capita income 44000. ఇదంతా గోవేర్నమేంట్ ఉద్యోగులు వల్ల వచ్చింది మాత్రమేనా? రాష్ట్రం పన్ను ఆదాయంలో హైదరాబాదు ది 30%. ఇంత ఆదాయ పన్ను ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిందేనా? కానే కాదు. అక్కడ నెలకొల్ప బడిన IT, ITES ,BPO, Biotech, Pharma కంపెనీల నుండి వచ్చింది. 1995 కి ముందు హైదరాబాదు ను దేశంలో ప్రముక నగరంగా ఎవరూ గుర్తించ లేదు. దక్షిణ భారతదేశం అంటే మద్రాసు మాత్రమే. మరి ఆ తరువాత ఏమి జరిగి హైదరాబాదు ఇంత అభివృది చెందింది? IT revolution అన్నది రాక పోయింటే, మన హైదరాబాదు పరిస్థితి ఇలా వుండేదా? కాదు కాదు ,అసలు తెలంగాణా కావాలని కెసిఆర్ అడిగేవాడ? ఇప్పడు సీమంధ్ర వాళ్ళు అడుగుతున్నది కూడా ఈ సంస్తల వల్ల వచ్చే ఆదాయం గురించే.

    ReplyDelete
    Replies
    1. >>>నిజాములు నగరాన్ని నిర్మించారే కాని అభివృదికి దోహదపడే రకంగా పరిపాలన అందించలేదు.

      దీన్ని ఇలా చెప్పుకుంటే బాగుంటుంది. నిజాంలు నగరాన్ని అభివృద్ధి పరచారు తప్ప తెలంగాణాను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణా ప్రజల శ్రమను దోపీడీ చేసి నగరాన్ని నిర్మించారు. అందుకే ప్రజాగ్రహానికి గురై, పరారై పోయినారు. మరే ఇతర రాజులకు ఈ గతి పట్టలేదు.

      కాని వారు హైదరాబాదును మాత్రం దేశంలో ఐదో పెద్ద నగరంగా అభివృద్ధి చేశారు. బ్రిటిషేతర ప్రభుత్వం వున్న ఏ ఇతర భారతీయ నగరం ఇంతగా అభివృద్ధి కాలేదు. అప్పటికే హైదరాబాదులో అల్విన్, ప్రాగా టూల్స్ లాంటి భారీ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కర్మాగారం, రోడ్డు రవాణా సంస్థ, రైల్వే, టంకశాల మొదలైనవి స్థాపించారు. ఆ కాలంలోని ఇతర నగరాల అభివృద్ధితో పోల్చితే హైదరాబాదు చాలా గొప్ప స్థితిలోనే వుంది.

      మీరు చెప్పిన ఫార్మా IT పరిశ్రమలు చంద్రబాబు దేహీ అని జోలె పట్టి తిరిగితే రాలేదు. ఇక్కడి వాతావరణం, ఇక్కడ వున్న అపారమైన ఖాలీ భూములు, నైపుణ్యత గలిగిన కార్మికుల వల్లే వచ్చాయి. Business viability లేకుండా ఎంత మూర్ఖులు కూడా పరిశ్రమలు ఊరికే స్థాపించరు.

      హైదరాబాదు ముమ్మాటికి గొప్పనగరమే. అది తెలంగాణా అంతర్భాగం. అది మాది అని చెప్పుకునే హక్కు మాకుంది. వచ్చినప్పుడు ఉత్త చేతులతో వచ్చి, మళ్ళీ ఆ నగరాన్నే పీల్చి పిప్పి చేసిన వారికి దాన్ని గురించి మాట్లాడే హక్కు కూడా లేదు.

      Delete
  2. something wrong with samaikya udyamam. neellu lekapothe nashtapoyevallu raithulu ? kaani employes enduku chestunnaru? Political ga seemandhra lo balam kosame parteelu try chestunnaii.prajala meeda,
    pranthaala meeda antha prema undaa evarikaina ? prantham ,kulam ,desam ivanni kadupu nindi khaaliga undi
    prajalani amayakulani chese kaburlu.

    ReplyDelete