Saturday, August 10, 2013

విభజన సమస్యలు

రాష్ట్రంలో ఒకపక్క మాత్రమే వినిపించేది ఏమిటి?

అ. సమైక్యవాదం
ఆ. ప్రత్యేకవాదం

KCR వేర్పాటువాది అయితే, మరి పొట్టిశ్రీరాములు ఏమవుతాడు?

అ. వేర్పాటువాదే!
ఆ. వేర్పాటువాది కాదు.

రాష్ట్రంలో సరైన దామాషాలో ఉద్యోగాలు ఇచ్చి వుంటే విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం వారికి ఎక్కువ ప్రమోషన్లు వస్తాయి? ఏ రాష్ట్రం వారికి ప్రమోషన్లు, అవకాశాలు పోతాయి?

అ. ఇద్దరికీ ప్రమోషన్లు, అధికారాలు వుంటాయి.
ఆ. ఒక ప్రాంతం వారికి అధిక ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తే, వేరొక ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుంది.

రాష్ట్రంలో నదీజలాలను ట్రిబ్యునళ్ళు చెప్పినట్టుగా వినియోగించి వుంటే విభజన సందర్భంలో నీటి పంపకంలో వచ్చే సమస్యలు ఏమిటి?

అ. సమస్యలు వచ్చే అవకాశం లేదు.
ఆ. చాలా చాలా ఊహించ లేనటువంటి సమస్యలు వస్తాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే రాజధాని తెలంగాణలో ఉండాలా? ఆంధ్ర లో ఉండాలా?

అ. ఆంధ్రలో.
ఆ. హైదరాబాదే రాజధానిగా వుండాలి.

మీ సమాధానాలలో (అ)లు ఎన్నున్నాయో (ఆ)లు ఎన్నున్నాయో ఒకసారి చూసుకోండి.

6 comments:

  1. 1.శ్రీ.పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవి అయ్యారు.. అన్ని ప్రాంతాల వారూ ఆదరించారు.. తమిళ వారు గాని కేంద్రం లో నాయకులు గాని వ్యతిరేకించలేదు.. తక్షణం తెలుగు వారికి సమగ్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.. కె.సీ.ఆర్ దొంగ దీక్ష సంగతి అందరికీ తెలుసు.. విరమించిన గానే ఉస్మానియ యూనివర్శిటీ విధ్యార్ధులు దిష్టిబొమ్మ దహనం చేసిన తర్వాత ఆసుపత్రిలో డ్రిప్ లు ఎక్కించుకుని దొంగ దీక్ష చేసాడు.. అందుకు మీ తెలంగాణా వాళ్ళే సాక్షి..
    2. పొట్టి శ్రీరాములు కొడుకు గాని, కూతురు గాని, మేనళ్ళుడు గాని వుద్యమంలో వుండి బలవంతపు వసూళ్ళు చెయ్యలేదు.. కోట్లు ఆర్జించలేదు..
    3. తెలంగాణా వుద్యమానికి తెలంగాణా ముస్లిములు, ఇతర స్థానికుల మద్దతు లేదు..
    4. మద్రాసుకి, ఆంధ్రాకి నదుల మధ్య గొడవలు లేవు.. మన తెలుగు గంగ ద్వారానే వారికి మంచినీరు అందుతోంది..
    5. మద్రాసు నుండి తెలుగు వాళ్ళని తరిమివెయ్యలని జాగో బాగో అనే కె.సీ.ఆర్ లాంటి నాయకులు లేరు.. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత తెలుగు ప్రముఖ్ హీరోయిన్...ఇప్పటికీ మద్రాసులో తెలుగు వాళ్ళే ఎక్కువ.. మన ఆంధ్రా/ తెలంగాణా ముఖ్యమంత్రులు బతిమాలక పోతే, అనేక రాయతీలు, స్టూడియో స్థలాలు ఇవ్వకపోతే ఇప్పటికీ సినీ పరిశ్రమ అక్కడే వుండేది..
    6. ఆంధ్ర ప్రదేశ్ లోని (శ్రికాకుళం నుండి సీమ వరకూ) ప్రతీ ఒక్కరి నెత్తురు చుక్క హైదరాబద్ అభివృధ్ధిలో ఖర్చు అయ్యింది..
    చాలా ఇంకా కావాలా...

    ReplyDelete
    Replies
    1. @వోలేటి

      పొట్టిశ్రీరాములు చనిపోయింది 1953లో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పదడింది 1953లో. అది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్న నీ అవివేకానికి నా జోహార్లు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956 నవంబర్ 1 న.

      నిజమే KCRను అరెస్టు చేసి డాక్టర్లు బలవంతంగా డ్రిప్ ఎక్కించారు. కాని మీ పొట్టిశ్రీరాములు ఆకలితో చివరి దశలో 'అన్నమో రామచంద్రా' అని అడుగుతున్నా మద్రాసుపై యావతో (ఇప్పటి హైదరాబాదు మీది యావ మాదిరిగానే) పచ్చి మంచితీర్థం కూడా అందించలేదు మీవాళ్ళు. అదీ మీ నీతి, మనిషి ప్రాణాలకన్నా, డబ్బు, పెట్టుబడులు ముఖ్యం మీకు.

      అప్పుడు కూడా మీది సమెక్కుడు ఉద్యమమే, క్రిష్ణా కావేరి ప్రాజెక్టు గండి కొట్టి మీరు పారించుకోవడానికి ఏసిన ఎత్తుగడే ప్రత్యేకాంధ్ర ఉద్యమం అని దేశమంతా తెలుసు! ఎవరికి చెపుతారు మీ నీతులు?

      నిన్నెవ్వరు జాగో, భాగో అనలేదు? నీకు నువ్వే వందసార్లు అనుకొని ఇతరులను రెచ్చగొట్టి తన్నించుకుందామనా? అంత చాన్సు నీకివ్వంలే వోలేటి! మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. నువ్వో నీ కిరణ్ కుమారో వచ్చి ఇక్కడ కర్రీ పాయింటో, కటింగ్ షాపో పెట్టుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. మా ప్రభుత్వ ఉద్యోగాలు, మా వాటా నీళ్ళు మా భూములు కబ్జా చేస్తానంటేనే మాకు అభ్యంతరం. అలాంటి వాళ్ళను జాగొ భాగో కాదు, కుక్కలను తరిమినట్టు తరుముతాం. నువ్వు వాళ్ళల్లో ఒకడివా?

      సినీ పరిశ్రమకి రాయితీలిచ్చారా? అవి నీ ఆంధ్రా నుంచి తెచ్చిన భూములా? తేరగా వున్న తెలంగాణా రిజర్వు భూములను కమీషన్లు తీసుకుని ఇష్టం వచ్చినట్టు పందేరం పెట్టడం కూడా గొప్పే?

      చరిత్ర ఓసారి తిరగెయ్యండి, మీరు అక్కడి వారిని తరిమికొట్టాలని లూటీలు దొమ్మీలకు దిగినప్పుడే మద్రాసు వారు మిమ్మల్ని సాగనంపారు, సగౌరవంగా.

      శ్రీకాకుళం నుంచి కడప వరకూ, ప్రతి ఆంధ్రా వాడూ ఇక్కడికి వచ్చి వాడే బాగు పడ్డాడు తప్ప, ఈ ప్రాంతపు అభువృద్ధికి చేసింది శూన్యం. కాదని ఒక్కటి నిరూపించగలవా వోలేటీ?

      ఇంతకీ తమరు మీ పొట్టిశ్రీరాములు వేర్పాటువాదా, సమైక్యవాదా చెప్పకుండానే పలాయనం చిత్తగించినట్టున్నారు!!

      Delete
  2. కె.సీ.ఆర్ దీక్ష విరమించి హాస్పిటల్ కి వెళ్ళ కుండా వుంటే మీరే చంపేసి వుండేవారు..
    మీ తెలబాన్ నాయకుడు శ్రీమాన్ కరాచా గారు రాసిన చరిత్ర మాకు తెలీదు.
    భారత దేశానికి 1947 లో స్వతంత్రం వచ్చినా తెలంగాణా సంస్థానానికి చీకటి రాజ్యం పోలేదని తెలుసు..నిజాం మనుషులు కుక్కల్లాగ, పందుల్లాగ తరిమి తరిమి కొట్టాడని తెలుసు..
    కృష్ణ, గోదావరికి గండి గొట్టకుండానే ఆంధ్రా లోకి వచ్చిపడుతోంది.. చైనా గోడంత ఎత్తుకట్టినా నీరు మీ భూమి తడపదు.. డ్రిప్ ఇరిగేషన్ కి కరెంటు శ్రీ కరాచా గారు జేబులోంచి ఇస్తాడు.. ఫర్వాలేదు..
    తెలంగాణా ఏర్పడ్డాక చీకటి రాజ్యంలో బడ్డీ కొట్టు పెట్టుకున్నా కొనుక్కోడానికి ఎవరూ వుండరు మీకు అక్కడ..
    తెలంగాణాకి చెందిన పిల్లలు ఇప్పటికే చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో చదువుకుంటు (కొంటు)న్నారు).. వుద్యమం దయవలన.. పరిశ్రమలు అన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, రియల్ ఎస్టట్ పడిపోయింది..వర్తమానం, భవిష్యత్తు కాక చరిత్రను తవ్వుకొని వెనక్కి వెళ్ళండి ఎవరు వద్దన్నారు.. బతికే వాడు ఎక్కడైనా బతుకుతాడు.. కాని హైదరాబాద్ మీద అందరికీ సమాన హక్కు వుంది.. మీ కిరణ్ (హైదరాబాద్), మీ విజయశాంతి, మీ ఐలయ్య గారి మాటలు చెవియొగ్గి వినండి.. ఇలా అందర్నీ తిడుతూ వుంటే ఎప్పటికీ తెలంగాణా రాదు..

    ReplyDelete
    Replies
    1. నువ్వన్నయే కరెక్టనుకుందాం కాసేపు. ఎల్లిపోతానికి అంత ఏడుపెందుకే వోలేటి? ఆంధ్రోల్లంత ఒక్కతీర్గ ఏడ్వబట్టింరు. ఇంత విషం కడుపుల పెట్టుకోని సంకలు గుద్దుకుంట ఎల్లిపోక, దొంగ సమైక్యాంధ్ర ఉద్యమాలెందుకు?

      Delete
  3. "ఎల్లి" పోతామని అన్నోళ్ళూ ఎల్లిపోయి మరెక్కడనో రాజధాని పెట్టుకోక కేవలం హైదరాబాద్ కోసమే దొంగ వేర్పాటు వుద్యమాలు ఎందుకో...

    ReplyDelete
    Replies
    1. తెలంగాణోళ్ళు తెలంగాణకోసం ఉద్యమం చేసిన్రే ఓలేటి! ఎప్పుడన్న ఆంధ్రప్రదేష్ మ్యాపుల హైదరాబాద్ ఎక్కడున్నదో చూసినవా? నువూ హైదరాబదుకి ఎట్నించి రావాల్నన్నా తెలంగాణలనించి 200 కిమీ నడువాలె. సమైజైందా తెలంగాణ ఎవరిదో.

      నువ్వు 1956ల వచ్చేటప్పుడు హైదరాబాదుని చెన్నై నించి పట్కరాలే, ఇప్పుడు తీసుక పోనీకి. అయినా గూడ సిగ్గులేకుండ మీ సమెక్కూడు వాదులు హైదరాబాదు మీది ఆశతోటి గాదు ఉద్యమం నటించేది? దొంగే 'దొంగా దొంగా' అని అరిచినట్టుంటయి మీ తొండి మాటలు.

      Delete