Thursday, August 15, 2013

ఇందుకేనా ‘సమైక్యం’

-అడ్డగోలు పోస్టింగ్‌లు.. పదోన్నతులు
-మంత్రి శైలజానాథ్ భార్య మోక్ష ప్రసన్న ఎదిగిన వైనం
-నిబంధనలు తుంగలో తొక్కి పోస్టింగ్‌లు ఇచ్చిన అధికారులు
-డీఎంఈ సీనియర్లను పక్కన పెట్టిన వైనం

ప్రమోషన్లు త్వరగా వచ్చే డిపార్ట్‌మెంట్‌లోకి చేరిక

హైదరాబాద్ ఆగస్టు 14 (టీ మీడియా): ఆమె పేరు మోక్ష ప్రసన్న. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ సతీమణి. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, విభజించవద్దని మంత్రుల భార్యలను వెంటేసుకుని ‘రాజ్‌భవన్’ గడపెక్కారు. మంత్రుల భార్యల బృందానికి నాయకత్వం వహించిన మోక్ష ప్రసన్న రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని మీడియా ఎదుట తన భర్త చెప్పే మాటలనే వల్లించారు. అయితే మోక్ష ప్రసన్న ఎందుకు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు..? మంత్రుల భార్యల బృందానికి ఎందుకు నాయకత్వం వహించారు..? దాని కారణాలేంటీ..? రాష్ట్ర విభజన జరిగితే ఆమెకు జరిగే నష్టమేంటీ..?

ఉస్మానియా మెడికల్ కాలేజీలో అక్రమంగా పోస్టింగ్ పొందిన వారిలో మోక్ష ప్రసన్న కూడా ఒకరు. 


ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత రూరల్ సర్వీస్ పూర్తిచేసుకున్న ఆమె జనరల్ సర్జన్‌గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో పనిచేశారు. యథావూపకారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిహెచ్, ఎపీవీవీపీ నుండి కొంతమంది పీజీ పూర్తి చేసిన డాక్టర్లను సరెండర్ చేసుకుంది. అదే సమయంలో 2010 మే 30న ఎంఎస్ జనరల్ సర్జన్ పీజీ పూర్తి చేసుకున్న మోక్ష ప్రసన్న కేవలం వారం రోజుల్లోనే జూన్ మొదటి వారం 2010లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోస్టింగ్ తీసుకున్నారు. ఈ పోస్టింగ్ ఇచ్చింది అప్పటి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డీఎంఈ రవిరాజ్. మోక్ష ప్రసన్నను సరెండర్ చేసుకున్న తరువాత ఆమెకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్టింగ్ ఇచ్చారు.

ఎన్నో ఏళ్లుగా డీఎంఈ వైపు శ్రీధర్, జీవన్, శాలిని పనిచేస్తున్నప్పటికీ వీరిని కాదని మోక్ష ప్రసన్నకు పోస్టింగ్ ఇవ్వడం వెనుక కేవలం మంత్రిగారి భార్య అన్న కారణమే కనిపిస్తోందనే విమర్శలున్నాయి. మోక్ష ప్రసన్న డీఎంఈ వైపు సరెండర్ కాకముందు నుండే శ్రీధర్ కార్డియోథెరపీ, జీవన్ ట్యూటర్‌గా, శాలినీ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి తరువాత డీఎంఈ వైపు సరెండర్ అయిన మోక్ష ప్రసన్న మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన తేదీ నుండే సీనియారిటీని లెక్కలోకి తీసుకుంటారు. ట్యూటర్లుగా, రీసెర్చ్ అసిస్టెంట్లుగా డీఎంఈ వైపే పనిచేస్తున్నా.. సీనియారిటీని లెక్కలోకి తీసుకోరు. దీంతో మోక్ష ప్రసన్న ఇకపై అన్ని ప్రమోషన్లలోనూ ముందుగానే వెళ్లిపోతారని నష్టపోయిన వైద్యులు చెబుతున్నారు.

త్వరలోనే డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ...?


రాష్ట్రంలోని మొత్తం 14 మెడికల్ కాలేజీలుంటే కేవలం ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాత్రమే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్ ఉంది. నిబంధనల ప్రకారం అయితే ఆమెను ఆ డిపార్ట్‌మెంట్‌కు పంపడం సాధ్యం కాదు. కానీ ఆ శాఖ మంత్రి ఒత్తిళ్ల మేరకు డీఎంఈ వసంతవూపసాద్ మోక్ష ప్రసన్నను గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్‌లోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్‌గా చేర్చారు. ఈ డిపార్ట్‌మెంట్‌కున్న అవసరం రీత్యా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ప్రమోషన్ పెరుగుతుంది. రెండేళ్ల తరువాత అసోసియేట్ ప్రొఫెసర్, ఆ తరువాత రెండేళ్లకు ప్రొఫెసర్‌గా మోక్ష ప్రసన్న ప్రమెషన్ పొందుతారు. ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె త్వరలోనే ఈ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఓడీగా మారుతారని తెలుస్తోంది. అసలామెను డీఎంఈ వైపు సరెండర్ చేసుకోవడమే నిబంధనలను తుంగలో తొక్కి చేసుకున్నారని, పైగా త్వరగా ప్రమోషన్లు వచ్చే డిపార్ట్‌మెంట్‌కు మార్చడం సీమాంవూధుల కుట్ర అని తెలంగాణ డాక్టర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలోని ఎపీఎన్జీవోలతో, సీమాంధ్ర ఉద్యోగులతో ఆందోళనలు చేయిస్తున్న మోక్ష ప్రసన్న తనకు లభించిన పదోన్నతులు ఎక్కడ పోతాయోనన్న భయం, ఇలాంటి దోపిడీ తన ప్రాంతం వారికి దక్కకుండా పోతుందనే భావనే ఆమె సమైక్యాంధ్ర ఉద్యమం చేయడానికి కారణమని నష్టపోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గవర్నర్‌ను కలిసిన మోక్ష ప్రసన్నకు తన ప్రాంతంపై అంత ప్రేమ ఉంటే అనంతపురానికి వెళ్లి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ మండిపడింది. నిబంధనల విరుద్ధంగా పోస్టింగ్‌లు, పదోన్నతులు పొందిన ఆమె ఇప్పుడు సమైక్య ఉద్యమం చేయడం దారుణమని సంఘం అభివూపాయపడింది. ఎంతో మంది తెలంగాణ డాక్టర్ల సీనియారిటీని తొక్కి పైకెక్కిన ఆమె ఇప్పుడు ఎపీఎన్జీవోలను రెచ్చగొడుతున్నారని, తనకు లభించిన అడ్డగోలు ప్రమోషన్లే మిగిలిన వారికి రావాలనే తలంపుతోనే ఈ ఉద్యమం చేస్తున్నారని టీజీడీఏ నేతలు అన్నారు.

No comments:

Post a Comment