Saturday, August 3, 2013

కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం

గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న సమెక్కుడు ఉద్యమాలను చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎలా వున్నా ఇక్కడి PCC ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి లకు ఈ ఉద్యమాన్ని కంట్రోలు చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లెదని. ఈ విషయం సమేక్కుడు చానెళ్ళ ఫూటింగులు చూస్తె ఈజీగా అర్థం చేసుకొవచ్చు.

తెలంగాణాలో చిన్న ధర్నా అయినా వేల సంఖ్యలో మొహరించే పోలీసులు అదే సీమాంధ్ర మచ్చుకైనా కనపడరు. పది మంది కలిస్తే విగ్రహ దహనాలు, ఇరవై మంది కలిస్తే రోడ్డు రొకోలు.



దహనాలకు పాల్పడుతున్నా, విగ్రహాలను కూలుస్తున్నా, పట్టుమని పదిమంది కలిసి క్యూలో నిలబడి హైవేపై రాస్తారోకో చేసినా పోలీసు అనే వాడు కనపడడం లేదు. కంపెనీలకొద్దీ బలగాలను సీమాంధ్రకు పంపించారని వార్తలు వచ్చాయి. ఏరీ? ఎక్కడా కనపడరే? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలంగాణలో పోలీసులు ఎలా వ్యవహించారో జనం ఇంకా మరిచి పొలేదు. కాబట్టి ఈ ఉద్యమం ప్రభుత్వం, పోలీసు పెద్దలు, సీమాంధ్ర మీడియా, పెట్టుబడి దారులు కలిసికట్టుగా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు.

ఇలాంటి పెట్టుడు ఉద్యమాలు అధికారికంగా నడిపిస్తూ మరోసారి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని ఈ మూకలు చివరి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి విరుగుడు మందు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సత్వర నిర్ణయాలు తీసుకోక తప్పదు.
  • ముఖ్యమంత్రికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అవసరమైతే మార్చాలి. 
  • DGP ని మార్చి మరో ఉత్తర భారతదేశానికి చెందిన ఎవరైనా నిస్పక్షపాత ఆఫీసర్ ని నియమించాలి. 
  • కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిన తాత్సారాన్ని విడనాడి, సత్వరమే వర్షాకాల సమావేశాల్లో తెలంగాణా ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టాలి. 
  • సీమాంధ్రకు క్యాపిటల్ ప్రకటించి సదరు కాంట్రాక్టుల బూచీ చూపి కొందరు పెట్టుబడి దారులను కట్టడి చెయ్యొచ్చు. కాంట్రాక్టర్ల దృష్టి మరలితే పెట్టుడు ఉద్యమం హుష్ కాకీ అని వేరే చెప్పవలసిన పని లేదు. 
  • సీమాన్ధ్రకు ఒక IIT, ఒక AIIMS లను ప్రకటించాలి. అవి ఎక్కడ పెడతామో చెప్పకుండా నాంచాలి. దాంతో మాకంటే మాకు అని పేచీలు పెట్టుకుంటూ ఉద్యమం సంగతి పక్కకు పెడతారు. 
పై ఎజెండా శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో చాప్టరు కన్నా వంద శాతం ఉత్తమమైనదని ఘంటాపథంగా చెప్పగలను. 


6 comments:

  1. gudumba land ki continous supply of gudumba ivvali. adi chaalu. endukantae vaalu somberulu kaabatti problem laedu. kottukune sakthi, interest kooda vundadu. endukantae basic ga lazy culture. ippudu pakka vaadi meeda padi edavadaani laedu. andukantae andaru gudumba taagi, gochilu kattukini dppulu vaayinchukoni gentutuntaaru.

    ReplyDelete
    Replies
    1. If you write such a lousy comments next time without substance, I will kick you out.

      Delete
    2. ఒరే వెధవల్లారా ఎందుకురా మీ బ్లాగుల్లో విషం కక్కుతున్నారు. తెలంగాణ అయితే ఏంటి? సీమాంధ్ర అయితే ఏంటి? ప్రజలంతా ఒక్కటే కదా... సోంబేరులనీ, లేజీ పర్సన్స్ అని, గుడుంబా చాలని.. అసలు మీకు సంస్కారం అంటూ ఉండి ఏడ్చిందా? సన్నాసుల్లారా? నేను కూడా తెలంగాణా వాడినే. కానీ మీలా నాకు సీమాంధ్రులపైన ద్వేషం లేదు. ఎందుకంటే వారితో సహజీవనం వల్లనే నాకు కొంచెం నాగరికత అబ్బింది. వాళ్లేం పాపం చేశార్రా మనకు? వాళ్ల ఆస్తులు అమ్ముకొని మన రాజధాని అనే భావనతో హైదరాబాదుకు తరలి వచ్చి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదే వాళ్లు చేసిన పాపమా? నిజాం కాలం దాకా ఎందుకు, స్వాతంత్ర్యం ముందు వరకూ మన పరిస్థితి ఎలా ఉండేది.. దొరల దగ్గర నీ కాల్మొక్తా బాంచెన్ అనే వాళ్లం. అన్న ఎన్టీఆర్ రాకతో మనకు చైతన్యం పెరిగింది. దొరల పెత్తనం మాయమయింది. చంద్రబాబు హైదరాబాద్ ను నంబర్ వన్ గా తీర్చిదిద్దారు. కాదనగలమా? వైఎస్ లేకపోతే మన బంజరు భూములు బంగారు భూములయ్యేవా? వాళ్లు ఇంతగా మనకోసం పాటుపడితే మనం మాత్రం వాళ్లను దోపీడి దారులన్నాం, దొంగలన్నాం. కానీ వాళ్లు మాత్రం జాతి మీద అభిమానంతో తెలుగువాళ్లమంతా కలసి ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ల గొప్పతనం. మనం మాత్రం చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాం. కేసీఆర్ కు ఇతర కొజ్జా కాంగ్రెస్ నాయకులకు పదవులు కావాలి. సొమ్ములు కావాలి. అందుకు విద్యార్థుల్లో వేర్పాటు వాదమనే విష బీజాలు నాటారు. తెలంగాణా భవన్ లో రెడ్యానాయక్ కు కేసీఆర్ చేసిన సన్మానాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆలె నరేంద్ర పరిస్థితి ఇపుడెలా ఉందో మనకు తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా వానపాము లాంటి జేపీని కేటీర్ చితక్కొట్టాడు. ఇదీ మన దొరల ప్రవర్తన. ఇపుడు మళ్లీ తెలంగాణా పేరుతో మనం వాళ్ల కాళ్ల కింద చెప్పులుగా మారిపోబోతున్నాం. అంతా మన ఖర్మ. మీలాంటి వాళ్లెపుడూ మారరు. మనసుల నిండా విద్వేషాలు, విషం చిమ్ముతున్నారు కదరా... కాంగ్రెస్సేదే మనకు మేలు చేసిందని మురిసిపోతున్నాం కానీ సన్నాసిగాంధీని పీఎమ్ చేయడానికి మన తెలుగుజాతిని నిలువునా చీల్చిందనే సంగతిని మనం మర్చిపోతున్నాం. తెలంగాణ వాళ్లకి బుర్రల్లేవనే ఎపుడో వెధవలు అన్న మాటల్ని మనం ఇవాళ నిజం చేసి చూపిస్తున్నాం.. తెలంగాణా వాడిగా తెలుగు జాతి ఐక్యతను కోరుకునే వాడిగా తెలుగు జాతికి జిందాబాద్ కొడుతున్నాం.

      Delete
    3. >>>సోంబేరులనీ, లేజీ పర్సన్స్ అని, గుడుంబా చాలని..

      పైన ఈ మాటలన్నది ఒక సమైక్య వాది. తెలంగానా వాది కాదు.

      >>>ఎందుకంటే వారితో సహజీవనం వల్లనే నాకు కొంచెం నాగరికత అబ్బింది.

      నాగరికత అంటే ఏమిటి, తెలంగాణా వారిని సోంబేరులని తిట్టడమా?

      >>>వాళ్ల ఆస్తులు అమ్ముకొని మన రాజధాని అనే భావనతో హైదరాబాదుకు తరలి వచ్చి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు.

      కాదు, హైదరాబాదుకు తరలి వచ్చి వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇక్కడి అభివృద్ధిలో పాలు పంచుకున్నది దేశంలోని అన్ని ప్రాంతాలవారూ. మీ మాటల్లో చెప్పాలంటే విదేశాలకు చెందిన IBM, Microsoftలు కూడా.

      >>>దొరల దగ్గర నీ కాల్మొక్తా బాంచెన్ అనే వాళ్లం.

      నీకు చరిత్ర తెలవదనుకుంటా. వారు కూడా తెల్లదొరల బూట్లు నాకేవారు. అయినా ఎవరో ఎప్పుడో ఏదో అన్నారని, ఇప్పుడు తెలంగానా వారు వేరొకరికి బానిసలుగా పడుండ వలసిన అవసరం లేదు.

      >>>అన్న ఎన్టీఆర్ రాకతో మనకు చైతన్యం పెరిగింది. దొరల పెత్తనం మాయమయింది. చంద్రబాబు హైదరాబాద్ ను నంబర్ వన్ గా తీర్చిదిద్దారు.

      మా బాబే! మరి చంద్రబాబు ఎందుకు ఓడిపోయినట్టో!

      >>> వైఎస్ లేకపోతే మన బంజరు భూములు బంగారు భూములయ్యేవా?

      ఉంటే మటుకు తప్పకుండా Vanpic భూములయ్యేవి. జైల్లో వున్న జగన్నడుగు!

      >>> కానీ వాళ్లు మాత్రం జాతి మీద అభిమానంతో తెలుగువాళ్లమంతా కలసి ఉండాలని కోరుకుంటున్నారు.

      నీకు అర్థం కావడం లేదా, లేక తెలంగాణా వాడీలా నటిస్తున్నావా? వాళ్ళు కోరుకునేది హైదరాబాదుని. సమైక్యతని కాదు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వారు చేస్తున్న డిమాండు సంగతేమిటి?

      >>>తెలంగాణా వాడిగా తెలుగు జాతి ఐక్యతను కోరుకునే వాడిగా తెలుగు జాతికి జిందాబాద్ కొడుతున్నాం.

      ఇన్నిసార్లు తెలంగాణా వాడినని చెప్పుకుంటున్నావంటేనే, నీవు తెలంగాణా వాడివి కావాని, Anonymous గా వచ్చిన సమెక్కుడు వాదివని తెలుస్తూనే వుంది!

      Delete
  2. Indira Gandhi is very popular with the anti-Telangana crowd. Yet no one denounced it when her statue was destroyed.

    ReplyDelete
    Replies
    1. Hi Jai,

      That speaks about their blind agitation. Their psuedo 'Samaikyavaadam' is blatantly exposed with their claims on Hyderabad. I doubt the high school students who are participating in agitations and the goons who are leading them ever understood the history of India or what Indira Gandhi advocated.

      Delete