నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగు చూసినంక కిరణ్ కుమార్ రెడ్డి తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని, కేవలం సీమాంధ్రకే నని తనకు తానే ప్రకటించు కున్నట్టు కనిపించింది. సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఏ కాలం లోనైనా తెలంగాణాకు మేలు చేస్తారనే (కనీసం కీడు చేయరనే) భ్రమలు తెలంగాణా ప్రజలకు ఎప్పుడో పోయాయి. కాని నిన్న జరిగింది మాత్రం 'నేను సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, కేవలం ఆంధ్రా ప్రయోజనాలు కాపాడే వాడిని' అని నగ్నంగా బయట పడడం.
ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీటు ఒక్కటి చాలు తెలంగాణా రాష్ట్రం ఎంత అవసరమో నిగ్గు తేల్చడానికి. తెలంగాణా ఏర్పడితే తెలంగాణకి ఎంత నష్టమో బెదిరిస్తూ సాగింది ఈయన ప్రసంగం. ఈయన దృష్టిలో రాష్ట్రం విడిపోతే తెలంగాణాకి వచ్చేవి నష్టాలు, ఆంధ్రాకు రావాల్సినవి హక్కులు.
ఈయన చెప్పిన అంశాలలో ప్రధానమైనది నీళ్ళ సమస్య. విభజన తర్వాత నీటి పంపకాల విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉవ్న్నాయని ఆయన చెప్తున్నారు. కాని అంతర్రాష్ట్రీయ నీటి పంపకాలను నిర్ణయించేందుకు జాతీయంగా ఇప్పటికే అనేక నిబంధనలు ఉన్నాయి. నదుల ట్రిబ్యునళ్ళు వాటి అవార్డులు ఉన్నాయి. వాటి ప్రకారం నదీజలాల పంపకాలు న్యాయంగా జరుప బడతాయి. ఆ విషయాలు తెలియని అమాయకుడు అనుకోలేం మన సీయం. ఆయన బాధల్లా ఆంధ్రాలో, రాయలసీమలో ఇప్పుడు అక్రమంగా వాడుతున్న నదీజలాలు విడిపోయిన తర్వాత కూడా అలాగే దోపిడీ ఎలా కొనసాగించాలి అనేదే సమస్య. ఆయన కేంద్రాన్ని కోరే వివరణ దీని గురించే. విభజన తర్వాత కూడా తెలంగాణాకు ఎలా అన్యాయాలు చేయాలి అనే వెసులు బాటు గురించే.
ఇదొక్కటే కాదు ఆయన స్పృశించిన ఇతర సమస్యలు కూడా అలాగే కనిపిస్తాయి. ఉద్యోగుల గురించి ఆయన ప్రస్తావన కూడా అలాంటిదే. 610 జీవోకి సంబంధించిన అక్రమ ఉద్యోగులు అసలు లేరే లేరన్నట్టుగా ఆయన మాట్లాడారు. అందరూ సక్రమ ఉద్యోగులే వుంటే మరి ఆయన ఆందోళన ఎందుకో అర్థం కాదు. ఆంధ్రా తెలంగాణా ఉద్యోగుల దామాషా సరిగానే వుంటే, మరి ఎవరి ప్రభుత్వంలో వారు హాయిగా ఉద్యోగాలు చెసుకొవచ్చు. అదొక సమస్యే కాదు. కాని మన కిరణ్ కుమార్ గారికి సమస్య కనిపిస్తుంది.
దామాషాలను మించి అనేక మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలలో అక్రమంగా తిష్ట వేయడమే ఆ సమస్య. రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ బోయే ముందు ప్రతి ఉద్యోగి సర్వీసు పుస్తకం తప్పని సరిగా తనిఖీ చేయవలసి వుంటుంది. దాని ఆధారంగా సదరు ఉద్యోగి ఏ ప్రాంతానికి చెండుతాడో నిర్ణయించి ఆ ప్రాంతానికి పంపవలసి వస్తుంది. ఆ విధంగా అవసరానికి మించిన అనేక రెట్ల ఉద్యోగుల భారాన్ని ఆంధ్రా ప్రభుత్వం మోయాల్సి వుంటుంది. ఈ విషయాన్ని APNGO లీడర్లు బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు కూడా. ఇలాంటి అక్రమ ఉద్యోగులను సీమాంధ్ర ప్రభుత్వానికి పంపకుండా, తెలంగాణలో పర్మనెంటుగా ఉంచాలనే తపన సీమాంధ్ర JAC కి మూల విరాట్టుగా వ్యవహరిస్తున్న నాయకుల వారిది! అదే ఆయన మాటల్లోని అంతరార్ధం.
ఇక పొతే విద్యుత్తు గురించిన ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్ల వాడికి కూడా నవ్వు తెప్పిస్తాయి. తెలంగాణా విడిపోతే కరెంటు లేక మీరు అల్లాడి పోతారు అన్న బెదిరింపు ఆయన మాటల్లో కనిపించింది. ఆయన చెప్పింది కొంతవరకు వాస్తవమే. కేంద్రప్రభుత్వం రామగుండంలో NTPC స్థాపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బొగ్గు నిక్షిప్తాలు అపారంగా కలిగిన తెలంగాణాలో ఏర్పడ వలసిన పవర్ ప్లాంట్లను ఉద్యోగాల యావతో ఆంధ్రాకు తరలించింది. ప్రపంచంలో ఎక్కడైనా ప్రధాన ముడిసరుకుకు దగ్గరగా కర్మాగారాలను ఏర్పాటు చెస్తారు. కాని సీమాంధ్ర పక్షపాత బుద్ధులు అపారంగా కలిగిన మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సింగరేణి బొగ్గు ఆంధ్రాకు, రాయలసీమకు తరలించి ఎక్కువ వ్యయంతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది! ఫలితంగా మనం ఎక్కువ కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నాం.
ఇప్పుడు అసలు సమస్య ఏమంటే ఈ అక్రమ కరెంటు ఉత్పత్తి కర్మాగారాలకు బొగ్గు ఉండదు, నీళ్ళు వుండవు. అదే మన సీయం గారి బాధ. కాని అది బయటికి చెప్పకుండా తెలంగాణాకి కరెంటు సమస్య వస్తుందని ఆయన బుకాయిస్తున్నారు. 'మీకు బొగ్గూ నీళ్ళూ అమర గలిగి నప్పుడు, మాకు కరెంటు అమరదా కిరణ్ రెడ్డీ? నువ్వు మరీ చిలిపి!' రాష్ట్రం ఏర్పడే ముందు కేంద్రాన్ని వత్తిడి చేసి, బొగ్గు వాటాలు పొంది, కరెంటు విషయంలో తెలంగాణాకు మొండి చెయ్యి చూపాలనేదే ఆయన అసలు ఆలొచన.
ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ఆలోచనలు కావు. తెలంగాణా ప్రజలను బెదిరించి రాష్ట్ర విభజనను అడ్డుకోవడమో, లేక విభజన అనివార్యమైతే ఎలాగైనా కేంద్రంపై వత్తిడి పెంచి తెలంగాణా వనరులను శాశ్వతంగా దోపిడీ చేయడమో సీమాంధ్ర దోపిడీదారుల ఆలోచనగా కనపడుతుంది. ఆ వాణినే వారి ప్రతినిధిగా ముఖ్యమంత్రి వినిపిస్తున్నారు.
mari telangana lo puttinollantha telanganolle ani mee KCR cheppindi apaddama ayite. ippdu vibhajanaki vyatirekanga matladadu kabatti seemandhra mukhya mantri ayipoyada. mimmalni ee afghanistan ko pampinchali. ade correct meeku.
ReplyDelete@Anon
Deleteఇప్పుడు ఆయన్ని తెలంగానోడు కాదని ఎవరన్నరు? పోస్టు పూర్తిగ చరివి మాట్లాడు. రాష్ట్రం విడిపోయినంక ఆయన షుభ్రంగ తెలంగాణల సెటిల్ అయి పోవచ్చు. రాజకీయాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎన్నికలల్ల పోటీ కూడ చేసుకోవచ్చు, ఆయన పార్టీ టికెట్ ఇస్తే.
ఆయన సీమాంధ్రకు ముఖ్యమంత్రిగ పనిచేసుకుంట కూడ సీమాంధ్ర పక్షపాతం వహిస్తే ఫరవా లేదు. కాని ఇప్పుడు ఆయనింకా సమైక్య ఆంధ్రప్రదెశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రం విడిపోయె సందర్భంలో పెద్దమనిషిగా తెలంగాణా ఆంధ్రా ప్రాంతాలకు ముఖ్యమంత్రి హోదాలో సమ న్యాయం చేయాల్సిన అవసరం వుంది. కాని ఆయన మాటవారస చూసినప్పుడు పూర్తి సీమాంధ్ర వాదిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది, సమైక్యవాదిగా కూడా కాదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామ ఇచ్చిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు వుంది. కాని ఆ పదవిలో వుండి సీమాంధ్ర వాదిగా మాట్లాడడం, రాష్ట్రం విడిపోవద్దని సంతకం పెట్టాననడం సరికాదు.
mari jaipal reddy evari kendra mantri, gita reddy, damodar narasimha evari up maukhyamantri, kodandaram anae so called professor evariki professor. veellandaru telabanlaki support chesi, seemandhrulaki vennupotu podicaahru, mosam chesaaru. malli veellu teesukune salaries, allowances seemandhra contribution vundi kada.
ReplyDeletesreerama
శ్రీరాం,
Deleteవాళ్ళెవరూ మీవాళ్ళ సాటి కాదు. ప్రకటన వెలువడే దాకా జయపాల్ రెడ్డి సమైక్య వాదే. గీటా రెడ్డి, రాజనర్సింహ మాట్లాడిందేమీ లేదు. ప్రకటన వచ్చిన తర్వాతే వారు దాన్ని సమర్ధిస్తున్నారు. ఇక పోతే కోదండరాం పేరు తీసే అర్హత కూడా నీలాంటి వారికి లేదు.
Its Manmohan telanganaki matrame PM a??? lekapote avatala rastram issues ento kuda kanokko kunda devide chesi parestara?? manaku nahcindi cheppe vadu enta edava aina vadu jatipita, evadanna reasonable point matladite vadu drohi!!
ReplyDeleteఅందరినీ కనుక్కున్నారు. గత మూడేళ్ళుగా సంప్రదిస్తూనే వున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాలు ఇచ్చాయి. సీమాంధ్ర ప్రజలు మాత్రం తెలంగాణాను మోసం చేస్తున్నామనుకుంటూ లోల్లోపల నవ్వుకుంటూ చంకలు గుద్దుకున్నారు.
Deleteముఖ్యమంత్రిగారు కాంగ్రెస్ అధిష్టాన్ని ధిక్కరించి,నీళ్ళు విద్యుచ్చక్తి తెలంగాణాకు కరువు అవుతాయని భయపెడుతున్నారు!భయపెడుతున్నామని భ్రమపడుతున్నారు!వారి దేహభాష చూస్తే ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చి ఆంధ్ర కిరణ్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్తాపించేటట్లు నాకు అనిపించింది!
ReplyDeleteసూర్యప్రకాశ్ గారు,
Deleteనంగి మాటల ముఖ్యమంత్రికి పార్టీ పెట్టేటంత సీను లేదు. సొంత ఆలోచన ఇసుమంటైనా లేని కిరణ్ రెడ్డి ఆంధ్రా పెట్టుబడి శక్తుల వాయిస్‌గా వ్యవహరిస్తున్నడు. కావూరి, లగడపాటి లాంటి వాళ్ళు ఈ పరిస్థితిలో దైరెక్టుగా ముందుకు రాకుండా, ఒక వైపు కేంద్ర నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్టు నటిస్తూ, ముఖ్యమంత్రిని ముందుకు తోస్తున్నరు. కిరణ్ రెడ్డి తన తెలివి తక్కువ తనంతో పదవి పోగొట్టుకోవడం దాదాపుగా ఖయంగా కనిపిస్తుంది.
"మాకు కరెంటు ఇయ్యుండ్రి" అని గిప్పుడే ఆంధ్రోల్లను అడుక్కుంటున్నాడు మీ గద్దముక్కు నాయకుడు.. మరి మీ అత్మాభిమానం గోదాట్లో కలిసింది.. ఇంకా ఘోషించడమెందుకు
ReplyDeleteవోలేటి,
DeleteKCR చెప్పింది నువ్వు మొత్తం వినలే. మాకు తక్కువ బదే కరెంటు మేం దర్జాగ కొనుక్కుంటం అని ఆయన చెప్పిండు. పైసలిస్తే అమ్మేటండుకు మస్తు పవర్ ప్లాంటులు ఈరోజు ప్రైవేట్ సెక్టర్ల వున్నై. అక్కడన్నా కొనుక్కుంటమని ఆయన అన్నడు. గట్లనే మాట వరసకు మీకాడ మిగులు వుంటే, మాకు అమ్మరా అని ఆయన అడిగిండు. గాదానికే మీకు గింత నీలుగుడైతె, ఎల్లిపోకుండ ఇంకా దొంగ ఉద్యమాలెందుకు మీకు?
అయినా KCR అనకున్నా నేను చెప్తున్న. మా సింగరేణి బొగ్గుకు బిరడా ఏస్తిమంటే, కాల్లు మొక్కుకుంట మీరే ఇస్తరు కరెంటు మాకు. గప్పుడు తెలుస్తది ఎవరి ఆత్మాభిమానం బంగాళఖాతంల కలుస్తదో!
పిచ్చి ముదిరింది తలకు రోలు చుట్టమన్నాడట అనే సామెత గురించి మీకు తెలిసే ఉంటుంది. ఉన్మాదం తారాస్థాయికి చేయిన మీలాంటి వాళ్లకి ఏమి చెప్పినా అది సమైక్యవాదం కిందకు వస్తుంది. సమెక్కడు వాదులని ముద్ర వేసేస్తారు. యాభై అరవై ఏళ్ల క్రితం తెలంగాణ ఎక్కడ ఉండేది, హైదరాబాద్ పరిస్థితి ఏంటి? నిజాం రాష్ట్రంలో ఒక్కో ప్రాంతం, ఒక్కో ముక్క అన్నట్లుగా ఉండేది. ఉక్కుమనిషి ప్రయత్నం మూలంగా హైదరాబాద్ సంస్థానం, తెలంగాణా ప్రాంతాలు అన్నీ ఒక్కటయ్యాయి. తర్వాత నాలుగైదేళ్లకు మిగతా ఆంధ్రా ప్రాంతం అంతా వచ్చి కలిసింది. అప్పుడు కూడా తెలంగాణా నాయకుల్లో మెజార్టీ వాళ్లు కోరుకుంటేనే వీలీనం జరిగిందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇపుడు ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. తెలంగాణా, ఆంధ్ర అన్న బేధభావాలేమీ ప్రజల్లో కనిపించవు. ఇక్కడి వాళ్లు అక్కడ, అక్కడ వాళ్లు ఇక్కడా ఒకరితో మరొకరు మమేకం అయిపోయారు. మీలాంటి వేర్పాటు వాదులకు అది నచ్చడం లేదు. అన్యాయం జరిగిపోయింది, అన్నీ వాళ్లు దోచుకున్నారు, దోపీడీదార్లు, దొంగలని ముద్ర వేస్తూ ఇక్కడ అమాయకులైన ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అందరూ కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాదును మీరొక్కరే అనుభవించాలని ఆశ పడుతున్నారు. అయినా తెలంగాణా తెలంగాణా అని అరిచి గీపెడుతున్నారు కదా... గుండె కాయలాంటి హైదరాబాదు నగరంలో ఎంత మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణాను కోరుకుంటున్నారు? హైదరాబాదులో కనీసం వార్డు మెంబరుగా కూడా తెరాస గెలవలేకపోతోంది. కానీ మీకు హైదరాబాదు కావాలి. మీకు ప్రత్యేక తెలంగాణా కోరిక ఉన్నట్లే హైదరాబాదు వాసులకు సమైక్య భావన ఉందని ఎందుకనుకోకూడదు? హైదరాబాదు వాసుల కోరికను మీరెందుకు కాదంటున్నారు? హైదరాబాదును పక్కన పెడదాం... ఖమ్మం జిల్లాల్లో ఎక్కడైనా తెలంగాణా వాదం వినిపిస్తుందా? మెదక్ లో తెలంగాణా అంటే జగ్గారెడ్డి మీ తోలు వలుస్తాడు. తెలంగాణావాదం కనిపించేది కేవలం వరంగల్; కరీంనగర్ మాత్రమే. మిగిలిన జిల్లాల్లో అంత తూతూ మంత్రమే. కేవలం రెండు జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్రాన్ని విడదీయడం ఎక్కడైనా ఉందా? తెలంగాణా ప్రజలందరూ తెలంగాణా కే ఓటేస్తే తెరాస పార్టీకి కనీసం వంద ఎమ్మేల్యే సీట్లు పదోపన్నెండో ఎంపీ సీట్లు ఉండేవి. కానీ నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్న చందంగా తెరాస పార్టీ ఎన్నికల్లో తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్నది కేవలం పదిహేను ఎమ్మేల్యే, రెండు ఎంపీ సీట్లు. ఈ మాత్రానికే రాష్ట్రాన్ని చీల్చాలా? ఇక ఉస్మానియా పిలకాయల సంగతికొద్దాం. పాపం ఉడుకురక్తం కదా... ఉన్మాదంలో ఉన్నారు. తెరాస నాయకులు వీరిలో వేర్పాటు వాదమనే విషాన్ని నింపారు. ఈ విషం దిగే వరకూ వారికెన్ని చెప్పినా వ్యర్థమే...
ReplyDeleteగత పది రోజులుగా సమైక్య ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయో గమనిస్తే అది సమైక్య వాదమో సమెక్కుడు వాదమో అర్థం చేసుకోవడం కష్టం కాదు. సమైక్యవాదం అన్ని వైపుల వుంటే ఈ రోజు సమైక్య ఉద్యమం అంతటా జరిగేది. కాని తెలంగాణాలో ఒక చిన్న ప్రదరషన కూడా ఎందుకు జరగలేదు?
Delete>>>మీకు ప్రత్యేక తెలంగాణా కోరిక ఉన్నట్లే హైదరాబాదు వాసులకు సమైక్య భావన ఉందని ఎందుకనుకోకూడదు?
ఎందుకనుకోవాలి? ఆధారాలున్నాయా? ఆ భావానను వ్యక్త్ర పరుస్తూ వారు ఒక్క వేదిక మీదనైనా చెప్పారా? ఇక్కడి సీమాంధ్ర కాలనీలతొ సహా అందరూ తెలంగాణాని మాత్రమే సమర్ధిస్తూ అనేక సార్లు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తెలంగాణా సెటిలర్స్ JAC కూడా వుందని మీకు తెలుసా? అన్నిటికన్నా విచిత్రం ఎక్కడో సీమాంధ్రలో వుండే వారు హైదరాబాదు గురించి మాట్లాడడం. అలా మాట్లాడడానికి వారికేమాత్రం అర్హత లేదని తెలుసుకోండి.
ఎక్కడెక్కడ తెలంగాణా వాదం వినిపిస్తుందో నీకి మేం చెప్పవలసిన అవస్రం లేదు, వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది. సమైక్య వాదం మాత్రం అసలు లేదని మీరె నిరూపిస్తున్నారు, గత పది రొజులుల ఉద్యమం సీమాంధ్రకే పరిమితం చేసుకుంటూ.
ఒక్క సీమాంధ్ర పది రోజులు కాదు, పది సంవత్సరాలు ఉద్యమం చేసినా అది సమెక్కుడు ఉద్యమం అవుతుందే తప్ప సమైక్య ఉద్యమం కానేరదు. నీకు తెలియదేమో ఈ రకమైన 'One side love' నే ఉన్మాదం అంటారు.