Saturday, August 31, 2013

తక్షణ కర్తవ్యం

తెలంగాణా ప్రకటన వచ్చి అప్పుడే నెలరోజులు గడిచి పోయింది. సెక్రెటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సీమాంధ్ర ఉద్యోగుల ఆట విడుపు స్థలాలుగా మారిపొయాయి. సీయం, డీజీపీ అధ్వర్యంలో బంద్ లు, ధర్నాలు, ర్యాలీలు సీమాంధ్ర పురవీధుల్లో యధేచ్చగా కొనసాగుతున్నాయి. పోలీసుల కనుసన్నలొ విగ్రహాల కూల్చివేతలు, తెలంగాణా ప్రాంతీయులపై దాడులు, బంద్ లకు సహకరించని వాహనాలపై ద్వంసకాండ నిత్య క్రుత్యాలుగా మారాయి. సీమాంధ్ర నెలరోజులుగా స్థంబించి పోయింది. అయినా కూడా ఒక్క లాటీ దెబ్బ తగల్లేదు. ఒక్క రబ్బరు బుల్లెట్  పేల లేదు.

ఎంత తేడా, అక్కడికీ ఇక్కడికీ? ఇక్కడ ఒక సమ్మెకు, ఒక ధర్నాకు, ఒక మార్చికి.. చివరికి దీక్షకి కూడా అనుమతి లభించదు. సమ్మె మా హక్కు అని జనం బయలుదేరితే లాటీలు విరుగుతాయ్. బుల్లెట్లు పేలుతాయ్. ఇక్కడి వారు సమ్మె చేస్తామని ప్రకటిస్తే, వంతులవారీగా కమీషనర్, డీజీపీ, హొమ్ మంత్రి, ముఖ్యమంత్రి ప్రెస్ మీటలు పెట్టి బెదిరింపు ప్రకటనలు చేస్తుంటారు.

అదే సీమాంధ్రలో ఎంత అల్లకల్లోలం చెలరేగినా ఎవడూ పలకడు. పైగా ముఖ్యమంత్రికి అంటా సవ్యంగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వందలాది జాతీయ నాయకుల విగ్రహాలు పగిలినా, దాడులు జరిగినా శాంతియుత ఉద్యమంగా కనిపిస్తుంది. వాళ్లకు ఇష్టంలేని ఉద్యమాన్ని ప్రజలు చేస్తే, వాళ్ళ తలలు పగులగొట్టి ఉద్యమాన్ని అశాంతిగా మారుస్తారు. అదే వాళ్లకు కావలసిన ఉద్యమానికి ప్రజలు రాకపోయినా రౌడీలను ఉపయోగించి, స్కూలు పిల్లలను సేకరించి మీడియా ముందు ప్రదర్శిస్తారు. ఇంకా సరిపోక పొతే కూలీలను పెట్టి విగ్రహాలను పగలగొట్టిస్తారు. ఆర్టిస్టులను పెట్టి రోడ్లమీద బొమ్మలు గీయిస్తారు. కూలీ గాయకులతో గీతాలు పాడిస్తారు. అధికారం మీది, డబ్బులు మీవి, మీడియా మీది... కాబట్టి ఏమైనా చేస్తారు.

కానీ చరిత్ర ఎప్పుడూ మీది కాదు. అందుకే ఒక అనివార్యత సంభవించింది. అందుకే జూలై ముప్పైన కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ అనివార్యత వల్లనే సీమాంధ్ర దోపిదీదార్లు ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నా, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోలేక పోతుంది. ఇప్పుడు మార్చుకొనే పరిస్తితి కూడా లేదు. ఇప్పుడు మార్చుకొని సాధించేదీ లేదు.

కాని, విభజన ప్రక్రియ నిదానిస్తున్న కొద్దీ దోపిడీ దార్లకు ఆశలు పెరుగుతాయి. దొంగసొత్తు దక్కించుకోగల మన్న నమ్మకం పెరుగుతుంది. దానికోసం రాజీడ్రామాలు, బస్సు యాత్రలు, జైలు దీక్షలు శురూ అవుతాయి. సీమాంధ్ర ప్రజలు మరింత గందర గోళం లోకి నెట్టబడుతారు. సీమాంధ్ర ప్రజలు మంచోల్లే కావచ్చు, కాని దేవుళ్ళు కారు. అప్పనంగా హైదరాబాదు పట్టుకోస్తామని వాళ్ళ నాయకులు చెపుతుంటే కాదనడానికి, ఆశ పడడానికి. సాగదీత ఎక్కువయ్యే కొద్దీ వారి ఆశ కూడా పెరుగుతూ పోతుంది.

అందుకే ఎటూ నిర్ణయం తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ తన సహజ సిద్ధమైన నాన్చివేత ధోరణి విడనాడి, విభజన ప్రక్రియపై కదం తొక్కాలి. అప్పుడు గాని సీమంధ్ర ప్రజలకు వాస్తవాలు తెలిసిరావు. ఊహాలోకాలు, వాస్తవాలు వేరు వేరని అర్థం కాదు. అలా కాకుండా బద్ధకం వదిలించుకొని పక్షంలో కాంగ్రేస్  ఆధః పాతాళానికి పడిపోక తప్పదు.


Thursday, August 29, 2013

తెలంగాణా ఉద్యమంలో తెలుగు తమ్ముళ్ళ పాత్ర

తెలంగాణా ఉద్యమంలో తెలుగు తమ్ముళ్ళ పాత్ర ఏమిటి? అని ప్రశ్నించుకుంటే, అది శల్య పాత్రకు ఎక్కువ సైంధవ పాత్రకు తక్కువ అనిపిస్తుంది. 

2009లో తెలంగాణా ఏర్పాటుకు సైంధవుడిలా అడ్డు పడ్డాడు చంద్రబాబు. అప్పుడు తెలంగాణాకు చెందినా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడూ నోరు మెదపలేదు. నోరు మెదపడానికి సాహసించిన నాగం లాంటి వారు పార్టీ వీడి పోవాల్సి వచ్చింది. 

అదే సమయంలో ఆంధ్రాకు చెందిన ఆ పార్టీ నాయకులు పార్లమెంటులో సమైక్య ప్లకార్డులతో ధర్నా చేశారు. ఇలాంటి ధర్నాలు చంద్రబాబు కనుసన్నలలో జరిగేవి అయినప్పటికీ, వాటిని ప్రశ్నించగల, తెలంగాణా వాణిని వినిపించగల నాయకుడు ఆ పార్టీ తెలంగాణా శిబిరంలో కనిపించ లేదు. 

ఆ తర్వాత మరోసారి చంద్రబాబు తెలంగాణాకు అనుగుణంగా ఉత్తరం ఇచ్చాడు అంటే, అందులో తెలంగాణా ప్రాంత నాయకుల వత్తిడి శూన్యమే అని చెప్పొచ్చు. చంద్రబాబు తన పాదయాత్రకు మార్గం సుగమం చేసుకోవడానికి మాత్రమె ఆ ఉత్తరం ఇచ్చాడు తప్ప మరో కారణం లేదు. 

కాంగ్రెస్ ఎలాగూ తెలంగాణా ఇవ్వదు, మరోసారి ఆ పార్టీని ఇరుకున పెడదాం అనుకున్న చంద్రబాబుకు మరోసారి కాంగ్రెస్ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీమాంధ్ర నాయకుల చేత రాజీడ్రామాలు, సమైక్య ఉద్యమాలు చేయించడం మొదలు పెట్టాడు. 

తెలంగాణాను మోసం చేయడం బాబు నైజం, ఆ ప్రాంతపు నాయకుల నైజం. మరి ఇక్కడ పుట్టి ఈ ప్రాంతపు నీళ్ళు తాగిన నాయకులకు కొంతైనా చీము నెత్తురు లేక పోవడం, బాబును ధిక్కరించె కలేజా లేకపోవడం విస్మయ పరుస్తుంది. అలాంటి నాయకులు రేపు ప్రజలవద్దకు ఎలా వద్దామనుకుంటున్నారో వారే ఆలోచించు కోవాలి. 

ప్రజా వ్యతిరేక పంథాలో వెళ్లి 2004లో చావు దెబ్బ తిన్నారు. 2009లో తెరాస తో పొత్తు పెట్టుకొని ఎలాగో ఊళ్లలో తిరగ్గలిగారు. కాని ఈసారి ఇలాగే వుంటే మాత్రం, రాజకీయంగా తమ సమాధి తాము తవ్వుకోన్నట్టే. 

ఒకపక్క సీమాంధ్ర ఎంపీలు ధర్నాలు చేసి సస్పెండ్ అవుతున్నారు. చంద్రబాబు మరో సమైక్య యాత్ర మొదలు పెడుతున్నాడు. వాళ్ళందరికీ లేని మొహమాటం మరి వీరికెందుకో. అది మొహమాటం కాదని చేతకాని తనమని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇక మిగిలింది రేపటి ఎన్నికల్లో తేలుస్తారు. 

Sunday, August 25, 2013

సమైక్యతకి ఎవరి కావాలి?


జూలై ముప్పైన దిగ్విజయ్ తెలంగాణా ప్రకటన చేయగానే మరోసారి ఆంధ్రాలో దానికి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు కాకున్నా కొన్ని వర్గాలు ఈ ఉద్యమంలో బాగానే పాల్గొంటున్నాయి. అసలు ఈ ఉద్యమం ఏమిటి? దేనికోసం చేస్తున్నారు అన్నదానికి ఎవరివద్దా సరైన సమాధానం లేదు. కాని గత ఇరవై రోజులుగా ప్రతిరోజూ మీడియాలో చూపెడుతున్నది చూసినప్పుడు కనపడేది ఇది. 'మేం సమైక్యత కోసమే ఉద్యమిస్తున్నాం. సమైక్యత తప్ప దేనికి మేం ఒప్పుకోం'. 

అసలు సమైక్యత అంటే ఏమిటి? ఇద్దరు సమైక్యంగా ఉండాలంటే అందులో ఒకరు సమైక్యంగా ఉండాలని అనుకుంటే అది సాధ్య పడుతుందా? ఒకవేళ అలా సాధ్యపడాలంటే సమైక్యత కోరేవాడు ఏం చేయాలి?

ఇవి సమాధానం చెప్పలేని ప్రశ్నలు కావు. వీటికి ఆంధ్రా ప్రాంతపు ప్రజలకు సమాధానాలు తెలియవని కావు. కాని వారు మాట్లాడే మాటలు, చేసే చేతలు చూసినప్పుడు సమాధానాలు తెలియవా అన్న అనుమానం వస్తుంది. వారికి సమాధానాలు తెలుసు. ఒక్క సమైక్యత అన్న పదం తప్ప వారు చేస్తున్న ఉద్యమంలో సమైక్యతా భావాన్ని ప్రతిబింబించేది మరేదీ కానరాదు!

తెలుగు తల్లి వేషధారణ తో పాటు శ్రీకృష్ణ దేవరాయల వేషధారణ వారి ఉద్యమ వైవిధ్యాలలో ఒకటి. కాని విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ దేవరాయలు ప్రస్తుత తెలంగాణా ప్రాంతాన్ని ఎప్పుడూ  పరిపాలించి ఉండక పోవడం! ఆయన ఆంధ్రా ప్రాంతం తోపాటు కన్నడ, తమిళ రాజ్యాలను కూడా పరిపాలించాడు. ఆ రెండు రాష్ట్రాలను కూడా కలిపి సమైక్య దక్షిణ దేశ రాష్ట్రాన్ని (తెలంగాణా కాకుండా) ఏర్పాటు చేయాలని వారి అభిమతమా? కనీసం ఆంద్ర రాష్ట్రాన్ని మొత్తంగా పరిపాలించిన రుద్రమదేవి వేషధారణ చేసినా వారి నినానాదానికి సరైన ప్రతీకగా వుండేది. కాని ఒక తెలంగాణా ప్రాంతానికి చెందినా రాణిని తమ ప్రతీకగా వారు ఒప్పుకోవడమన్నది సందేహాస్పదమే. 

ఇక పొతే సమ్మె ఎవరు చేస్తున్నారన్నది కూడా దగ్గరగా పరిశీలిస్తే, సమ్మె స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు టీవీల్లో కనిపిస్తున్న దాని ప్రకారం సమ్మెలో పాల్గొంటున్నది NGO లు, RTC వర్కర్లు. వీరు కాకుండా స్కూలు పిల్లలు. 

NGO లు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందు తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి జనాభాను మించి అత్యధిక దామాషాలో ఆంధ్రా ఉద్యోగులు ఉన్నవిషయం అందరికీ తెలిసినదే. రాష్ట్రం విడిపోతే అదనపు ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారి భయం. అంతే కాకుండా తెలంగాణలో ఉన్న మిగులు ఆంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతానికి తిరిగి వస్తే, ఆంధ్రా ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వారికి రావలసిన ప్రమోషన్లకు, ఇతర అవకాశాలకు గండి పడుతుందనేది కూడా ఒక కారణం కావచ్చు. వారి ఆందోళనలో అర్థం వుంది, కాని వారు చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ లేదు. వారు నిజంగా తమ హక్కుల కొరకు పోరాడితే తెలంగాణా ప్రాంత NGO లు కూడా వారికి మద్దతు పలుకుతారు. కాని అది వదిలేసి సమైక్యత, హైదరాబాదు అనే నినాదాలు పట్టుకుంటే వారు సాధించేది శూన్యం. 

అలాగే RTC ఉద్యోగులు చేసే సమ్మెకు కూడా ఇటువంటి కారణాలే ఉన్నాయి. ఆ సంస్థకు వచ్చే ఆదాయంలో సింహభాగం తెలంగాణా నుండే వస్తుంది. ఆంద్ర ప్రాంతంలో రైల్వేను, ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తారు, కాబట్టి అక్కడ వచ్చే రెవెన్యూ తక్కువ. కాని విచిత్రంగా ఎక్కువ ఆదాయం వచ్చె తెలంగాణలో తక్కువ బస్ డిపోలు ఉంటాయి. తక్కువ ఆదాయం వచ్చే ఆంధ్రాలో ఎక్కువ డిపోలు ఉంటాయి. ఆంధ్రా లోని అన్ని డిపోలలో ఆంధ్రా కి చెందిన ఉద్యోగులు మాత్రమే ఉంటారు. అదే తెలంగాణలో మాత్రం ప్రతి డిపో లోనూ కనీసం పది నుండి ఇరవై శాతం వరకూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటారు. అదీగాక హైదరాబాదులో వున్న RTC కేంద్ర కార్యాలయంలో ఉన్న వెయ్యి మంది ఉద్యోగులలో ఎనభై శాతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే!

దీన్ని బట్టి ఆంధ్రా ప్రాంత RTC ఉద్యోగులు చేసే సమ్మె లోని హేతుబద్ధత కనిపిస్తుంది. CPI అనుబంధ సంస్థ అయిన ఎంప్లాయిస్ యునియన్ కూడా సమ్మెలో పాల్గొంటుందంటే వారు ఎంతటి భయాందోళన లో ఉన్నారో అర్థమవుతుంది. వీరు నిజంగా సమైక్యతను కొరుతున్నారు. ఎందుకంటే సమైక్యంగా ఉండకపోతే, తెలంగాణా నుండి వచ్చే అదనపు రెవెన్యూ లేకపోతే ఆంధ్రా RTC కి మనుగడ లేదు మరి! కాని గత కాలపు పాపాలకు ఎవరో ఒకరు శిక్ష అనుభవించక తప్పదు మరి. కాని వారు నిజాయితీగా తమకు జరుగబోయే నష్టాలు వివరిస్తూ ఉద్యమిస్తే, ఏదో తగు పరిష్కారం దొరక్క పోదు. కాని నెల విడిచి సాము చేసినట్టు సమైక్యతా ఉద్యమాన్ని తలకెత్తుకుంటే ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిందన్న సామెతగా మారుతుంది. ఆ విషయం వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. 

ఇక పొతే విద్యార్థుల సమ్మె. పిల్లవాడు పుట్టగానే అమెరికా వీసా గురించి ఆలోచించే ఆంధ్రా పౌరులు, తమ పిల్లలను సమ్మె లోనికి దింపుతారంటే ఆశ్చర్యమే! అయితే దీంట్లో ఉన్న అసలు రహస్యం మీడియా మిత్రుల ద్వారా బట్టబయలయింది. స్కూలు పిల్లలకు రోజూ ఒక గంట సమ్మె ఆటవిడుపు ప్రకటించారు. ఆ గంటలో పిల్లలు అందరూ ప్రధాన కూడలికి వచ్చి రోడ్డు మీద నిలబడాలి. పిల్లలను వరుసలలో నిలబెట్టడం, గంట పూర్తికాగానే తిరిగి క్లాసు రూములకి తీసుకెళ్లడం టీచర్ల బాధ్యత. ఆ తర్వాత క్లాసులు యధావిధిగా నడుస్తాయి. ఈ ఉద్యమంలో మీడియా కూడా ప్రధాన పాత్రధారి కావడం వల్ల, ఆ గంటలోనే మీడియా వారు వచ్చి తమ వీడియో ఫూటేజీలను తీసుకొని వెళ్తారు. ఫాషన్ పరేడ్ లను తలపిస్తున్న ఈ సమ్మెల అసలు రహస్యం  కొంచెం జాగ్రత్తగా టీవీలో చూస్తె వెంటనే అర్థమవుతుంది. 

ఆంధ్రా సోదరులారా! ఇలాంటి ఉద్యమాల వలన మీరు సాధించ గలిగేది శూన్యం. చేవ వుంటే మీకు రాబోయే సమస్యలను ధైర్యంగా వివరించి, సరైన రక్షణల కొరకు పోరాడండి. మేం కూడా మీకు మద్దతు పలుకుతాం. కేంద్రంలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిపొయింది. ఇప్పుడు మీరెంత గింజుకున్నా అది మారదు. మిధ్యా సమైక్య నినాదంతో మీరు కాలయాపన చేయడం వాళ్ళ మీ అసలు సమస్యలు బయటికి రాక, వాటికి పరిష్కారాలు కూడా కనుగొన బడవు. దానివల్ల చివరికి నష్ట పోయేది మీరే!

Friday, August 23, 2013

అశోక్‌బాబు అసలు బండారం!

- దొంగపత్రాలతో హైదరాబాద్‌లో పోస్టింగ్
- అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే అధ్యక్షుడి అవతారం
- అక్రమ బదిలీ నిర్దారించిన విజిలెన్స్
- ఎన్నికలే జరగని ఏపీఎన్జీఓ సంఘానికి గుర్తింపు లేని అధ్యక్షుడు
- హౌజింగ్ సొసైటీలో సభ్యత్వమూ అక్రమమే


నాయకుడు నలుగురికి దారిచూపే వాడై ఉండాలి, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకు నాయకత్వం వహించేవాడే ఆక్రమణదారుడైతే ఉద్యమం దారితప్పుతుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌కుమార్ వ్యవహా రం కూడా అచ్చం ఇలాగే ఉంది. అశోక్‌బాబు ఉద్యోగ వ్యవహారం అనైతికమని, ఆయన సృష్టించిన దొంగ విద్యార్హత పత్రాలతో పొందిన బదిలీ అక్రమమనీ...

హైదరాబాద్, ఆగస్టు 22 (టీ మీడియా):హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా...సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది.  విజిలెన్స్  విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిలెన్స్  విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది.

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిలెన్స్  శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిలెన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలోపేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురుకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు.

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి...అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిలెన్స్  అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికిందరాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు.

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్...
ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ... అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యుటేషన్ మీద  పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది.

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిక్షిగాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేలెత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని...ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంబపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను...నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు.

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి...అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి...డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలే జరగలేదు...అధ్యక్షుడెలా అయ్యాడో....
రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి.

హౌజింగ్ సొసైటీలో క్రిమినల్ చర్యలకు సిఫార్సు....
ఏపీఎన్జీఓలకు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 190 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, రూ. 13కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సాధారణ పరిపాలనా శాఖ(విజిపూన్స-ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ అక్రమాలు నిజమే అని నిర్దారించింది. వీరు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారిపై వాఖా పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు హైదరాబాద్ నగర అధ్యక్షుడు పివివి సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చుతూ సీసీఎస్ కేసు నమోదు చేసింది. ఇందుకు 2013 జూన్ 6న కేసు నెంబర్ 81ను నమోదు చేసింది. ఇందులో సెక్షన్ 406, 409, 420, 182 రెడ్‌విత్ 120 సెక్షన్‌లను నమోదు చేసింది.

610, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకమైన పీవీవీ సత్యనారాయణ...
ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ ఆపీసర్గా పనిచేస్తున్న ఏపీఎన్జీఓ హైదరాబాద్ అధ్యక్షుడి ఉద్యోగ నియామకంపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి కాగా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఈయన ఖమ్మం జిల్లాలో (జోన్-5) క్లాస్-4 క్యాడర్లో జూనియర్ టెక్నికల్ అధికారిగా ఉద్యోగం పొందారని ఆరోపణలున్నాయి. అయితే ఈయన ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించారు. 20శాతం ఉండే ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో నాన్ లోకల్‌లో ఉద్యోగం పొందినా ఆయన జోన్ -6లో పనిచేసేందుకు అర్హుడు కాదని నిబంధనలున్నాయి.

అయితే ఇవేవీ వర్తించని రీతిలో ఆయన హైదరాబాద్ చీఫ ఇంజనీర్ కార్యాలయంలో మే 15, 1990న బదిలీపై వచ్చి చేరారు. అనంతరం ఈయన టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందడం తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాన్ లోకల్ క్యాడర్లో జోన్-6కు బదిలీపై రావడం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా5(1)కి వ్యతిరేకమని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో యన నియామకంపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఐ అండ్ సీఏడి శాఖ విచారణకు స్వీకరించింది. ఇందులో ఆయన సర్వీస్ రికార్డు గల్లంతయిందని...ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేల్చింది. ఈ అవకతవకలపై రాయకోటి కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులకు కమిషన్ హామీ ఇచ్చింది కానీ ఈ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఆయన తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

అక్రమార్కులే నాయకత్వంలో ఉంటే న్యాయం జరగడం అసాధ్యం
అవినీతి పరులు, అర్హత లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో నాయకత్వం వహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేతల నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతందని గుర్తించాలి. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలో పనిచేస్తున్న ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి వీరిపై తిరగబడాలి. ఉద్యమం ముసుగులో తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వీరి దమననీతిని గుర్తించి పక్కకు తప్పిస్తే మంచిది. లేకపోతే సోదరుల్లా కలిసిమెలిసి పనిచేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విద్వేషాలు రేగడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ విభజనకు ఉద్యోగుల్లో మానసిక విభజన జరిగిపోయింది...ఇక భౌగోళిక విభజనే జరగాల్సి ఉందనే వాస్తవాన్ని నేతలు గ్రహించి సహకరించాలి. అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీఎన్జీఓ సంఘం గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్‌బాబును సర్వీసులనుంచి భర్తరఫ్ చేసి ఆయన అక్రమాలపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలి

- గంజి వెంక టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు

Wednesday, August 21, 2013

పాడిందె పాటరా..

Seema-Andhra leaders are saying that there was never a discussion happened about Telangana statehood, the decision of Telangana formation was taken in hurry and they were never aware that such a decision will ever be taken.

 

The discussion has taken place at all levels, many times, in media, in public, in and outside the political parties’ internal meetings, through out the Telugu speaking regions, through out the country right from 1948 to till date.

 

It is really funny to note that they have already said the same words when Telangana statehood was announced by Central government in 2009 and they are pretending the same innocence once again now and we all have seen that from 2009 to till date, not even a single day has passed without discussion on Telangana. Print media has spent thousands of pages and Electronic media has spent thousands of hours in this discussion.

 

Here are some of the major milestones where the discussions took place at length.

 

1948-50: Operation Polo, Hyderabad state liberty from Nizam's rule, Military rule by Gen. Chowdary, Employees import heavily from Seema-Andhra saying Telangana people do not know Telugu and English. Telangana employees were replaced by Seema-Andhra imported employees.

1950-52: Gen Melody headed the civilian government in Hyderabad state and further increased employees import to Telangana from Seema-Andhra, many protests happened against it.

1953-56: first SRC lead by Justice Fatal Ali, Reported the opinions of all the regions, aspirations for Telangana statehood and apprehensions of Telangana people if the region is merged with Seema-Andhra.

1956: Conditional merger of Telangana with Andhra state against first SRC's recommendations of keeping Telangana separate.

1969-71: Jai Telangana moment.

1971: Telangana Praja Samithi's huge victory in parliament elections despite Indira Gandhi's wave all over the country.

1972-73: Supreme Court’s judgment in support of Mulki rules, Jai Andhra moment in Seema-Andhra against Mulki rules, Introduction of Presidential orders and 6-point formula.

1996-2001: Start of Mali dasha Telangana udyamam by Telangana intellectuals and many meetings were organized in Telangana, Andhra and also outside India. All those occasions were reported in media and Chandra Babu Naidu, the then CM warned publicly that he would suppress any kind of separatist moments in the state.

1999: Representation for Telangana statehood by all Telangana Congress MLA's to Sonia under the leadership of Y.S.Rajashekar Reddy , the then PCC president of AP. CWC accepted the demand and recommended NDA government to consider forming 2nd SRC to resolve all such demands.

2001: Formation of TRS by Kalvakuntla Chandrasekhar Rao after he resigned from TDP and Dy.Speaker post in a big public meeting.

2003: YSR as PCC president announced that Congress has no objection for Telangana statehood.

2004: Congress formed alliance with TRS in general elections, Sonia said in Election campaigns that she knows and work on the aspirations of people of Telangana for statehood if Congress comes to Power, Added the Telangana statehood in the Common minimum program of UPA government, Added in President’s address and Formed Pranab Mukharjee committee to collect the opinions of all the political parties representing in Parliament and majority of them gave letters in support of Telangana.

2005: TRS ministers in Centre and state governments resigned and withdrew support to Congress governments in protest of the delay in forming the Telangana. KCR and others were holding important cabinet posts in both the governments.

2008: TDP resolution towards formation of Telangana state after lengthy discussions in the party at all levels in all the regions and a letter was given to Pranab committee demanding Telangana statehood.

2009: YSR said in assembly that Congress as a principle agrees formation of Telangana state and Roshaiah committee will be formed to address the concerns of the stakeholders. TDP alliance with TRS in general elections included Telangana statehood in their election manifesto.

2009: Announcement by Chidambaram and Pranab Mucharjee in Parliament that process of Telangana state formation will begin. All the parties except CPM agrees and given letters to home minister of India in one or other way for Telangana statehood and blamed Congress for not taking a decision.

2013: Resolution by UPA allies and resolution in CWC by Congress and requested Central Government to form the state of Telangana.

Tuesday, August 20, 2013

సమైక్యత అంటే?

సమైక్యత కోసం గత కొన్ని రోజులుగా సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమాలు మిథ్యమాలే అన్న విషయం బట్ట బయలు కావడం ఒక కోణమైతే, కనీసం వాటినయినా ఎందుకు చఎతున్నారన్నది బయట బడడం మరో కోణం.

సమైక్యవాద ఉద్యమ కాలులమని చెప్పుకునే వారు మాట్లాడే మాటల్లో సమైక్యత అన్న పదం మొదటి వాక్యంతోనే ఆవిరయి పోతుంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆకాంక్ష రెండో వాక్యంలో తొంగి చూస్తుంది. ఇక మూడో వాక్యంలో 'హైదరాబాదు మాదే' అన్న సామ్రాజ్యవాద రాక్షసత్వం గోచరిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు, నీళ్ళు నిధులు అన్న పదాలు అలవోకగా తొంగి చూస్తుంటాయి.

ఇంకా అర్థం కాలేదా? సమైక్యత అంటే వీరి దృష్టిలో హైదరాబాద్, ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు. సరే, వారు చెప్పే వాటిలో ఎంతవరకు నిజాయితీ వుందో పరిశీలిద్దాం.

హైదరాబాదును వారు ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకు రాలేదు ఇప్పుడు అడగడానికి. అది తెలంగాణాప్రాంతం యొక్క అంతర్భాగం. అంతర్భాగం గానే వుంటుంది. వారు ఇక్కడికి వచ్చేటపుడు హైదరాబాదును చూసే వచ్చారు. హైదరాబాదు లేక పొతే కనీసం కలిసే ఆలోచన కూడా చేసేవారు కాదు. హైదరాబాదులో వున్న రాజభవనాలపై ఎంత మక్కువ చూపెట్టారో ఆనాటి ఆంధ్రా అసెంబ్లీలోని ప్రసంగాల పాఠాలను గమనిస్తే అర్థమౌతుంది. హైదరాబాదు పై మక్కువతో కొన్ని షరతులకు అంగీకరించి ఇక్కడికి వచ్చినవారు, ఆ షరతులను నిలబెట్టుకోలేక పోయారు. అందుకే వారు నేడు వెనుదిరిగి పోవాల్సి వస్తుంది.

ఇక ఉద్యోగుల విషయంలో వారు ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణా ఏర్పడ్డాక ఎవరి ఉద్యోగులు వారి ఆఫీసులలో పని చేయొచ్చు గదా? ఇక్కడనే వుంది అసలు కిటుకు! అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడి 80%కి పైగా అన్ని ఆఫీసులలోను వారే తయారయ్యారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రా ప్రభుత్వంలో అందరికీ చోటు లేకపోతే వారి గతేమిటి? కొత్త ప్రభుత్వం అధిక మొత్తంలో ఉన్న ఉద్యోగులను భరిస్తుందా? లేక రిట్రెంచి చేసి తీసి వేస్తుందా? ఈ విధ్యమైన భయాందోళనల వలన ఈ సమైక్య ఉద్యమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొంటున్నారు.

నిజానికి వారి ఆందోళనలో న్యాయం వుంది. కాని నిజాయితీగా వారి భయాలను వెల్లడించినప్పుడే దానికి విలువ కలుగుతుంది. కాని వారిది  'ఇదీ' అని చెప్పుకోలేని బాధ. చెప్పుకుంటే ఇన్నాళ్ళు తాము తేరగా అనుభవించిన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల అవకతవకల వ్యవహారాలు నిజమే నని ఒప్పుకొవాలి. ఒకవైపు అవినీతి పెంటమీద కూచుని, న్యాయం చేయమని ఎలా డిమాండు చేయగలరు? అందుకే వారు మాట్లాడగలిగిన ఒకే ఒక మాట 'సమైక్యాంధ్ర'. ఉంగరం ఆఫీసులో పోగొట్టుకొని వీధిలో వెతికితే దొరుకుతుందా? అలాగే వారి సెక్రెటేరియట్ రహస్యాలు బద్దలు కాకుండా న్యాయం జరగడం అసాధ్యం.

ఇక పొతే నీళ్ళ గురించి వాళ్ళు చేసే వాదన. సమైక్యంగా ఉన్నన్ని రోజులు తెలంగాణా వాదులు 'మా నీళ్లన్నీ మీరే దోచుకుంటున్నారు బాబో' అని అరుస్తున్నప్పుడు, తాపీగా 'నీరు పళ్ళానికి పారక పొతే మెరక మీదకు పారుతుందా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టే వెసులు బాటు లేక పొతే ముఖ్యమంత్రులు మాత్రం ఏం చేయగలరు?' అని పలికారు. ఇప్పుడేమో, తెలంగాణా ఏర్పడితే కృష్ణ, గోదావరి నదులు బిరడలు వేసి బిగిస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అప్పుడు వీలు కాని ప్రాజెక్టులు ఇప్పుడెలా వీలవుతాయో మాత్రం చెప్పరు. దానర్థం ప్రాజెక్టులు కట్టే వెసులుబాటు ఉండీ  తెలంగాణాను ఇంతకాలం ఎండబెట్టామని ఒప్పుకున్నట్టే కదా? వారి అసలు బాధ ఏమంటే అలవోగ్గా పారించుకుంటున్న అదనపు జలాలను ఇప్పుడు తెలంగాణాతో దామాషా ప్రకారం పంచుకోవలసి రావడమే.

ఇక పొతే నిధుల విషయం. రాష్ట్ర ఆదాయంలో 35% హైదరాబాదు నుండే వస్తుంది. అదీ వీరి పాయింటు. ఈ విషయంలో వారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కాదు 1956లో హైదరాబాదు కలిసినప్పుడు కూడా భారత దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. అంతే కాక హైదరాబాదుకు మరో ప్రత్యేకత వుంది. హైదరాబాద్ చుట్టూతా, లోపలా నిజాం ముందు చూపుతో ఏర్పాటు చేసిన సర్ఫేకాస్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ విలువైన భూముల వలననే అనేక ప్రాజెక్టులు హైదరాబాదుకు వచ్చాయి. ఒక వేళ అలాంటి భూములు మరేదైనా సీమాంధ్ర పట్టణంలో వుండి వుంటే తప్పకుండా అక్కడే అభివృద్ధి జరిగి వుండేది.

సీమాంధ్ర నాయకులు చేసిందల్లా అలాంటి విలువైన భూములను పందేరం పెట్టి, తమ అనుయాయులకు ఉపభోక్తం చేయగా మిగిలిన దానిలో కొంత పెట్టుబడిదారులకు రిబేటుగా ఇవ్వడమే. అదీ తాము చేసిన అభివృద్దే అని చెప్పుకుంటే అంతకన్నా అపహాస్యం మరోటి ఉండబోదు.

ముందే చెప్పుకున్నట్టు 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. ఇప్పుడు ఆ ఐదో సస్థానానికి బెంగుళూరుతో పోటీ పడవలసిన దుస్థితి. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో ఎప్పుడూ హైదరాబాదుడి సింహభాగమే. కాబట్టి హైదరాబాదు ఆదాయాన్ని ఆంధ్రాలో కర్చు పెట్టి ఉంటారు తప్ప, ఆంధ్రానుంచి తెచ్చి హైదరాబాదుకి ఒక పూచిక పుల్ల కూడా కర్చు పెట్టి ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయవలసి వస్తే తెలంగాణాకే సీమాన్ధ్రులు ఎదురిచ్చుకోవలసి వస్తుంది.

ఇప్పుడు బోధపడి ఉంటుంది కదూ సమైక్యత అంటే ఏమిటో? సమైక్యత అంటే వెళ్లేముందు అందినంత దోచుకొని వెళ్ళడం. దానికోసమే ఈ పెట్టుడు మిధ్యమాలు. 

Friday, August 16, 2013

వికృత సమైక్యం

పేరుకు సమైక్యవాద ఉద్యమమంటారు.. కానీ గుంటూరులో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారిని ఓర్వరు. కులం, ప్రాంతం పేరుతో దూషిస్తూ.. బెదిరింపులకు దిగుతారు. మీది తెలుగే.. మాది తెలుగే కలిసుండాలంటారు. కానీ పొట్టచేత పట్టుకొని వైజాగ్‌కొచ్చిన ఇందూరు బిడ్డను చావగొట్టి పంపుతారు. బజారు గూండాల కన్నా హీన స్థాయికి దిగజారి నిలువుదోపిడీ చేస్తారు. ఇక మా సమైక్యవాదం ప్రపంచంలోనే గొప్పదనే డాంబికాలు పోతారు. తీరా చూస్తే దీక్ష చేస్తున్న వ్యక్తికి సహకరించడానికి వచ్చిన సొంత ప్రాంత అధికారిణిపైనే అత్యంత అరాచకంగా దాడికి పాల్పడతారు. రోజురోజుకు వికృత పోకడలకు, అరాచక స్థితికి దిగజారుతున్న సీమాంధ్ర లోని సమైక్య ఉద్యమానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

-ఆందోళన ముసుగులో అరాచకాలు
-తెలంగాణ ఉద్యోగిపై గుంటూరులో.. ఇందూరు ఇంజినీర్‌పై విశాఖలో దాడి
-కాకినాడలో మహిళావైద్యాధికారిపై పెండ
-సంక్షేమ శాఖ అధికారి హనుమంతునాయక్‌ను బెదిరించిన ఏపీ ఎన్జీవోలు.. కులం పేరుతో దూషణలు
-ఆంధ్రలో ఉద్యోగం చేయొద్దంటూ బూతుపురాణం
-కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన హనుమంతునాయక్
-ఇందూరు బిడ్డపై వైజాగ్‌లో దాడి
-కాకినాడలో వైద్యాధికారిపై అరాచకం
-తోట వాణికి వైద్యసాయం కోసం వచ్చిన మహిళ అధికారిపై పెండతో దాడి

విజయవాడ, ఆగస్టు 15 (టీ మీడియా ప్రతినిధి):గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను ఏపీ ఎన్జీవోలు కులం పేరుతో దూషించారు. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు దిగారు.

విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు నవీన్‌పై అక్కడి ‘సమైక్య’ గూండాలు దాడికి దిగి.. చితకబాదారు. అతని వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును నిలువుదోపిడీ చేశారు. సమైక్య ఉద్యమంలోని వికృత కోణాలను ఎత్తిచూపుతున్న ఈ ఘటనలు గురువారం జరిగాయి. మరోవైపు సొంత జిల్లా అధికారులను సైతం సహించ లేని స్థితిలో సమైక్య ఆందోళనలు దారితప్పుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి.. ఆమెకు

వైద్య సహాయం అందించేందుకు వచ్చిన జిల్లా వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి దిగి.. ఆమెపై చెత్త, పెండ విసిరి తమ అరాచకాన్ని చాటుకున్నారు. ఆందోళనల పేరిట వికృత స్వభావం సీమాంధ్రలో గంగ సమైక్య ముసుగులో సీమాంవూధలో అసాంఘిక శక్తులు బరితెగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడం మొదలు.. ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి సీమాంధ్ర నాయకులు రోడ్లమీదకి తెచ్చిపడేయడం.. ఉద్యమకారుల ముసుగులో అరాచక శక్తులు రంగంలోకి దిగడం.. సీమాంధ్ర పాలకులు, నాయకుల కనుసన్నలలో ఉద్యమం నడుస్తుడటంతో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం.. నియంవూతణ, నిర్బంధం, స్వీయ అస్తిత్వం అంటూలేని భయాలు, అపోహాలు, ఉద్రేకాలతో ఆందోళనలు కొనసాగుతుండటంతో.. రోజురోజుకు సీమాంధ్ర ఉద్యమంలో ఒక మూఢత్వం, మూర్ఖత్వం కలగలిసిన ఉన్మాద పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సమైక్య ఉద్యమాల పేరిట జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఆయన తనయుడు రాహుల్‌గాంధీకి పెళ్లి చేయడం, జాతీయ నేతలైన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను విశృంఖలంగా పగలగొట్టడం, తెలంగాణ ఉద్యమ నేతలైన కేసీఆర్, కోదండరాం బొమ్మలను జుగుప్స కలిగించేవిధంగా, అమానుష పద్ధతిలో చిత్రీకరించి ఊరేగించడం, పుర్రెకు తొచ్చిన ప్రతి అడ్డమైన దాష్టీకాన్ని ఉద్యమంగా చిత్రీకరించడం సీమాంధ్ర ఉద్యమంలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పెట్టుబడిదారులు, కొన్ని స్వార్థరాజకీయ శక్తులు ఎగదోసిన కృత్రిమ ఉద్యమం ఇదని, దీనిని సీమాంధ్ర మీడియా చిలువలుపలువలుగా ప్రచారం చేస్తోందని సామాజిక మేధావి వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న సీమాంధ్ర ప్రజలు కూడా ఈ ఉద్యమానుల చూసి ఏవగించుకుంటున్నారు. ఇప్పటికే అగ్రకుల, ఆధిపత్య, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతున్న ఈ ఉద్యమంలో మమేకం కాలేక దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ తదితర వర్గాల ప్రజలు తాము సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే హైదరాబాద్‌లోని సీమాంధ్రలకు భద్రత ఉండదు, వారిపై దాడులు జరుగుతున్నాయనే కుంటి సాకులు చెబుతున్న సమైక్యవాదులు.. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులు, ప్రజలపై దాడులకు దిగుతుండటం తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సమైక్యవాదం పేరిట అందరూ కలిసి ఉండాలని చెబుతున్న సీమాంధ్ర ప్రాంత నాయకులు.. ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని, ఇదేనా వారు కోరుతున్న సమైక్యవాదమని నిలదీస్తున్నారు.

తెలంగాణ ప్రాంత అధికారిపై ఏపీ ఎన్జీవోల విషం!
సమైక్యాంధ్ర పేరిట నానాయాగీ చేస్తున్న ఏపీ ఎన్జీవోలు కూడా తెలంగాణ ప్రాంత అధికారులపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యోగులను బెదిరిస్తూ.. తిడుతూ అక్కసు ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర అరాచక ఉద్యమకారులకు తామేమీ తీసిపోమనే స్థాయిలో వికృత స్వభావాన్ని ప్రదర్శించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను కులం పేరుతో దూషించి.. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు, దూషణలకు దిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సాక్షాత్తు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఎదుటే హనుమంత్ నాయక్‌ను ఏపీ ఎన్జీవో ఉద్యోగులు బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. కుల ప్రస్తావన తెచ్చి అవమానించారు. బుధవారం గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. గిరిజన విద్యార్థుల రెసిడెన్షియల్ అడ్మిషన్లను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు జరిగిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యానారాయణ, డీటీడబ్ల్యూవో విజయ్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతునాయక్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు రెసిడెన్షిల్ స్కూల్‌లో అత్యుత్తమ చదువును అందించేందుకు విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు.

ఈ సమయంలో ఏపీఎన్జీవో గుంటూరు పట్ణణ శాఖ అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్‌తోపాటు మరికొందరు ఉద్యోగులు సమావేశ మందిరం వద్దకు వచ్చి లాటరీ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుంత్‌నాయక్ వద్దకు వచ్చిన ఎన్జీవో నేతలు ‘తెలంగాణ వాడివి ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నావ్, ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ అహంకారాన్ని ప్రదర్శించారు. అక్కడే పలువురు ఉన్నతాధికారులు ఉన్నప్పటీకీ ఎన్జీవో నేతలు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి హనుమంత్‌నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని దూషణలకు పాల్పడ్డారు. అధికారులు ఎంత వారించినా వినిపించుకోని వారు.. మరింత రెచ్చిపోయి ‘కులం పేరుతో దూషించారు’. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా పనిచేస్తున్న దయానందరాజు అనే వ్యక్తి వేలెత్తి చూపిస్తూ మరి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై హనుమంత్‌నాయక్ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘నేను జిల్లా స్థాయి అధికారిని. ప్రభుత్వం ఎక్కడ నియమిస్తే.. అక్కడ పనిచేసే అధికారం ఉంది. కానీ ఏపీఎన్జీవో నేతలు నా కులం, ప్రాంతం పేరిట దూషించారు. నా ఆత్మభిమానం దెబ్బతిశారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ ఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలి:
టీ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్
గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రూప్-1 ఆఫీసర్ హనుమంతు నాయక్‌పై ఏపీ ఎన్జీవో నేతలు దుర్భాషాలడటం, కులం పేరుతో దూషించడాన్ని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ఖండించారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏపీఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్రుల ఆధిపత్యం, వారు చేస్తున్న అవమానాలను భరించలేకనే తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హనుమంతు నాయక్‌ను దూషించిన ఏపీ ఎన్జీవో నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందూరు ఇంజినీర్‌పై వైజాగ్‌లో దాడి
పొట్టకూటికోసం విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇందూరు బిడ్డపై సీమాంవూధులు అమానుషంగా దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో మదమెక్కిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న కొన్ని అసాంఘిక శక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన వివరాలివి.. డిచ్‌పల్లికి చెందిన నవీన్ బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభ ఆధారంగా ఆయన ఆంధ్రాకు చెందిన జేఎంసీ ఇన్‌వూఫాస్ట్రక్చర్ కంపెనీలో ఇంజినీర్ ఉద్యోగం వచ్చింది. 20వేల వేతనంతో కూడిన గౌరవవూపదమైన ఉద్యోగమని కోటి ఆశలతో వారం రోజుల కిందట నవీన్ వైజాగ్‌లోని జేఎంసీలో సైట్ ఇంజినీర్‌గా చేరాడు.

తెలంగాణ ప్రకటన రాగానే వైజాగ్‌లో పనిచేస్తున్న తెలంగాణ యువకులను అక్కడి సమైక్య గూండాలు టార్గెట్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నవీన్ పనిచేస్తున్న చోటుకే వచ్చిన ఆరుగురు ఆంధ్రా యువకులు.. పాశవికంగా అతనిపై దాడిచేశారు. అపస్మారక స్థితికి చేరేవరకు కొట్టారు. అంతటితో ఆగకుండా నవీన్ జేబులో నుంచి రూ. 8వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ను కొట్టేశారు. తీవ్ర గాయాలపాలైన నవీన్ తేరుకొని..తెలిసిన స్నేహితుల సాయంతో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైజాగ్‌లోని ఇదే కంపెనీలో పనిచేస్తున్న దోమకొండకు చెందిన భూపాల్ రాహుల్ సైతం అక్కడి ఆంధ్ర గూండాల దాష్టీకానికి భయటపడి ఉద్యోగం మానివేసి ఇంటికి చేరుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర సీమాంధ్ర ప్రాంతాల నుంచి బతకడానికి వచ్చిన సెటిలర్లను నిజామాబాద్ జిల్లాలో 60 ఏళ్లుగా నివసిస్తున్నారు. వారిని ఇందూరు బిడ్డలు కూడా ఆదరిస్తున్నారు. అదే తమ పిల్లలు ఉద్యోగాల కోసం సీమాంధ్రకు వెళితే.. బతకలేని దయనీయ పరిస్థితి ఎదురవుతుండటంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాకినాడలో వైద్యాధికారిణిపై పెండతో దాడి
సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల్లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. నిన్న కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి దీక్షా శిబిరం వద్ద అల్లరిమూకలు వేసిన వీరంగం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహిళ అని కూడా చూడకుండా సాక్షాతూ జిల్లా వైద్యాధికారిణిపైనే దాడికి దిగారు మంత్రి అనుచరులు. అంతేకాకుండా బుధవారం రాత్రి కాకినాడ వీధుల్లో వారు అరాచకం సృష్టించారు. వారి దౌర్జన్యంతో దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. దారినపోయేవారిని కూడా మంత్రి అనుచరులు చితకబాదారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గత ఐదురోజులుగా మంత్రి భార్య తోట వాణి సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు.

బుధవారం వాణి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా వైద్యాధికారి పద్మావతి వచ్చారు. వాణి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే వైద్య సహాయం అందించాలని ఆమె చెప్పారు. అంతే ఆగ్రహించిన మంత్రి అనుచరులు జిల్లా వైద్యాదికారి మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆమె మీద చెత్త, పెండను కుమ్మరించారు. ఈ హఠాత్ దాడితో నివ్వెరపోయిన జిల్లా వైద్యాధికారి పద్మావతి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పోలీసులు అతికష్టం మీద ఆమె రక్షించి అక్కడినుండి తప్పించారు. ఆ తరువాత కూడా మంత్రి అనుచరుల వీరంగం కొనసాగింది. ఒక కుర్చీని రోడ్డు మీదకు విసరగా అటుగా బైక్ మీద వెళ్తున్న ఒక జంటకు గాయాలయ్యాయి. భానుగుడి సెంటర్, పిఠాపురం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులను దిగ్బంధించిన మంత్రి అనుచరులు రోడ్డునపోయే వాహనదారులు, పాదచారుల మీద కూడా దాడికి తెగబడ్డారు. స్థానికంగా ఉన్న సోడా హబ్ షాపు మీదపడి దాన్ని ధ్వంసం చేశారు. సాయం చేయడానికి జిల్లా వైద్యాధికారి వస్తే ఇట్లా అవమానించడం ఏమి సంస్కృతి అని అక్కడున్న పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యమం పేరిట అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారు.
  

Thursday, August 15, 2013

ఇందుకేనా ‘సమైక్యం’

-అడ్డగోలు పోస్టింగ్‌లు.. పదోన్నతులు
-మంత్రి శైలజానాథ్ భార్య మోక్ష ప్రసన్న ఎదిగిన వైనం
-నిబంధనలు తుంగలో తొక్కి పోస్టింగ్‌లు ఇచ్చిన అధికారులు
-డీఎంఈ సీనియర్లను పక్కన పెట్టిన వైనం

ప్రమోషన్లు త్వరగా వచ్చే డిపార్ట్‌మెంట్‌లోకి చేరిక

హైదరాబాద్ ఆగస్టు 14 (టీ మీడియా): ఆమె పేరు మోక్ష ప్రసన్న. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ సతీమణి. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, విభజించవద్దని మంత్రుల భార్యలను వెంటేసుకుని ‘రాజ్‌భవన్’ గడపెక్కారు. మంత్రుల భార్యల బృందానికి నాయకత్వం వహించిన మోక్ష ప్రసన్న రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని మీడియా ఎదుట తన భర్త చెప్పే మాటలనే వల్లించారు. అయితే మోక్ష ప్రసన్న ఎందుకు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు..? మంత్రుల భార్యల బృందానికి ఎందుకు నాయకత్వం వహించారు..? దాని కారణాలేంటీ..? రాష్ట్ర విభజన జరిగితే ఆమెకు జరిగే నష్టమేంటీ..?

ఉస్మానియా మెడికల్ కాలేజీలో అక్రమంగా పోస్టింగ్ పొందిన వారిలో మోక్ష ప్రసన్న కూడా ఒకరు. 


ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత రూరల్ సర్వీస్ పూర్తిచేసుకున్న ఆమె జనరల్ సర్జన్‌గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో పనిచేశారు. యథావూపకారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిహెచ్, ఎపీవీవీపీ నుండి కొంతమంది పీజీ పూర్తి చేసిన డాక్టర్లను సరెండర్ చేసుకుంది. అదే సమయంలో 2010 మే 30న ఎంఎస్ జనరల్ సర్జన్ పీజీ పూర్తి చేసుకున్న మోక్ష ప్రసన్న కేవలం వారం రోజుల్లోనే జూన్ మొదటి వారం 2010లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోస్టింగ్ తీసుకున్నారు. ఈ పోస్టింగ్ ఇచ్చింది అప్పటి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డీఎంఈ రవిరాజ్. మోక్ష ప్రసన్నను సరెండర్ చేసుకున్న తరువాత ఆమెకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్టింగ్ ఇచ్చారు.

ఎన్నో ఏళ్లుగా డీఎంఈ వైపు శ్రీధర్, జీవన్, శాలిని పనిచేస్తున్నప్పటికీ వీరిని కాదని మోక్ష ప్రసన్నకు పోస్టింగ్ ఇవ్వడం వెనుక కేవలం మంత్రిగారి భార్య అన్న కారణమే కనిపిస్తోందనే విమర్శలున్నాయి. మోక్ష ప్రసన్న డీఎంఈ వైపు సరెండర్ కాకముందు నుండే శ్రీధర్ కార్డియోథెరపీ, జీవన్ ట్యూటర్‌గా, శాలినీ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి తరువాత డీఎంఈ వైపు సరెండర్ అయిన మోక్ష ప్రసన్న మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన తేదీ నుండే సీనియారిటీని లెక్కలోకి తీసుకుంటారు. ట్యూటర్లుగా, రీసెర్చ్ అసిస్టెంట్లుగా డీఎంఈ వైపే పనిచేస్తున్నా.. సీనియారిటీని లెక్కలోకి తీసుకోరు. దీంతో మోక్ష ప్రసన్న ఇకపై అన్ని ప్రమోషన్లలోనూ ముందుగానే వెళ్లిపోతారని నష్టపోయిన వైద్యులు చెబుతున్నారు.

త్వరలోనే డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ...?


రాష్ట్రంలోని మొత్తం 14 మెడికల్ కాలేజీలుంటే కేవలం ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాత్రమే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్ ఉంది. నిబంధనల ప్రకారం అయితే ఆమెను ఆ డిపార్ట్‌మెంట్‌కు పంపడం సాధ్యం కాదు. కానీ ఆ శాఖ మంత్రి ఒత్తిళ్ల మేరకు డీఎంఈ వసంతవూపసాద్ మోక్ష ప్రసన్నను గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్‌లోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్‌గా చేర్చారు. ఈ డిపార్ట్‌మెంట్‌కున్న అవసరం రీత్యా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ప్రమోషన్ పెరుగుతుంది. రెండేళ్ల తరువాత అసోసియేట్ ప్రొఫెసర్, ఆ తరువాత రెండేళ్లకు ప్రొఫెసర్‌గా మోక్ష ప్రసన్న ప్రమెషన్ పొందుతారు. ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె త్వరలోనే ఈ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఓడీగా మారుతారని తెలుస్తోంది. అసలామెను డీఎంఈ వైపు సరెండర్ చేసుకోవడమే నిబంధనలను తుంగలో తొక్కి చేసుకున్నారని, పైగా త్వరగా ప్రమోషన్లు వచ్చే డిపార్ట్‌మెంట్‌కు మార్చడం సీమాంవూధుల కుట్ర అని తెలంగాణ డాక్టర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలోని ఎపీఎన్జీవోలతో, సీమాంధ్ర ఉద్యోగులతో ఆందోళనలు చేయిస్తున్న మోక్ష ప్రసన్న తనకు లభించిన పదోన్నతులు ఎక్కడ పోతాయోనన్న భయం, ఇలాంటి దోపిడీ తన ప్రాంతం వారికి దక్కకుండా పోతుందనే భావనే ఆమె సమైక్యాంధ్ర ఉద్యమం చేయడానికి కారణమని నష్టపోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గవర్నర్‌ను కలిసిన మోక్ష ప్రసన్నకు తన ప్రాంతంపై అంత ప్రేమ ఉంటే అనంతపురానికి వెళ్లి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ మండిపడింది. నిబంధనల విరుద్ధంగా పోస్టింగ్‌లు, పదోన్నతులు పొందిన ఆమె ఇప్పుడు సమైక్య ఉద్యమం చేయడం దారుణమని సంఘం అభివూపాయపడింది. ఎంతో మంది తెలంగాణ డాక్టర్ల సీనియారిటీని తొక్కి పైకెక్కిన ఆమె ఇప్పుడు ఎపీఎన్జీవోలను రెచ్చగొడుతున్నారని, తనకు లభించిన అడ్డగోలు ప్రమోషన్లే మిగిలిన వారికి రావాలనే తలంపుతోనే ఈ ఉద్యమం చేస్తున్నారని టీజీడీఏ నేతలు అన్నారు.

Unmasking of Naidu’s contributions to Hyderabad

28th November 2012

We often hear from our TDP friends and Chandrababu Naidu himself that he, Chandrababu himself was responsible for development of Hyderabad into a world class (?) city and IT revolution that had swept India and that cell phone technology was invented and brought to use of the public (?). Their claims belittle Al Gore’s claim of inventing Internet. These claims are incorrect and are deliberately misleading, and without any basis. Hyderabad was the fifth largest city in 1956 and was fifth largest city in 2004 and in 2012. Osmania University is a century old university.

Immediately after India became independent, the Government took upon the responsibility of Industrial development of the country. As there were not too many private entrepreneurs available at that time, the Central Government started a large number of public sector units (PSUs). The PSUs awarded to AP included BHEL, HMT, HAL, BEL, Hindustan Cables, IDPL, NRSA, Nuclear Fuel Complex, ECIL, NMDC, STP, CMC, and NFDB. In addition, a large number of civil and defence research laboratories were also sanctioned by Central Government in AP including DMRL, DRDL, DLRL, DRDO, IICT, CCMB. For reasons best known to the Chief Ministers of those days, unlike in other states where the Central Government public sector units were widely dispersed all over the State, in our State all of them were set up in and around Hyderabad. The private sector came as ancillary to the PSUs and were set up in the proximity of PSUs naturally.

It is because of IDPL, Hyderabad has emerged as the bulk drug capital of India. 90% of these pharmaceutical companies are located in Hyderabad and some of these ancillaries have grown into global companies with huge assets. All these developments took place when Mr Chandrababu Naidu was in his high school and, for him to claim any credit for these is like living in fool’s paradise.

Similarly, the only public sector institutions that were engaged in software development in the country viz ECIL and Computer Maintenance Corporation (CMC) had their head quarters in Hyderabad. It was because of this that Narasimha Rao Government at the Centre, which saw an opportunity for the promotion of software industry in the country promoted six Software Technology Parks (STPs) in India in 1991 and Hyderabad got the first of these. Chennai did not get its own STP till recently. Satyam Computers which was India’s fourth larger software exporting companies was also promoted in early 1990s.

Where and what was the position Chandrababu Naidu holding at that time? There is no greater dishonesty for him to claim any credit for the software development in Hyderabad. It so happened that when Y2K in Western world provided a great opportunity for software exports from India he was the Chief Minister of Andhra Pradesh (AP). If he was as efficient as his predecessors were, he should have grabbed the opportunity for making the state as the largest exporter of software from India, as in the case of bulk drugs. That did not happen and instead, Andhra Pradesh was ranked 3rd in software exports in 1995, i.e. before he became CM in September 1995, has slid to 5th position in 2004. The gap between the software exports of Bangalore and Hyderabad which was just Rs 250 crores in 1995-96 has widened to Rs 2,500 crores in 2003-04 i.e. when he left his seat. AP’s share of India’s software exports in 2003-04 was only 9% as against Karnataka’s 38%. Despite this, thanks to his extraordinary clout in media, he launched a nation-wide propaganda that Hyderabad was the IT Capital of India. Other States like Karnataka and Tamilnadu which have really done wonderful job had never claimed any credit for this. Unsurprisingly, a modest leader that Dr YSR was that he too never claimed any credit for improving AP’s share of 9% in India’s software exports in 2003-04 to 14% in 2008-09.

The only credit Chandrababu can claim is for bringing ISB, but what is the ISB’s social and economic impact on the State or for that matter on Hyderabad? Who are the real beneficiaries of that institution? Unlike Chandrababu, Dr YSR promoted three IIITs, an IIT and 18 new Universities and unlike Chandrababu, Dr YSR always said that the credit must go to the children and their parents for their success in education and IT development. He always used to say that it’s not due to effort of the politicians, but because of the toil of parents and children that they go places and government only provides the facilities and avenues for the children. Big difference between Chandrababu and YSR.

Chandrababu should be credited for donating 850 acres of prime land in Hyderabad with a market value of Rs 2500 crores to his close relative (Billy Rao) from Chittoor district for a deferred payment of Rs 400 crores in the midst of an Interim Government. The IMG Bharath to which said donation was made was a sham company with just one lakh rupees share capital. Similarly, Chandrababu gifted away 535 acres of prime land to EMAAR at Rs 29 lakh per acre although the fair market price was Rs 3 crores per acre in 2002, confirming the loot of the public property.

Chandrababu also must be credited for closing down of prestigious state public sector units such as Allwyn, Nizam Sugar Factories and others of which most of them have been pocketed by his supporters. Yet, he claims to be an honourable man and all others unethical.

D A Somayajulu, Member of Political Affairs & Central Governing Committees of YSR Congress Party, with Gurava Reddy (Atlanta), CVR Murthy (Hyderabad)

Saturday, August 10, 2013

విభజన సమస్యలు

రాష్ట్రంలో ఒకపక్క మాత్రమే వినిపించేది ఏమిటి?

అ. సమైక్యవాదం
ఆ. ప్రత్యేకవాదం

KCR వేర్పాటువాది అయితే, మరి పొట్టిశ్రీరాములు ఏమవుతాడు?

అ. వేర్పాటువాదే!
ఆ. వేర్పాటువాది కాదు.

రాష్ట్రంలో సరైన దామాషాలో ఉద్యోగాలు ఇచ్చి వుంటే విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం వారికి ఎక్కువ ప్రమోషన్లు వస్తాయి? ఏ రాష్ట్రం వారికి ప్రమోషన్లు, అవకాశాలు పోతాయి?

అ. ఇద్దరికీ ప్రమోషన్లు, అధికారాలు వుంటాయి.
ఆ. ఒక ప్రాంతం వారికి అధిక ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తే, వేరొక ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుంది.

రాష్ట్రంలో నదీజలాలను ట్రిబ్యునళ్ళు చెప్పినట్టుగా వినియోగించి వుంటే విభజన సందర్భంలో నీటి పంపకంలో వచ్చే సమస్యలు ఏమిటి?

అ. సమస్యలు వచ్చే అవకాశం లేదు.
ఆ. చాలా చాలా ఊహించ లేనటువంటి సమస్యలు వస్తాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే రాజధాని తెలంగాణలో ఉండాలా? ఆంధ్ర లో ఉండాలా?

అ. ఆంధ్రలో.
ఆ. హైదరాబాదే రాజధానిగా వుండాలి.

మీ సమాధానాలలో (అ)లు ఎన్నున్నాయో (ఆ)లు ఎన్నున్నాయో ఒకసారి చూసుకోండి.

కుట్ర పర్వం పరిపూర్ణం


చంద్రబాబు లేఖతో సీమాంధ్ర పార్టీల కుట్ర పర్వం పరిపూర్ణం అయింది. విభజన గురించి కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చిన వైకాపా ప్రకటన వెలువడ్డ మొదటి రోజే తోక ఝాడించింది. లగడపాటి, కావూరి, కిరణ్ రెడ్డి మొదలైన ఘనాపాటీలు తోక ఝాడించారు (ఇది పూర్తి చేసే సమయానికి జగన్ కూడా రాజీనామా చేశాడని తెలిసింది). ఇప్పుడు చంద్రబాబు కూడా యూ టర్న్ తీసుకొని సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజన మాట ఎత్తాలని చెప్పడం ద్వారా మోసాల డ్రామా పునరావృతమైంది.

కాని గతానికి ఇప్పటికి వున్న చిన్న తేడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ సారి కొంత చిత్తశుద్ధితో వున్నట్టుగా కనిపిస్తోంది. అది చిత్తశుద్దా, ఉత్త డ్రామాయేనా అనే విషయం కాలమే నిర్నయించాలి.

వైకాపా, ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల మోసాల కన్నా చంద్రబాబు మోసం మరీ నికృష్ట మైనది. వైకాపాకి తెలంగాణలో ఎక్కడా బలం లేదు.  సమైక్యవాదం ఎత్తుకోవడం ద్వారా కనీసం ఆంధ్రలో నిలదొక్కు కోవాలనుకుంది. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆడే డ్రామాలు కూడా తమ ప్రాంతంలో ఇతర పార్టీల డ్రామాలతో పోటీ పడుతూ తమ వ్యక్తిగత అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలుగా భావించొచ్చు.

కాని చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఆయన అటు ఆంధ్ర లోను ఇటు తెలంగాణా లోను బలంగా వున్న పార్టీకి అధినేత. కాని ఆయన చేసే పనులు చూసినప్పుడు ఆయన్ను కరడుగట్టిన ఆంధ్రా పక్షపాతిగా, తెలంగాణా వ్యతిరేకిగా మనం అర్థం చేసుకోవలసి వుంటుంది.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణా పేరు ఉచ్ఛరించ నీయలేదు. 2004 ఎన్నికల్లోనూ అతని తీరు మారలేదు. తెలంగాణా ప్రజల ఆకాక్షలను 2008 వరకూ ఆయన ఏనాడూ గుర్తించ లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కోవడానికి వేరే మార్గం లేక తప్పని పరిస్థితిలో ఆయన తెలంగాణాకు మద్దతు ప్రకటిస్తూ ప్రనభ్ కమిటీకి ఉత్తరం ఇచ్చాడు. కాని ఎలక్షన్లు అయిపోయిన మరునాటి నుండీ ఆయనకు తెలంగాణపై అన్య మనస్కతే. తాను  మానిఫెస్టోలో పెట్టిన ముఖ్యమైన అంశాన్ని గురించి ఏనాడూ అసెంబ్లీలోనూ బయటా ఆయన మాట్లాడిన పాపాన పోలేదు.

తీరా 2009లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసేసరికి, కాంగ్రెస్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని తెలంగాణాకు మద్దతు ప్రకటించినట్టు నటించాడు. తీరా 2009 డిసెంబర్ 9న తెలంగాణా ప్రకటించే సరికి, తాను ప్రకటించిన మూడోరోజే తన మాటలకు, పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలాడు.

అప్పటి నుండి తెలంగాణా కోసం వెయ్యి బలిదానాలు జరిగినా అయ్యవారికి చలనం రాలేదు. ఏనాడూ తెలంగాణాపై ఒక చిన్న ఉత్తరం కూడా రాయలేదు. తీరా పాదయాత్ర దగ్గర పడేసరికి, తన మోసపూరిత వ్యవహారాలను చూసి భగ్గుమంటున్న తెలంగాణా ప్రజలను శాంత పరచవలసిన అవసరం కలిగింది.

దరిమిలా తెలంగాణాపై అఖిల పక్షాన్ని పిలవాలని, అక్కడ తన అభిప్రాయాన్ని చెపుతానని మరో లేఖ ప్రధానమంత్రికి పంపాడు. అనుకోని విధంగా షిండే అఖిలపక్షం ఏర్పాటు చేసేసరికి చంద్రబాబు మరోసారి ఖంగు తిన్నాడు. ఆ సమావేశంలో తాము ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో అంతా చెప్పామని, ఇప్పుడు తాజాగా చెప్పేదేమీ లేదని తనకు అలవాటైన బుకాయింపు మాటలే చెప్పించాడు. బయట పాదయాత్రలో మాత్రం తానూ తెలంగాణాకు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాడు.

ఇపుడు కేంద్రం మరోసారి తెలంగాణా ప్రకటనతో ముందుకు వచ్చేసరికి అయ్యగారికి దిక్కు తోచలేదు. మొదట పార్టీ వారితో రరాజీడ్రామాలు యధావిధిగా జరిపించాడు. తన పార్టీ తెలంగాణా ఎంపీలను పార్లమెంటులో ఏనాడూ అనుమతించని చంద్రబాబు, సీమాంధ్ర ఎంపీలను మాత్రం ప్లకార్డులు పట్టుకొని పోడియంలో ప్రదర్శనలు ఇచ్చేందుకు పురికోల్పాడు. అంతటితో ఊరుకోకుండా తాజాగా ప్రధాన మంత్రికి మరో లేఖ రాశాడు. తెలంగాణాపై అన్ని వర్గాలను ఒప్పించే దాకా రాష్ట్ర విభజన ఆపాలని ఆ లేఖ సారాంశం.

ఈ విధంగా ఆయన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తన మనసులో దాచుకున్న కుళ్ళు మరోసారి బయట పడింది. ఇదంతా చూస్తుంటే చంద్రబాబే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నాయకులకు రింగ్ లీడర్ గా వ్యవహరిస్తూ రాజీ డ్రామాలను చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు కిరణ్ తో ఉన్న అనైతిక బాంధవ్యం గత అవిశ్వాస తీర్మాన సమయంలోనే అందరికీ తెలిసి పోయింది. తాజా లేఖతో ఈ గుంపు అంతా పార్టీలకు అతీతంగా తెలంగాణాపై కత్తి గట్టారని స్పష్టం అవుతోంది. తెలంగాణా తెలుగు తమ్ముళ్ళూ, జర జాగ్రత్త, మీరింకా బాబుతోనే వుంటే మీకు తెలంగాణలో నీళ్ళు ముట్టవు. తెలంగాణా వైకాపా నాయకుల మాదిరిగా మీరు కూడా ఆ సీమాంధ్ర పార్టీని వదిలి రాక పొతే ఆ తర్వాత మీరు ఇక్కడ రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదు.

Friday, August 9, 2013

సీమాంధ్ర ముఖ్యమంత్రి


నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగు చూసినంక కిరణ్ కుమార్ రెడ్డి తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని, కేవలం సీమాంధ్రకే నని తనకు తానే ప్రకటించు కున్నట్టు కనిపించింది. సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఏ కాలం లోనైనా తెలంగాణాకు మేలు చేస్తారనే (కనీసం కీడు చేయరనే) భ్రమలు తెలంగాణా ప్రజలకు ఎప్పుడో పోయాయి. కాని నిన్న జరిగింది మాత్రం 'నేను సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, కేవలం ఆంధ్రా ప్రయోజనాలు కాపాడే వాడిని' అని నగ్నంగా బయట పడడం.

ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీటు ఒక్కటి చాలు తెలంగాణా రాష్ట్రం ఎంత అవసరమో నిగ్గు తేల్చడానికి. తెలంగాణా ఏర్పడితే తెలంగాణకి ఎంత నష్టమో బెదిరిస్తూ సాగింది ఈయన ప్రసంగం. ఈయన దృష్టిలో రాష్ట్రం విడిపోతే తెలంగాణాకి వచ్చేవి నష్టాలు, ఆంధ్రాకు రావాల్సినవి హక్కులు.

ఈయన చెప్పిన అంశాలలో ప్రధానమైనది నీళ్ళ సమస్య. విభజన తర్వాత నీటి పంపకాల విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉవ్న్నాయని ఆయన చెప్తున్నారు. కాని అంతర్రాష్ట్రీయ నీటి పంపకాలను నిర్ణయించేందుకు జాతీయంగా ఇప్పటికే అనేక నిబంధనలు ఉన్నాయి. నదుల ట్రిబ్యునళ్ళు వాటి అవార్డులు ఉన్నాయి. వాటి ప్రకారం నదీజలాల పంపకాలు న్యాయంగా జరుప బడతాయి. ఆ విషయాలు తెలియని అమాయకుడు అనుకోలేం మన సీయం. ఆయన బాధల్లా ఆంధ్రాలో, రాయలసీమలో ఇప్పుడు అక్రమంగా వాడుతున్న నదీజలాలు విడిపోయిన తర్వాత కూడా అలాగే దోపిడీ ఎలా కొనసాగించాలి అనేదే సమస్య. ఆయన కేంద్రాన్ని కోరే వివరణ దీని గురించే. విభజన తర్వాత కూడా తెలంగాణాకు ఎలా అన్యాయాలు చేయాలి అనే వెసులు బాటు గురించే.

ఇదొక్కటే కాదు ఆయన స్పృశించిన ఇతర సమస్యలు కూడా అలాగే కనిపిస్తాయి. ఉద్యోగుల గురించి ఆయన ప్రస్తావన కూడా అలాంటిదే. 610 జీవోకి సంబంధించిన అక్రమ ఉద్యోగులు అసలు లేరే లేరన్నట్టుగా ఆయన మాట్లాడారు. అందరూ సక్రమ ఉద్యోగులే వుంటే మరి ఆయన ఆందోళన ఎందుకో అర్థం కాదు. ఆంధ్రా తెలంగాణా ఉద్యోగుల దామాషా సరిగానే వుంటే, మరి ఎవరి ప్రభుత్వంలో వారు హాయిగా ఉద్యోగాలు చెసుకొవచ్చు. అదొక సమస్యే కాదు. కాని మన కిరణ్ కుమార్ గారికి సమస్య కనిపిస్తుంది.

దామాషాలను మించి అనేక మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలలో అక్రమంగా తిష్ట వేయడమే ఆ సమస్య. రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ బోయే ముందు ప్రతి ఉద్యోగి సర్వీసు పుస్తకం తప్పని సరిగా తనిఖీ చేయవలసి వుంటుంది. దాని ఆధారంగా సదరు ఉద్యోగి ఏ ప్రాంతానికి చెండుతాడో నిర్ణయించి ఆ ప్రాంతానికి పంపవలసి వస్తుంది. ఆ విధంగా అవసరానికి మించిన అనేక రెట్ల ఉద్యోగుల భారాన్ని ఆంధ్రా ప్రభుత్వం మోయాల్సి వుంటుంది. ఈ విషయాన్ని APNGO లీడర్లు బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు కూడా. ఇలాంటి అక్రమ ఉద్యోగులను సీమాంధ్ర ప్రభుత్వానికి పంపకుండా, తెలంగాణలో పర్మనెంటుగా ఉంచాలనే తపన సీమాంధ్ర JAC కి మూల విరాట్టుగా వ్యవహరిస్తున్న నాయకుల వారిది! అదే ఆయన మాటల్లోని అంతరార్ధం.

ఇక పొతే విద్యుత్తు గురించిన ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్ల వాడికి కూడా నవ్వు తెప్పిస్తాయి. తెలంగాణా విడిపోతే కరెంటు లేక మీరు అల్లాడి పోతారు అన్న బెదిరింపు ఆయన మాటల్లో కనిపించింది. ఆయన చెప్పింది కొంతవరకు వాస్తవమే. కేంద్రప్రభుత్వం రామగుండంలో NTPC స్థాపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బొగ్గు నిక్షిప్తాలు అపారంగా కలిగిన తెలంగాణాలో ఏర్పడ వలసిన పవర్ ప్లాంట్లను ఉద్యోగాల యావతో ఆంధ్రాకు తరలించింది. ప్రపంచంలో ఎక్కడైనా ప్రధాన ముడిసరుకుకు దగ్గరగా కర్మాగారాలను ఏర్పాటు చెస్తారు. కాని సీమాంధ్ర పక్షపాత బుద్ధులు అపారంగా కలిగిన మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సింగరేణి బొగ్గు ఆంధ్రాకు, రాయలసీమకు తరలించి ఎక్కువ వ్యయంతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది! ఫలితంగా మనం ఎక్కువ కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నాం.

ఇప్పుడు అసలు సమస్య ఏమంటే ఈ అక్రమ కరెంటు ఉత్పత్తి కర్మాగారాలకు బొగ్గు ఉండదు, నీళ్ళు వుండవు. అదే మన సీయం గారి బాధ. కాని అది బయటికి చెప్పకుండా తెలంగాణాకి కరెంటు సమస్య వస్తుందని ఆయన బుకాయిస్తున్నారు. 'మీకు బొగ్గూ నీళ్ళూ అమర గలిగి నప్పుడు, మాకు కరెంటు అమరదా కిరణ్ రెడ్డీ? నువ్వు మరీ చిలిపి!' రాష్ట్రం ఏర్పడే ముందు కేంద్రాన్ని వత్తిడి చేసి, బొగ్గు వాటాలు పొంది, కరెంటు విషయంలో తెలంగాణాకు మొండి చెయ్యి చూపాలనేదే ఆయన అసలు ఆలొచన.

ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ఆలోచనలు కావు. తెలంగాణా ప్రజలను బెదిరించి రాష్ట్ర విభజనను అడ్డుకోవడమో, లేక విభజన అనివార్యమైతే ఎలాగైనా కేంద్రంపై వత్తిడి పెంచి తెలంగాణా వనరులను శాశ్వతంగా దోపిడీ చేయడమో సీమాంధ్ర దోపిడీదారుల ఆలోచనగా కనపడుతుంది. ఆ వాణినే వారి ప్రతినిధిగా ముఖ్యమంత్రి వినిపిస్తున్నారు.

Thursday, August 8, 2013

అసత్యపూరిత సమై'ఖ్య' మిథ్యమాలు

 
ఈ ఉద్యమంలో మొదటి, అతి పెద్ద అబద్ధం పొట్టి శ్రీరాములు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ సమై'ఖ్యాం'ధ్ర గురించి ఆలోచించి ఉండడు. ఆయన కోరింది మద్రాసు నుండి ప్రత్యేకాంధ్ర. నిర్లజ్జగా అది విస్మరిస్తూ ఆయన ఫోటో పెట్టుకుని మిధ్యమాలు చేస్తుంటారు ఈ అబద్ధాల కోరులు.

ఒకప్పుడు అపస్మారకంలో వుంది ఆయన చస్తుంటే కూడా, పట్టించు కోలేదు, వైద్య సహాయం అందించ కుండా ఆయన చావుకు కారకులయ్యారు. ఇప్పుడు ఆయన ఆశయాలను వక్రీకరిస్తూ ఆయన ఆత్మ హననానికి కూడా పాల్పడుతున్నారు.

పైపెచ్చు ఆయన కోరుకున్న సమైక్య 'ఆంధ్ర' రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఒప్పుకోకుండా ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణా, గ్రేటర్ రాయలసీమ అనుకుంటూ కాట్లాడ కుంటారు. 
వీరి నాయకుల్లో ఎవడు మాట్లాడినా మొదటి వాక్యంతో సమై'ఖ్యాం'ధ్ర ముగిసి పొతుంది. ఆ వెంటనే హైదరాబాదుపై హక్కు సాధించు కుంటాం అనే ఆధిపత్య ధోరణి కనపడుతుంది. హైదరాబాదు వస్తే సమైక్యత అవసరం లేదన్న మాట! వారి సమై'ఖ్య'త అర్థం అదేనేమో!

అంటే అప్పటివరకూ వీరు చెప్పే తెలుగు జాతి, అన్నదమ్ములు వగైరా ఊకదంపుడు అంతా అబద్ధాలని తెలంగాణా వారికి ఎప్పటినుండో తెలుసు,కాని ఇప్పుడు ఆంధ్రా సోదరులకు కూడా అర్థమవుతున్నాయి.

సగటు ఆంద్ర పౌరుడు రాష్ట్రం విడిపోతే దగ్గరలో సొంత రాజధాని కావాలని అనుకుంటాడు. కాని ఈ సమెక్కుడు వాదులు మాత్రం రాష్త్రం విడిపోయినా, కలకాలం హైదరాబాదు రాజధానిగా కావాలను కుంటారట. అంటే రాజధాని కోసం రాష్ట్రం దాటి 200 కి మీ ప్రయాణిస్తారన్న మాట ప్రతి రోజూ!
వీరికి పక్కనున్న తెలంగాణా వారి బాధలు పట్టవు. అర్థ శతాబ్దంగా వీరు ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అని ఒక సెకను మాత్రం కూడా ఆలొచించరు. కాని రాష్ట్రం విడిపోతుంది అనగానే వీరికి బోడోలాండ్ గుర్తుకు వస్తుంది. గూర్ఖాలాండ్ గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే కలిసి పోయిన జర్మనీ గుర్తుకు వస్తుంది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాలని వాదించే వీరికి గోర్ఖాలు, బోడోలు వారి సొంత భాషలు కలిగి ఉన్నారని తెలియదా?

జర్మనీ దేశాలుగా కలిసినా, ఆ దేశంలో జర్మను భాష మాట్లాడే పదుల కొద్దీ రాష్ట్రాలున్నాయని తెలియదా? వారికి అన్నీ తెలుసు, అయినా అసత్యాలు మాట్లాడడంలో అందెవేసిన చేతులు వారు. 

ఒక వైపు రాష్ట్ర రాజధానినుండి నలభై శాతం రెవిన్యూ వస్తోంది అని వారే ఒప్పుకుంటారు.  నిజాం కాలం నుండి కూడా రాష్ట్ర రాజదానిదే ఆదాయంలో సింహభాగం.  ఆ కాలంలోనే దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. ఇప్పుడు కూడా దానిలో మార్పేమీ లేదు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కూడా హైదరాబాదు మిగులు ఆంధ్రాలో వినియోగించారు తప్ప, హైదరాబాదును వారు అభివృద్ధి చేసినదేమీ లేదు. కాని హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని బుకాయిస్తారు. 

వీరు హైదరాబాదుకు చేసిందేమీ లేదు, జలగలు రక్తం పీల్చినట్టు తెలంగాణా ఆదాయం పీల్చి సీమాంధ్ర ప్రాజెక్టులు నిర్మించుకోవడం తప్ప.  
తెలంగాణా వాదులు మొదటి నుండి నీళ్ళు, ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చారు. కాని సమైక్యవాదులు ఆ వాదనను ఏనాడూ ఒప్పుకున్నా పాపాన పోలేదు.

నీళ్ళ విషయంలో తెలంగాణా వాదులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వచ్చినప్పుడల్లా  'నీరు పల్లమెరుగు కదా? మేం పల్లంలో ఉన్నాం కదా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి వీలు కాకపొతే మేమేం చేయాలి?' అంటూ అమాయకంగా ప్రశ్నించే వారు. తెలంగాణా ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపించ గానే వీరి రాగం మారిపోయింది.

తెలంగాణా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులకు తెలంగాణా వారు అడ్డు కట్టలు వేస్తారట! ఒక్క చుక్క నీరు కూడా కిందకు దిగకుండా చేస్తారట! ఇంతకీ వీరి మాటల్లో ఏది నిజం? నిన్నటి వరకూ చెప్తున్నట్టు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టడం వీల్లేదన్న మాటలా? లేక పోతే ఆంధ్రాకు చుక్క నీరు వదలకుండా ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాలో వాడుకొనే వీలున్నదా?   

వీరు ఇన్నాళ్ళుగా అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నదే నిజం అనుకున్నా, ఏ రాష్ట్రం కూడా తనకు కేటాయించిన జలాలు మాత్రమే వినియోగించుకో గలుగు తుంది. అది నిర్ణయించే టందుకు ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో కలిసి నదుల పంపకం వుంది. మన పైవారు ఎవరూ నీటికి బిరడా బిగించు కొలేదే?

సమెక్కుడు వాదులూ, ఇలాంటి అబద్ధాల మిధ్యమాలతో మీరు ఆంధ్రా ప్రజలని నమ్మించ గలరేమో కాని, ప్రపంచాన్ని నమ్మించ లేరు. 

Saturday, August 3, 2013

కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం

గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న సమెక్కుడు ఉద్యమాలను చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎలా వున్నా ఇక్కడి PCC ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి లకు ఈ ఉద్యమాన్ని కంట్రోలు చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లెదని. ఈ విషయం సమేక్కుడు చానెళ్ళ ఫూటింగులు చూస్తె ఈజీగా అర్థం చేసుకొవచ్చు.

తెలంగాణాలో చిన్న ధర్నా అయినా వేల సంఖ్యలో మొహరించే పోలీసులు అదే సీమాంధ్ర మచ్చుకైనా కనపడరు. పది మంది కలిస్తే విగ్రహ దహనాలు, ఇరవై మంది కలిస్తే రోడ్డు రొకోలు.



దహనాలకు పాల్పడుతున్నా, విగ్రహాలను కూలుస్తున్నా, పట్టుమని పదిమంది కలిసి క్యూలో నిలబడి హైవేపై రాస్తారోకో చేసినా పోలీసు అనే వాడు కనపడడం లేదు. కంపెనీలకొద్దీ బలగాలను సీమాంధ్రకు పంపించారని వార్తలు వచ్చాయి. ఏరీ? ఎక్కడా కనపడరే? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలంగాణలో పోలీసులు ఎలా వ్యవహించారో జనం ఇంకా మరిచి పొలేదు. కాబట్టి ఈ ఉద్యమం ప్రభుత్వం, పోలీసు పెద్దలు, సీమాంధ్ర మీడియా, పెట్టుబడి దారులు కలిసికట్టుగా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు.

ఇలాంటి పెట్టుడు ఉద్యమాలు అధికారికంగా నడిపిస్తూ మరోసారి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని ఈ మూకలు చివరి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి విరుగుడు మందు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సత్వర నిర్ణయాలు తీసుకోక తప్పదు.
  • ముఖ్యమంత్రికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అవసరమైతే మార్చాలి. 
  • DGP ని మార్చి మరో ఉత్తర భారతదేశానికి చెందిన ఎవరైనా నిస్పక్షపాత ఆఫీసర్ ని నియమించాలి. 
  • కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిన తాత్సారాన్ని విడనాడి, సత్వరమే వర్షాకాల సమావేశాల్లో తెలంగాణా ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టాలి. 
  • సీమాంధ్రకు క్యాపిటల్ ప్రకటించి సదరు కాంట్రాక్టుల బూచీ చూపి కొందరు పెట్టుబడి దారులను కట్టడి చెయ్యొచ్చు. కాంట్రాక్టర్ల దృష్టి మరలితే పెట్టుడు ఉద్యమం హుష్ కాకీ అని వేరే చెప్పవలసిన పని లేదు. 
  • సీమాన్ధ్రకు ఒక IIT, ఒక AIIMS లను ప్రకటించాలి. అవి ఎక్కడ పెడతామో చెప్పకుండా నాంచాలి. దాంతో మాకంటే మాకు అని పేచీలు పెట్టుకుంటూ ఉద్యమం సంగతి పక్కకు పెడతారు. 
పై ఎజెండా శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో చాప్టరు కన్నా వంద శాతం ఉత్తమమైనదని ఘంటాపథంగా చెప్పగలను. 


KCR ఏమన్నాడు?

KCR ఆంధ్రోల్లని వెళ్లి పొమ్మని అన్నాడట. కాదు కాదు పంపించి వేస్తాం అన్నాడట. అది కూడా కాదు జాగో భాగో అన్నాడట. ఇదీ నిన్నటి నుంచి సీమాంధ్ర మీడియాలో మారు మోగుతున్న వార్త.

అసలు KCR అన్నదేంది?

NGO సంఘాలు రాష్ట్ర ప్రకటన వచ్చిన సందర్భంగా ఆయనను అభినందించడానికి వెళ్ళినప్పుడు ప్రసంగిస్తూ, వారిని ఉత్తేజ పరిచే సందర్భంలో అన్నమాటలు అవి. ఏమన్నాడో కింది వీడియో చూడండి.



ఇంతకీ ఆయన ఏమన్నాడు? రాష్ట్రాలు వేరు పడ్డ తర్వాత ఆంధ్రా ఉద్యోగులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలని. వారికి ఇక్కడే తిష్ట వేయడానికి ఆప్షన్లు ఏమీ ఉండవని.

దానిలో అంత అనకూడని విషయం ఏముందో సీమాంధ్ర మీడియాకే తెలియాలి. కోతికి కొరివి దొరికినట్టు ధర్నాలు చేస్తున్న ఆంద్ర ప్రాంతపు ఉద్యోగులకే తెలియాలి.

అంటే వీరి ఉద్దేశం ఏమిటట? ఇంతకాలం తెరగా తెలంగాణా కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలు వెలగబెట్టింది కాక రాష్ట్రం విడిపోయినాక కూడా ఇక్కడనే తిష్ట వేయాలనా? ఆప్షన్లు అడిగితే హైదరాబాదు వదిలి వెళ్ళడానికి ఒక్కడైనా ఆప్షను ఇస్తాడా? మరి ఆంధ్రా ప్రభుత్వం నడిచేదేట్లా?

అయినా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా పది సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా హైదరాబాదు ఉంటుందని CWC ప్రకటనలో చెప్పనే చెప్పారు. అంటే ఆంధ్రకి చెందిన ఉద్యోగులు కూడా అప్పటి వరకూ హైదరాబాదులోనే కదా ఉండేది? కాకపొతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్యాలయాలలో హైదరాబాదులోనే పనిచేస్తారు. KCR చెప్పింది కూడా అదే. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోనికి వెళతారు, కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు మిగులు పోస్టులలో ప్రమోషన్లు వస్తాయి అని ఆయన చెప్పారు. దానికి అంట రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమిటి? కనీసం హైదరాబాదులో వున్నా ఆంధ్రా కార్యాలయానికి కూడా మారరా?

ఉన్న ఉద్యోగులను అందరినీ తెలంగాణలో వదిలించుకొని, ఆంధ్రాలో మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి, తద్వారా లబ్ది పొందాలనేది సమెక్కుడు వాదుల దురాలొచనగా కనిపిస్తుంది. ఇప్పుడు KCR మాటలతో అది కాస్తా బయట పడింది! తెలంగాణా వాదులారా పారాహుషార్!! రాష్ట్రం నిజమయ్యే లోగా మరెన్నో ఇలాంటి కుట్రలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త.

Friday, August 2, 2013

సమైక్యవాద డ్రామాలు


కుహనా సమైక్యవాద డ్రామాలు మళ్ళీ మొదలైనయి. దానికి తోడు సీమాంధ్ర మీడియా డప్పు వాయిన్చుడు కూడా మొదలైంది. కుహనా అని ఎందుకనవలసి వస్తుందంటే, సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రల జరుగడమే. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నరంట. మరి ఇక్కడ సమైక్యతా కొరకు ఒక సర్పంచి, ఒక వార్డు మేమ్బరి కూడా చెయ్య లేదే? మరి గదేమి సమైక్యత? ఒక్కవైపే ఉండే సమైక్యతా ఏందో ఆ సమైక్య వాదులమని చెప్పుకునే మట్టి బుర్రలకు తప్ప ఎవ్వరికి అర్థం కాదేమో!

స్కూలు పిలగాండ్లతోని ఊరేగించుకుంట వాళ్ళు చేస్తున్న తాటాకు చప్పుళ్ళని పులి గర్జనల లెక్క చూపిస్తందుకు ఆంధ్ర మీడియా పడే పాట్లు చూస్తుంటే నవ్వాల్నో ఏడవాల్నో ఆర్థం అయితలేదు. ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామాలు చేస్తున్నరని నిముష నిముషానికి ఇచ్చే ప్రకటనలు, రాష్ట్రం రెండు ముక్కల కింద బద్దలైతున్నట్టు చూపెడుతున్న ఆనిమేశన్లు... చెప్ప తరం గాదు వాళ్ళ బాధలు.

A ని A లెక్క చూపెట్టే టందుకు బాధ పడే అవసరం లేదు. కాని A ని B లెక్కనో D లేక్కనో చూపెట్టాలె నంటెనే కష్ట పడవలసి వస్తది. ఆ సినిమా కష్టాలే ఇప్పుడు సీమాంధ్ర మీడియా పడుతున్నది. కడుపు రాకుండానే బిడ్డను కనేతందుకు పురిటి నొప్పులు పడుతున్నది. కాని ఆ చెప్పుట్లనే, చూపెట్టుట్లనే వాళ్ళ ఉద్యమాల అసలు రంగు దానంతట అదే బయట పడుతున్నది.

రాజీనామా లేఖలు దిగ్విజయ్ సింగుకు ఇచ్చినరట! రాష్ట్ర మంత్రులు ముఖ్య మంత్రికి ఇచ్చినరట! కొంతమంది బొత్సకు ఇచ్చిన్రట. మరి కొంతమంది ఫ్యాక్సు చేసిన్రట! ఎవనిగ్గావాలే ఈ ఊక దంపుడు?తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని ఇప్పుడు పసి పిల్లగానికి కూడా ఎరుకే, రాజీనామా ఎవరికిస్తే ఏ పద్ధతిల ఇస్తే ఆమోదించ బడుతదో! మరి సిగ్గు లేని సీమాంధ్ర మీడియాకు ఎందుకు అర్థంగాదు?

మనుషులు రాకపోయినా ఉన్న కొద్ది మందినే క్లోజప్ ల చూపిస్తరు. ఎక్కడన్న దిష్టిబొమ్మ తగులబడితే దాన్నొక దావానలం లెక్క జూమ్ చేసి మరీ చూపిస్తరు. ఆంధ్రా అంటుకున్నదన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తరు. గత నలభై ఎనిమిది గంటల్లో ఈ చానళ్ళు సీమాంధ్ర, హింస అన్న పదాలను కలిపి ఎన్ని సార్లు వాడాయో లెక్క లేదు. వాటికి ఇప్పుడు సీమాన్ధ్రలో హింస కావాలె. అది జరుగుత లేనందుకు అవి పిచ్చెక్కి పొతున్నయి. ఎట్లనన్న రెచ్చ గొట్టాలె నని అవి చేయని ప్రయత్నం లేదు. 

కాని వీటికి అతీతంగా మెజారిటీ సీమాంధ్ర ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నరు. ఒక ప్రాంతం ప్రజల వత్తిడి ద్వారా రెండు ప్రాంతాలను కలిపి వుంచడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనీసం ఆ ఒక ప్రాంతపు ప్రజల మద్దతు కూడా లేని ఇలాంటి సిగ్గు మాలిన ఉద్యమాలు ఎన్నటికీ కొసెల్ల జాలవు.

Thursday, August 1, 2013

జయహో తెలంగాణా



తెలంగాణా సోదర సోదరీమణులకు శుభాభినందనలు. చిరకాల పోరాటాల అనంతరం ఊహించని సాఫల్యత లభించింది. తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత కాంగ్రెస్ పార్టీని నిర్ణయం దిశగా పురి కొల్పింది. తెలంగాణా వాదులు మొదటి నుండి విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ వ్యూహాలు నిజమని నిరూపించ బడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పని అనివార్య పరిస్థితులను కల్పించాయి.

అయితే మనం అప్పుడే పండగ చేసుకోవలసిన అవసరం లేదు. సీమాంధ్ర పెట్టుబడి దారుల కుట్రల తీవ్రత మనకు తెలియనిది కాదు. పది జిల్లాలతో కూడిన రాష్ట్ర ఏర్పాటు పైన కేంద్ర కాబినెట్ నిర్ణయం వచ్చేంత వరకూ, పార్లమెంటులో బిల్లు పాసయ్యేటంత వరకూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి.

పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ప్రకటించి హైదరాబాదుపై మరో సందిగ్ధత లేవ నెత్తారు. గతంలో రాష్ట్రాలుగా ఏర్పడ్డ చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ లాంటి రాష్ట్రాలకు రాజధాని ఏర్పాటుకు ఎంత సమయం పట్టిందో ఉదాహరణ లున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతటి వనరులైనా సమకూర్చడానికి ఒకటి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం అవసరం లేదు. అప్పటివరకూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు తెలంగాణా రాష్ట్రంతో పాటు హైదరాబాదులోని వసతులను ఉపయోగించుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు.

కాని అప్పుడే కొన్ని నోళ్ళు కేంద్ర పాలిత ప్రాంతమని, నగరంపై ఉమ్మడి అధికారమని నోళ్ళు పారవేసుకోవడం మొదలు పెట్టాయి. తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా వుండవచ్చు. అంత మాత్రాన అది ఉమ్మడి నగరం ఎంతమాత్రం కాదు. హైదరాబాదు తెలంగాణా సొత్తు. తెలంగాణలో అంతర్భాగం. దాన్ని తెలంగాణా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు.

ఐదు లక్షల కోట్లతో హైదరాబాదు లాంటి కొత్త నగరం కట్టివ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డిమాండు చేస్తున్నారు. పిర్రలు నావి కాకపోతే కంప మీదనుండి దేకుతానన్నాడట వెనకటికి ఎవడో. అలా వున్నాయి బాబు మాటలు. అలవి కాని కోరికలు కోరి ఇక్కడే తిష్ట వేయాలనే దురాలోచనలు కనబడుతున్నాయి వారి మాటల్లో.

ప్రకటన వెలువడగానే కృత్రిమ ఉద్యమాలు మళ్ళీ మొదలు పెట్టారు కుహనా సమైక్య వాదులు. యునిఫారం లోని విద్యార్థులు, కొన్ని రౌడీ మూకలు తప్ప ప్రజలే కనపడడం లేదు వాటిలో. దానికి తోడూ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫ్యాక్సు రాజీనామాలు నవ్వు తెప్పిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజలారా, ఇలాంటి ఉద్యమాల పట్ల, నాయకుల పట్ల అప్రమత్తంగా వుండండి. వీళ్ళని నమ్మితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

కాసుల గలగలలు తప్ప మరేదీ పట్టని సీమాంధ్ర పెట్టుబడి దారులు, యూ టర్న్ తీసుకోవడానికి ఎంతో  సమయం పట్టదు. రాష్ట్ర ప్రకటన వెలువడి కొత్త రాజధాని ఏర్పాటుకు టెండర్లు మొదలవగానే, వీళ్ళ ప్రాధాన్యతలు అనూహ్యంగా మారిపొతాయి. కాని అప్పటిదాకా జాగ్రత్తగా వచ్చిన రాష్ట్రాన్ని పసిబిడ్డ లాగా గద్దలు ఎత్తుకు పోకుండా కాపాడు కోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలదే.

జై తెలంగాణా!