Saturday, April 16, 2011

సమైక్య వాదులకు మూడు ఆప్షన్లు.

ఇక్కడ వ్రాసిన ప్రేలాపనకు నా సమాధానం.

మీరు ఎన్ని కుట్రలు, వంచనలు చేసినా, ఎన్ని డబ్బు సంచులు డిల్లీలో పంచినా తెలంగాణా ఏర్పాటు కాక తప్పదు. ఒక వేళ 2011 ల కాకపోతే 2014 ల రాక తప్పదు. అప్పటిదాకా మొకాలడ్డుకుంట నిలబడి చెడ్డ పేరు తెచ్చుకోకండి. విడిపోయినాక తెలంగాణా పై మీరు ఆధార పడాలే గాని తెలంగాణా మీ పై ఆధార పడదు. అందుకే మీరు బుద్ధిగా రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే మీకే మంచిది.

కాబట్టి మీకు మూడు ఆప్షన్లు ఇస్తున్నాం.

1 తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వప్పుకుంటాం. పోలవరం ఏర్పాటుకు అడ్డు చెప్ప కండి. నీటి అర్హత లేకున్నా కూడా రాయల సీమకు మేం తోవ్వుకున్న కాలువలు మూసి వేయకండి. కనీసం అనంత పురానికి తాగు నీరు వదలండి.

2తెలంగాణా ఏర్పాటు వప్పుకుంటాం. మాకు రాజధాని నగరం లేదు. కాస్త మా రాజధాని నగరం కట్టుకునే దాకా హైదరాబాదులోని భవనాలను ఓ ఐదేళ్ళ పాటు ఉపయోగించుకోనివ్వండి.

3తెలంగాణా ఏర్పాటుకు వప్పుకుంటాం. మాదారిన మేం పోతాం, కాని, మా పెత్తందార్లు అక్రమంగా ఆక్రమించిన భూములు, జాగాలు వారికే వదలండి. ఏదో, బతుకు తారు.

ఒప్పుకోరా, సరే, మీ ఇష్టం. అప్పుడు రాజాజీ వెళ్ళగొడితే కట్టుబట్టలతో వెళ్లి పోయినట్టుగా ఇప్పుడు కూడా హైదరాబాదు, తెలంగాణా వదిలేసి వెళ్ళ వలసి వస్తుంది.  

2 comments:

  1. బాగా రాశారు. విశాలాంధ్ర మహాసభ అంట, రాసేదంతా లగడపాటి పీపీటీనుంచి ఎత్తుకొచ్చింది. రోజుకు పది టపాలు రాస్తారు, అడిగితే ఒక్కదానికి సమాధానం లేదు, సమాధానాలకోసం వాళ్ళ నల్లమోతు దగ్గరికి వెల్లి అడుగుదామంటే దొరకడంలేదేమో.

    ReplyDelete
  2. అమర్, thanks,

    మీరు బాగా అడిగారు, ఒక్క దానికీ సదరు మనిషి దగ్గర సమాధానం లేదు. దేవతా వస్థ్రాలని నిజం వస్త్రాలని నమ్మించడం సాధ్యమా?

    ReplyDelete