Tuesday, April 19, 2011

రేపు "జై ఉత్తర తెలంగాణ" అంటే ఏంచేస్తరు?

ఏ వాదన దొరుకని సమైక్యవాదులు చేసే పిచ్చి వాదనలల్ల ఇది ఒకటి. ఉన్న విషయాల మీద సమాధానాలు చెప్ప చాతకాక, లేని విషయాలను కల్పించి ఏదో మైలేజీ సాధిద్దం అనుకోవడమే ఇట్లాంటి అర్థం లేని వాదనలకు కారణం. 

అసలు "జై ఉత్తర తెలంగాణ" నినాదం ఎందుకు వస్తది? నిధులో, నీళ్ళో కొల్లగొడితేనే కదా? మరి నిధులు, నీళ్ళు కొల్లగోట్టినప్పుడు ఎవడైనా ఏం జేస్తడు? 1952 ల ఆంధ్రావాడు ఏం జేసిండో గదే జేస్తడు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలనంటే సమన్యాయం చూపెట్టాలె. అది చాతగానప్పుడు విడి పోతమంటే గమ్మునుండాలె. 

ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగు తుంటె, ప్రతి రోజు వివక్ష గురించి అన్ని వేదికల మీద వాదోప వాదాలు జరుగుతుంటెనే మొన్నటికి మొన్న, నాబార్డు నిధులల్ల 110 కోట్లు ఆంధ్రల కేటాయిస్తే, 10 కోట్లు తెలంగాణాల కేటాయిస్తరు. బీబీనగర్ నిమ్సు కడప రిమ్సు ఒకే సారి మొదలు పెట్టినరు. రిమ్సు కట్టడం పూర్తైతే, నిమ్సు మాత్రం మూలకు బడె. ఇదే మన సమైక్యాంధ్రల సమ న్యాయం. పైనించి ఇప్పుడు నిమ్సు కట్టుడు చేతగాదని కామినేని కిస్తరట!

తెలంగాణ యూనివర్సిటి, కడప యూనివర్సిటి ఒకే సారి మొదలు పెట్టిన్రు. కడప యూనివర్సిటీకి 350 కొట్లిస్తే, తెలంగాణ యూనివర్సిటీకి 27 కొట్లిచ్చిన్రు. ఇట్ల ప్రతి దాన్ల పక్షపాతం చూపిస్తా వుంటే ప్రత్యేక ఉద్యమాలు రాకపోతే ఏం వస్తయి? 

రేపు ఉత్తర తెలంగాణకి న్యాయం జరగక పొతే ఉద్యమం తప్పకుండ వస్తది. అప్పుడు ఉత్తర తెలంగాణ గూడ ఇయ్య వలసి రావచ్చు. అంటే కాదు ఉత్తరాంధ్రల ఉద్యమం వచ్చినా రాయల సీమల ఉద్యమం వచ్చినా అదే పరిష్కారం తప్పదు. 
 

1 comment:

  1. గోదావరి నదీ జలాలపై వేర్పాటువాదుల మోసపూరితమైన వాదన
    >>>అసలు కేటాయింపులు రాష్ట్రాలవారీగా, రాష్ట్రాలలో ప్రాజెక్ట్ల వారీగా జరుగుతాయి కానీ ప్రాంతాలవారీగా కాదు. <<<
    Pl. read this article.
    http://visalandhra.blogspot.com/2011/04/blog-post_19.html

    ReplyDelete