రాష్ట్రంల ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలు రూపొందించేటందుకు ప్రభుత్వం అయిదుగురుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందట. దానికి ఛైర్మన్‌గా వట్టి వసంత్‌కుమార్, సభ్యులుగా జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు నియమిచబడ్డరు.
కమిటీల నలుగురేమో సీమాంధ్ర మంత్రులట! చైర్మన్ గూడ ఆంధ్రా వాడే. ఏదో మొఖమాటానికి ఒక తెలంగాణా మంత్రిని పెట్టిన్రు. ఆయన్ను గూడ ఎందుకు పెట్టిన్రో మరి? మొత్తం వాళ్ళే ఉంటే పోయె గదా?
ఇప్పుడు ఒకవైపు నుండి విగ్రహాలు పెట్టడంల అన్యాయం జరుగుతుందని గొడవ జరుగుతనే ఉన్నది. ప్రజలు దానికి నిరసన తెలుపుకుంట మొన్ననే ట్యాంకుబండు మీద విగ్రహాలు కూలదోసి తమ ఆగ్రహాన్ని తెలియ జేసినరు. ఇంత చేసినా ఈ సీమాంధ్ర పక్షపాత బుద్ధి మారలేదని ప్రభుత్వం తాజా నిర్ణయం తోటి తెలుస్తున్నది.
ఇట్లాంటి పక్షపాత కమిటీ తీసుకొనే నిర్ణయాలు ఎట్ల ఉంటయో ముందుగనే చెప్పొచ్చు. మల్ల కొన్ని వందల సీమాంధ్రుల విగ్రహాలు తెలంగాణా గడ్డ మీద మొలుస్తయన్న మాట!
ఇంతటి ఉద్యమం జరుగుంటేనే ఎక్కడి కక్కడ నియామకాల్లో, నిర్ణయాలలో చేతి వాటం చూపెట్టే సమైక్యాంధ్ర పాలకులు, తెలంగాణా కేదో ఉద్దరిస్తరనేది కలలో మాట.
ఇది వీళ్ళకు కొత్తకాదు. ఉద్యమం జరుగు తున్నప్పుడే నాబార్డు నిధుల్ల 92% నిధులు ఆంధ్రాకు పంపకం జెయ్యడం చూసినం. ఉద్యమం జరుగుతున్నప్పుడే సిగ్గు లేకుండ అక్రమంగా పోలీసు నియామకాలు జరపడం చూసినం. నీతి నియమం లేని ఈ సమైక్య ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తదనే దానికి ఇది తాజా ఉదాహరణ.
అయితే ఏంచేద్దామ్?
ReplyDeleteఇంకేముందన్న, మా రాష్ట్రం మాగ్గావాలె.
ReplyDelete