Sunday, April 17, 2011

సమైక్యవాదులారా ఆలోచించండి.

సమైక్యవాదులారా కొద్దిసేపైనా మీ మెదళ్ళకు పని పెట్టండి.

మీరు సమైక్యంగా ఉండడానికి చెప్పే కారణాలేంటివి? తెలుగుజాతి అంటరు. అవును తెలుగు జాతి అయితెనేం?  రెండు రాష్ట్రాలు ఉండ కూడదా? హిందీ మాట్లాడే వారికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నయి? అవన్నీ ఒక్కటి చేయాలంటరా? బెంగాలీ మాట్లాడే వారు రెండు దేశాల్లో ఉన్నరు. వారందరినీ ఒక్క రాష్ట్రం చేద్దమా?  

ప్రపంచంలో ఎక్కడా భాషను మాతగా పెట్టి పూజించే పధ్ధతి లేదు. కేవలం వారి దేశాన్నో, రాష్ట్రాన్నో మాతగా భావించి పూజించు కుంటరు. తెలుగు వారంతా ఒక్క రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే మాతను పూజించొచ్చు. రెండు రాష్ట్రాలు గా విడిపోయినప్పుడు తెలుగు తల్లి, ఆంధ్రా మాత ఇద్దరూ ఉంటరు. ఈ తల్లులు మన భావనల్ల నించి వచ్చినప్పుడు ఎంత మంది మాతలు ఉంటె మాత్రం ఏంది?

భాష పేరు మీద జాతిని నిర్మించడం ప్రపంచంల ఎక్కడ కూడ సాధ్యం కాలేదు, కాదు గూడ. భాష పేరుమీద మాత పెట్టుకోవాలె నంటె, బెంగాలీలకు, బంగ్లాదేశ్ కు ఒక్కటే మాత ఉండాలె. గూర్ఖాలకు, నేపాలీలకు ఒక్కటే మాత ఉండాలె. పాకిస్తానీయులకు, హైదరాబాదు పాతనగరం వారికి ఒక్కటే మాత ఉండాలె. ఇది సాధ్యమా? ఆలోచించండి.

ఒకవైపు మనందరం తెలుగు వాల్లమంటరు, అన్నదమ్ముల మంటరు. కలిసుంద మంటరు. మల్ల వెంటనే మేం తెలబాన్ల మంటరు. వేర్పాటు వాదుల మంటరు. తెలివి తక్కువ వాల్లమంటరు. తాగుబోతుల మంటరు. నిజంగా కలిసుంద మనే వాల్లు అయితే ఈ విధమైన భాష ఎట్లా ఉపయోగిస్తరు? కాబట్టి మీ అసలు ఉద్దేశం కలిసుండడం కాదని అర్థమై పోతుంది. మీ అసలు ఉద్దేశాలు వేరే. 

మీ అసలు ఉద్దేశం హైదరాబాదు మీద ఆధిపత్యం చెయ్యాలెనని కోరిక. ఇక్కడి నీళ్ళు కొల్లగొట్టుక పోవాలెనని కోరిక. వీటికోసం మీరు ఎంతకైనా తెగిస్తరు. ఎన్ని వేషాలయిన వేస్తరు. ఎన్ని కుట్రలైన చేస్తరు. అయితె సమస్య ఏందంటే మీ కుట్రలను వేషాలను ఇంకా తెలంగాణ జనం నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వేషాలేయ్యాలెనని నని చూసిన్రా, తెలంగాణ ప్రజల దగ్గెర మరింత చులకనై పోతారు. 

అందుకే మీ గౌరవం నిలబెట్టుకొండి. గౌరవంగ విడిపొండి.       

6 comments:

  1. బెంగాల్ విభజన్ ఏ విధంగా జరిగిందో మీకు తెలియదా !? అప్పట్లో బెంగాల్‌లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో దేశనాయకులంతా ఎక్కువగా బెంగాల్ నుండే ఉద్భవించారు . వారు దేశమంతా తిరిగి ప్రజలలో దేశ భక్తిని నింపి ప్రజలలో రాజకీయ చైతన్యం నింపేవారు .ఇది గిట్టని ఇంగ్లీషు వాళ్ళు ఎలాగైనా రాజకీయ చైతన్యం గల బెంగాల్ నుండి మిగతా ప్రజలను వేరు చేయడానికి బెంగాల్‌ను విభజించారు. దినికి పైకి చెప్పిన కారణం పరిపాలన సౌలభ్యం(ఇప్పుడు తెలంగాణ విషయంలో అభివృద్ధి అనే అంశం ఎలా పాపులర్ చేయబడిందో అలా ) . అప్పుడు విడ దీయబడిన బెంగాల్ క్రమంగా ఇండియాకు దూరమైపోయింది . ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే తూర్పు బెంగా అనబడే బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌లో ఒక భాగంగా ఉండి ఉండేది. ఇప్పటికీ బంగ్లాదేశ్6లో రాజకీయ చైతన్యం లేదు. అవిధ్య , అవినీతి, అధిక జనాభా రాజ్యమేలుతున్నాయి. అప్పట్లో దానిని పశ్చిమ బెంగాల్ నుండి విడదీసి ఉండకపోతే దాని చరిత్ర ఇంకో రకంగా ఉండేది

    ReplyDelete
  2. బెంగాల్ విభజన గురించి ఇప్పుడు అనవసరం. అది బ్రిటిష్ వారి టైముల జరిగింది. అంతకు ముందు దేశం మొత్తం ఎప్పుడూ ఒక్కటిగ లేదు.

    ఇప్పుడు జెప్పున్రి, బంగ్లాదేశ్ వాల్లు, వెస్ట్ బెంగాల్ వాల్లు మేం బాంగ్లా మాతను పూజిస్తం అంటె కుదుర్తదా? అందుకే భాష పెరు జెప్పి మాతలను సృష్టించడం సరికాదని చెప్పింది.

    తెలుగు వాల్లంత ఒక్కటిగ ఉన్నప్పుడు తెలుగు తల్లి ఉండొచ్చు, విడిపోయినప్పుడు ఎవరి తల్లి వారికుంటది. తెలుగు తల్లికి ఏదొ అపచారం జరిగి పోతదని మాట్లాడడం కరెక్టు గాదు.

    ReplyDelete
  3. మరి తెలంగాణ వెనకబడ్డది అంటున్నారు కదా, TRS ఏర్పడి ఇన్నాళ్ళలో తెలంగాణ కు చేసిన అభివృధ్ధి ఏమిటి? KCR కుటుంబం + స్వార్థ నాయకులు తప్ప ఈ ఉద్యమం లో బాగుపడింది ఇంకెవ్వరూ లేరు.

    ReplyDelete
  4. ఈ సమైక్య రాష్ట్రంల ఏదీ జరగదనేగదా మా రాష్ట్రం మాగ్గావాలె నని చెప్పేది!

    ఉదాహరణకి బీబీనగర్ NIMS కడప RIMS ఒక్క సారే మొదలు పెట్టిన్రు. RIMSకి 500 కోట్లిస్తె, NIMS కి పాతిక కోట్లు గూడ ఇయ్యలే. మల్ల గిప్పుడు గా NIMSను కామినేని కిస్తమంటున్రు. కడప యూనివర్సిటీ, నల్లగొండ యూనివర్సిటీ ఒక్క సారే శంకుస్థాపన జేసిండ్రు. కడపకు 350 కోట్లు, నల్లగొండకు కోటిన్నర. ఇది సమైక్యాంధ్రల సీమాంధ్రుల పాలన. ప్రతి ఒక్క దానికి కొట్లాడుతనే ఉన్నం, తన్నులు తింటనే ఉన్నం. అయినా మాకు తన్నులు తప్ప, పాలకుల పద్ధతిల మార్పు రాదు.

    ఇకనుండి ప్రతి దానికి కొట్లాడుడు బంద్. ఇంక కొట్లాట రాష్ట్రం కొరకే.

    తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రుడు CM అయినా, నిధులు ఆంధ్రకో, పంజాబ్‌కో ఇయ్యలేడూ కద? ఏమంటవ్ సూర్యన్నా?

    ReplyDelete
  5. నిజమే ... తెలంగాణకు ఎంత దరిద్రుడు CM అయినా నిధులు ఆంధ్రకో పంజాబ్‌కో ఇవ్వడు కరెక్టే ... నిధులన్నీ ఉత్తర తెలంగాణకో , లేదా దక్షిణ తెలంగాణకో (CM ఏ తెలంగాణకు చెందితే ఆ తెలంగాణకు) ఇస్తే పరిస్థితి ఏంటీ? ... అప్పుడు మళ్ళీ దక్షిణ తెలంగాణ అభివృద్ది అనో లేక ఉత్తర తెలంగాణ అనో రోడ్డెక్కుతారన్న మాట.

    ReplyDelete
  6. ఊహాజనితమైన విషయాలు ఎందుకు బ్రదర్. దేశంల పాతిక పైగా రాష్ట్రాలున్నాయి, ఈ దరిద్రపు గొట్టు discrimination ఎన్ని రాష్ట్రాలల్ల ఉంది? ఎప్పుదో సమస్య వస్తదని ఇప్పటి సమస్య పరిష్కరించకుండా ఉండలేం కదా?

    ఇప్పటి సమస్య విడిపోకుండా పరిష్కరించడానికి 1956 నుండి రక రకాల ఒప్పందాలు జరిగినయి, కమిటీలు వేయబడ్డయి, GOలు వచ్చినయి. అయినా గూడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు.

    అందుకే ఇప్పుడు రాష్ట్ర విభజన తప్ప వేరే పరిష్కారం లేదంటున్నం.

    ReplyDelete