Wednesday, April 20, 2011

పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే

అసలు సమైక్య వాదం అనేదే ప్రపంచంల ఎక్కడ వినబడని కుటిల వాదన. సమైక్య వాదం అంటే జర్మనీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతరు. జర్మనీ సామ్రాజ్య వాదుల చేర బలవంతంగ రెండు దేశాలుగ విడదియ్య బడ్డది. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాల వాళ్ళు కలవాలె నని అనుకున్నరు, కలిసి పోయ్యిన్రు. ఇప్పుడు కలిసిన జర్మనీల గూడ 15 రాష్ట్రాలున్నయి. ఆ ముచ్చెట మాట్లాడంగనే సమైక్యా వాదులకు ముచ్చెమటలు పోస్తై. వీళ్ళకి దేశం వేరు, రాష్ట్రం వేరు అన్న ఇంగితం తెలువక గాదు, ఏదో గుడ్డి వాదన చేయాలె, కింద బడ్డా నాకాలే మిర్రని చెప్పాలె.

ఏ వాదన చేతగాని సమైక్య వాదులు ప్రత్యేక తెలంగాణా వాదులని వేర్పాటు వాదులని పిలుసుడు మొదలు పెట్టిన్రు. వెనుకట ఖలిస్తాన్ దేశం కొరకు పోరాటం చేసినోల్లను, ఇప్పుడు కాశ్మీర్ ప్రత్యేక దేశం కొరకు పోరాటం చేసేటోల్లను తెలుగుల వేర్పాటు వాదులని చెప్పుడు మామూలు. వాళ్ళతోటి కలిపి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణా వారిని కూడా వేర్పాటు వాదులు అని పిలవడం వీళ్ళ కుట్రబాజీ మనస్తత్వాన్ని బయట పెడుతుంది.

కొంతమంది మరింత ముందుకు పొయ్యి తెలంగాణా వాళ్ళను తెలబాన్లంటున్నరు. అంటే అన్యాపదేశంగ ఆఫ్గన్ తాలిబాన్లతోటి పోల్చడం అన్న మాట. రాజ్యాంగ బద్ధంగ ప్రత్యేక రాష్ట్రం కోరుడు తాలిబానిజం ఎట్లయితది అని అడిగితె దానికి సమాధానం ఉండదు.

మరి 1952 ల మద్రాసు రాష్ట్రం నుండి విడిపోతమని పోరాటం చేసిన విషయం ఎవ్వరికి గుర్తు లేదు అనుకునుడు, పిల్లి కండ్లు మూసుక పాలు తాగుకుంట ఎవ్వరు చూస్తలేరు అనుకున్నట్టు ఉంటది. అది మరిచి పొయ్యినా 1972 ల జై ఆంధ్ర ఉద్యమం చేసిన విషయం గూడ జనం మరిచి పోతరని అనుకునుడు వీరి మాయ మాటలు చెప్పే నైజాన్ని మాత్రమె బయట పెడుతది.
              
అవును, పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే. పొట్టి శ్రీరాములు తాలిబానైతే నేనూ తాలిబాన్నే. ప్రాంతీయ విచక్షణకు వ్యతిరేకంగ అధ్బుతమైన పోరాటం చేసి మీరే మాకు మార్గ దర్శకంగా ఉన్నరు. మీ అడుగు జాడలల్లనే మేం గూడ పోరాటం చేస్తం, ప్రత్యేకరాష్ట్రం సాధించుకుంటం.

జై తెలంగాణా.

10 comments:

  1. మీకిష్టమున్నా లేకపోయినా మా దుర్మార్గపు పాలన మీరు భరించాల్సిందే, కాదంటే కేసులు బనాయిస్తం లక్షలకొద్దిజనాన్ని అరెస్టు చేస్తం కాల్పులు జరిపి మీఉద్యమాన్ని అణచివేస్తం అనేది మాత్రం తాలిబనిజం కాదు.

    ReplyDelete
  2. బాగా చెప్పినావు ఏది సత్యం. మేము మా ప్రాంతంలో బలవంతంగా బంద్‌లు చెయ్యించి లారీలు బద్దలు గొడితే గాంధీయవాదం, అదే పని మీరు చేస్తే తెలబాన్‌వాదం. ఇదీ మా ప్రాంతంవాళ్ళ శ్రీరంగనీతి.

    ReplyDelete
  3. evaru evarini kalisi undamantalla..
    the main issue penatrates between Hyderabad ..
    adi andariki telisinde...
    with out Hyd telangana ite intha situation vachhede kaadu...

    and KCR lanti vadiki telaban anna padam kuda takkuve...

    hyderab ad pai athyasa antunnavu
    athyasa evariko cheppali...

    1973 lo prathyeka andhra korina vallu ippudu samikhyam koraru ante.. danini kuda meru ardam chesukovali....

    oka prantham abivriddi chendatam ante akkada unna prajalu abivruddi chendatame..

    ReplyDelete
  4. main issue penatrates between Hyderabad...

    మీరు వచ్చేటప్పుడు హైదరాబాద్ పట్టుక వచ్చిన్రా? ఇప్పుడు తీసుక పోయేటందుకు? తీసుక పోయ్యేది ఏమన్న ఉంటె తీసుక పోండి, మాకు అభ్యంతరం లేదు. :)

    athyasa evariko cheppali...

    తన జాగల హైదరాబాదు లేకున్నా, వచ్చేటప్పుడు తాను తేకున్నా, ఇప్పుడు హైదరాబాదుపై ఆశ పడేటోనిది.

    1973 lo prathyeka andhra korina vallu ippudu samikhyam koraru ante.. danini kuda meru ardam chesukovali....

    అప్పుడు ముల్కీ రూల్సు తెలంగాణకు అనుకూలంగ ఉన్నయని ఉద్యమం చేసిన్రు. ఇప్పుడు అయ్యి లేవు. పైగా నీళ్ళ, నిధుల దోపిడీ సమ్మగ సాగుతుందని కలిసి ఉందాం అంటున్రు.

    oka prantham abivriddi chendatam ante akkada unna prajalu abivruddi chendatame..

    మేం జెప్పేది గదే కద? మా అభివృద్ధి మేం జూసుకుంటం, జర పరేషాన్ గాకున్రి.

    ReplyDelete
  5. nuvvu vachhetappudu hyd techhava metho pate undataniki...
    asalu first history telusuovali edanna matladalante..
    hyderabad built with both the assets of Andhra people (in hyderabd the people who speak telugu are called by andhra..)
    if ppl of hyd want hyd as a seperate state will u ppl agreee?

    nenu 1973 lo seperate Andhra annadi
    appudu hyd meeda enduku aasa ledu ani...


    me abivriddi meru chuskondi kadantalla..kani danini memedo aputhunnattu asthya pracharalu cheyyakandi..

    and i have no objection if the state is seperated...

    ReplyDelete
  6. nuvvu vachhetappudu hyd techhava metho pate

    భాయ్, నేనెక్కడి నుండో తెచ్చుడెందుకు? అది మొదటి నుండి ఇక్కడనే ఉంది. నేను ఇక్కడనే ఉన్న.

    if ppl of hyd want hyd as a seperate state will u ppl agreee?

    అడిగేదాంక ఆగరాదె అన్నా! ఎవ్వరు అడ్డగోలుగ అడుగరు, వొంట్లె కాలితె తప్ప.

    danini memedo aputhunnattu...

    మీరు మా ఉద్యమానికి వ్యతిరేక ఉద్యమం ఎందుకు నడిపిస్తున్నరు మరి?

    and i have no objection if the state is seperated...

    Then we do not have any dispute at all.

    ReplyDelete
  7. ప్రధాన ఇష్యూ హైదరాబాదైతే ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పాలి. సమైక్యవాదం అని పాడిన పాటే పాడుతూ అసలు విషయం దాటవెయ్యడం ఎందుకు?

    ReplyDelete
  8. meru kuda Hyd kosame chesthannam ani cheppochhuga..
    athma gauravam and other things enduku...
    prati okkallu hhyd kosame chesthunnaru...

    ok not intrested in any more discussion

    ReplyDelete
  9. వినోద్ భాయ్,

    మేం హైదరాబాదు కొరకు గాదు పోరాడేది. తెలంగాణా రాష్ట్రం కోసం. హైదరాబాదు తెలంగాణల అంతర్భాగం. అనుమానముంటె ఇక్కడ చూడున్రి.

    ReplyDelete
  10. ’తెలబానులు’ అని వాగే వెధవలు ’మొట్టమొదటి తెలబాను’(తెలుగు తాలిబాన్) పొట్టి శ్రీరాములు అని అంగీకరించాలి మరి. ఆ మహానుభావుడు తెలబానైతే మేమంతా ఆయనతో స్ఫూర్తినొందిన నవీన తెలబానులమే.

    ReplyDelete