Saturday, April 16, 2011

సమైక్య వాదపు కల్లోలం చూడు

సమైక్య వాదపు కల్లోలం చూడు
బలి పోతున్న పసి ప్రాణాలు చూడు.

రౌడీయిజం తెలియని నా హైదరాబాదుల 
బెజవాడ రౌడీల వీరంగం చూడు
జూబిలీ హిల్సులో ఫిల్ము నగరులో 
మసిబారు తున్నట్టి మానవత్వం చూడు

నాజీల మించిన నయా కామందుల 
నైచ్యాల నెదిరించ నక్సలైట్లుగా మారి
ప్రాణాల నొడ్డిన పడుచు వీరుల చూడు 

మత ఘర్షణలు లేని మా తెలంగాణలో 
పర పాలకుల వలన పడలేని కష్టాలు 
గోకుల్ చాటులో కొత్తగా బాంబులు 

అతిలేని గతిలేని మతిలేని దర్యాప్తు 
ఎన్నేళ్ళు సాగేను ఎప్పటికి ముగిసేను
తినుడు యావే తప్ప ధీరత్వమేలేని 
చవట దద్దమ్మలే రాష్ట్రాన్నిఏలంగ!

ఇంక సాగబోవు దోపిడీ రాజ్యాలు 
కుట్ర బాజీ గాళ్ళ కుహనా సమైక్యాలు 
జనం కదిలి వచ్చె సంద్రమ్ము మాదిరి 
దోపిడీ దొంగల పీచ మణుగు తుంది 
ప్రజా గర్జన విని పగుతుంది గుండె

19 comments:

  1. " రౌడీయిజం తెలియని నా హైదరాబాదుల
    బెజవాడ రౌడీల వీరంగం చూడు"
    సోదరా పైన అన్న విషయంలో తమరికి సరైన అవగాహన ఉన్నదా లేక ఎమె పెద్దలు నూరిపోసిన విషయాలను తిరిగి ఇక్కడ వల్లిస్తున్నావా..? ఒకసారి మీకు సమయమం ఉంటే హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లి చూడండి మహానుభావ హైదరాబాద్ రౌడీయిజం గురించి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నవి..కాకపోతె హైదరాబాద్ ప్రత్యేకత వేరు రౌడియిజంలో..!

    2." నాజీల మించిన నయా కామందుల
    నైచ్యాల నెదిరించ నక్సలైట్లుగా మారి "

    అలా నక్సలైట్లగా మారింది ఎవరివలన..? ఒక సారి తెలంగాణ పల్లేల్లోని మీ దొరల సంస్కృతి చూడు మిత్రమా..తెలుస్తుంది నక్సలైట్స్‌గా ఎలా మారారో..! అంతెందుకు గద్దర్‌ని అడిగిచూడు ఆయన తన చిన్నప్పటి వెతలు గురించి బాగా విపులీకరించి చెబుతారు..!

    3." మత ఘర్షణలు లేని మా తెలంగాణలో
    పర పాలకుల "

    మతఘర్షణలు తెలంగాణలో లేవేమో గాని హైదరాబాద్‌లో నాకు ఊహతెలియక పూర్వం నుండి ఉన్నాయి..పోనీ తెలంగాణ మినహా మిగతా రాష్ట్రంలో ఎక్కడైనా మతఘర్షనలు చూసారా తమరు..లేక విన్నారా చెప్పండి..కేవలం హైదరాబాద్‌లోనే ఎందుకు ప్రజ్వరిల్లాయో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. వెళ్లి చరిత్ర చదవండి.

    ఇక్కడ సమైఖ్యమా లేక తెలంగాణమా అనికాదు...! దోచుకోవడం..కుట్రలు ఇవన్ని మనిషికి సంబందించిన లక్షణాలు అంతేకాని ఒక ప్రాంతాన్ని చూసో లేక ఒక మతాన్ని, కులాన్ని అనుసరించే అలాంటి తత్వాలు ఉండవు..అది గుర్తించుకోండి..అంతేగాని ప్రాంతాన్ని బట్టి లేక కులాన్ని బట్టో మనుషులుంటారనుకుంటే అంతకన్న మూర్ఖత్వం ఉండదు ఆలోచించండి..

    ReplyDelete
  2. Kamal, I welcome your comments. But at the same time you should note that it is intended to be a retaliation to some extreme samaikyavaadi comments. The comments which depict the telangaanaa will become a place for naxals, rowdees etc if divided which is not true. The truth is that naxals rowdees prevailed in the existing samaikya rule itself.

    ReplyDelete
  3. By the way, Bejawaada is known for rowdees, Ram Gopal Varma, who is also from Bejawada is planning to make a film on that.

    ReplyDelete
  4. The post 1969 naxalism can only be attributed to either blatant suppression of T movement or the misrule by the Samaikya Leaders.

    ReplyDelete
  5. It is an open secret that many a times to roots to Communal riots in Hydereabad are ignited by rayalaseema leeders to fulfil their perverted political desires.

    ReplyDelete
  6. Hydereabad are ignited by rayalaseema leeders to fulfil their perverted political desires.

    మిత్రమా..! రాయలసీమ నాయకులు..కోస్తా నాయకులు..తెలంగాణ నాయకులు అంటూ మీరు మనుషుల్లో కులాలవారిగా మనుషులను విభజించినట్లు ప్రాంతాల వారిగా నాయకులను విభజిస్తున్నారు..! నాయకులన్న వారు ఎక్కడున్నా ఒకే రకపు రాజకీయపు తత్వం వున్న రాజకీయనాయుకలే అవుతారు అంతే కాని మీరు మళ్లీ పాత పాటే పాడుతున్నారు..! ప్రాంతాలవారిగా మనస్థత్వాలు ఉండవు రాజకీయనాయుకలకు..? దోచుకోవడం వారి ఎజండా అయినప్పుడు దోపిడికి కుల.ప్రాంతీయ మత భేదాలుండవు. ఒకె మీరు కోట్ చేసినా రాయలసీమ నాయుకులు చేసిన మతఘర్షణల సమయంలో నేను హైదరాబాదులొ బాగ్‌అంబర్ పేట్‌లోనే ఉన్నాను మతఘర్షనల పేరుతో రాజకీయ అధికారం కొసం మతఘర్షణ ముసుగులో చేస్తున్న అరాచాకాలను నేను ప్రత్యక్ష చూసినవాడిని..అదే సమయంలో మా వీధులను యువకులైన మేమే రాత్రిళ్లు కర్రలు పుచ్చుకొని కాపలా ఉంటూ కాపాలకాస్తూ కాపాడుకున్నాము. అది 1990 లో మాత్రమే జరిగింది అంతకన్న మునుపు అంటే 1982 కు మునుపు ప్రతి సంవత్సరం వినాయక చవితి పండగ సందర్భంగా మతఘర్షణలు జరిగేవి..అక్కడెక్కడో అలహాబాద్‌లో ఒక చిన్న మతఘర్షణ సంఘటన జరిగినా ఇక్కడ హైదరాబాద్‌లో మొదలయ్యి చెలరేగేవి..! యన్.టి.ఆర్ 1983 తర్వాత అధికారంలో వచ్చాక ఆయన చాలా దృడంగా అమలుచేసిన కొన్ని పనుల వలన 1984 నుండి మతఘర్షణలు ఆగిపోయాయి..తిరిగి 1990 అద్వాని చేబట్టిన రథయాత్రతో మల్లి మొదలయ్యాయి..దాని కొనసాగింపే 1992 లో చెన్నారెడ్డిని అధికారం నుండి దించడానికి చేసిన మతఘర్షణ..అదొక్కటే..దానినే మీరు పెద్ద బూచిగా చూపిస్తూ మొత్తం జరిగిన మతఘర్షణలన్ని కేవలం రాయలసీమ నాయుకులు చేసినవే అని ఆరోపణలు చేస్తే ఎలా..? ఒక సారి వెల్లి పాత పేపర్లు తిరిగేయండి.

    ReplyDelete
  7. ఇక నక్సల్స్ గురించి అనుకుంటే..అది కలకత్తాలో ప్రారంభమయి..శ్రీకాకుళం మీదుగా తెలంగాణ ప్రాంతంలో స్థిరపడింది..దానికి కారణం " దొరల ' ఆకృత్యాల వలన..! దానిని బూచిగా చూపనవసరం లేదు. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ అల్లుకుంది..కాని తెలంగాణలో ఉన్నంత తీవ్రత మిగతాప్రాంతంలో లేదు.

    ReplyDelete
  8. బెజవాడ రౌడీలు అన్న పేరుతో సినిమా రామగోపాల్ వర్మ చేస్తున్న పబ్లిసిటీ జిమ్మిక్..! రౌడీలు అన్న వాళ్లు ఒక్క విజయవాడలోనే ఉన్నారా..? మనుషులున్న చోట ఎక్కడైనా సరే రౌడీలు ఉంటారు..! అమెరికాకి వెళ్లి చూడండి డౌన్‌టౌన్‌ల వద్ద ఎంత మంది ఉంటారో..అంతమాత్రానా అమెరికా సంస్కృతి అంతా రౌడీయిజం అని చెబుతామా..? హైదరాబాద్‌లో నాకు చాలా ప్రత్యక్ష అనుభవాలున్నాయి రౌడీలతో..అదే కడపలో నేన్నెక్కడా రౌడీయిజం భారిన పడలేదు మరి..అంతమాత్రాన హైదరాబాద్ సంక్సృతి అంతా రౌడీయిజమే అంటే నా అంత మూర్ఖుడు ఎవరుండరని అర్థం వస్తుంది.. అవన్ని మనుషుల తత్వాలు. రాజధాని అన్నాక రాష్ట్ర నలమూలల నుండి రకరకాల తత్వాల కలిగిన మనుషులు వస్తారు వారి లక్షణాలే నగరంలో ప్రతిబింబిస్తాయి..!

    ReplyDelete
  9. కమల్ గారు,

    మీరు చెప్పింది నిజమే. నాయకులు ఎవ్వరైన ఒక్కటే. నా వాదం మీరు సరిగ్గ అర్థం చేసుకోలేదు.

    సమైక్య రాష్ట్రంల రౌడీయిజం, మత కల్లోలాలు, నక్సలిజం ఇట్ల వృద్ధి చెందిన రికార్డులు మన ముందుండంగ, కేవలం తెలంగాణా విడిపోతేనే కొత్తగ ఇవన్ని వస్తయన్నట్టు చెప్ప బూనడం, ఇప్పుడు ఇవన్ని లేనట్టు చెప్ప బూనడం ఏరకమైన వాదన కిందికి వస్తది? అట్ల మీరు చెప్పక పోవచ్చు, కని అట్ల చెప్పిన వారికి సమాధానమే ఈ టపా.

    ReplyDelete
  10. But at the same time you should note that it is intended to be a retaliation to some extreme samaikyavaadi comments.

    ఎవరో కొంతమంది చేసిన కామెంట్స్ వలన ఉన్న వాస్తవం మరుగున పడదు కదా..? అ ఎవరో కొందరు మాత్రమే కాదు కదా... మొత్తం సమైఖ్యవాదుల ప్రతినిధి..? ఎవరు ఎవరినీ అవహేలన చేసినా దాన్ని సమర్థించకూడదు.. అది ఎవరైనా సరే..అలా చేస్తున్న వారిని ఖండించాలి, నిరోదించాలి..నిర్మూలించాలి అంతె కాని కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనుకుంటే సశ్మశానాలే మిగులుతాయి.

    ReplyDelete
  11. కమల్ గారు

    వర్మ పబ్లిసిటీ కోసమే తీసినడనుకున్నా, వరంగల్ ఫాక్షనిస్టులు, కడప రౌడీలు అని తీస్తె పబ్లిసిటీ రాదు. జనంల ప్రచారంల ఉన్న పేరు బెడితెనే పబ్లిసిటీ వస్తది. మరి జనంల ఆ విధంగ ప్రచారంల ఎందుకున్నదో నేను ప్రత్యేకంగ జెప్ప నవసరం లెదు!

    ReplyDelete
  12. సమైక్య రాష్ట్రంల రౌడీయిజం, మత కల్లోలాలు, నక్సలిజం ఇట్ల వృద్ధి చెందిన రికార్డులు మన ముందుండంగ, కేవలం తెలంగాణా విడిపోతేనే కొత్తగ ఇవన్ని వస్తయన్నట్టు చెప్ప బూనడం, ఇప్పుడు ఇవన్ని లేనట్టు చెప్ప బూనడం ఏరకమైన వాదన కిందికి వస్తది? అట్ల మీరు చెప్పక పోవచ్చు, కని అట్ల చెప్పిన వారికి సమాధానమే ఈ టపా.

    మీరు పైన చెప్పిన అన్ని విషయాల్లో మీతో ఏకీబవిస్తాను కాని ఒక్క విషయంలో మాత్రం నేను మీరు కూడ కాస్త లోతుగా ఆలోచించాలి..! అది నక్సల్ విషయంలో.. కొన్నేళ్ల క్రితం విడిపోయిన చత్తీస్‌గడ్ రాష్ట్రం నక్సల్స్ సమస్య చూస్తే..పాపం ఆ చిన్న రాష్ట్రం నక్సల్స్ విషయంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నది.. నక్సల్స్ చెలరేగిన ప్రతిసారి పక్కన ఉన్న మన రాష్ట్రం వైపు సహాయం కోసం చేతులు చాస్తున్నది..కారణం.. పోలీసు వ్యవస్థ తగినంతగా లేకపోవడమా ..? లేక సరైన శిక్షణ లేకపోవడమా అన్నది ఇంతవరకు తేలలేదు..! ఆ విషయంలో కొంత అస్పష్టత వున్నది రాష్ట్రం విడిపోవడం వలన జరిగే నష్టం విషయంలో..!

    ReplyDelete
  13. ఫ్యాక్షనిజం ఒక్క కడపలోనే లేదు..గుంటూరు, మాచర్ల,మహబూబ్‌నగర్ ఖమ్మం ప్రాంతాలలో కూడ ఉన్నది..! కాకపోతే ఒక్కోప్రాంతంలో ఒక్కో తరహా..! అయినా నేను " ఫ్యాక్షన్ " అన్నసంబోదిస్తున్న పదాన్ని వ్యతిరేకిస్తాను..! ఫ్యాక్షన్ పదంకున్న అర్థం వేరు..ముఠాకక్షలు పదం వేరు..మీడియా సృష్టించిన ఫ్యాక్షన్ పదం వేరు.
    రౌడీలు ఒక్క విజయవాడలో ఏం ఖర్మ ప్రకాశం జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు.. హైదరాబాద్‌లోనూ కోకొల్లలుగా ఉన్నారు..! అలా పేర్లు పెట్టడం అన్నది ప్రోవోక్ చేసే బాగంలో ఒక పన్నాగం అంతె.

    ReplyDelete
  14. ఒక సమైఖ్యవాది రాసిన కవిత వలన మీరు బాదపడడంలో సహేతుకత ఉన్నది..! అందులో నాకు గాని మరొకరికి గాని అబ్యంతరాలు ఉండకూడదు కూడ..! దానికి మీరు సమాధానం ఇవ్వాలి కూడ..! కాని మీరు పైన రాసిన కవితలో చాలా వరకు వాస్తవాలు లేకపోవడం వలనే నేను స్పందించాను..! అంతే గాని..మిమ్మల్ని..మీ భావాలను కించపరచాలని మాత్రం కాదు. మీరు కూడ ఆ సమైఖ్యవాది రాసిన కవితకు సరైన సహేతుకంగా కవిత రాస్తే చదివే వారికి కూడ.." ఇది నిజమే కదా..? మనమెందుకు ఇలా ఆలోచించలేకున్నాము.." అన్న భావన కలగాలి..అదెలాగు అన్నది మీరు ఆలోచించాలి.

    ReplyDelete
  15. ఒక వ్యాసం రాసినపుడు వాస్తవాలన్ వినిపించే అవకాం ఉంటుంది, కవితలో అది అన్నిసార్లు కుదరదు. అవతలి పక్క ఎక్జాగరేషన్‌తో పోల్చితే శ్రీకాంతాచారి రాసినది అర్ధవంతంగానే అనిపిస్తుంది.

    ReplyDelete
  16. కమల్ గారు,

    నా కవిత ఇంకొక సారి చదువున్రి. దాంట్లె సమైక్య రాష్ట్ర పాలకులను తప్ప ఇంకెవరిని కూడ నిందించ లేదు. ఇంక మీదగ్గర ఇట్ల తయారయితరు అని ఎవరైన చెప్తె, మీ దగ్గెర కూడ ఇట్లనే ఉన్నరని చెప్పుడు తప్పెట్లయితది?

    ఇదెట్ల ఉందంటె మనం స్వతంత్ర పోరాటం జేసినప్పుడు బ్రిటిష్ వాడు మీకు పరిపాలించుకునుడు రాదని చెప్పినట్టుంది.

    ReplyDelete
  17. విశ్వరూప్ గారు,

    వివరణకు thanks.

    కమల్ గారు,

    For a change మీరు దీనికంతకి మూలమైన బ్లాగులకి వెళ్ళి, ఆ సోదరునికి నిరసన ఎందుకు తెలుప కూడదు?

    ReplyDelete
  18. "For a change మీరు దీనికంతకి మూలమైన బ్లాగులకి వెళ్ళి, ఆ సోదరునికి నిరసన ఎందుకు తెలుప కూడదు?"

    నా మొదటి కామెంట్ పెట్టిన సమయంలో..మీ కవితకు కారణమైన కవితను నేను చూడలేదు.. మీరు రాసిన కవిత కింద మీరిచ్చిన లింక్‌ను నేను గమనించలేదు..! ఇందాకే చూశాను ఆ కవిత. నా స్పందన ఖచ్చితంగా రాస్తాను అక్కడ కూడ నేను ఏదైతే ఫీల్ అవుతానో.

    ReplyDelete
  19. Kamal,

    Just checked that site.

    Seems that you have comfortably forgotten to express your స్పందన there.

    Ignore this if they have deleted your comment.

    ReplyDelete