Tuesday, April 26, 2011

ప్రజలను విడదీయడం పాపమా?

ప్రజలను విడదీయడం పాపమని ఒకాయన అన్నడట! అంటే పక్కోడు పాపాలు చేస్తున్నా కూడా, వాని పాపాలు ఎదుర్కునే టందుకు విడిపోవడం తప్ప మార్గం లేకున్నా కూడ విడిపోవద్దన్న మాట.

అవును మరి, వానికి మెజారిటీ ఉంది. మెజారిటీ తోటి మైనారిటీ నోరు మూయిస్తడు. నోరు ముయ్యని ఒకరిద్దరు నాయకులను కొనేస్తడు. ఇంకెవరైన మిగిలితే బెదిరిస్తడు. ఫాక్షనిస్టుల పురమాయిస్తడు. చావుకు భయపడేటట్టు చేస్తడు. అప్పుడు కూడ కలిసే ఉండాలె. విడి పొతే పాపమట!  

మరి 1953 ల మద్రాసు నుండి విడిపొయ్యి నప్పుడో? అంటె వేరే భాష వానితోటి విడిపోవచ్చన్న మాట. వాడు గూడ మన దేశంల మనిషైనా సరే. వాడు తమిళుడంటం. తెలుగోనికి వేరే రాష్ట్రం గావాలంటం. జాతీయ వాదాన్నివొదిలి భాషావాదాన్ని నిర్లజ్జగా తలకెక్కించు కుంటం.  

మన భాష మాట్లాడేటోళ్ళు మాత్రం విడిపోతే పాపం. మనం వాళ్ళ భాషని, యాసని ఎంత గేలి చేసినా సరే. విడిపోవద్దు.అట్లనే అణిగి మణిగి ఉండాలె, వాళ్ళ కాళ్ళ కింది చెప్పుల్లెక్క. అది మన సమైక్య వాదుల నీతి.  

ప్రాతం పేరున విడిపోవడం పాపమైతే, భాష పేరుమీద విడిపోవడం పాపం కాదా? ఆ లెక్కన 1953 లనే పాపిష్టులుగా మారినోల్ల తోటి మేమెందుకు కలిసుండాలే? సమైక్య వాదులారా, మీ పాపాలను నిజంగ కడుక్కోవాలె నని మీకుంటే మాకు అడ్డం రాకున్రి. పూర్తిగ కడుక్కోవాలెనంటె పొయ్యి తమిళనాడుల కలువున్రి, వాళ్ళు కలుపుకుంటే.

మీరు మోకాలడ్డం పెట్టినా, మొత్తంగా అడ్డం పండుకున్నా, మిమ్మల్ని దాటి రాష్ట్రం ఎట్ల తెచ్చుకోవాలనో మాకు బాగనే తెలుసు.

2 comments:

  1. ఒకే వంశీయులకే రెండు రాజ్యాలు ఏర్పడాలని, హస్తినాపుర రాజ్య విభజనకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే రాయబారం నడిపిన సంగతి ఈనాటి కుహనా సమక్యవాదులకు ఎందుకు అర్థం కాదు? కొందరు తామేదో మహా మేధావులయినట్టు పోజు పెట్టి - "అందరూ ఆంధ్రులే అయినప్పుడు తెలంగాణీయులు వేరుగా చెప్పుకోవడమేమిటి?" అని అడుగుతుంటారు. మరి అందరూ కౌరవులే ఆయినప్పుడు " పాండవులు" అని ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందో - వీళ్ళ మట్టి బుర్రలకు అర్థం కాదా?

    ReplyDelete
  2. బాగ చెప్పిన్రు శాయి గారు. అర్థం గాని బుర్రలకు చెప్పొచ్చు, అన్ని తెలిసి తొండి వాగుడు వాగేటోనికి ఏంజెప్తం?

    ReplyDelete