నేల విడిచి సాము చేసే సమైక్యవాదులకు ఉద్యమం ఉధృతి పెరుగుతున్న కొద్ది గుండెలలో గుబులై పోతుంది. ఇంక తెలంగాణా ఏర్పాటు తప్పదని నిర్ణయించు కున్నంక కొత్త రాగం పాడుడు మొదలు పెట్టిన్రు. హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలెనట!
ఇనాళ్ళు సమైక్య వాదం, తెలుగుజాతి అని చెప్పింది అన్ని ఉట్టి మాటలేనని వాళ్ళంత వాళ్ళే బట్ట బయలు చేసుకున్రు. అంటే హైదరాబాదు వస్తే 'తెలుగుజాతి, గిలుగు జాతి జాన్తానై' అన్న మాట!
మొదటినుండి వీరి కన్ను హైదరాబాదు మీదనే ఉన్నది. 1956 ల వీళ్ళు తెలంగాణా తోటి కలిసింది కూడా హైదరాబాదు మీద మోజు తోటి గాని మరొకటి గాదు. ఆ విషయం 1953 లనే ఆంధ్రా అసెంబ్లీల నీలం సంజీవ రెడ్డి స్పష్టంగనే చెప్పిండు.
ఎవడైనా విడిపోతున్నప్పుడు తన వాటా సంగతి చూసు కుంటడు. నీళ్ళో నిప్పులో సరిగ్గ పంచమని బేరమాడుతడు. విడిపోతే తన ప్రాంతం వాళ్ళు పడే కష్ట నష్టాల గురించి ఏమన్నా ఉంటె చెప్పు కుంటడు. అది తన ప్రాంతపు ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేసే పని.
ప్రజలెక్కడ పోతే మాకేంది? మా వ్యాపారాలు, మా రియల్ ఎస్టేట్లు, మా కబ్జాలు సల్లగుండాలె అనుకునేటోడు ఏంజేస్తడు? హైదరాబాదు మీద కన్ను బెడుతడు. నా ప్రాంతం గాదు, నాకు హైదరాబాదే ముఖ్యం అంటడు. ఊళ్లు అభివృద్ధి చేయ్యలేనోడు హైదరాబాదు అభివృద్ధి చెస్తడట! వీళ్ళు చేసేది హైదరాబాదు అభివృద్ధి కాదు, హైదరాబాదుల వీళ్ళ అభివృద్ధి అని ఆంధ్రా జనం తెలుసుకుని మేలుకుంటె ఇప్పటికయినా మంచిది. గట్ల తెలుసుకొకుండ, గా నాయకులనే నమ్మితిరా, వాళ్ళు తడిగుడ్డ తోటి గొంతు కొయడానికయినా వెనుకాడని రకాలు! జర జాగ్రత్తగ ఉండున్రి.
దళితులూ, ప్రజా సంఘాలు, కవులు, మేధావులు ఇప్పటికే మేలుకున్నరు. సమైక్య వాదం జపించే దొంగ నాయకుల కుట్రలను పసిగట్టిన్రు. మిగిలిన వాళ్ళు కూడ తెలుసుకుని 'జై ఆంధ్ర, జై తెలంగాణా' అని నినదించే రోజు దగ్గరలనే ఉంది.
అన్న దమ్ముల్లాగా విడిపోదాం, అన్న దమ్ముల్లాగా ప్రేమగ మెలుగుదాం.
ponee KCR ni kooda hyd vadilesi telangana teesukomani chepparaade. atanoppukuntada? migata telanganani develope cheskovachuga mee KCR?
ReplyDeleteSurya,
ReplyDeleteNo one has to leave Hyderabad. But yes, some people may have to leave their illegal properties, whether it is you or KCR, does not matter.