ఆరేడు సంవత్సరాలనుండీ అధికారానికి దూరమైన చంద్రబాబు నాయుడికి ఏం జేయ్యాల్నో తెల్వక పిచ్చెక్కు తున్నట్టుంది. అటూ ఇటూ బొయ్యి TRS వెంట బడ్డడు.
కాంగ్రెస్ల PRP విలీనం కాంగనే మస్తు ఖుషీ అయిండు చంద్రబాబు. ఇంక కాంగ్రెస్ అయిదేండ్లు అదికారంల ఉంటదని, గప్పటి లోపట స్టేట్ల జరంత మంచి పేరు తెచ్చుకుందమని అనుకున్నడు. గిప్పుడు గిట్ల ఎలక్షన్లు వస్తే అటు సైడు జగన్, ఇటు సైడు TRS సీట్లన్నీ ఊడ్సుక పోతే, గిప్పుడున్న తొంభై గూడ రావని ఆలోచించిండు. గిప్పుడు PRP విలీనమైంది గాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోదు, తనకు ఫుల్ భరోసా అనుకున్నడు.
ఇంక మిగిలింది TRS. దాన్ని గూడ గబ్బు లేపితే ఇంక మనదే రాజ్యం అనుకున్నడు. అనుకొనగానే తన తొత్తు గాన్లను పిలిచి TRS కాంగ్రెస్ బ్రాంచి ఆఫీసని ప్రచారం జేయించిండు. PRP కాంగ్రెస్ ల విలీనం అయింది గాబట్టి TRS గూడ విలీనం అయితదని చెప్పితే జనం నమ్ముతరు అనుకొన్నడు.
అయితే గీయన KCR తెలివి తేటలు తక్కువ అంచనా వేసిండు. ఈయన మాటలను KCR జబర్దస్తుగా ఎదుర్కున్నడు. "అయ్యా, నేను రేపు అసెంబ్లీల అవిశ్వాస తీర్మానం బెడుత. నువ్వు నన్ను బలపరుస్తవా? లేకుంటె నువ్వే కాంగ్రేసు బ్రాంచి ఆఫీసని ఒప్పుకుంటవా?" అని ఒక్కతీర్గ అడిగిండు.
ఏం జెప్తడు చంద్రబాబు? నిన్నటి దాంక "ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందీ, విశ్వాసం కోల్పోయిందీ" అని కోడి లెక్క గూశిండు. ఇప్పుడు ఏమంటడు? "విశ్వాసం కోల్పోలేదు కాబట్టి బలపరచను" అంటడా? ఎటూ తోయని చంద్రబాబు పరిస్థితి కోరి కోరి కుడితిల పడ్డ ఎలుక లెక్క అయింది.
No comments:
Post a Comment