Thursday, November 17, 2011

లగడపాటి రాజగోపాల్ యూపీలో ఉద్యమం చేయాలి


లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు బద్ధ వ్యతిరేకి. హైదరాబాదులో వున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన బలంగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని సమైక్యవాదులకు కూడా తెలుసు. కాకపొతే ఆయన ఆ విషయం ఒప్పుకోడు.

తనకు హైదరాబాదుపై గానీ, హైదరాబాదులోని బిజినేసులపై గానీ ఎలాంటి భయం లేదనీ, ఆమాటకొస్తే హైదరాబాదులోనే కాక ఇంకా పదహారు రాష్ట్రాల్లో ఆయన బిజినెసులు ఉన్నాయనీ నిన్న ఆయనే స్వయంగా ప్రకటించాడు.

మరి ఆయన బాధ దేనికి? ఆయన మాటల్లోనే చెప్పాలంటే, చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకి భంగకరం. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. వగైరా వగైరా. తనకున్న దేశ భక్తిని చాటుకోవడానికి ఆయన భుజానికో త్రివర్ణపతాకం కూడా తగిలించుకొని తిరుగుతుంటాడు.

అయితే ఇప్పుడు తన దేశభక్తి (?) ని చాటుకోవడానికి ఆయనకో సువర్ణావకాశం లభించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నినాలుగ్గా విభజించడానికి మాయావతి కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాకర్లోపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతానంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ వేసి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఇంకో పక్కన ముందుకు వెళుతుంది.

మరి ఒక్క ఆంద్రప్రదేశ్ విడిపోతేనే విపరీతంగా బాధపడి పోయే రాజగోపాల్ కి సహజంగా ఇవి విద్యుదాఘాతం లాంటి వార్తలే కదా? అసలే ఆయన దేశభక్తిలో దేశముదురు కూడాను! ఇప్పుడాయన ఏదో ఒకటి చేయక పోతే జనం ఆయన దేశభక్తిని శంకించే ప్రమాదం వుంది.

అందుకే వెంటనే ఆయన యూపీ వెళ్లి, భుజానికో జెండా తగిలించుకొని, మాయా ఇంటిముందు దీక్ష మొదలు పెట్టాలి. సీమాంధ్రలో చేసినట్టు దొంగ ఉద్యమాలు లేవదీస్తే ఇంకా బెటరు! ఇవన్నీ చేయడానికి చేదోడువాదోడు కావాలంటే నన్నపనేని ఎలాగూ ఖాళీగానే వుంది, ఆవిణ్ణి కూడా తీసుకెళ్ల వచ్చు. చేతిలో డబ్బు ఎలానూ ఉండనే వుంది. లగడపాటీ, నీకు చక్కని అవకాశం! ఇంకేం,  వెంటనే వెళ్లి ఉత్తరప్రదేశ్ లో సమైక్యఉద్యమం మొదలుపెట్టు!
  

9 comments:

  1. కేసీయార్ వచ్చి సీమాంధ్ర లో ఉద్యమం చేయగలడా?

    ReplyDelete
  2. ఆయనకు హిందీ రాదు, పైగా అక్కడ వ్యాపారాలు, వక్ఫ్ దురాక్రమణ భూములు లేవు మరి. పరకాల ప్రభాకర్ గారిని పంపిస్తే బాగుంటుంది.

    ReplyDelete
  3. UP was formed in 1857; almost 100 years before AP. How come no one is deploring the demise on "emotional integration" grounds?

    Organizer carried an article many years ago on state formation. The article starts with a conversation in the first post-independance cabinet (when Nehru included several non-Congress stalwarts).

    When Ambedkar suggested bifurcating UP in a cabinet meeting, Nehru retorted "why not trifurcate"? SP Mookerjee also supported the idea. GB Pant, the then UP CM, opposed the move saying "how can you divide the land of Rama, Krishna & Ganga"?

    Balasaheb Deoras, the author of the article, comments wryly: "Punditji (Pant, not Nehru: Jai) did not unfortunately realize Rama, Krishna & Ganga belong to the whole country, not just UP"

    ReplyDelete
  4. Suresh,

    Srikanth is asking lagadapati to go to UP as he gives statements about unity and blah blah.

    ReplyDelete
  5. Splitting UP not a bad idea http://www.thehindubusinessline.com/opinion/article2636351.ece

    ReplyDelete
  6. source : http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=7&ContentId=46068


    నల‘మోస’ చక్రవర్తి చరిత్ర

    ReplyDelete
  7. అసలే ఆయన దేశభక్తిలో దేశముదురు కూడాను


    LOL

    ReplyDelete
  8. నలమోతు చక్రవర్తికి యుపిలో ఉద్యమం చెయ్యమని చెప్పాలి. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమంతా ఏకమైపోతోందనీ, ప్రపంచం ఒక కుగ్రామంలా కనిపిస్తోందనీ వాదించే వర్గానికి చెందిన వ్యక్తి కదా అతను.

    ReplyDelete
  9. కాళిదాస్ గారు, నల‘మోస’ చక్రవర్తి చరిత్ర నేను ఆలస్యంగా చదివాను. నా సెల్ ఫోన్‌లో తెలుగు అక్షరాలు కనిపించకపోవడం వల్ల నేను ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగా చదవలేదు. నలమోతు చక్రవర్తి గురించి నేను ఇక్కడ వ్రాసాను, చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/9HvR2fCxKhd

    ReplyDelete