ఒక వైపు తెలంగాణా వారు 'మా చరిత్ర వక్రీకరిస్తున్నారు మొర్రో' అంటే 'అబ్బే ఎక్కడా?' అని అమాయకంగా అడుగుతారు సమైక్యవాదులు. ఎక్కడో ఎందుకు? ప్రతి రోజూ, ప్రతి క్షణం దృష్టాంతాలు కనబడుతుంటే!
చూసారుగా చంద్రబాబు నాయుడుగారి స్పీచు! తెలుగుజాతి సమైక్యత కోసం పొట్టిశ్రీరాములు ప్రాణాలర్పించారట! ఇంతకన్నా ఈ శతాబ్దంలో పెద్ద అబద్ధం ఇంకేమైనా ఉందా? ఈ పెద్దమనిషి 2009లో వోట్లు దండుకోవడానికి తెలంగాణా తెచ్చేది నేనేనని, నా మాటంటే మాటేనని, కాంగ్రెస్ లాగా కాదని ఊదరగొట్టాడు. అదే సంవత్సరం డిసెంబరు నాటికే మాట మార్చి తెలంగాణా ప్రకటన అర్ధరాత్రి ఎలా చేస్తారంటూ తన సమైక్యవాద విషకోరలను బయట పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉప ఎన్నికల్లో తెలంగాణా ప్రజల వోట్లు గుర్తొచ్చి తనది రెండుకళ్ళ సిద్ధాంతమంటూ దేబిరించాడు. మొన్నటికిమొన్న నేను తటస్థ వాదినంటూ ఊకదంచాడు.
ఇప్పుడు తాజాగా కొత్త అబద్ధాల కూర్పుతో సమైక్యవాద సిద్ధాంతాలు మొదలు పెట్టాడు. పెద్ద చరిత్రకారుడిలా తెలుగు జాతి మొత్తం 150 సంవత్సరాలు తప్ప మూడువేల సంవత్సరాల నుంచీ కలిసే వుందట! ఇలాంటి వెర్రి మొర్రి వాదాలని తెలంగాణా ప్రజలు ఎప్పుడో తిప్పికొట్టిన సంగతి (చూ: http://telangaanaa.blogspot.com/2011/04/blog-post_27.html) ఈయన కింకా తెలియదేమో పాపం!
ఇక ఈ పెద్దమనిషి చెప్పిన మహా అబద్ధం వక్రీకరించిన పొట్టిశ్రీరాములు చరిత్ర. పొట్టిశ్రీరాములు దీక్షకు దిగింది ఆంద్ర రాష్ట్రం కోసం కాదట సమైక్య తెలుగు రాష్ట్రం కోసమట! ఆంద్రపత్రిక డిసెంబరు పదో తారీఖు పేపరు చూస్తే విషయం అర్థం అవుతుంది.
పై పత్రికలో వార్త ఏం చెపుతుంది? ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు తమిళులకి ఏమాత్రం అభ్యంతరం లేనట్టూ, తమిళ భూభాగంలో అంతర్భాగమైన మద్రాసుకోసమే పొట్టిశ్రీరాములు దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలియడం లేదూ?
ఇప్పడు తమ భూభాగంలో అంతర్భాగం కానటువంటి హైదరాబాదును కోరుతున్న (కుహనా) సమైక్యవాదుల్లాగానే అప్పుడు కూడా పొట్టి శ్రీరాములు మద్రాసుపై గొంతెమ్మ కోరికతో పరమపదించారని పై వార్త చదివితే తెలుగు తెలిసిన వారందరికీ అర్థమౌతుంది. మరి పొట్టిశ్రీరాములు సమైక్య తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించాడని చంద్రబాబుకి ఎలా జ్ఞానోదయమైందో ఆయనకే తెలియాలి.
శెబ్బాష్.. చారి గారు. చెప్పుతో కొట్టినట్లు ఆధారాలతో సహా ఆంధ్రుల దీక్షా రహస్యాన్ని బద్దలు చేసారు. కొంతమంది చదువరులకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండ చేసారు. ఇప్పుడైనా కుహనా సమైక్య వాదులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఏడుపు ఆపుతారని, వాళ్ళకు జ్ఞానం కలుగుతుందని ఆశిద్దాం.
ReplyDelete@తెలంగాణ బిడ్డ
ReplyDeleteThanks, నిజానికి నేను మీరు చెప్పిన పెద్దమనిషి బ్లాగు ఇప్పుడే చూశాను. కేవలం చంద్రబాబు అబధ్ధాలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఇది రాశాను.
పాపం మీ బ్లాగు చంద్రబాబు ఇంకా చదవలేదనుకుంటా అందుకే అలా అని ఉంటాడు.
ReplyDeleteమూడు వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష ఎక్కడ ఉండేది? శాతవాహనుల కాలంలో కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో మాహరాష్ట్రి అనే భాష మాట్లాడేవాళ్ళని తెలుస్తోంది కానీ మూడు వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష ఉండేది అని చెపితే చెవిలో పువ్వులు పెట్టుకున్నవాడు కూడా నమ్మడు.
ReplyDeleteనవంబర్ ఒకటిన మాత్రమే అందరికీ పొట్టి శ్రీరాములు గుర్తుకొస్తాడు.
ReplyDeleteమా ఊళ్ళో రోడ్డు విస్తరణ కోసం పొట్టి శ్రీరాములు విగ్రహం తవ్వి అవతల పడేశారు.
ఒక్కరూ పట్టించుకోలేదు.
చివరకి ఆర్య వైశ్య సంఘం వారు ఆందోళన చేస్తే గానీ ఆ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్టించలేదు.
ఆ విధంగా ఆ మహానుభావుణ్ణి ఆయన కులం రక్షించింది!
అప్పుడు మా సమైక్యవాదులకి (అనగా హైదరబాదు వాదులకి) పొట్టి శ్రీరాములు ఎవరో తెలీదు.
డిసెంబరు తొమ్మిది తరవాత హఠాత్తుగా కొందరికి చాలా ఇష్టుడైపొయ్యాడు.
చరిత్ర వక్రీకరణ అనేది అవసరార్ధం జరుగుతూనే ఉంటుంది.
రాజకీయ అవసరాలు అలాంటివి!
చంద్రబాబుగానీ, కెసీఅర్ గానీ.. సత్యహరిశ్చంద్రుడి వారసులు కాదు గదా!
పల్లెటూర్లలో చాలా మందికి గాంధీ ఎవరో కూడా తెలియదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వర్గంవాళ్ళకి మావోయిస్టులని విమర్శించడానికి మాత్రం గాంధీ గుర్తుకి వస్తాడు. వ్యక్తి పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం ఎక్కడైనా జరిగేదే. పొట్టి శ్రీరాములు పేరు చెప్పుకుంటున్నవాళ్ళు చేస్తున్నది కూడా ఇదే.
ReplyDeleteRead this link: https://plus.google.com/111113261980146074416/posts/8GmPDeg3Pac
ReplyDeleteఇంకా నయం ఆయన చనిపోయాడు కాబట్టి ఈ మాత్రమయినా గ్లామరు దక్కింది.
ReplyDeleteఅదే పాపం విశాఖ ఉక్కు స్థాపన కోసం సత్యాగ్రహం చేసి సాధించిన అమృత రావు గారిని గుర్తు చేసుకునే నాథుడే లేడు.
@Praveen: మూడు వేల ఏళ్ల కిందట తెలుగు భాష లేదనే విషయం ఆంధ్రబాబుకే కాదు, పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి లాంటి కుహనా మేధావులకు కూడా తెలీదు, తెలిసినా ఒప్పుకోరు.
ReplyDeleteతెలకపల్లి రవి అనే ఇంకో మేతావి ఉన్నాడు. భాష ఒక్కటే ప్రజలని ఏకం చెయ్యదు అని మార్క్సిజం-జాతుల సమస్య పుస్తకంలో స్టాలిన్ స్పష్టంగానే వ్రాసాడు. అయినా మార్క్సిస్ట్‌నని చెప్పుకునే ఆ మేతావి స్టాలిన్ మాటలు నమ్మడు. జాతుల సమస్య పుస్తకంలో స్టాలిన్ వ్రాసినదే ఇక్కడ ఉదహరిస్తున్నాను. "ఇంగ్లాండ్‌వాళ్ళు, అమెరికావాళ్ళు మాట్లాడేది ఒకే భాష కానీ కొన్ని వందల సంవత్సరాల పాటు ఇంగ్లాండ్‌వాళ్ళు, అమెరికావాళ్ళు వేరువేరుగా ఉండడం వల్ల తాము వేరువేరు జాతులగానే వాళ్ళు భావిస్తారు". ఇది జాతుల సమస్య పుస్తకంలో స్టాలిన్ స్పష్టంగానే వ్రాసాడు. అమెరికా దాక ఎందుకు? పక్కపక్కనే ఉన్న ఆస్ట్రియా-జెర్మనీ ఈ రెండు దేశాలలోనూ మాట్లాడేది ఒకే భాష కానీ వీళ్ళు వేరువేరు ఐడెంటిటీలు కలిగి ఉంటారు. అయినా తెలంగాణావాళ్ళు ప్రత్యేక దేశం కావాలనడం లేదు, ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు, అంతే.
ReplyDelete>>>>>
ReplyDeleteThis, of course, does not mean that different nations always and everywhere speak different languages, or that all who speak one language necessarily constitute one nation. A common language for every nation, but not necessarily different languages for different nations! There is no nation which at one and the same time speaks several languages, but this does not mean that there cannot be two nations speaking the same language! Englishmen and Americans speak one language, but they do not constitute one nation. The same is true of the Norwegians and the Danes, the English and the Irish.
>>>>>
http://www.marxists.org/reference/archive/stalin/works/1913/03a.htm#s1
మార్క్సిస్ట్‌గా నేను ఈ వ్యాసం ఎప్పుడో చదివేశాను. కానీ మార్క్సిజం చదివినట్టు చెప్పుకున్న తెలకపల్లి రవి గారికి ఈ వ్యాసం గురించి తెలియదా, తెలియనట్టు నటించారా?
ఈ సమైక్యవాద మేతావి తెలంగాణావాద చానెల్ అయిన HMTVలో ప్రసంగాలు ఎందుకు ఇస్తున్నట్టో. తెలకపల్లి రవి OMC గనుల గురించి HMTVలో బాగానే ప్రసంగాలు దంచాడు.
ReplyDelete