Thursday, November 10, 2011

సమైక్యవాదుల కబుర్లు


కొంతమంది మనుషులను చూస్తుంటాం. వారు వారికి కొన్ని కోరికలుంటాయి. కాని వాటిని బలంగా చెప్పలేరు. వారి వాదనలను బలంగా వినిపించ లేరు. వారి కోరిక ఎందుకు సమంజసమైందో తార్కికంగా వివరణ ఇవ్వలేరు. 

అలాంటి వారు వారి కోరికలను సాధించుకోవడానికి వేరే రకాలైన మార్గాలను ఎన్నుకుంటుంటారు. ఉదాహరణకి ఒక కుటుంబం సినిమాకి వెళ్లాలని అనున్నారనుకుందాం. భర్త ఒక సినిమా పేరు చెప్తాడు. భార్యకు ఆ సినిమా చూడడం ఇష్టం వుండదు, వేరే సినిమా చూడాలని వుంటుంది. కాని తనకు ఇష్టమైన సినిమాఏ మంచిది అని చెప్పి నెగ్గలేదు. ఎందుకంటే తర్కిస్తే భర్త చెప్పిందే మంచి సినిమా అని రుజువై పోతుంది. దానికే ఒప్పుకోవాల్సి వస్తుంది.  అటువంటి సమయంలో ఆ భార్య వేరే పధ్ధతి లో నరుక్కు వస్తుంది.

"చిన్నమ్మాయికి ఆ సినిమా ఇష్టం లేదు".

చిన్నమ్మాయి అంటే ఇంట్లో అందరికీ గారం. దానికి ఇష్టం లేకపోతే ఎవరూ కాదన లేరు. మరి చిన్నమ్మాయి... తల్లి మాట కాదనలేదు. అందరి ఎదురుగా తల్లిని ధిక్కరించి తనకు ఆ సినిమా ఇష్టమే నని చెప్పలేదు. ఆ విధంగా తల్లి పంతం నెగ్గుతుంది.

తర్కం తమకు సహకరించనప్పుడు పనులు సాధించుకోవడానికి ఇలాంటి పద్ధతులను వాడడం మనం ప్రతిరోజూ చూస్తుంటాం. సరిగ్గా మన సమైక్యాంధ్ర వాదులు చేసేది కూడా ఇదే. 

తెలంగాణా ప్రజల ప్రేత్యేక రాష్ట్ర ఆకాన్స్ఖ రాజ్యాంగ బద్ధమైనది. అది ప్రజల యొక్క బలమైన కోరికేనని, నాయకుల కోరిక కాదని ఇప్పటికే నిర్ద్వంద్వంగా రుజువైంది. ప్రజాస్వామ్యంలో నాలుక్కోట్ల ప్రజల భవితవ్యాన్ని వారి ఇష్టాలకు విరుద్ధంగా నిర్ణయించడం జరిగే పని కాదు. కాబట్టి రాష్ట్ర ఏర్పాటు అనివార్యతని సమైక్యవాడులమని చెప్పుకునే వారు కూడా గుర్తించారు.

అయితే వారి అవసరాల దృష్ట్యా రాష్ట్రం ఆ విధంగా విడిపోవడం అస్సలు ఇష్టం లేని సంగతి. కాని అడ్డు ఎలా చెప్పాలి? అదిగో అక్కడే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఇల్లాలి పాత్ర రంగంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ క్రింద పలు సందర్భాలలో సమైక్యాంధ్ర వాదులు మాట్లాడిన మాటలు చూడండి.

తెలంగాణా ఏర్పాటు చేస్తే ఇలాంటి రాష్ట్రాల డిమాండ్లు మరెన్నో పుట్టుకొస్తాయి. అలా దేశం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది. అది దేశ సమగ్రతకే భంగం. 

దీనికన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు. స్వాతంత్ర్యం వచ్చింతర్వాత మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండు మొదలు పెట్టిందే వారు. పైగా దాన్ని ఎంతో ఉదాత్తమమమైన ఉద్యమంగా అభివర్నించు కుంటారు. అప్పుడు రాష్ట్ర విభజన దేశ సమగ్రతకి భంగం కలిగించేది కానప్పుడు ఇప్పుడెలా అవుతుంది? 

తెలంగాణా ఏర్పాటు చేస్తే ముస్లిం తీవ్రవాదం, నక్సలిజం ఇక్కడ పెరిగి పోతాయి. అది దేశ సమగ్రతకి భంగం కలిగిస్తుంది.

ఇది మరో అసహ్యకరమైన వాదన. ఇప్పుడు హైదరాబాదులో కానీ, దేశమంతటా కానీ ముస్లిం తీవ్రవాదం లేదా? ఈ సమైక్య హైదరాబాదులోనే కాదా లుంబినీ పార్కులో, గోకుల్ చాటులో బాంబులు పేలితే ఇప్పటివరకూ ఆతీ గతీ లేనిది? ఇంతకన్నా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పలుమార్లు బాంబులు, ఉగ్రవాదవాద దాడులు ఎందుకు జరిగాయి?  అసలు చిన్నా, పెద్ద రాష్ట్రాలకు ఉగ్రవాదానికి ఏమిటి లింకు? చిన్న రాష్ట్రాలన్నిటిలో ఉగ్రవాదులు వున్నారా? 

ఇక నక్సలిజానికి వస్తే గత ముప్పై సంవత్సరాలుగా నక్సలిజంతో ఆంధ్రప్రదేశ్ ఎంతగా అట్టుడికి పోయిందో మనకు తెలుసు. మరి పెద్దరాష్ట్రాలు నక్సలిజానికి రక్షణ కవచాలయితే, మన రసహ్త్రంలో ఇలా ఎందుకు జరిగినట్టు? మనకన్నా చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం నక్సలిజం ఎందుకు అడుగుపెట్ట లేక పోయినట్టు? ఇంత పెద్ద రాజ్యంలో నక్సలిజం ఒక్కటేనా? రౌడీయిజం, గూండాయిజం, ఫాక్షనిజం అని ఒకటేమిటి, ఎన్నో రుగ్మతలు ఇప్పటికే చూస్తున్నాం. రేప్పొద్దున అంతకన్నా ముప్పు ఉంటుందనేది కేవలం ఊహా జనితం మాత్రమే. పైగా చిన్న రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకోవడం, అమలు జరపడం వేగంగా జరుగుతుంది, span చిన్నది కాబట్టి. ఆవిధంగా చూస్తే చిన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి వాటిని అరికట్టే అవకాశం ఎక్కువ.

ఇలా వీరు చెప్పే ఇల్లాలి ముచ్చట్లు చాలానే వుంటాయి. మరికొన్ని ఇతర టపాల్లో.  

2 comments:

  1. శ్రీకాంతాచారిగారు... మీ టపా చూస్తుంటే నవ్వు వస్తోంది. ఎంతసేపు సమైక్యవాదుల్ని ఆడిపోసుకోవడమే గానీ అసలు మీ వాదనల్లో ఏమైనా పస ఉందా అనేది ఆలోచించారా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మీరు చెబుతున్నారు అసలు నిజంగానే నాలుగు కోట్ల మంది తెలంగాణాను కోరుకుంటున్నారా? ఆలోచించండి. హైదరాబాదులో ప్రత్యేక వాదం శూన్యం. వరంగంల్, కరీంనగర్ జిల్లాల్లో మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో, ప్రాంతాల్లో తెలంగాణా వాదం ఉందా అసలు? ఆలోచించండి. ఎంతమంది వాస్తవంగా తెలంగాణాను కోరుకుంటున్నారు? కలిసి ఉండాలని కోరుకుంటున్న తెలుగు ప్రజల్ని మీరు మీ విషపు రాతలతో ఎందుకు విడగొడతారండి.

    ReplyDelete
  2. >>> హైదరాబాదులో ప్రత్యేక వాదం శూన్యం. వరంగంల్, కరీంనగర్ జిల్లాల్లో మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో, ప్రాంతాల్లో తెలంగాణా వాదం ఉందా అసలు?


    లేదని ఎలా చెప్పగలిగారు మీరు, సాక్ష్యాలుంటే ఇవ్వండి. ఇంతవరకు తెలంగాణాలో ఏ పార్టీ ఐనా సమైక్యవాదం పేరుతో పోటీ చేసి గెలిచిందా? ఒక్క MIM(7), CPM(1) తప్ప. గెలిచిన అన్ని పార్టీలూ ఇప్పటివరకూ తెలంగాణా తెస్తామనో, చస్తామనో చెప్పే గెలిచాయి. అది చాలదూ చెప్పడానికి?

    మీతో మాకు పొసగదు మొర్రో అన్నా వినక, "వదలను బొమ్మాళీ" అనేవారికన్నా ఎక్కువ విషపు రాతలు రాసేదెవరు?

    ReplyDelete