Monday, November 14, 2011

పరకాలకు ప్రచారమొచ్చిందోచ్!


పరకాల ప్రభాకర్ అనే పెద్దమనిషి తెలంగాణా మొత్తం సమైక్య వాదాన్నే సమర్దిస్తున్నారని, తనకు అవకాశం ఇస్తే దాన్ని నిరూపిస్తానని చంద్రశేఖర్ అనే TRS పెద్దమనిషితో సవాలు విసిరాడట. ఆయన సవాలు విని, వికారాబాద్ లో మాట్లాడడానికి తాను అవకాశామిస్తానని, అక్కడ నిరూపించవలసిందని ప్రతి సవాల్ చేశాడట. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఇద్దరూ ABN ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వచ్చారట. పరకాల ఒంటరిగా రాకుండా మందీ మార్బలంతో వచ్చాడట. ఈ చంద్రశేఖర్ కూడా ఒంటరిగా రాకుండా తన మనుషులతో వచ్చాడట.

పరకాలకు సంబంధించిన మనిషి నోటిదూలతో ఏదో అన్నాడట. వీళ్ళకు నోటిదూల ఉండడం, తెలంగాణా వైతాళికులని తిట్టడం అలవాటే గా! అది ఎలా వుంటుందో చూసి తరించాలంటే ఇక్కడ నొక్కండి. చిర్రెత్తుకొచ్చిన తెలంగాణా వాదులు టీవీ స్టూడియో సాక్షిగా నాలుగు తన్నారట. ఇకనేం, పరకాలకు కావలసింది జరిగింది. తన్నులు తింటే గగ్గోలు పెట్టొచ్చు. లబోదిబోమని మొత్తుకుంటూ సానుభూతికోసం దేబిరించొచ్చు. ఇకనేం, అన్ని సీమాంధ్ర చానెళ్ళ లోనూ మార్చి మార్చి ఇతన్ని తన్నుతున్న సీన్లు.

పైగా వీరికి భావ వ్యక్తీకరణ స్వేచ్చ కావాలట. ఏమిటి వీరి దృష్టిలో భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే? తెలంగాణా ప్రజలు అభిమానించే వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు తిట్టడమా? తెలంగాణా వారు ఆంధ్రాకు వెళ్లి పొట్టిశ్రీరాములు మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకుంటారా? అసలు ఆంధ్రాలోనే కొందరు నాయకులు ప్రత్యేకాంధ్ర కోసం సదస్సు నిర్వహించుకోవాలని ప్రయత్నిస్తే ఎవరు వారి మీటింగ్ హాల్లోకి వెళ్లి చావ చితగ్గొట్టి తరిమారో జనం అప్పుడే మరిచిపోయారనుకుంటే ఎలా? ఇలాంటివారు భావ ప్రకటన గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చదివినట్టు కాదూ?

అసలు చంద్రశేఖర్ అనేటాయనకు ఉండాలి బుద్ధి! ఆయన మెతక మనిషే కావచ్చు, కాని ఈ పరకాల అనే పరమాణువు అడగ్గానే ఒప్పుకోవడమేమిటి? ఇంట్లో భార్యనే సమైక్యాంధ్రకు ఒప్పించలేనివాడు తెలంగాణా ప్రజలను ఒప్పిస్తానని చెపితే, దానికో విలువ నివ్వడమేమిటి? అందుకు ఈయన రక్షణ కల్పిస్తాననడమేమిటి? అసలు తెలంగాణలో అంతా సమైక్యవాదులే ఉన్నారని ఆయన అంటూంటే ఆయనకు తెలంగాణలో తిరగడానికి ఈయన ప్రత్యేకంగా రక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంటుందని నమ్మడమేమిటి? ఆయన రక్షణకు ఈయన గ్యారంటీ ఇవ్వడమేమిటి? విచిత్రంగా లేదూ?

ప్రచారంలేని పరకాలకు తెలంగాణావాదుల చేత తన్నించుకోవడమే కావలసింది. ఎన్ని తన్నులు తింటే అంత ప్రచారం. దానికోసం తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టడం అనే చిన్న పెట్టుబడి పెడితే చాలు. రోగి కోరిందే డాక్టరు ఇచ్చినట్టు ఆయనకు కావలసినట్టుగానే వీళ్ళు తన్నారు. ఇన్నాళ్ళూ టీవీలో కనపడడానికి మొహం వాచిపోయినాయనకు ముందే ఊహించినట్టుగానే అంతో ఇంతో ప్రచారం లభించింది. ఇంకో నాలుగు తన్నులు, ఒకటో రెండో బాండేజీలు ఎక్కువెందుకు పడలేదా, మరో నాలుగు రోజులు ఎక్కువ ప్రచారం వచ్చేదే అని ఆయన  బాధపడిపోయి ఉంటాడు పాపం. ఏంచేస్తాం పరకాల గారూ, మావాళ్ళకు అంతకన్నా ఎక్కువ చేతకాదు మరి! ఈ సారి మరింత బాగా రెచ్చగొట్టి చూడండి మరి! మీరెలాగూ మాటలతో తెలంగాణా ప్రజలని మెప్పించలేరు, తన్నులు తిని సానుభూతి అయినా పొందడానికి ప్రయత్నించండి.

12 comments:

  1. Charigaru,

    What a greatness..that is true Telangana....we have to think which age are we in...This scene is showing Rathi yugam....that's the reason whole india don't like this separation..this will become another Bihar state..Out beloved prime minister said very clearly about your demand..better have more beers..look for some one to fight..your wish is not going to fulfill..just pray to god and wish for big earth quake for telangana..and ask god to create your place as a seperate planet..so that your own brother can fight and enjoy the shows.

    ReplyDelete
  2. @Anonymous Nov 14, 2011 08:56 AM

    True, the country itself is in Rati Yugam. A country which has a PM who puts T in CMP. A PM who constitutes dozens of committees for T. A PM and his party repeatedly participate in elections saying they are who can form T. Now the same PM can twist his tongue.

    A neghborhood which does not have any respect for the wishes of her fellow neighbors and tries to go against them and still want unity!

    You might not know that the PM does not go against T. But he said there would be 2nd SRC, to form more of such states. Telangana may be delayed because of you like hipocrites who want to degrade your fellow neighbors and still want to solidarity. But ultimately it is going to be an inevitable change to happen.

    ReplyDelete
  3. ఈ పరకాల ప్రభాకర్ అనేవాడు మూడు పార్టీలు వాళ్ళు గెంటేసిన మహనీయుడు. నాలుగు సార్లు ఎన్నికలలో ఛీ గొట్టించుకున్నా పదవీ వ్యామోహం తీరక ఇప్పుడు తెలంగాణపై పిచ్చి వాగుడు మొదలు పెట్టాడు.

    ReplyDelete
  4. you guys lost brains, you support kcr or etela rajendar or some mad guy who is working for their personnel gains only.

    why dont we demand our MLAs of telangana, what they are doing from last 50 years in their areas.

    ReplyDelete
  5. @srini,

    Yes, KCR works for his personal gains
    You work for your personal gains
    I work for my personal gains
    Everyone in Telangana (and also in Seema-Andhra) only work for their personal gains.

    The total resultant effort of Telangana people has already become into a great force towards the goal of achieving Telangana. If you think the Telangana as a whole lost brain, then it is the health of your brain, which needs an overhaul.

    ReplyDelete
  6. ఈ పైన పరకాల గారి మీద రాసిందంతా అహంకారం దుర్మదాంధం. అయనకు తన మాట చెప్పుకునే అధికారం లేదా? అందరూ ఆ తె.రా.స్.పాడిన పాడుతున్న పాటే పాడాలా? అతను చెప్పేదాన్ని చెప్పనివ్వండి. అది మంచా చెడా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అల్ల కాకుండా అ వేర్పాటు వాదానికిభిన్నంగా ఎవర్నీ ఏమీ చెప్పనివ్వమనడమమానుషం. వేర్పాటే సరని ఏమీలేదు. ఈ విభజన వల్ల వచ్చేతెలుగు జాతి శక్తి రేపు విడిపోతే తగ్గిపోవచ్చు. దాంతో చులకన కావచ్చు. ఈ రోజు ఏదో దుర్మదాంధంగా విడగొడితే భవితరాలవారు దానికి బాధపడొచ్చు. మనల్ని క్షమించరు.

    ReplyDelete
  7. >>>ఈ పైన పరకాల గారి మీద రాసిందంతా అహంకారం దుర్మదాంధం.

    అలా అని ఫిక్సై పొయారన్న మాట! బాగుంది.

    అయనకు తన మాట చెప్పుకునే అధికారం లేదా?

    ఎందుకు లేదు. కాని ఇతరులు దైవంలా భావించే వారి గురించి వారి ప్రాంతంలోనే అవాకులు చవాకులు వాగాలని చూస్తే, ఎదుటివారికి అడ్డుకునే హక్కు కూడా వుంటుంది.

    >>>అందరూ ఆ తె.రా.స్.పాడిన పాడుతున్న పాటే పాడాలా? అతను చెప్పేదాన్ని చెప్పనివ్వండి.

    అహ్హ! ఫలానా ప్రాంతాల్లో విభజన వాదుల మీటింగులను (అవి జై అంధ్రా అయినా సరే) ఎంత చక్కగా జరగనిస్తున్నారో కదా!

    >>>అది మంచా చెడా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు.

    ప్రజలు నిర్ణయించారు కాబట్టే రియాక్షన్లు.

    >>>అల్ల కాకుండా అ వేర్పాటు వాదానికిభిన్నంగా ఎవర్నీ ఏమీ చెప్పనివ్వమనడమమానుషం. వేర్పాటే సరని ఏమీలేదు. ఈ విభజన వల్ల వచ్చేతెలుగు జాతి శక్తి రేపు విడిపోతే తగ్గిపోవచ్చు. దాంతో చులకన కావచ్చు. ఈ రోజు ఏదో దుర్మదాంధంగా విడగొడితే భవితరాలవారు దానికి బాధపడొచ్చు. మనల్ని క్షమించరు.

    మీ భావితరాలు ఏం పడతారో మాకు తెల్వదు గానీ, ఇప్పుడు వదిలేస్తే మా భావితరాలు మమ్మల్ని క్షమించరు. మీరనుకుంటున్నట్టు తెలుగుజాతి శక్తేమీ తగ్గదు. పైగా రెండు రాశ్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంట్రులతో మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతానికి రెండో రాజధాని నగరం ఏర్పడుతుంది.

    ReplyDelete
  8. ఈ పైన పరకాల గారి మీద రాసిందంతా అహంకారం దుర్మదాంధం. అయనకు తన మాట చెప్పుకునే అధికారం లేదా? అందరూ ఆ తె.రా.స్.పాడిన పాడుతున్న పాటే పాడాలా? అతను చెప్పేదాన్ని చెప్పనివ్వండి. అది మంచా చెడా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అల్ల కాకుండా అ వేర్పాటు వాదానికిభిన్నంగా ఎవర్నీ ఏమీ చెప్పనివ్వమనడమమానుషం. వేర్పాటే సరని ఏమీలేదు. ఈ విభజన వల్ల వచ్చేతెలుగు జాతి శక్తి రేపు విడిపోతే తగ్గిపోవచ్చు. దాంతో చులకన కావచ్చు. ఈ రోజు ఏదో దుర్మదాంధంగా విడగొడితే భవితరాలవారు దానికి బాధపడొచ్చు. మనల్ని క్షమించరు.

    అల్ల కాకుండా అ వేర్పాటు వాదానికిభిన్నంగా ఎవర్నీ ఏమీ చెప్పనివ్వమనడమమానుషం
    ee chaari gaadiki enta seppina waste elections lo chupimchandira ante bicham esinattu 10 seatlu (TRS ki) matrame istaru kaani rastranni bagu padanivvaru

    ReplyDelete
    Replies
    1. బాబూ,

      తమరేవ్వరో గానీ ముందు మీ ఆంధ్రాకే చెందినా ప్రత్యేక ఆంధ్రా వాదులను మీ ప్రాంతంలో ప్రచారం చేసుకునే ఏర్పాటు చేయండి.

      మీ ఇంటికే వచ్చి మిమ్మల్ని అమ్మనా బూతులు తిడితే మీరు ఊరుకుంటారా? మరి తెలంగాణాలోనే తెలంగాణా వైతాలికులను చులకన చేసి మాట్లాడితే అడ్డుకునే హక్కు ప్రజలక్కూడా వుంటుంది.

      సత్తావుంటే మీ పరకాలనే పోటీ చేయమనండి రాబోయే బై ఎలక్షన్లో, ఎన్ని వోట్లు వొస్తాయో చూద్దాం. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ పరకాల కూడా తెలంగాణా వాదమే ప్రచారం చేశాడని మీకు తెలుసా?

      సమైక్యవాదినని చెప్పుకుంటూ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కడికీ చాతకాదు పోయిన రాజశేఖర్ రెడ్డితో సహా. కానీ ఎన్నికలు, సీట్ల గురించి ప్రతి ఒక్కడూ మాట్లాడే వాడే, నీలాగా.

      Delete
  9. "ప్రజలు నిర్ణయించారు కాబట్టే రియాక్షన్లు."

    ఓహో ప్రజలంటే రెండు లారీల టీఆరెస్ గూండాలేనా. అయితే ఒకే

    ReplyDelete
    Replies
    1. veerendra,

      ప్రజలంటే ఎవరో తెలంగాణాకి వచ్చి చూడు తెలుస్తది.

      సూమోలలో, బస్సుల్లో గూండాల్ని నింపుకొచ్చి మీటింగులు పెట్టుకునేది మీ ఆంధ్రా లీడర్లు చంద్రబాబు లాగా.

      Delete
  10. emi replys anna.. arajakarlula gooba gui mannadhi... nuuvu dusukellu anna.. nee venuka memu unnamu.

    ReplyDelete