Monday, February 13, 2012

పరకాలా! హాస్యానికైనా హద్దుండాలి


విశాలాంధ్ర మహాసభ సభ్యుల్లో ఎక్కువమంది నైజాం ప్రాంతానికి చెందినవారున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.
పరకాల ప్రభాకర్



అన్ని పార్టీలూ బయటకు గెంటేస్తే ఏదో పొట్ట కూటికోసం తిప్పలు పడితే ఫరవాలేదు. కాని మరీ ఇలా అలవోకగా అబద్ధాలు గుప్పిస్తుంటే ఎలా పరకాలా? తమరి మాటలు కనీసం సమైక్య వాదులైనా నమ్మొద్దూ?

తెలంగాణలో సమైక్యవాదులు ఎక్కువగా ఉన్నారా? అయితే తమరికింకేం బాధ? సమైక్యవాదులే ఎక్కువగా వున్నప్పుడు వారికేం కావాలో వారు చూసుకో లేరా? వారిని ఉద్ధరించడానికి తమరేమైనా మెస్సయ్య అవతారం ఎత్తారా? మరి ఎక్కువమంది వారే ఉన్నప్పుడు తమరికి వాదం వినిపించుకోవడానికి తెలంగాణా వాదులు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎందుకో? అసలు ఎక్కువమంది వారే వున్నప్పుడు తమరు ప్రత్యేకంగా వాదం వినిపించాల్సిన అవసరం ఏమిటి? అవకాశం ఇస్తే వారి మనసులు మారుస్తానని ప్రకటనలు గుప్పించడ మేమిటి? 

ఇక పోతే తమరి కూటమిలో ఎక్కువమంది తెలంగాణా ( సారీ, నైజాం, మీకు తెలంగాణా పదం అంతే చిరాకు కదా) వారే ఉన్నారా? మరి తమ మీటింగుల్లో కనపడరేమి సామీ? సరే, ఉన్నారనుకుందాం. ఎప్పుడు ఎక్కడ చూసినా ఓ డజను పేర్ల కన్నా తమ గుంపు కనపడదు. ఆ డజను గుంపులో తెలంగాణా వారే ఎక్కువగా వుంటే, మరి ఆంధ్రాకి సంబంధించిన వారు ఆ మాత్రం కూడా లేనట్టేనా? మరీ ఇలాంటి చవక డవలాగులు చెప్పి ఉన్న పరువు తీసుకుంటే ఎలా ప్రభాకర్ జీ!

చెప్పడానికి నిజాలేమీ లేనప్పుడు అబద్ధాలే చెప్పి పబ్బం గడుపుకోవాలంటారా! సరే కానీండి.   


6 comments:

  1. ఆయన భార్యను ఒక వేదిక మీద సమైక్య వాద సమర్థన చేయమనండి చూద్దాం.

    ReplyDelete
  2. 1850-1900 మధ్య భారతదేశంలోని అత్యధికులు తెల్లవారి శాస్త్రీయ ప్రగతి, పద్ధతులకు ఆకర్షితులై వారి పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతుందని, చిరకాలం వారి పాలనే వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాంటి వాళ్ళలో మన ఆంధ్ర వైతాళికులు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావూ ఉన్నారు. దాన్ని మనం సమర్థించాలా? ఎవరి పాలన వారు చూసుకొందామంటే వీడికేం బాధ? అంటే బ్రిటిష్ వాళ్ళలాగే అధికారం చెలాయిస్తూ దోచుకొందామనేగా పన్నాగం! యెస్.. ఇట్స్ క్లియర్!

    ReplyDelete
  3. The same Grey Haired Dozen appear at all their meetings (err, not meetings...they don't have enough people to conduct meetings yet. So they name it as workshops, seminars, xyz)

    ReplyDelete
  4. Anna unko comment kuda chesindu...
    Ayana daggara unna statistics chuste karadu kattina pratyeka vadi kuda maripotada.

    ReplyDelete
  5. @Dileep: Don't understand Prabhakar who could even mobilize two senile old people and pass them off as "freedom fighters" :)

    ReplyDelete