Saturday, March 29, 2014

చంద్రబాబు BC కార్డు

జన్మించబోతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇప్పటికే వున్న జీవన్మరణ సమస్యలు:
- హైదరాబాదును సీమాంధ్ర కబ్జా నుంచి విడిపించడం.
- ఉద్యోగుల ఆప్షన్లను అడ్డుకోవడం
- పోలవరం కోరల నుండి భద్రాచలం డివిజన్ను రక్షించడం.
- తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు సాధించడం
- విద్యుత్ ప్రాజెక్టులు... తద్వారా మిగులు విద్యుత్ సాధించడం.
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం.
- తెలంగాణా ప్రాంతపు విద్యావకాశాలను ఆంధ్రులనుండి పరిరక్షించడం.
ఇదీ తెలంగాణాకి ఉండవలసిన ఎజెండా.
కాని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్న BC నాయకుడు ఏం ప్రకటించాడో చూడండి. ఆయనకు తెలంగాణా సమస్యలు పట్టవట! పదవిలో వుండి కూడా BC ఉద్యమమే చేస్తడట! జాతీయ స్థాయిలో BC రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లకోసం ఉద్యమాలు చేస్తడట!
ఆయన దృష్టిలో అవి ముఖ్యమైన విషయాలే కావచ్చు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల అవి ఎలా సాధ్యమో ఆయన చెప్పలేక పోయాడు. ఉద్యమాలు చేయడానికి ముఖ్యమంత్రి పదవలు అవసరమా?
ఆయన ఎజెండా చెప్పడంలో కృష్ణయ్యకు నిజాయితీ వుంది. కాని ఆ BC నాయకున్ని తీసుకురావడంలో చంద్రబాబుకు నిజాయితీ లేదు. తెలంగాణ ప్రజలను తికమక పెట్టే, దారి మళ్ళించే ఉద్దేశం మాత్రమే కనపడుతుంది.


Thursday, March 27, 2014

విభజన ప్రక్రియ కూడా లో చేతివాటం


విభజన ప్రక్రియ వేగవంతమైన ఈ తరుణంలో సీమాంధ్ర అధికారుల కుట్రలు కూడా అంతే ఊపందుకున్నట్టు వస్తున్నా వార్తలను బట్టి అర్థమైతుంది. గత అరవై సంవత్సరాల సీమాంధ్రుల చేతి వాటం చూసిన వారికెవరికైనా విభజన సమయంలో సీమాంధ్ర అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించ గలరని నమ్మకం కలగదు.

దురదృష్ట వశాత్తూ అన్ని శాఖల్లోనూ ఉన్నతాధికారులు మొత్తంగా సీమాంధ్రకు చెందిన వారే తిష్ట వేశారు. విభజన సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి ప్రభుత్వం ఒక వెబ్ సైటును కూడా ఏర్పాటు చేసింది. ఆ వివరాల సేకరణ, అప్లోడ్ పనులకు తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల,  అధికారుల ప్రాతినిధ్యం వీలయినంత తక్కువగా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

స్థిరాస్తులను ఏమీ చేయలేనప్పటికి, మూవబుల్ వాటి విషయంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనాలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఫర్నిచర్, యంత్ర పరికరాలు, ఇతర పనిముట్ల విషయంలో కాలం చెల్లినవి, పాతవి తెలంగాణా ప్రాంతానికి అంటగట్టి కొత్తవి, ఖరీదైనవి సీమాంధ్రకి తరలించేందుకు కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తుంది.

విభజన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మొత్తం విధానం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం వుంది. విభజన ప్రక్రియకు ఉపయోగిస్తున్న వెబ్సైటుని పబ్లిక్ యాక్సెస్ లో వుంచడం వల్ల కొంత నష్టాన్ని నివారించ వచ్చు. అలాగే ప్రక్రియలో తెలంగాణా వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ విషయంలో తెలంగాణా ప్రాంత నాయకులు పూనుకుని గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి చెందినా విభజన అధికారులకు తగు సూచనలు చేయ వలసిందిగా తెలంగాణా వాదులు కోరుతున్నారు.     

Monday, March 3, 2014

ఎందుకు కలుపాలె ?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినట్టు చేసింది. జనం, నాయకులు ఉద్యమ కారులు పండుగలు చేసుకునుడు శురువు జేసిన్రు.

ఇదా సంపూర్ణ తెలంగాణా?


పదేండ్ల పాటు సీమాంధ్ర పిలగాల్లు ఇక్కడి కాలేజీ సీట్లల్ల సదువు కొవచ్చు. తెలంగానోల్లు మాత్రం సీమాంధ్రల సడువరాదు. 

పదేండ్ల పాటు తెలంగాణా ప్రభుత్వానికి హైదరాబాదు మీద అధికారం ఉన్దదు. గవర్నర్ చేతిల వుంటది. ఇంతకంటే అవమానం ఉంటదా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా?

తెలంగాణా ప్రాంతాన్ని ముంచే పోలవరం ప్రాజెక్టును ఏ అనుమతులు లేకున్నా అడ్డదారిన కేంద్రం నెత్తికెత్తుకొని పూర్తీ చేస్తదట! వారి స్వార్థానికి అడ్డం రాకుండా, వచ్చినా అణగ దొక్కు తందుకు ముంపు గ్రామాలతో సహా సంబంధిచిన మండలాలు సీమాన్ధ్రకు ధారాదత్తం చేస్తున్నరు!

తెలంగాణలోని పది జిల్లాలలో తొమ్మిది దేశంలోని వెనుకబడ్డ జిల్లాల్ల లిస్ట్ల వున్నయని కేంద్ర ప్రభుత్వమే ఒకవైపు చెప్తున్నది. కాని దోపిడీ చేసి తెగ బలిసిన సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తున్నరట! ఇదెట్ల వున్నదంటే, దోచుకునే రౌడీ దోపిడీ ఆపెటందుకు రౌడీ మామూలు ఇచ్చినట్టు!!


ఎంత కాలానికి ఇచ్చింది తెలంగాణాని?


2004 లనే తెలంగాణా ఇస్తనని చెప్పి కాంగ్రెస్ అధికారం లకొచ్చింది.  ఐదేండ్ల పాటు మోసం చేసింది. 

తిరిగి 2009 ఎన్నికల్ల ఇచ్చేది తెచ్చేది మేమే ననుకుంట నమ్మ బలికింది. 2009 డిసెంబర్ ల ప్రకటన ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు మళ్ళింది. 1200 మంది ఉద్యమ కారుల చావులకు కారణమయ్యింది. 

2012ల తెలంగాణా ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ ల కలుపుతామని తెరాస ఆఫర్ కూడా ఇచ్చింది. కాని కాంగ్రెస్ స్పందించ లేదు. ఉద్యమాన్ని అణగ దొక్కుతందుకే చూసింది.

ఎన్ని లాఠీ చార్గిలు, ఎన్ని విషవాయు ప్రయోగాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా తెలంగాణా ప్రజలు వెనుకకు పొలెదు. ఉద్యమం ఒక ఇంచు కూడా సడలలేదు. సీమాంధ్ర వాద కాంగ్రెస్ టిడిపి లకు ఒక్క సీటు కూడా ఎన్నికల్ల దక్కలేదు. 

తెలంగాణా ఆపినా కూడా సీమాంధ్ర మొత్తంల ఎన్నికల్ల జగన్ చేతిల మట్టి గరిచినంక, కనీసం తెలంగాణాలనన్న బట్ట కట్టాలే నని భావించి తెలంగాణా ప్రక్రియ ప్రారంభించింది. 

ప్రక్రియ మొత్తంల కూడా సీమాంధ్ర నాయకులను కట్టడి చేస్తందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు.  బరితెగించిన ముఖ్యమంత్రి తన పార్టీ పాలసీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, రాష్ట్రపతినే ధిక్కరించడానికి ప్రయత్నించినా మాట మాట్లాడలేదు. ముఖ్యమంత్రిని మార్చ డానికో, రాష్ట్ర పాటి పాలన విధించడానికో ఏమాత్రం ప్రయత్నించ లేదు. 

కాని ఇప్పుడు సీమాంధ్ర నేతలు కోరగానే కొంపలు మునిగినట్టు రాష్రపతి పాలన విధించింది.

తెరాస ఆఫర్ ఇచ్చిన మాట నిజమే 


నిజమే, తెలంగాణా కోసం ఆత్మాహుతికి పాల్పడుతున్న యువకులను చూడలేక తనకు తాను  బలి అవుతందుకు సిద్ధ పడింది తెరాస. సంపూర్ణ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీల విలీనం చెందేతందుకు ఒప్పుకుని, తెలంగాణా ఏర్పాటు చేయమని అర్థించిండు కెసిఅర్.  

కాని కాగ్రెస్ ఒప్పుకోలేదు. దానికి స్పందించ లేదు. ఆత్మాహుతవుతున్న ప్రజలు ఏమాత్రం భరోసా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చెయ్యలేదు.    

ఇప్పుడెందుకు అం తహ తహ?


పదేండ్లు తాత్సారం చేసి, పన్నెందొందల ఆత్మార్పణాలకు కారణమై, చివరకు వికలాంగు రాలిగా మార్చిన తెలంగాణాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఆ మాత్రం దానికి బిల్లు పాసైన మరుక్షణం నుంచే తెలంగాణా రాష్ట్ర సమితి విలీనం కావాలని వత్తిడి తెస్తుంది.

విలీనం అయితే?


పేరుకు తెలంగాణా రాష్ట్రం వచ్చినా ఇంకా సాధించు కావలసింది ఎంతో వుంది. వందలాది సంవతరాల రాజరికంలో, గత యాభై ఆరు సంవత్సరాల వలస పాలనలో తెలంగాణా క్రుంగి, కృశించింది.  పొరబాటున తెరాస కాని కాంగ్రేసుల విలీనం అయితే ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడే నాధుడే వుండడు. BJP, కాంగ్రెస్ పార్టీలు అధిష్టానానికి బందీలు. TDP సీమాంధ్ర చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మ. ఇప్పటివరకు తెలంగాణా పక్షాన మాట్లాడగల, పోట్లాడ గల ఒకే ఒక పార్టీ తెరాస. కాబట్టి పొరపాటున కూడా ఆ పార్టీ కాంగ్రేసులో విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవద్దు. అదే అశేష తెలంగాణా ప్రజల ఆకాంక్ష. 

అలా కాక కాంగ్రేసులో తెరాస విలీనం చెందడానికి నిర్ణయిస్తే, అది తెలంగాణా ప్రజల ఆశలపై నీళ్ళు చల్లినట్టే! తెలంగాణా ప్రజానీకానికి ద్రోహం చేసినట్టే!!