Sunday, December 13, 2009

ఎందుకు సమైక్యాంధ్ర?

చిదంబరం డిల్లీల ప్రకటన చేసిండో లేదో ఆగమాగం చేసుడు మొదలు పెట్టినరు, ఆంధ్రల. బస్సులను తలగ బెట్టుడు షురూ జేసిన్రు. కార్లను తగుల బెట్టు కుంటున్నరు. ముప్పై లక్షల బీ ఎస్ ఎన్ ఎల్ కేబుల్ ని బుగ్గి బుగ్గి జేసిన్రు. కాల్ సెంటర్ లల్ల బడి కంప్యూటర్లు పగుల గొట్టుడు మొదలు బెట్టిన్రు.

నిన్నటి దాన్క తెలంగాణల లొల్లి జరుగు తుంటె జై ఆంధ్ర, జై రాయలసీమ అని లొల్లి పెట్టుకుంట తిరిగినోల్లె, ఇయ్యాల సమైక్యాంధ్ర అంటున్నరు. మరి నిన్న మొన్నటి లొల్లి ఉత్తుత్తి లొల్లా? ఇయ్యాల పెట్టేది ఉత్తుత్తి లొల్లా? సమజైతలేదు. జెర చెప్పున్రి ఎవరన్న.

ఆంధ్రోల్లు, రాయల సీమ జనాలు సమైక్యాంధ్ర అంటె ఎట్లైతది? తెలంగాణల ఉన్నోల్ల మాటకు విలువ లేదా? తెలంగాణల ఎవడన్న సమైక్యాంధ్ర అంటున్నడా? గా కొంచమైన గీల్లకు అర్థం అయితలేదంటే అనుమానమే! గీల్లకు తెలువక కాదు. అన్నీ తెలుసు.

నిన్న దివాకర్ రెడ్డి టీవీల మాట్లాడుతుండు. సమైక్యాంధ్ర, 'హైదరాబాద్ ల ఆంధ్రోల్లు...' అనుకుంట ఏదేదో చెప్తుండు. వెంటనే ఐ న్యూస్ విలేకరి అడిగిండు, 'హైదరాబాద్ ఇస్తే సమైక్యాంధ్ర నినాదం ఒదులు కుంటరా' అని అడిగిండు. దిమ్మ దిరిగిన దివాకర్ రెడ్డి నిమిషం పాటు డంగై పోయిండు. మేమ్మేమ్మే అనుకుంట మెల్లగ చెప్పిండు, కాదు, మాకు సమైక్య ఆంధ్రే కావాలన్నాడు. గిండ్లనే తెలుస్తుంది, గీల్లకు కావాల్సింది హైదరాబాదు కాదు. తెలంగాణల పారుతున్న క్రిశ్ణమ్మ కావాలె. గోదావరి కావాలె. గీ నదులు నూటికి డెబ్బై పాల్లు తెలంగాణల పారుతున్నయి. ముప్పయి పాల్లు ఆంధ్రాల పారుతున్నయి. ఒక్క రాష్ట్రం పేరు చెప్పి డెబ్బై శాతం నీళ్ళు కృష్ణల, గోదావరిల కొల్ల గొట్ట బట్టిరి. రేపు రాష్ట్రం వేరైతే గీనీల్లు ఎవరి కోటా వాళ్ళు వాడు కుంటరు. అంటె ముప్పై శాతం ఆంధ్ర కు, డెబ్బై శాతం తెలంగాణా కు పంపకాలు జరుగుతయి.

గిప్పు డయితే తెలంగాణా జిల్లాలను ముంచుకుంట మూడో కారు పండిచ్చు కుందమని పోలవరం, పులి చింతల ప్రాజెక్టులు కట్టు కుంటున్రు. తెలంగాణా వస్తె గయ్యి ఆగి పోతయి. మూడో కారు పెరుమాండ్ల కెరుక, ఒక్క పంట పండుడు కష్ట మైతది. గీ ప్రాజెక్టుల కింద తేరగా పండిచ్చుకుంట సంపాయించిన పైసలు తెచ్చి హైదరా బాదుల పెట్టుబడులు పెడుతున్డ్రి. పిల్లగాండ్లకు లక్షలు కర్చు పెట్టి సాఫ్టు వేరు సదువులు సదివిస్త్రున్రి. ఐ ఏ ఎస్ కోచింగు లిప్పించి కలెక్టర్ల చెయ్య బడ్తిరి. అమెరికాకు పంపిస్తున్రి. ఇప్పుడు గీ నీళ్ళు ఆగి పొతే గయ్యన్ని ఎట్లా నడుస్తయి? నాకు తెల్వ కడుగుత?

ఇంక రాయల సీమోల్లంటారా... వాళ్ళకు బాంబులు తప్ప నీళ్ళు లేవు. రాజోలిబండకు బాంబులు పెట్టి మహబూబ్ నగరుకు నీళ్ళు లేకుండ జేస్తిరి. శ్రీశైలం రిజర్వాయరుకు పన్నెండు గేట్లు పెట్టి నీళ్ళన్ని పీల్చు కుంట బతుకు తుండిరి. ఎడమ వైపు కాల్వకు మాత్రం ముప్పై ఏళ్ళ నుండి దిక్కు లేక పాయె. గీల్లకు తెలంగాణా లేక పొతే బతుకు లేదు. గందుకే తెలంగాణా గావాలె. అంటె సమైక్యాంధ్ర గావాలె. గీల్లు తెలంగాణా చీలి పొతే మాత్రం ఆంధ్ర తో కలిసి ఉండేది లేదు అని కచ్చితంగా చెప్పుతరు. ఆంధ్రోల్లతోటి మీరే కలువ లేక పొతే ఇంకా మేమెట్ల కలువాలె? కొంచెం ఆలోచించున్రి.

లోపల ఇంత కుట్ర పెట్టుకొని పైకి మాత్రం 'అందరు ఒక్కటే, తెలంగాణా, ఆంధ్ర భాయి భాయి' అంటరు. వీళ్ళకు మా భాష అంటె, మా యాస అంటె ఎక్కడ లేని అసహ్యం. మా పండుగ లంటే చిన్న చూపు. మరి ఎందుకని కలిసి ఉండాలే మీతోటి? జర ఒక్క కారణ మన్న చెప్పున్రి, ఎందుకు మీతోటి కలువాలె?

మీకు మా హైదరాబాదుల ఉండే టందుకు బయ మైతుందా? ఎందు కంటరు అట్లాటి పనికిరాని మాటలని? ఇక్కడ ఎన్ని ప్రాంతాల, ఎన్ని దేశాల ప్రజలు వచ్చి ఉంటున్నరు? వాళ్ళంత మంచిగ ఉంట లేరా? మీకెందుకు భయం. మీరు మాపై పెత్తనం జేసుడు వద్దని అన్నం. అంతే గని ఇక్కడ ఉండొద్దని, వ్యాపారాలు చేసుకో వద్దని అన లేదు. ఆంధ్ర సోదరులారా, మిమ్ములను కోరేది ఒక్కటే. మీరు మాపై పెత్తనం చేయాలని కోరుకోకండి. మా మానానికి మమ్ములను వదిలి పెట్టండి. మీ రాష్ట్రం ల మీరు ఇష్టం వచ్చినంత అభివృద్ధి చెందండి. మాకేం సమస్య లేదు. దయ చేసి మమ్ములను మీరు అభివృద్ధి చేస్తమని చెప్ప కండి. వినేటి వాళ్ళు నవ్వు కుంటరు మీ మాటలు చూసి. ఇంకా మీ మాటలకు బోల్త పడె ఓపిక మాకు లేదు.