Monday, October 31, 2011

తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర


సమైక్యవాదనల డొల్లతనం

సమైక్య వాదులు చేసే వాదనలు చాలా విచిత్రంగా వుంటాయి. ఏదో చిన్న పాయింటు దొరగ్గానే దాని పట్టుకుని వేళ్ళాడడం, అది చివరకంటా నిలబడక పోయే సరికి పలాయనం చిత్తగించడం లేదా, ఇంకో పాయింటు వెతకడం వారికి పరిపాటి. ఇలాంటి వారికి సమాధానాలు చెప్పడం కూడా సమయం వృధా చేసుకోవడం తప్ప మరో ప్రయోజనం లేదు. కాని ఈ వితండవాదులు కనపడ్డ ప్రతి చోటా ఇలాంటి వ్యాఖ్యలు కుమ్మరించడంతో అమాయకులైన జనాలు కూడా మోసపోయే అవకాశం వుంది. వారికోసమే ఈ వివరణ.

గత పది సంవత్సరాలుగా అడపా దడపాగా, గత రెండు సంవత్సరాలుగా మాత్రం వీరు విరివిగా చేసే వాదన ఇది. అదేమంటే కెసిఆర్ కి తెలంగాణా రావడం ఇష్టం లేదు. ఆయనదంతా రాజకీయంతో పబ్బం గడుపుకోవడానికి ఆడే నాటకం. అసలు కేంద్రం తెలంగాణా ఇస్తానన్నా కూడా కెసిఆర్ ఇవ్వనివ్వడు. ఎందుకంటే అది ఇస్తే ఇక ఆయనకు పని ఆదాయం లేకుండా పోతుంది. ఇలాంటివి.

కెసిఆర్ తెలంగాణా రానివ్వక పొతే వీళ్ళకు బాధెందుకు? వీల్లకేమైనా తెలంగాణా రావాలనే కోరిక ఏమైనా ఉందా? మరి తెలంగాణా రాక వీరికీ బాధలేదు, కెసిఆర్ కీ బాధలేదు. మరి వీరికేందుకు కెసిఆర్ మీద కోపం? ఈ ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానం వుండదు.

సరే తెలంగాణా ప్రజలు మోసపోతున్నారు అని వీరి బాధ అనుకుందాం. యాభై ఏళ్ళ చరిత్ర చూసినవాడెవ్వడూ వీళ్ళకి అలాంటి బాధ ఉంటుందని అనుకోడు. సరే, మాటవరసకు వుందే అనుకుందాం. మరి తెలుగుదేశం, కాంగ్రెస్ తెలంగాణా సాధించేది మేమే అని మానిఫెస్టోలలో పెట్టి జనాన్ని ఊదరగొట్టి వోట్లు దండుకున్నప్పుడు వారికి ప్రజలను మోసం చేస్తున్నారన్న స్పృహ కలుగలేదేం? అంటే వారు మోసం చేయడం లేదు, నిజమే చెప్తున్నారని వీరి ఉద్దేశ్యమా? ఒకవేళ నిజమే చెప్తున్నారు అని వీరనుకొన్నారు అనుకుందాం. మరి అప్పుడు రాష్ట్రాన్ని విడగోడుతున్నందుకు వీరికీ ఏ బాధా కలుగలేదే? కలుగలేదనే దానికి ప్రబల సాక్ష్యం ఎన్నికల ఫలితాలే. 

ప్రత్యేకరాష్ట్రం హామీ ఇచ్చిన పార్టీలన్నిటికీ అక్కడా సీట్లు వచ్చాయి. అంటే జనం వీరు చెప్పే విషయాలు నమ్మలేదని అయినా అనుకోవాలి. లేదా అక్కడి జనానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం పట్ల అభ్యంతరం లేదనైనా అనుకోవాలి. కాబట్టి వారిది తెలంగాణా పై సానుభూతి కాదనో, లేక వారి ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం పట్ల వ్యతిరేకత లేదనో రెండింటిలో ఒకటి నిజమని ఒప్పుకోక తప్పదు.

వారిది సానుభూతి కాదని ఒప్పుకున్నట్టైతే మరి కెసిఆర్ తెలంగాణా వారిని ఏదో మోసం చేస్తున్నాడని కురిపించే జాలి క్రుత్రిమమైనదే నని కూడా ఒప్పుకోవలసి వస్తుంది. అంటే తెలంగాణా కోసం పోరాడే వారిని ఏదో ఒకటి చెప్పి బురద చల్లదమే వారి ధ్యేయమని కూడా ఒప్పుకోవలసి వస్తుంది.

ఇక కెసిఆర్ పై వీరి ఆరోపణల విషయానికి వస్తే, తెలంగాణా ప్రజలు మునుపటిలా అమాయకులు ఎంతమాత్రం కారు. ఒక వేళ కెసిఆర్ తెలంగాణావాదం విడిచి ఒక అంగుళం పక్కకు జరిగాడని తెలంగాణా ప్రజలకు ఏమాత్రం అనిపించినా ఆయన్ని చెత్తకుండీలో వేసి ముందుకు పోగల సామర్థ్యం వుంది. దానికి నాయకత్వం వహించడానికి ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు నడుస్తున్నాయి. ఇప్పుడు కెసిఆర్ అయినా, గద్దరైనా, బీజేపీ అయినా ప్రజలు నిర్దేశించిన బాటలో వెళ్ళ వలసిందే తప్ప, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు విరుద్ధంగా చెప్పినా వినే పరిస్థితిలో వారు లేరు. ఆ విషయంలో మన గౌరవనీయ సమైక్యవాద మేధావులు బాధపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. 

నవంబర్ ఒకటి: తెలంగాణ విద్రోహదినం

రెండు దృశ్యాలు:
ఒకటి: ఏటా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఉత్సవాలు జరుపుతున్నది. ముఖ్యమంత్రి, ప్రముఖులు ఆ రోజు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన త్యాగనిరతిని కీర్తిస్తుంటారు. సమైక్యరాష్ట్రం అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే సాధ్యమైందని తమ ప్రసంగాల్లో చెప్తుంటారు.

రెండు: తెలంగాణా వాదులం నవంబర్ ఒకటిని ప్రతి యేటా విద్రోహ దినంగా జరుపుకుంటున్నాం. నల్ల బ్యాడ్జీలు, నల్ల జండాలు ధరించి తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద నిరసన దీక్షలు చేస్తుంటాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా దోపిడీకి గురైందో వివరిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటాం.

ఎందుకీ భిన్నత్వం?
నవంబర్ ఒకటి ఎందుకింత భిన్నంగా కనిపిస్తూన్నది, వివాదాస్పదమైంది? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని తెలంగాణ ప్రజలం ఎందుకు విద్రోహదినంగా పరిగణిస్తున్నం? అసలు పొట్టి శ్రీరాములు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేసారు? ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల చారిత్రక నేపథ్యం ఏమిటి?

కథా ప్రారంభం:
ఆంధ్ర ప్రాంత చారిత్రక నేపథ్యం బ్రిటిష్ పాలనలో మదరాసు రాష్ట్రంలో భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలుండేవి. పూర్వం చంద్రగిరి రాజుల పాలనలో స్థాపితమైన ఆంధ్ర పట్టణం చెన్నపురి బ్రిటిష్ పాలనలో మదరాసుగా విస్తరించబడి రాజధాని నగరంగా ఏర్పడింది. తమిళులు నివసించే ప్రస్తుత తమిళ జిల్లాలతో, తెలుగు మాట్లాడే ఆంధ్ర జిల్లాలతో కలిపి మదరాసు ప్రెసిడెన్సీ ఉండేది.

1911లో గుంటూరు పట్టణంలోని ఒక న్యాయస్థానంలో అరవ(తమిళ) వ్యక్తి జడ్జీగా ఉండేవారు. ఆ కోర్టులో ఒక చప్రాసీ (ఆంద్ర్హ భాషలో బంట్రోతు) ఉద్యోగం ఖాళీ ఉంటే తన ప్రాంతీయుడైన అరవ వ్యక్తిని జడ్జీగారు నియమించారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆంధ్ర ప్రాంతీయులు మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేయాలని ఆందోళన ప్రారంభించారు.

1936లో దేశంలో మొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. దీనితో ఉమ్మడి మదరాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు మరింత ప్రోత్సాహం లభించినట్లయింది.

అనంతపురంలో పెట్టాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించారనే కోపం రాయలసీమ ప్రజలకు కోస్తా ప్రాంత ఆంధ్రులపై వున్నందున సీమ ప్రాంతం మదరాసు రాష్ట్రంలోనే వుంటుందని ఆ ప్రాంత నేతలు కోస్తాంధ్రులతో విభేదించారు. వారిని శాంతింప చేయడానికి 16 నవంబర్ 1937న ఇరు ప్రాంతాల పెద్దలు కూర్చొని ‘శ్రీభాగ్’ ఒప్పందం చేసుకున్నారు.
కాగా, 1937లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభ ఆంధ్ర రాష్ట్రానికై సిఫార్సు చేసింది. దీన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించారు. ‘ఆటవిక కోర్కె’గా రాజాజీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు.

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ నియమించిన ధార్ కమిటీ (లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమీషన్) భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆమోదం తెలపలేదు.

1948లో ఏర్పాటైన జె.వి.పి (జవహర్‌లాల్, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి) కమిటీ మాత్రం దేశంలో కొత్త రాష్ట్రాలు అవసరం లేదంటూనే కేవలం (మదరాసు మినహా) ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 1949 ఏప్రిల్‌లోనే ఆమోదం తెలిపింది. అయితే, దీనికి రాయలసీమ నేతలు అడ్డుపడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వెంటనే సాధ్యపడలేదు. మదరాసును తమకే వదిలేయాలని ఆంధ్రులు పట్టుబట్టడంతో ‘‘ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి ఉద్యమం అవసరం లేదని, ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలనే దానికి తాను బద్ధుడనై ఉన్నానని, కానీ మదరాసు సంగతే ముందు తేల్చుకోవాలని’’ నెహ్రూ అన్నారు.

ఇక విషయానికి వస్తే, మదరాసు లేని ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నెహ్రూ ప్రకటించిన తర్వాత పొట్టి శ్రీరాములుకు ఆమరణ దీక్ష అవసరమేమొచ్చింది?

పొట్టి శ్రీరాములు ఎందుకోసం దీక్ష చేపట్టారు?ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని నెహ్రూ ప్రకటించినా సంతృప్తి చెందని కొందరు పెద్దలు మదరాసును ఆంధ్రకు రాజధానిగా చేసుకోవాలనే దుర్బుద్ధితో పొట్టి శ్రీరాములుచేత 19 అక్టోబర్ 1952 నుండి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష చేయించారు. అదీ మదరాసు నగరంలోనే. ఆయన ఏకైక డిమాండ్ ‘మదరాసు’ కోసమే.

పొట్టి శ్రీరాములు ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకున్న నెహ్రూ 1952 డిసెంబర్ 9న మదరాసు లేని ఆంధ్రరాష్ట్రాన్నివ్వడానికి తాము సిద్ధమేనని పార్లమెంట్‌లో మరోసారి స్పష్టం చేసారు. అయినా ఆంధ్ర పెద్ద మనుషులు పొట్టి శ్రీరాములుచే దీక్షను విరమింపజేయలేదు. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకుపోలేదు. ఆయనకు నెత్తురు వాంతులయినా, మాట పడిపోతున్నా పట్టించుకోలేదు. చివరికి కోమాలోకి పోయినా వారికి చీమ కుట్టినట్లయినా కాలేదు. ఆనాటి మదరాసు రాష్ట్ర కమ్యూనిస్టు లెజిస్లేచర్ పార్టీ నాయకులు తరిమెల నాగిడ్డి కూడా దీక్ష విరమించాలని పొట్టి శ్రీరాములును కోరినారు. మదరాసు లేకుండానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే చాలునన్నారు. ఎవరిమాటను శ్రీరాములు చుట్టూ వున్న పెద్దలు విన్పించుకోలేదు. అంతా కలిసి శ్రీరాములు చావు కోసం ఎదిరి చూసారే గానీ ఆయనను బతికించుకునే ఏ ప్రయత్నమూ చేయలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, మదరాసు కావాలనే మొండి వాదనతో, పంతానికి పోయి పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆంధ్ర నేతలది. 1952 డిసెంబర్ 15 నాటి రాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. అయినా మదరాసు ఆంధ్రకు దక్కలేదు. ఆయన అమరత్వం వల్ల ఆంధ్రులకు ఏ ప్రయోజనమూ కలగలేదు. నిష్ఫల త్యాగమే పొట్టి శ్రీరాములు చేసింది. ఆయన దీక్ష చేయకున్నా, మధ్యలో వదిలేసినా ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఉండేదే (నెహ్రూ మాటల్లోనే అది స్పష్టమైంది). ఇప్పుడేమో సమైక్య రాష్ట్రం పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమని ఆంధ్ర నేతలు, పాలకులు చరివూతను వక్రీకరిస్తున్నారు.

పొట్టి శ్రీరాములుకు తెలంగాణకు ఏమిటి సంబంధం?
తమకేమీ కాని పొట్టి శ్రీరాములు పట్ల తెలంగాణ ప్రజలకేవిధమైన వ్యతిరేకతా లేదు. ఆయనంటే జాలి, సానుభూతి తప్ప. చిత్రమేమిటంటే, తెలంగాణకేమి చేసారని ఆయన విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం? అసలు నవంబర్ ఒకటికి 
పొట్టి శ్రీరాములుకు ఏమిటి సంబంధం? పొట్టి శ్రీరాములు మరణానంతరం కనీ వినీ ఎరుగనంతటి విధ్వంసాన్ని ఆంధ్రనేతలు సృష్టించినా వారికి మదరాసును రాజధానిగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మదరాసు లేకుండానే కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ ఒకటిన ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏ పార్టీకి చెందని ప్రకాశం పంతులు బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బులేని ఆర్థిక దుస్థితి. వందేళ్ళ క్రితం నిర్మించిన ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలు శిథిలమై ఉండటం, వీటి పునర్నిర్మాణానికీ డబ్బుల్లేకపోవడం... ఏం చేయాలో అర్థం కాని గడ్డు పరిస్థితి!

తెలంగాణను కబ్జా చేయడానికి ‘విశాలాంధ్ర’ నినాదం
ఆంధ్రలో ఆనాటికే అమల్లో వున్న మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేయాలని రామ్మూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను ప్రకాశం పంతులు అంగీకరించలేదు. దీనితో పాలకులలో విభేదాలు మొదలై ప్రభుత్వం రద్దయి రాష్ట్రపతి పాలన ఏర్పడింది. రెండు నెలల తర్వాత బెజవాడ గోపాలడ్డి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవడ్డి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కర్నూలులో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవు. గుడారాల కింద ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసారు. అప్పటికే అన్ని హంగులతో దేశంలోనే ఐదవ పెద్ద పట్టణంగా ఉన్న హైదరాబాద్‌పై ఆంధ్ర పాలకుల కన్ను పడింది.

హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాల సర్కారు భూమి ఉన్నది. పాకిస్తాన్ పారిపోయిన కాందిశీకుల భూములున్నవి. తెలంగాణ నుండే ప్రవహించే కృష్ణా, గోదావరి నదులున్నయి. రాజధానికి సరిపోయే విశాలమైన భవనాలున్నాయి. అప్పటికే హైదరాబాద్ సర్కారు వద్ద మిగులు బడ్జెట్ ఉన్నది. తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలు ఉన్నవి. పెద్ద పరిక్షిశమలున్నవి. వీటిపై కన్నేసిన ఆంధ్ర నేతలు తెలంగాణను కబ్జా చేయడానికి తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలంటూ ‘విశాలాంధ్ర’ నినాదం ముందుకు తెచ్చారు . తమ అవసరం కోసం కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమం నిర్వహించారు.

తెలంగాణ ప్రాంత చారిత్రక నేపథ్యం
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. 224 ఏళ్ళు నిజాం నవాబుల పాలన కొనసాగింది. తెలంగాణలోని 8 జిల్లాలు, మరట్వాడాలోని 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలోని 3 జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి. 

1948 సెప్టెంబర్ 12న స్వంతంత్ర దేశమైన హైదరాబాద్ సంస్థానం పైకి భారత ప్రభుత్వం తన సైన్యాన్ని పంపి, 17న విలీనం చేసుకున్నది. ఆ తర్వాత జనరల్ చౌదరి నేతృత్వంలో మిలిటరీ పాలన కొనసాగింది. 

1949లో సివిల్ సర్వీసెస్‌కు చెందిన వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952లో ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలనే కుట్రలు ‘విశాలాంధ్ర’ నినాదం రూపంలో మొదలయ్యాయి. తెలంగాణ ప్రజలు ఆంధ్రతో విలీనానికి అంగీకరించలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం నెహ్రూకు ఇష్టం లేదు. ఆయన అభిప్రాయం ఇలా ఉండింది: ‘‘విశాలాంధ్ర డిమాండ్ కళంకిత సామ్రాజ్యవాదానికి సంబంధించింది. ఖచ్చితంగా సామ్రాజ్యవాదమని కాదు, దాని వెనుక గల ప్రియమైన మనఃప్రవృత్తికి చెందింది అది.’’ (సెపూక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ, 6వ సంపుటం: పేజీ, పేరా 68)తెలంగాణ ప్రాంతంలోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ‘విశాలాంధ్ర’ నినాదాన్ని వ్యతిరేకించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్.ఆర్.సి) ఇరు ప్రాంతాల వాదనలు విన్నది. చివరికి తమ నివేదికలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే 1961 దాకా కొనసాగించాలని, అప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో గెల్చిన శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలని తీర్మానిస్తే అప్పుడు సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని ఎస్.ఆర్.సి. స్పష్టంచేసింది.

పెద్ద మనుషుల ఒప్పందం-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎస్.ఆర్.సి. పై ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణ విడిగా ఉండాలన్న సిఫారసు మింగుడు పడలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. నెహ్రూ చుట్టూ ఉన్న జాతీయ నేతల్లో కొందరిని డబ్బుతో కొన్నారు. మరి కొందరితో స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి తమకున్న సాన్నిహిత్యాన్ని వాడుకున్నరు. తెలంగాణ విడిగా ఉంటే ప్రమాదమని కొత్త వాదనలు ముందుకు తెచ్చారు. 1948 సెప్టెంబర్ 13న ఐక్యరాజ్యసమితిలో అప్పటి హైదరాబాద్ ప్రధాని ‘లాయక్ అలీ’ ప్రభుత్వం తరఫున ఒక పిటిషన్‌ను దాఖలు చేయించాడు. భారతదేశం తమ హైదరాబాద్ రాజ్యంపై దురాక్రమణ చేసిందని, హైదరాబాద్ సంస్థానాన్ని స్వంతంత్ర దేశంగానే కొనసాగనివ్వాలని, భారత దురాక్రమణను నివారించాలన్నది ఆ పిటీషన్ సారాంశం.

1956 నాటికి కూడా ఆ పిటీషన్ ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్నది. 1978లో ఆ పిటీషన్ కొట్టివేయబడింది. హైదరాబాద్‌తో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిస్తే ఎప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని ఒక స్వతంత్ర దేశపు హోదా తెలంగాణకిచ్చే ప్రమాదం పొంచి వుంటుందని అనుమానాలు రేకెత్తించారు. ఏ పాచిక పారిందో ఏమో చివరికి కేంద్ర ప్రభుత్వం ఎస్.ఆర్.సి.సిఫార్సులను పక్కన పెట్టి సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపింది. తెలంగాణ కోరుతున్న నేతలను (బూర్గుల, కె.వి.రంగాడ్డి, చెన్నాడ్డి) ఢిల్లీ పిలిచి ఒత్తిడి పెంచింది. ఇరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది నేతలతో ఒక ‘పెద్ద మనుషుల ఒప్పందం’ పై 20 ఫిబ్రవరి 1956న సంతకాలు పెట్టించింది కాంగ్రెస్ అధిష్టానం. 

నిధులు, వనరులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, మంత్రివర్గ హోదాలు, వ్యవసాయం తదితర అంశాలతో ఉన్న ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు అనేక హక్కులు కల్పించబడినాయి. ఈ హక్కుల అమలుకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

ఈ ఒప్పందం, హామీల వల్ల తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలుగలేదు. ఇటువంటి హామీల వల్ల, ప్రాంతీయ సంఘాల వల్ల తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చడం సాధ్యం కాదని ఫజల్ అలీ కమీషన్ (ఎస్.ఆర్.సి) తన నివేదికలోనే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని 21 ఏప్రిల్ 1954న ‘ఆంధ్ర పత్రిక’ కూడా ఇలా స్పష్టం చేసింది: ‘‘హామీలివ్వ గలవారు, ఇచ్చిన హామీలను చెల్లింప శక్తి గలవారు తెలంగాణ వారు మాత్రమే కాని ఆంధ్రరాష్ట్ర నాయకులు ఎన్నటికీ కారు. తెలంగాణ వారి ఆహ్వానం, ఆదరణ లేకుండా, వారి ఒడంబడికల ద్వారా సాధించగలమని భావించే వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మన ప్రవర్తన ముఖ్యం కాని, ప్రకటనలు కావు.’’

ఏక పక్షంగా, ఆంధ్రనేతల ఒత్తిళ్ళకు లొంగి నెహ్రూ తనకే మాత్రం ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ను 1 నవంబర్ 1956న ఏర్పాటు చేసారు. అదీ జరిగిన అసలు కథ.

అదే రోజు హైదరాబాద్‌లో కొత్త రాష్ట్రాన్ని ప్రారంభిస్తూ నెహ్రూ ఇలా వ్యాఖ్యానించారు: ‘‘ఈ రోజు నుంచి ఆంధ్రులకు తెలంగాణ వారితో వ్యవహరించే పద్ధతికి పరీక్ష ప్రారంభమైంది. ఒకవేళ తెలంగాణ వారిని గనుక వారు నిరాదరణకు గురిచేస్తే, తిరిగి వారికి వేరుపడే హక్కు ఉంది.’’ (దక్కన్ క్రానికల్, 2-11-1956)

ఈ మాటలు అక్షరసత్యాలే అయ్యాయి. తెలంగాణను నిరాదరణకు గురిచేయడమే కాదు, సమైక్య రాష్ట్రంలో ఉన్న ఖర్మానికి తెలంగాణ ప్రజలు తమ సొంత గడ్డపైనే రెండవ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఏ హామీ అమలు కాలేదు. ఆ హామీల అమలు కోసం ఏర్పడ్డ ప్రాంతీయ సంఘమూ రద్దయింది. గత యాభై ఏళ్ళుగా తెలంగాణలో చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల ఫలితంగా చేసిన రాజ్యాంగ సవరణలు, కల్పించిన రక్షణలు, విడుదలైన జీవోలు, ఆదేశాలు ఏవీ కూడా అమల్లోకి రాలేదు. 55 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 49 ఏళ్ళు సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు పాలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రులైన వారంతా కలిసి పాలించింది కేవలం ఆరేళ్ళే. పి.వి, అంజయ్య, చెన్నాడ్డి.. వీరిలో ఏ ఒక్కరినీ రెండేళ్ళయినా పదవిలో ఉండనివ్వలేదు.

షరతుల ఉల్లంఘనసమైక్య రాష్ట్రంలో సీమాంధ్రుల దోపిడీకి అడ్డూ అదుపూ లేదు. వనరుల దోపిడీ నిరాటంకంగా నేటికీ (ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నా) జరుగుతూనే ఉన్నది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మంట గలిసింది. ప్రతి రంగంలో తెలంగాణ బిడ్డలు ఆంధ్రుల వల్ల నిత్యం అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణా భాషా, సంస్కృతి, సంప్రదాయాలు ఆంధ్రులచే అవహేళన చేయబడుతున్నవి. ఈ అవమానాలు, అవహేళనలు, అహంభావపు మాటలను తట్టుకోలేక వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని కన్న తల్లిదంవూడులకు, తెలంగాణ వాదులకు శోకాన్ని కలిగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది ఒక షరతులతో కూడిన ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఒప్పందంలోని ఏ ఒక్క షరతు అమలు కాకున్నా చట్టరీత్యా ఆ ఒప్పందం చెల్లదు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అన్ని షరతులూ ఉల్లంఘించబడినపుడు ఇక ఈ రాష్ట్రం ఎలా కొనసాగుతుంది? ఒప్పందానికి ముందున్న స్థితిని తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలకు కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.

అందుకే 55 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యమాలు సాగిస్తున్నరు. 1969లో 369 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. చరిత్రలో అంతటి గొప్ప ఉద్యమం లేదు. ఇప్పటి సకలజనుల సమ్మె ఈ ఉద్యమాలకు పరాకాష్ట. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఇంతటి ఐక్యత మున్నెన్నడూ కానరాలేదు. అంతటి చారిత్రక ఉద్యమ సందర్భంలో మనం ఉన్నం.

భిన్న దృశ్యాలు అందుకే...
సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నేతలు, సంపన్నులు తెలంగాణను నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నరు. తెలంగాణ ప్రజలు ఆంధ్రులచే అడుగడుగునా మోసగింపబడి ఆకలి చావులతో, ఆత్మహత్యలతో తమ జీవితాలను అంతం చేసుకుంటున్నరు. లక్షలాదిగా సుదూర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయి అనేక కష్టాలు పడుతున్నరు. ఈ గోసకంతా కారణం సమైక్య రాష్ట్రమే. సకల వనరులున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వుంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా విరాజిల్లుతుంది.

Saturday, October 29, 2011

చైతన్యం వెలిగించిన సకల జనుల సమ్మె


ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా కబళించే క్రమంలో జరిగిన నష్టంలో, ట్రేడ్ యూనియన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతాబ్దపు 1970 దశకంలో దేశ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో, ముఖ్యంగా రైల్వే సమ్మె మొత్తం దేశాన్ని కుదిపేసింది.ఆ కాలంలో ఉద్యోగులు, రవాణా, ఉపాధ్యాయులు పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేస్తే సమాజం దాదాపు స్తంభించిపోయేది. ఆ క్రమం 1980 దశకం వరకు చాలా మారింది. కార్మిక సంఘాల నాయకత్వ రాజీ ధోరణి, అమ్ముడుపోయే ధోరణి పెరిగి కార్మికవర్గ పాత్ర కుంచించుకుపోయింది. 80 దశకంలో దాదాపు సమ్మెలు జరగడం ఆగిపోయింది. 90 దశకంలో ఊపందుకున్న ప్రపంచీకరణ వల్లా, సర్వీస్ రంగాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేటీకరించడం వల్లా, పబ్లిక్ రంగ ఉద్యోగులు సమ్మె చేసినా అన్ని రంగాలలో సమాంతరంగా ప్రైవేట్ రంగం పెరగడం వల్లా - మధ్య తరగతికి, ప్రత్యేకించి పాలకవర్గాలకు సమ్మె ఒక సమస్యే కాకుండాపోయింది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా గత మూడు దశాబ్దాలుగా సమ్మెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు కార్మిక రంగ సంస్థలలో పోటీ సంస్థలు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు బలం గా ఉండడం వలన, రాజకీయాలు ఎలా దిగజారాయో అదే క్రమంలో ట్రేడ్ యూనియన్లు కూడా దిగజారుతూ, ఒక సంఘం సమ్మె పిలుపు ఇస్తే మరో సంఘం దానిని వ్యతిరేకించడంతో సమ్మె విఫలం కావడం దాదాపు సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మె, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు తమ మాతృ సంస్థలతో సంబంధం లేకుండా సంఘటితంగా ఉద్యమాలు చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది.

సకల జనుల సమ్మె తెలంగాణలో ఉధృతంగా జరుగుతున్న కాలంలోనే వాల్‌ స్ట్రీట్‌కు వ్యతిరేకంగా 80 దేశాలలో నిరుద్యోగులు, సాధారణ పేద ప్రజ లు రాజ్య వ్యవహార పద్ధతిని, అక్రమ సంపదకు అవినీతి రాజకీయాలకు మధ్య ఏర్పడిన అనైతిక సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రధానంగా లేవదీసిన ప్రశ్న: సామాజిక ఆర్థిక జీవితంలో రాజకీయాల పాత్ర ఏమిటి? రాజకీయాలు ప్రజల ఓట్లతో, లేదా మద్దతుతో గెలిచి, ప్రజాస్వామ్యం పేరు మీద, సార్వభౌమ అధికారం పేరుమీద పాలిస్తూ, దేశం లో సంపదను లూటీ చేస్తున్న వాళ్లకు అనుకూలం గా ఎందుకు పనిచేస్తున్నట్టు-అంటూ, ప్రజాస్వామ్యమంటే దోపిడీదారులు, రాజకీయ నాయకులు కూడబలుక్కుని, రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల రక్తం తాగడమేనా అనే ఒక మౌలిక ప్రశ్న లేవదీశారు. ఈ ఉద్యమాలకు స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘ప్రపంచవ్యాప్తంగా సంపద మీద తిష్ఠ వేసి కూర్చున్న వాళ్లు సామాజిక శ్రేయస్సును గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించాడు. ఈ తిరుగుబాటు అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పాకింది. అమెరికా అధ్యక్షుడు కూడా ‘ఈ తిరుగుబాటుదారుల ఆవేదనను అర్థం చేసుకోవాల’ని సంపన్నులకు సలహా ఇచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తిరుగుబాటులో ఒక గమనించదగ్గ అంశం, ఏ సాంకేతిక విజ్ఞానాల ద్వారా సంపన్నులు ప్రపంచాన్ని నియంత్రిస్తున్నారో, ఆ సాంకేతిక మార్గాల ద్వారానే ప్రపంచవ్యాప్త తిరుగుబాట్ల మధ్య ఒక సంబంధం ఏర్పడింది. ఉత్పత్తి శక్తులు పెరుగుతున్న క్రమంలోనే ఏర్పడే వైరుధ్యాలు, సంపదకు ఎలా సవాలుగా మారుతాయో ఇదొక చక్కటి ఉదాహరణ. పెట్టుబడిదారీ వ్యవస్థకు శ్రమకు మధ్య ఏర్పడ్డ రాజీయే కార్మికుల హక్కులు అనే ఒక సూత్రీకరణ కూడా ఉంది. హక్కులు ఒక చారిత్రక సంధి నుంచి బలీయమైనవన్న ఒక అవగాహన కూడా ఉంది. కార్మికులు రెండు శతాబ్దాల పోరాటాల ద్వారా హక్కులు సాధించుకున్నారు. ఈ మొత్తం చారిత్రక అభివృద్ధిని అడ్డుకుంటూ, హక్కులను హరించుకుంటూ నయా ఆర్థిక విధానం ప్రపంచ సంపదను కొల్లగొట్టాలనుకుంటోంది. కొల్లగొడుతున్నది. దీనికి పర్యవసానంగానే సాధించుకున్న హక్కులు పోగొట్టుకుంటూ, పని దొరికితే చాలు అనే దీన స్థితికి ప్రజలను నెట్టబడ్డారు. ఒకవైపు ఐఎల్‌ఓ (అంతర్జాతీయ లేబర్ సంస్థ) ‘పని అంటే ‘డీసెంట్ పని’ అని, అది గౌరవప్రదంగా ఉండాల’ని నిర్వచించినా, ఆ మాట వినేవాళ్లే కరువయ్యారు. దీనికి తోడు మదనూరు భారతి గారు ప్రస్తావిస్తూ వచ్చిన ‘అదనపు మనుషుల’ సంఖ్య పెరుగుతూ వస్తున్నది. పనిచేయడానికి చేతులుండి, ఆలోచించే శక్తి ఉన్న మనుషులకు పని ఎందుకు దొరకదు? అనేది చాలా మౌలికమైన ప్రశ్న. ఆహార సేకరణ దశలో ఏ మనిషికామనిషి తమ ఆహారాన్ని తామే సేకరించే పనిలో ఉన్నారు. అందరికి ప్రకృతి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఆ దశ నుంచి అత్యంత ఆధునిక దశకు చేరుకున్నామని భ్రమించే వ్యవస్థలు మనిషి జీవితాన్ని ఉన్నతీకరించే బదులు పనిలేని, పని దొరకని మనుషులను చేశాయి. మనిషికి చేతినిండా పని కల్పించని ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అది అమానవీయ దోపిడీ వ్యవస్థే. ఈ వక్ర అభివృద్ధికి వ్యతిరేకంగా భిన్న దేశాలలో ‘మాకు పని ఎందుకు లేదు, మేం పేద వాళ్లుగా ఎందుకున్నాం?’ అంటూ ‘సంపద మీకు పేదరికం మాకా?’ అన్న నినాదాలతో ఉద్యమిస్తున్నా రు. తెలంగాణ సకల జనుల సమ్మెలో ఈ మౌలిక ఆకాంక్ష ఎక్కడో దాగుంది అని అనిపిస్తున్నది.

తెలంగాణ ప్రాంతంలో చారిత్రకంగా ప్రపంచ మార్పులకు ప్రతిస్పందించే ఒక గుణముంది. దేశమంతా స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్నప్పుడు, అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చైనాలో జరుగుతున్న పోరాటంతో పోల్చగల సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంత అనుభవంలో ఉంది. ఆ పోరాటం ఎంత అర్ధాంతరంగా ముగిసినా ఆ దారిలో అనుభవం తెలంగాణకు గొప్ప వారసత్వాన్ని ఇచ్చింది. ఆ పోరాటాన్ని అణచివేసి, అదే నినాదాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకుంది. అప్పటికి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్వభావంలో అలాగే ఉంది. అప్పుడు సోషలిజం పేరు చెప్పి, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలలో గెలవాలని తప్పించి నిజాయితీగా న్యాయమైన పరిష్కారమేమిటా అని ఆలోచించే స్థితి లో లేకపోవడం ఎంతో అప్రజాస్వామికం. ఇది మోసపు చరిత్ర కొనసాగింపు.

అలాగే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రపంచం ఉద్రిక్త, ఉద్వేగ వాతావరణంలో ఉంది. చైనాలో సాంస్కృతిక విప్లవం, అమెరికాలో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమం, ఫ్రాన్స్‌లో యువత తిరుగుబాటు, దేశంలో నక్సల్‌బరీ పోరా టం పుంజుకుంటున్న సందర్భమది. అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు జరుగుతున్న ఉద్య మం సకల జనుల ఉద్యమంగా ఎదగగలిగింది. ఈ సమ్మె సఫలమైందా, విఫలమైందా, సరియైన సమయంలోనే జరిగిందా? లేదా? నాయకత్వంలో రాజీపడ్డారా? సమర్థవంతమైన నాయకత్వం లేదా? వంటి ప్రశ్నలు చాలానే అడగవచ్చు. వీటిని చాలాకాలం చర్చించుకోవచ్చు. ఒక ప్రజా ఉద్యమం విజయవంతమైందా?, విఫలమైందా? అనడానికి మనం ఉపయోగించే ప్రమాణాలు ఏమి టి? అనేది కూడా ప్రశ్నే. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం లేదా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనేదే ప్రమాణమైతే సమ్మె తన లక్ష్యాన్ని సాధించలేదు అని అనవచ్చు. ప్రజా ఉద్యమాలను అలా చూడకుండా, ఉద్యమ ప్రక్రియ ఎలా ఉంది, సమీకరణ ఎలా సాగింది, సంఘటిత శక్తి ఎలా వ్యక్తీకరింపబడింది, సామాజిక సంబంధాలను ఎలా ప్రభావితం చేసింది, కొత్త విలువలు , ప్రజల చైతన్యంలో ఎదిగాయా? ఇలాంటి ప్రశ్నలు అడగకపోవడం వలన అనుకున్నది సాధించలేదన్న నిరాశ కలుగుతుంది. ఈ కోణం నుంచి సకల జనుల సమ్మెను చూస్తే పెట్టబడిదారులకు, రాజకీయాలకు ఏర్పడ్డ అనైతిక సంబంధాన్ని సమ్మె ఎండగట్టింది. అక్రమ సంపాదన కలిగిన వారు రాజకీయాలను ఎలా నిర్దేశిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలిసినంత స్పష్టంగా బహుశా ఇతర ఏ ప్రాంతం వారికి తెలిసి ఉండదు. అలాగే భిన్నరంగాలకు చెందిన సమస్త వృత్తుల వాళ్లు, విద్యార్థులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోలు నడుపుకునే వాళ్లతో సహా... ఒక్కరు కాదు ప్రతిరంగం ఉద్యమానికి స్పందించింది. తన స్థాయిలో పొల్గొన్నది. సింగరేణి కార్మికుల్లో వ్యక్తమయిన ఐక్యత సాధారణమైన సంఘటన కాదు. అలాగే గ్రామ గ్రామంలో నిరసన ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ రూపాలలోని వైవిధ్యంలో ప్రజల సృజనాత్మకత కనిపించింది. అంటే ఉద్యమాలకు నిర్దిష్టమైన గమ్యాలు ఉండడమే కాదు, వాటికి ఒక గమనం కూడా ఉంటుంది. ఆ గమనాన్ని గమనిస్తే సకల జనుల సమ్మె ఒక గొప్ప సామాజిక అనుభవమే. అయితే సమ్మె విఫలమైందన్న నిరాశకు గురికాకుండా సమ్మె సృష్టించిన చైతన్యాన్ని మరలా ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేలా ఉద్యమకారులు కృషి చేయడమే నిజమైన సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది.

- పొఫెసర్ హరగోపాల్

Friday, October 28, 2011

చంద్రబాబు విమర్శలకి కేసీయార్ సమాధానం




నాన్నా సమైక్యవాదం అంటే?


నాన్నా ఎక్కడికెళ్ళావ్?

సమైక్యవాదుల మీటింగు కెళ్ళాను.

సమైక్యవాదం అంటే?

అందరూ కలిసి ఉండాలని...

అంటే అందరూ మన ఇంట్లో ఉంటారా?

లేదు, ఎవరింట్లో వాళ్ళే వుంటారు. కాకపోతే అందరూ ఒకే రాష్ట్రంలో వుండాలని...

ఒకే రాష్ట్రం అంటే? ఈ దేశం మొత్తం ఒకే రాష్ట్రంగా వుండాలనా?

కాదు, ఈ దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా వుండాలని.

అంటే హిందీ మాట్లాడే వారు కూడా ఒకే రాష్ట్రంగా వుండాలా?

కాదు. హిందీ మాట్లాడే వారు వేరు వేరు రాష్ట్రాలుగా ఉండవచ్చు. తెలుగు మాట్లాడే వారే ఒకే రాష్ట్రంగా వుండాలి.

హిందీ మాట్లాడే వారు వేరు వేరు రాష్ట్రాలుగా వున్నప్పుడు తెలుగు మాట్లాడేవారు కూడా వేరు వేరు రాష్ట్రాలుగా ఎందుకు వుండకూడదు?

ఎందుకంటే... మొన్న హైదరాబాదు వెళ్లాం చూసావా? అప్పుడు అక్కడ చార్మినార్, గోల్కొండ చూసి మా హైదరాబాద్, మా చార్మినార్, మా గోల్కొండ అనుకున్నాం. మరి రాష్ట్రం వేరుగా వుంటే అలా అనుకోవడానికి వీలుకాదుగా!

ముంబాయి వెళ్ళినప్పుడు కూడా అన్నీ చూసి మన ముంబాయి అనుకున్నాంగా డాడీ?

అది కాదమ్మా. అక్కడ మన వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే వారికి ఇబ్బంది అవుతుంది కదా?

ఎవరు డబ్బులు పెట్టారు? మన తాతయ్యా? మామయ్యా? 

కాదు.

మరెవరు?

లగడపాటి, కావూరి, తిక్కవరపు, రాయపాటి, మేకపాటి అనీ...

వాళ్ళెవరు? మన చుట్టాలా?

కాదు!

మరి మనకెందుకు? వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళు చూసుకుంటారుగా?

నీకు తెలియదులే, వెళ్లి ఆడుకోఫో!
  

తెలంగాణా కాంట్రాక్టులు, ఎవరికెంత?

WHO’s WHO of T Contracts
Hyderabad: Amidst the ongoing demand for and against the bifurcation of the state, several arguments from both sides have been put forward. It is not only the politicians who have vested interests but also the contractors of major infrastructure projects in the region.

In the backdrop of this situation, The Hans India probed into the contractors who were executing various works. Here’s the list of the contractors who have been awarded major projects.

Gayatri Constructions


Gayatri Constructions is owned by Congress MP T Subbarami Reddy. The total cost of the ongoing projects in Telangana (including Hyderabad) is over Rs 2800 crore.

It has taken up contract works (awarded by the government) for the development of Nagarjuna Sagar Tail Pond link Canal in Khammam district with a cost of Rs 1,088.21 crore.

It has also taken up four laning of the state highway number one Hyderabad- Karimnagar-Ramagundam at Rs 1358 crore. They were also awarded the Outer Ring Road - phase -II project from Mallampet to Dundigal.

The cost of the project is Rs 323.97 crore.It also includes developing express highways on another stretch between Sagar road to Vijayawada highway at a cost of Rs 200 crore

Transstroy India Ltd

Transstroy India jointly owned by Eluru MP Kavuri sambasiva Rao and the Guntur MP Rayapati sambasiva Rao (both Congress) is executing notable projects like the eight lane expressway between Gachibowli and Shamshabad at a cost of Rs 699 crore on Outer Ring Road, the Komaram Bheem irrigation project at a cost of Rs 48.69 crore in Adilabad district and Dr BR Ambedkar Pranahita Lift irrigation canal at Nizamabad.

The cost of the last project is Rs 1,189.6 crore.

Progressive Constructions

Progressive Constructions belongs to Eluru MP K Sambasiva Rao(Congress). The ongoing works are Sriram Sagar Project works ( SRSP - J4 - 02A. SRSP - C5 - 03B. SRSP - L6 - 15B) in Nizamabad district. The cost of the works is estimated at around Rs 300 crore.


Ramky Group 

Ramky Group, a leading infrastructre company in the state, is owned and maintained by TDP MP Modugula Venugopala Reddy and his family members from Guntur district. It has been awarded to take up ORR works between Shamshabad and Tukkuguda at a cost of Rs 400 crore.

It has also bagged the contract to construct solid waste management project at a cost of Rs 900 crore by the Greater Hyderabad Municipal Corporation. The project is in progress at Jawaharnagar dump yard.
 
Besides taking up construction of residential towers in the city, it plans to establish the Multi Product Park and the Discovery City at a cost of Rs 3000 crore in Rangareddy district.

GMR Group

GMR group which had constructed and maintains the Rajiv Gandhi International airport at Shamshabad is owned by G Mallikarjuna Rao (No political affliation) from Sirkakulam district.

The new Hyderabad International Airport Limited (HIAL) was a public-private partnership joint venture of GMR Group, Malaysia Airports Holdings Berhad, the State Government of Andhra Pradesh and the Airports Authority of India (AAI). GMR Group holds 63 per cent of the equity in the airport which was constructed at a cost of Rs 2300 crore.

Lanco Group

The Lanco Group belongs to Vijaywada MP Lagadapati Rajagopal (Congress).

He had taken up Lanco Hills- housing project at a cost of Rs 5,500 crore in 108 acres. However, the wakf board had filed a petition in the Wakf Tribunal claiming that Lanco had occupied the wakf land and that it belongs to Hussain Shah Wali darga at Manikonda village near the Hitech city in Hyderabad.

KMC Constructions.

KMC Constructions Company Limited, belongs to Nellore MP Mekapati Rajmohan Reddy,( now YSR Congress party) It has taken up the eight-lane expressway from Tukkuguda to Sagar Road under Outer Ring Road (ORR) project. The cost of the project is around Rs 370 crore. Mekapati Goutam Reddy is the Managing Director of the company.

Nagarjuna Construction Company


Nagarjuna Construction Company Limited owned by AV Satya Narayana Raju of East Godavari (No political affliation). His Son R Ranga Raju is the Managing Director of the company. It has taken up express highway works on the stretch of Ghatkesard-Vijayawada highway and Ghatkesar-Kesara in the city. The total cost of the project is around Rs 400 crore.

The other works taken up by them include the Krishna drinking water project phase-2 at a cost of Rs 1200 crore including manufacturing, supplying, laying, jointing, testing and commissioning the pipelines under package 3 and 4. It has also developed an indoor stadium at Saroor Nagar. The other project taken up by the company was the Singapur township in Hyderabad.

Madhucon Projects.

The only notable company from Telangana region which was executing some infrastructure projects is Madhucon projects, owned by Telugu Desam Parliamentary Party leader Nama Nageswara Rao from Khammam.

The company has taken up projects like the main canal and structures of Sri Ram Sagar right branch canal, SRSP flood flow canal from 103.00 km to 122.00 km in Karimnagar district on EPC turnkey system, high-level submersible bridge across the river Sabari at 36/4 km of Nallipaka – Pocharam road in Khammam district.

It constructed flyovers at the CTO junction and the airport junction in Hyderabad and the Flyover at Taranaka over a length of 801 metres. The total cost of the projects taken up in Hyderbad and in Telangana districts was estimated at Rs 500 to Rs 700 crore.

Indu Group

Indu Group owned by I Shamprasad Reddy (close to YSR but not member of Congress) from Kurnool district. He was closely associated with YS Rajasekhara Reddy. The infrstructure construction and development company bagged the contract of Pranahita- Chevella Lift Irrigation scheme. It won the Rs 1447 crore contract in a joint venture with Srinivasa Construction Limited , Kirloskar Brothers Limited and WEG Electric ( India) Limited for link 7, package 22 in the project.

The company also established " Indu Techzone", a notified 150 acre IT and ITES SEZ being developed by Indu Projects Limited and Sun Apollo at Shamshabad in Hyderabad. The total development in the 150-acre campus is to the tune of 7.8 million square feet of processing and non-processing zones.

The location comes under the Shamshabad growth corridor, which is one among the top 17 growth corridors in India, with respect to the envisaged pace and potential of growth, and return on investments. It will offer complete end-to-end solutions, from concept planning to property management.

IVRCL Company

IVRCL company owned by E Sudheer Reddy (close to YSR but not a member of the Congress party) of Nellore district has taken up Koil Sagar Life Irrigation scheme to irrigate an ayacut of 12000 cares in Mahabubnagar district. Indirasagar lift irrigaiton project ( Polavaram) package -31 to lift 51.5 cusecs of Godavari water in stages from Rudrammakota village in Khammam district to irrigate 2 lakh acres at a cost of Rs 152.20 crore.

The other irrigation project it is executing is Flood flow canal project from 57km to 70 km of SRSP main canal to irrigate an ayacut of 2.20 lakh acres in Karimnagar, Warangal and Nalgonda districts in two stages. The cost of the project is Rs 195 crore.

It has also taken up works in the Krishna Drinking Water Supply scheme-phase 2 under package one with the collaboration of Nagarjuna Constructions Company Limited.

GVR Infra Projects

GVR Infra Projects owned by G Venkataeswara Rao (close to TDP but not a party member) was awarded contract to develop outer Ring Road on the stretch from Dundigal to Shamirpet. It has taken up irrigation projects in Telangana under the Jalayagnam scheme.

Curtesy: The Hans India

Thursday, October 27, 2011

తెలంగాణాకి అడ్డుపడుతున్నదెవరు?


తెలంగాణా సమస్యపై ఇంత జాప్యం ఎందుకు? సమస్య ఎందుకు ఇంత చిక్కుముడిగా మారింది?

ఈ సమస్య పరిష్కారానికి రెండే మార్గాలు. ఒకటి తెలంగాణా ఇచ్చెయ్యడం. రెండోది ఇవ్వక పోవడం.

ప్రజల్లోకి తీవ్రంగా చొచ్చుకు పోయిన ఉద్యమాన్ని తెలంగాణా ఇవ్వకుండా చల్లార్చడానికి ఇవి 1969 నాటి చీకటి రోజులు కావు. సమాచార విప్లవంతో ప్రతివిషయం మారుమూలలక్కూడా నిముషాల మీద పాకుతున్న రోజులు. ఈ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి వారి న్యాయమైన కోర్కెలను నిరాకరించే దమ్ము నాయకులకు లేదు. అలా నిరాకరిస్తే రేపు ప్రజాకోర్టులో దోషులుగా నిలబడక తప్పదు.

ప్రజలు కూడా ఇంతకాలం సహనంతో రాజకీయులు చెప్పిన మాటనల్లా విన్నారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా అన్నిటినీ సహించారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా అన్నిటినీ ఓపికతో విన్నారు. ఎన్ని కమిటీలు వేసినా అన్నిటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణా ప్రజల కోర్కెను నిరాకరించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అన్నదే సమస్య. అలాంటి దమ్మే గనక వుంటే అది ఎప్పుడో నిరాకరించేది. కాని అలా జరగలేదు. కేవలం తాత్సారం మాత్రమే జరుగుతుంది. ఈ తాత్సారం కూడా ఎన్నాళ్ళో జరపడానికి వీలు కాదు. 2014 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరి! అప్పటిదాకా ఇలాగే తాత్సారం చేస్తే ప్రజలు అందుకు కారణమైన వారికి తప్పకుండా బుద్ధి చెపుతారు. 

ఇక మిగిలింది తెలంగాణా 2014 లోపే ఇవ్వడం.

దీనికి అడ్డుపడుతున్నదెవరు? 

సమైక్యాంధ్రవల్ల లాభ పడుతున్న కాంట్రాక్టర్లు, భూస్వాములు అని తెలంగాణా వాదుల ఆరోపణ.  కాదు సీమాంధ్ర ప్రజలంతా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు అని అవతలి వారి వాదన. ఇందులో నిజమేదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. 

ఒకవేళ హైదరాబాదు గనుక సీమాంధ్ర ప్రాంతంలో వుండి వుంటే అసలు వారికి అడ్డు చెప్పవలసిన అవసరమే ఉండేది కాదు. ఈ విషయం వారే పలుమార్లు ఒప్పుకున్నారు కూడా.

వారి ఖర్మానికి హైదరాబాదు కనీసం తెలంగాణా, ఆంధ్రా సరిహద్దుల్లో కూడా లేదు, చెరిసగం పంచుకోవడమో, పూర్తిగా మాదే అని అనడమో చేయడానికి. అది ఎటునుండి చూసినా సీమాంధ్ర ప్రాంతానికి రెండొందల కిలోమీటర్ల పైనే ఉంది. వారు తెలంగాణా గనక ఇస్తే హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అదే అసలు కారణం. మరి హైదరాబాదు కేంద్రపాలితం కావడానికి హైదరాబాదు ప్రజలు ఒప్పుకోరు. కారణం కేంద్రపాలిత ప్రాంతం అంటే మరో తరహా వలస పాలనే కనుక. ఇక తెలంగాణా వారు సరే సరి.

ఇక సమైక్యతా నినాదాన్ని పక్కకు పెట్టి హైదరాబాదు గురించి మాట్లాడినప్పుడే ఇలాంటివారి రంగు బయట పడింది. కోరుకునేది వారు చెప్పుతున్నట్టు సమైక్యాంధ్రో, లేక విశాలాంధ్రో కాదనీ, వీరి ఆలోచన మొత్తం హైదరాబాదు మీదనే ననీ.

సామాన్య ప్రజలకు హైదరాబాదుతో పనేం వుంటుంది? ప్రైవేటు ఉద్యోగాలో, వ్యాపారాలో ఐతే ఈ రాష్ట్రం ఏర్పడక ముందైనా వారికి ఎలాంటి అడ్డంకి లేదు. రేపు రాష్ట్రం విడిపోయినా కూడా అలాంటి అడ్డంకి వుండదు. ఇక్కడి ప్రాంతీయ ప్రభుత్వ ఉద్యోగాలపై వారికి ఎప్పుడూ హక్కు లేదు, కాబట్టి వాటిపై చర్చ అనవసరం. ఇవి కాక మిగిలిన విషయాలు ఏం వున్నా, అవి అంత ప్రధానమైనవి కావు. ఒకసారి రాష్ట్ర విభజనకంటూ అంగీకరిస్తే అవన్నీ చర్చించి పరిష్కరించుకోగల విషయాలే.

కాని అలా జరగడం లేదు. కారణం ఇవి కాక ఏవో విషయాలున్నాయి కాబట్టి. అవి అత్యంత బలీయమైనవి, వ్యతిరేకించేవారు బయటికి చెప్పలేనివీ.

అవి ఏమిటో తెలుసుకోవాలంటే గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించాలి. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అని వేర్వేరుగా లేవు. రెండూ కలగలిసి పోయాయి. రాజకీయనాయకుడే వ్యాపారి. కాదంటే ఆయన వ్యాపారం బినామీగా నడుస్తుంది. విధాన నిర్ణయాలు వ్యాపారులకు అనుకూలంగా వుండి తీరుతాయి. టెండర్లు, అంచనాలు వాటికి అనుగుణంగానే వుంటాయి. ప్రజా దానం విచ్చల విడిగా కొల్లగొట్ట బడుతుంది.

ఇక ఎంత పెద్ద రాష్ట్రం అయితే అంత ఎక్కువ ప్రజాధనం. అంత పెద్ద కాంట్రాక్టులు. డబ్బు ఎక్కువ, ప్రభావితం చేయవలసిన మనుషులు తక్కువ. వ్యాపారులకు, సారీ వ్యాపారాజకీయులకు ఇంతకన్నా ఏం కావాలి? అందుకే వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎంతమాత్రం ఇష్టం లేదు.

ఇలాంటి రాజకీయులు ఒక ప్రాంతం వారేనని చెప్పబోవడం లేదు. వారు రెండు ప్రాంతాల్లోనూ వున్నారు. కాకపోతే ఒకప్రాంతం వారే ఎక్కువ సంఖ్యలో, అదీ రాస్త్ర ప్రభుత్వాన్ని శాసించగల స్థాయిలో వున్నారు. ఎందుకంటే శాసన సభలో మెజారిటీ సభ్యులు వారే కాబట్టి. ఒక ప్రాంతం వారు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తుంటే, రెండో ప్రాంతం వారికి అంత సదుపాయం లేదు. ఎందుకంటే రేప్పొద్దున వారు అక్కడినుండే ఎన్నుకోబడాల్సిన వారు కాబట్టి. అందుకే వారు బయటికి మాత్రం తామే సిసలైన తెలంగాణా వాదులమని చెపుతూనే, రెండోవైపు తెలంగాణా ఉద్యమానికి పొడవాల్సినన్ని వెన్నుపోట్లు పొడుస్తూనే వున్నారు. ప్రజలు వీరి ఉష్ట్రపక్షి తెలివితేటల్ని గమనిచడం లేదని వీరి ఆలోచన. అయితే ఈ సమైక్యాంధ్రలో బడా కాంట్రాక్టర్లతో పోటీ పడలేని చిన్నకారు కాంట్రాక్టర్లు మాత్రం నిజాయితీగానే ప్రత్యేక రాష్ట్రం కోసం నిజాయితీగానే పోరాడుతున్నారు, అప్పుడైనా వారికి అవకాశాలు వస్తాయనే ఆశతో.

ఇప్పటి తెలంగాణా పోరాటం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించింది మాత్రమే. ఇది ఒక ప్రాంతంమీద మూకుమ్మడిగా ఇంకో ప్రాంతం చెలాయిస్తున్న పెత్తనానికి, వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం. పెట్టుబడిదారుల పైనో, అగ్రకులాధిపత్యానికి వ్యతిరేకంగానో చేసే పోరాటం కాదు. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రయోజనాలు ఇమిడివున్నాయి. కాబట్టి దీనిలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ ఉద్యమం కూడా అందరినీ కలుపుకొని పోతుంది. మిగతా అస్తిత్వవాద, దోపిడీ వ్యతిరేక పోరాటాలు దీనికి సమాంతరంగా కొనసాగుతూనే వుంటాయి. అవి ఇక్కడే కాదు మిగతా దేశమంతా కూడా కొనసాగుతూనే వుంటాయి. వాటి సాఫల్యతా వైఫల్యాలు కూడా దేనికవే విడివిడిగా వుంటాయి. వీటన్నిటినీ ఒకదానికొకటి ముడిపెట్టి చూడలేం.

తెలంగాణా వ్యతిరేకులు ఎవరు అనే విషయంలో తెలంగాణా ప్రజలు స్పష్టంగా వున్నారు. ఇక మిగతాది కాలమే నిర్ణయిస్తుంది.



Tuesday, October 25, 2011

సమ్మె విఫలమైందా?


సకల జనుల సమ్మె ముగిసింది. దీన్ని తెలంగాణా ఉద్యమానికే ముగింపుగా వర్ణిస్తూ కొంతమంది నిర్హేతుక, నిరర్థక, నిష్ఫల వ్యాఖ్యలు చేయడం అప్పుడే మొదలుపెట్టారు.

ముందుగా గమనించ వలసిన విషయం సమ్మెకి, ఉద్యమానికి ఉన్న తేడా. ఇప్పుడు జరిగిన సమ్మె కొన్నివర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు మొత్తానికి మొత్తంగా సమ్మెలో పాల్గొని, దాదాపు నలభైరెండు రోజులు రాష్ట్రాన్ని స్తంభింప జేయడం. వారు దీన్ని తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా చేశారు.

ఇంత భారీ సంఖ్యలో ఒక ప్రాంతపు ప్రజలు మొత్తానికి మొత్తంగా నలభై రెండురోజులు సమ్మె చేయడం మన దేశ చరిత్రలోనే ఎన్నడూ వినని విషయం. చివరికి భారత స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఇంతటి తీవ్రమైన సమ్మె జరగ లేదు. సమ్మె సఫలం కాకపోవచ్చు, కాని అది విజయవంతం అయిందనడానికి ఈ ఒక్క విషయం చాలు.

దాదాపు 180 ఉద్యోగ సంఘాలు, ఏడు లక్షల మంది ఉద్యోగులు తెలంగాణా ఏర్పాటుకోసమై తమ ఆకాంక్షను ఏకకంఠంగా ఎలుగెత్తి చాటారు. సహజంగానే ఇది సమైక్య పక్షపాత మీడియాకు, కొన్ని ప్రజాకంటక శక్తులకు రుచించని విషయం. అందుకే వారు సమ్మె విఫలమైనట్టు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు.

ఈ సమ్మె విఫలమే అయిందని అనుకుంటే, గాంధీజీ తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పుసత్యాగ్రహం కూడా విఫలమైనట్టే. ఆ ఉద్యమాల వల్ల కూడా మనకు స్వాతంత్ర్యం రాలేదు కదా! మరి ఎందుకు పుస్తకాల్లో వాటి గురించి ఊదర గొట్టుకుంటున్నాం?

సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటాలు ఎక్కడా ఒక కొలిక్కి రాకుండానే ముగిసాయి. అంతమాత్రాన అవి గొప్పవి కావని ఎలా అనగలం?

మొదటి స్వాతంత్ర్య సంగ్రామం దారుణంగా అణచి వేయబడ్డ విషయం వాస్తవం కాదా?

పై పోరాటాలన్నీ ఎలాంటి ప్రయోజనాలు లేనివే అయితే ఈ సమ్మె కూడా అలాంటిదే అనుకోవాలి. కాని ఎనిమిదో తరగతి చదివిన పిల్లాడికి కూడా తెలుసు, పై పోరాటాలు పూర్తిగా వ్యర్థం కాదనీ, అవి ఒకదానికి ఒకటి స్పూర్తి నిచ్చుకుంటూ తరవాతి తరాలకు ఉద్యమ స్పూర్తిని రగిలించాయనీ.

నిజంగా ఈ సమ్మెవల్ల ఏ ప్రయోజనం సమకూరలేదా?

ప్రజా ప్రతినిధుల రాజీనామాలు కుయుక్తులతో ఆమోదించకుండా ఆపివేసి, పచ్చ బాబుతో కుమ్మక్కై మైనార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకుంటూ, ఇక ఇప్పట్లో ఎలాంటి సమస్యా ఉండబోదనుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తన్నిలేపింది ఈ సమ్మె.

తెలంగాణా పై ఏనాడూ గంట కూడా చర్చించని కాంగ్రెస్ కోర్ కమిటీ దాదాపు ముప్పై సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆజాద్ నివేదిక, ప్రణభ్ నివేదిక మూలవిరాట్టుకు చేరింది. ఇంకా ఈ విషయంపై జాగు జరిగితే అది కేవలం మూలవిరాట్టు మాత్రమే కారణం తప్ప మరే కారణం లేదని ప్రజలకు అర్థమైంది.

పైకి 'జై తెలంగాణా' అంటూ, లోల్లోపల సమైక్యవాదుల మోచేతి నీళ్ళకోసం ఆశపడుతూ,  జనాన్ని మోసం చేస్తున్న రాజకీయ నాయకులు నగ్నంగా ప్రజలముందు నిలబడ్డారు.

తెలంగాణా ఏర్పాటు మాచేతుల్లో లేదని ఒకవైపు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళబేరానికి వచ్చి, జీతాలు, స్పెషల్ లీవులు, బోనసులూ ఇచ్చి ఉద్యోగుల చేత సమ్మె మాన్పించిన పద్ధతే సమ్మె విజయవంతమైందో కాదో చెప్తుంది. ఇక వేరే సాక్ష్యం కావాలా? ఇంత జరిగినా గుర్తించని వారికి సమ్మె గురించైనా తెలియక పోవాలి, లేదా తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తుండాలి.

తెలంగాణా ఉద్యోగులు సమ్మె విరమించ వచ్చు. మళ్ళీ చేస్తామనే బెదిరింపును అట్టే పెట్టుకున్నారు. సమ్మెకు తాత్కాలిక విరమణ జరగ వచ్చు. కాని ఉద్యమానికి మాత్రం విరమణ లేదు, తెలంగాణా వచ్చే దాకా. రక రకాల రూపాలతో అది ప్రజా వ్యతిరేకుల కళ్ళు బైర్లు కమ్మిస్తూనే వుంటుంది.

పోలవరం, ప్రత్యామ్నాయం

Here is an alternative to Polavaram
Avoids displacement of tribes, destruction of vast timber reserves

Hyderabad: The Indirasagar (Polavaram) mega multipurpose project has been making it to headlines of late for obvious reasons – threat of colossal damage to environment, huge displacement involving two lakh population in 299 villages, a majority of them being primitive tribal groups, and submergence of two lakh acres, mostly timber reserves and pristine forests of Godavari valley. 

In view of this, an alternative proposal to the Polavaram project itself, but affords all its benefits, is fast gaining acceptance among the intellectuals in the state. Moreover, it has drawn the support of the main losers of the Polavaram project – the tribals.

The plan, put forth by a retired Chief Engineer M Dharma Rao, comprises two components. It banks mainly on diversion of water from two points – the Sileru basin and the Dummugudem barrage. Rich flora and fauna, more particularly some native plant species, face the risk of extinction due to the Polavaram project in its current design. 

Neither the environmentalists who are up in arms against the project nor the constitutional guarantees to the affected tribal communities could come in the way of the project’s implementation. The project has become an exception to the norms laid down in the national water policy for taking up such a major project.

But the alternative plan would yield almost the same benefits that are expected under the Polavaram dam. There is an ample scope to avoid rather completely the suffering and disruption expected from the present design, which was given a go-ahead despite all its ill–effects on the state as a whole, according to Mr Dharma Rao.

His plan has gained the acceptance of the tribal leaders, who have been desperately opposing the project that would spell the doom for their communities. 

The environmentalists have also been largely supportive of Mr Rao’s plan as it envisages tunneling to carry water underground, thus sparing the large pockets of greenery that made Khammam one of the densely forested districts in the country. 

The alternative proposal which comprises two components is banking mainly on diversion of water from two points – the Sileru basin and the Dummugudem barrage. The Sileru River has many existing hydro-electric schemes contributing a regular flow of 5000 cusecs. 

The regulated flow can be harnessed by constructing a barrage across the river below Lower Sileru Hydro Electric Scheme near Mothugudem of Khammam.

Component-I
Waters thus diverted could be channelled into Yeleru River through tunnels and it can be linked to the Left bank main canal of the project below the Yeleru reservoir. The proposed diversion takes off from an elevation of 600 feet and as it negotiates a fall of 500 feet to reach the designed ayacut area. The water flow can be harnessed to generate some 500 MW of hydel power, too. 

The scheme also envisages construction of balancing reservoirs across the smaller streams including Sokuleru and Pamuleru. The scheme would make available some 100 TMCFT of water - TMCFT from the regulated flow of the Sileru basin and 25 TMCFT from the balancing reservoirs.

Component-II
The existing anicut across Godavari at Dummugudem village could be improved to store water up to +165 ft level. The anicut is at a higher elevation compared to Polavaram. A perennial flow of more than 35,000 cusecs would be ensured. 

It would make 600 TMCFT of water available at 75 per cent dependability. About 180 TMCFT of water can be diverted from the anicut and about 80 TMCFT of it could be rerouted to the Krishna barrage.

A major canal can be proposed from the right flank of Dummugudem anicut and aligned to run parallel to Godavari River up to Kinnerasani River. It needs a tunnel to be provided to carry the water across the Godavari–Krishna ridge. All the benefits envisaged as part of the Polavaram right canal can be achieved by the second component. The tail-end ayacut of the Nagarjunasagar Left Canal can also be served.
The Polavaram project canals which were already constructed ahead of starting work on the dam could be utilised if the alternative scheme is opted for, says Mr Dharma Rao. It also poses no major environmental complications, he adds.



Curtesy: The Hans India

Monday, October 24, 2011

ఎవరు ప్రాంతీయ వాదులు?


పౌరహక్కుల నాయకులూ, నేర్చుకోండి, హక్కులంటే ఏంటో!


పౌరహక్కుల నాయకులూ (కనీసం కార్యకర్తలూ) ఎక్కడున్నారు మీరు? అక్కడ హైదరాబాద్ లో పౌరహక్కులకు పాతరేశారట. మీరు అక్కడికి వెళ్లి నిరసన తెలియజేయకపోయినా కనీసం ఖండించక పొతే ఎలా?

మీకు ఇంకా తెలియలేదా? కొంతమంది పెట్టుబడి దారులకు హైదరాబాదుపై గుత్తాధిపత్యం కావాలట! దానికి రాష్ట్ర విభజనద్వారా భంగం కలుగుతుందట. మరి ఆ హక్కును ప్రభుత్వం కాలరాస్తే ఎలా?

అదేం హక్కు అంటారా? సమైక్యవాదం అంటే మీకు సరిగ్గా తెలీదులా వుంది. ఇన్నాళ్ళూ ఏంచేస్తున్నారు? ఇప్పుడైనా నేర్చుకోండి, సమైక్యవాదులు చెప్పే హక్కులంటే ఏంటో!

  1. నదులు పారే చోట నీటిని వాడుకునే హక్కు వుండదు, ఎవరు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలరో వారిదే ఆ హక్కు!
  2. ఏ ప్రాంతం ఉద్యోగాలు ఆప్రాంతం వారివి కావు, ఎవడు దొంగ సర్టిఫికెట్లు పెట్టి, అస్మదీయుల రికమండేషనుతోనో, లంచాలతోనో చేర గలిగితే వాడిదే ఆ ఉద్యోగాల మీద హక్కు.
  3. ప్రాజెక్టు, కాలువలు ఉన్నంత మాత్రాన నీటిపై హక్కు వున్నట్టు కాదు, ఎవడు ఆ తూములు పగల గొట్ట గలిగితే వాడిదే ఆ నీటిమీద హక్కు.
  4. పక్క ప్రాంతం వాడికి మెజారిటీ లేదు కాబట్టి వాడి చరిత్రను, సంస్కృతిని తరగతి పుస్తకాల్లో లేకుండా చేసే హక్కు, తద్వారా వచ్చే తరాలకు వారి చరిత్ర, సంస్కృతి వారికే తెలియకుండా చేసే హక్కు.
  5. ప్రక్క ప్రాంతం వాడి, యాస, అలవాట్లు పుస్తకాల్లో, మీడియాలో, సినిమాల్లో నిరంతం హేళన చేస్తూ వారిని నిరంతరం ఆత్మా న్యూనతకు గురిచేసి, మానసికంగా బలహీన పరచే హక్కు.
  6. పక్క ప్రాంతం వాడు న్యాయంగా, రాజ్యాంగ బద్ధంగా కోరే కోర్కెలను వ్యతిరేకిస్తూ దొంగ ఉద్యమాలు చేస్తూ వారిని అడ్డుకునే హక్కు. దొంగ నివేదికలతో కేంద్రాన్ని ప్రభావితం చేసే హక్కు.
  7. పక్క ప్రాంతం వారికి పొత్తు కూడడానికి ఇష్టం వున్నా లేకపోయినా సరే, సమైక్యవాదులమని చెప్పుకునే ఒక ప్రాంతం వారికి ఇష్టమైతే చాలు, బలవంతంగా పొత్తుకూడే హక్కు. 
  8. వోట్లకు ముందు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం కాదని చెప్పి, పోలింగు జరిగిన వెంటనే ప్రత్యేక రాష్ట్రం వస్తే వీసా తీసుకుని వెళ్లాలని చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టే హక్కు.

ఇవీ హక్కులంటే. వీటినే మీరు ఇప్పటినుండి మీ హక్కుల డిక్షనరీలో చేర్చుకొని, వీటికి ఏమాత్రం భంగం కలిగినా మీరు ఎదిరించాలి. అర్థమయిందా?

Image Curtesy: Gr8 Telangana 

Sunday, October 23, 2011

మా జాతిని రక్షించే మార్గమొకటే, మారాష్ట్రం


కష్టాల కడలిని కడదాకా ఈది ఈది 
తీరం చేరామో లేదో తేరగా నువ్వొచ్చావు 

భాషే లంకెగ మార్చి పాశం సంధించావు
కవలలమని అన్నావు కలిసుందామన్నావు

అనుమానించిన నాతో ఆప్యాయత నటిస్తూ  
పలుబాసలు చేశావు పాటిస్తానన్నావు

నీ మాటలు నమ్మేసి నీతో జత కలిశాక 
ఒప్పందాలకు వరుసగా నూకలు చెల్లించావు

మాకున్న ఘనచరిత్ర మాపిల్లలు చదువకుండా 
కుట్రలు మొదలెట్టావు కుయుక్తులను పన్నావు 

మా నదులను ఒంపుకొని మాగాణం పండించి
కోట్ల డబ్బు కూడబెట్టి కొల్లగొట్టి మా నేలను
వ్యాపారాలను పెట్టి మమ్ముల కూలీలు జేసి
మా నేలను మొత్తం నీ వలసగా మార్చేశావు

నీ ఎత్తులు చూశాక నీ వంచన తెలిశాక
నీతోనే కలిసుంటే నీ బంధం వీడకుంటే
నాజాతే మొత్తంగా నాశనమై పోతుంది
నీ దొరతనం కిందే నీల్గవలసి వస్తుంది

అంతే మా ఆరాటం అందుకే మా పోరాటం
మా జాతిని రక్షించే మార్గమొకటే, మారాష్ట్రం 

Saturday, October 22, 2011

మనది ప్రజాస్వామ్యమా?



What Telangana says about our democracy

Manoj Mitta Oct 16, 2011, 07.19AM IST

Whether you agree with their demand or not, there is no denying the extraordinary commitment on display across Telangana. Lakhs of government servants have been on a strike for over a month, suffering loss of pay and ruining their Dussehra. Given the Centre's prolonged consultations and deliberations, the agitators are likely to miss out on Diwali too.

Their bid to intensify the agitation with a rail blockade has prompted the Andhra Pradesh government to come up with tough measures. Things could get worse in a situation where schools and colleges have been shut as teachers too have taken to the streets. Similarly, the involvement of bus drivers has disrupted public transport in Telangana and of coal miners has caused a power crisis in the whole of Andhra Pradesh and neighboring states.

The political response to this popular revolt has thrown up larger questions about democracy, governance and constitutional morality. Although the movement has been by and large peaceful, ministers and legislators are in no position to set foot in Telangana districts outside Hyderabad. This is even after MLAs and MPs tried to pacify agitators by tendering mass resignations about two months ago. The gesture proved to be farcical as none of their resignations have come into effect. State ministers on their part made a similar show of boycotting the secretariat and cabinet meetings. The stalemate in governance has resulted in incalculable social and economic costs. What is worse is the subversion of democracy by the Centre in Telangana. In the 2004 Lok Sabha election, the Congress party's alliance with the Telangana Rashtra Samithi (TRS) won the popular mandate in Telangana, which has 17 constituencies. Despite the incorporation of Telangana in its common minimum programme, the UPA-1 made little effort to honour that promise. Yet, in the 2009 election, the Congress party fared even better in Telangana for two reasons. First, all the major parties had by then come out in support of the statehood demand. But, more importantly, chief minister Y S Rajasekhara Reddy played a fraud on the voters in Telangana . Taking undue advantage of the multi-phase polling in Andhra Pradesh, Reddy sought votes in Telangana by making suitable noises. Then, while campaigning in the rest of the state, he claimed that those people would need visas to visit Hyderabad if they did not pre-empt the division of the state by voting for Congress.

Later in the same year, after Reddy had died in a crash, the Manmohan Singh government betrayed similar disdain for the Telangana sentiment. Reacting to the hunger strike forced on TRS leader K Chandrasekhar Rao by agitating students, P Chidambaram famously announced on December 9, 2009 that the "process of forming a separate Telangana will be initiated." Yet, within a fortnight , Chidambaram reneged on it, saying that "the situation in Andhra Pradesh has altered" since his statement. Why, did the people of Telangana suddenly change their mind? No, Chidambaram was actually referring to the differences that emerged among political parties after he had conceded statehood. "A large number of political parties are divided on the issue," he said, adding that this was despite the all-party consensus in Hyderabad just two days before his December 9 statement. In effect, the Centre placed the fickleness of political parties above the will of the people of Telangana , manifested in successive elections. By the time the current round of the agitation started last month, the people's will had been expressed even more emphatically in the 2010 assembly by-elections , when Telangana proponents had won all the 12 seats. The by-elections took place while the agitation was on hold for a year, in deference to the consultations held by the Justice Srikrishna Committee. But its anti-Telangana report turned out to be so flawed that the Centre has never dared to convene the promised all-party meeting to discuss its findings. A "secret" chapter of the Srikrishna report, laid bare by the Andhra Pradesh high court, was so partisan that it advised the government on how it could deal with opposition parties and "manage" the media.

The insults heaped on the Telangana movement by the Manmohan Singh government contrast with the respect shown by Jawaharlal Nehru in a speech delivered early 1956 in the then Hyderabad state, which included Kannada and Marathi-speaking districts. He was opposed to the idea of separating those districts from Telangana "because it is a flourishing province" . He however yielded to the preference expressed by the people of Kannada and Marathi-speaking districts. For, "who was I to force my views down their throats. This is not how a democracy works. Therefore, though it was my firm opinion, I gave it up." On the demand since raised by Telanganites for breaking up another "flourishing province" called Andhra Pradesh, Nehru's successors could well redeem themselves by following his democratic approach.

Curtesy: Times of India 

పోచారం, జర చూసుకొని పో


తనకు వోటు వెయ్యని వారిని పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేయడం అభ్యంతర కరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరికైనా వోటు వేసే హక్కు వుంటుంది. ఆ క్రమంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి వోటు వేస్తే తప్పేంటి?

నిజానికి పోచారానికి గత ఎలక్షన్ల కంటే ఇప్పుడు రెట్టింపు మెజారిటీ వచ్చింది. అప్పుడు కూడా తెలుగుదేశం, తెరాస కలిసి పోటీ చేశాయి. అయినా కూడా ఇప్పుడు రెట్టింపు వోట్లు వచ్చాయంటే అది కేవలం ఉద్యమ తీవ్రతవల్ల మాత్రమే.

నిజానికి తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు పోచారం ఆ ప్రాంతంలో తెలంగాణా వాదులకు, తెలంగాణా పేరెత్తిన వారికి చేసిన సన్మానాలు ఇంకా చాలామంది మరచి పోలేదు. అయినా కూడా పెద్ద మెజారిటీతో గెలిపించారంటే కారణం ఆయన్ను చూసి కాదు, తెలంగాణా వాదాన్ని గెలిపిద్దామని మాత్రమే. ఆ క్రమంలో కొంత వ్యతిరేక వోటు పక్కవాడికి పడడంలో ఆశ్చర్యం కనిపించదు. పోచారం ఈరోజు పార్టీ మారి తెరాస తీర్థం పుచ్చుకోగానే సిసలైన తెలంగాణా వాదిగా మారిపోయాడని అందరూ నమ్మాలనేముంది?

ఇక్కడ గమనించ వలసిన ఇంకో విషయమేమిటంటే, అక్కడ పోటీ చేసింది ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీనివాస గౌడ్ కూడా తెలంగాణా ఇచ్చేదీ తెచ్చేదీ మేమే అంటూ బలంగా ప్రచారం చేయడం ఇక్కడ గమనిచాల్సిన విషయం. అటువంటప్పుడు పోచారానికి వ్యతిరేకంగా పడ్డ వోట్లు తెలంగాణాకి వ్యతిరేకంగా పడ్డట్టు ఎలా అవుతాయి?

దీనికి తోడు అక్కడ గిరిజనుల జనాభా కూడా ఎక్కువగానే వుంది. అమాయకులైన గిరిజనులు వారి నేతలు ఏం చెప్తే అదే వింటారు. ఆ గిరిజన నాయకులను కాంగ్రెస్ డబ్బుతో కొనడం పెద్ద విషయం కాదు. ఇలాంటివి నివారించాలంటే తెలంగాణా ఆవశ్యకత గిరించి మరింత లోతుగా వారికి వివరించే ప్రయత్నం చేయాలి తప్ప వారిని ద్వేషించడం పరిష్కారం కాదు. 

తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరగానే తెలంగాణావాది ఐపోడని, తెలంగాణా నిజాయితీగా పోరాడినప్పుడే ప్రజల విశ్వాసం చూరగొంటాడని ఇప్పటికైనా పోచారం గ్రహిస్తే మంచిది.

Friday, October 21, 2011

సీమాంధ్రులకు తొత్తుగా మారిన కాంతం


హైదరాబాద్: ప్రజాసంఘాలజేఏసీ నేత గజ్జల కాంతం సీమాంధ్రులకు తొత్తుగా మారాడని మాలమహానాడు నాయకులు, తెలంగాణవాదులు విమర్శించారు. తెలంగాణకోసం ఏనాడూ పోరాడని నీకు తెలంగాణకోసం అహర్నిషలూ కృషిచేస్తున్న కోదండరాంను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. ప్రజాసంఘాలపేరుతో తెలంగాణకు ద్రోహం చేస్తున్న నీలాంటి వాల్లు తెలంగాణవాదుల ఆగ్రహానికి గురికాకముందే పద్ధతి మార్చుకోవాలన్నారు.


ఇదీ న్యూస్ ఐటం.


మొన్న ఏదో ఒక చానెల్లో సకల జనుల సమ్మె విరమణ పై డిస్కషన్ పెట్టారు. దాంట్లో గజ్జెల కాంతం వాదన ఇలా వుంది.

"సకల జనుల సమ్మె కోదండరామిరెడ్డి ఎందుకు పెట్టినట్టు? తెలంగాణా ఉద్యోగులు, ప్రజలు ఎంతో నష్ట పోయారు. సరే, నష్టపోయినా ఫరవాలేదు. మరి ఎందుకు ఆపినట్టు? తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందే ఎందుకు విరమించారు?"

దళిత సంఘాలకు ప్రతినిధిని అని చెప్పుకునే ఈయన, కోదండరాంని కోదండరామిరెడ్డి అని సంబోధించడమే ఒక విచిత్రం. ఆయన పదే పడే అదేవిధంగా ఆయన పేరుని వ్యవహరించారు. జన్మతః రెడ్డి అయినా కోదండరాం తనంత తానుగా కులనామాన్ని పరిత్యజించారు. ఆయన వదిలేసినదాన్ని నొక్కి పలుకుతూ సగటు తెలంగాణా వ్యతిరేకుల్లా వ్యవహరించారు గజ్జెల కాంతం. ఆయనకు కోదండరాం తీసుకున్న నిర్ణయాలను గాక, ఆయన్ను వ్యక్తిగతంగా నిందిచే ఉద్దేశమే ఎక్కువగా వున్నట్టు కనపడింది.

ఇక పొతే సకలజనుల సమ్మె గురించి కాని దాని విరమణ గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన వున్నట్టు కనపడలేదు. ఒక వైపునుండి సమ్మె ఎందుకు మొదలు పెట్టినట్టు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సమ్మె వాళ్ళ ఉద్యోగులు, ప్రజలు నష్టపోయారు అని చెప్తారు. మళ్ళీ ఆయనే, నష్టపోయినా ఫరవాలేదు అంటారు. ఎందుకు విరమించారు అని ప్రశ్న వేస్తారు. ఈయన ధోరణికి ఆ చర్చ నిర్వహిస్తున్న సీమాంధ్ర శల్యునిగా పేరుపడిన ఒక ప్రముఖ యాంకరే ఆశ్చర్యపోవడం జరిగింది.

ఏ సమ్మె అయినా ఆశావహ దృక్పధంతో ఏదైనా సాధించాలనే చేస్తారు. ప్రభుత్వం మొండికేస్తే ఉద్యోగులు ఎంతకాలం సమ్మె చేస్తారు? అందుకనే కొన్ని విభాగాలు సమ్మె విరమించాయి. అలాగే విద్యార్థులు నష్టపోతున్నారని భావించి టీచర్లు కూడా సమ్మె విరమించారు. అయినా కూడా ఇంకా 135 యూనియన్లతో కోడిన ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలు సమ్మెలోనే వున్నాయి. ఒక వేళ ప్రభుత్వ ప్రలోభాలకు లోని సమ్మె విరమింప జేస్తే అందరినీ విరమింప జేయాలి కదా? మరి వీరంతా సమ్మెలో ఎందుకున్నట్టు? ఎంతకాలం సమ్మెలో కొనసాగాలన్నది ఆయా సంఘాల నిర్ణయానికే వదిలేసినట్టు దీన్ని బట్టి తెలుస్తూనే వుంది.

ఇలా ద్వంద్వప్రమాణాలతో మాట్లాడుతూ గజ్జెలకాంతం వ్యవహరిస్తున్న తీరు, పై ఆరోపణలు నిజమని తెలియజెప్పడం లేదూ?

Thursday, October 20, 2011

కొత్త ఎత్తుగడలు అవసరం


ఇప్పుడు రాష్ట్రంలో వున్న ప్రభుత్వానికి తెలంగాణా నుండి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. మూకుమ్మడిగా తెలంగాణా ఎమ్మెల్యేలంతా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయడమే దానికి నిదర్శనం. అంతే కాక దాదాపు పాతిక మంది జగన్ వర్గీయులు కూడా రాజీనామాలు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది?

ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ గరవర్నరుకు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు పంపవచ్చు. మెజారిటీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి మెజారిటీ నిరూపించుకోవడానికి అసెంబ్లీని సమావేశ పరచవలసిందిగా కోరవచ్చు. కాని తెలుగుదేశం పార్టీ అలా చేయలేదు.

సీమాంధ్ర పెట్టుబడుల బలంతో చంద్రభాబు దర్శకత్వంలోని ఆంధ్రా సిండికేట్ మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదన్న విషయం బహిరంగమైన రహస్యం. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలంగాణా వాదం పట్ల కాని, తెలంగాణా ప్రజల పట్ల కాని ఎలాంటి సానుభూతి లేదన్న విషయం ఇప్పటికే నిరూపించబడ్డది. 

నెల రోజులు సకల జనుల సమ్మె జరిగి తెలంగాణా మొత్తం అట్టుడికిపోతే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ, కేంద్రానికి all is well అని నివేదికలు పంపడమే అందుకు నిదర్శనం. కేంద్రం ముఖ్యమంత్రిని, బొత్సాని డిల్లీకి పిలిపించి మొట్టికాయలు వేస్తే తప్ప ప్రభుత్వంలో ఎంతో కొంత చలనం రాలేదు. దీన్ని బట్టి తెలుస్తున్నదేమంటే సమైక్యవాదులచేత ప్రాయోజితమౌతున్న ఈ ప్రభుత్వం తెలంగాణా ఉద్యమాల పైన పూర్తి నిర్లిప్తతతో వుంది. అంతే కాక, ఈ సమ్మె వేడి కేంద్రానికి వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా అక్కడ తెలంగాణాకు ఎలాంటి అనుకూల నిర్ణయం రాకుండా వుండడానికి అది శాయశక్తులా కృషి చేస్తుంది.

ఉద్యమాలు చేయడం వల్ల తెలంగాణా ప్రజలు మాత్రం రకరకాల నష్టాలు అనుభవించవలసి వస్తుంది. అదే సమయంలో సీమాంధ్రలో అంతా సజావుగానే వుండడం వల్ల వారికి పరిస్థితిలో మార్పు రావలసిన అవసరం కనిపించడం లేదు. సమస్యకు పరిష్కారం రావలసిన అవసరం అంతకన్నా అనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో ఉద్యమకారుల వ్యూహాలు ఎలా ఉండాలన్న విషయం పునస్సమీక్షించు కోవలసిన అవసరముంది. గతంలో సకలజనులసమ్మె ప్రారభమైన మొదటి రోజుల్లోనే ఈ విషయం గురించి ఉద్యమం రూపం మార్చవలసిన సమయం వచ్చింది అన్న టపాలో ఇదివరకే చర్చించడం జరిగింది.

సమైక్యవాదుల, వారు నడిపే ప్రభుత్వాలు ఉద్యమం పైన నిర్లిప్తత వహిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయక పోవడానికి ముఖ్యకారణాలు ఇవి:


  1. ఇప్పుడు సమైక్య రాష్ట్రమే వుంది కాబట్టి తెలంగాణా ఉద్యమాలు ఎన్ని జరిగినా వారికి వచ్చే నష్టం లేదు. ఈ రాష్ట్రం ఇలాగే ఉన్నంత కాలం, వారి దోపిడీకి ఆటంకం కలగనంత కాలం వారికి ఎలాంటి బాధ లేదు. 
  2. ఈ ఉద్యమాల కారణంగా కేంద్రం ఏదైనా చర్యలు తీసుకుంటుందని అనుకుంటే తప్ప ఇలాంటి ఉద్యమాల వల్ల వారికి నష్టం లేదు.  అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగూ సూట్కేసులు రంగంలోకి దిగుతాయి కాబట్టి ఫరవాలేదు.
  3. వారి అక్రమ ఆస్థులకు గాని, అక్రమ వ్యాపారాలకు గాని ఎలాంటి ఆటంకాలు జరగడం లేదు.

అలాంటప్పుడు సమస్యకు పరిష్కారం ఎందుకు? ఒకవేళ పరిష్కారం తెలంగాణాకు అనుకూలంగా వస్తే వారికి నష్టమేగాని లాభం వుండదు. అందుకని ఎలాంటి పరిస్థితి రాకుండా యధాతథ పరిస్థితి కొనసాగడమే వారికి ఎక్కువ ఇష్టం. 

ఇలాంటి పరిస్థితిలో ఉద్యమగతిని నిర్ణయించే వ్యూహంలో భాగంగా ఈ క్రింది అంశాలను దృష్టిలో వుంచుకోవాలి.

  1. ఉద్యమ క్రమంలో తెలంగాణా ప్రజలకు నష్టం తక్కువగా వుండాలి. 
  2. అదే సమయంలో ఉద్యమం కొనసాగినంత కాలం తమకు నష్టాలే తప్ప లాభాలు వుండవన్న భావన సమైక్యవాద పెట్టుబడిదారులకు కలిగించాలి.
  3. అక్రమ ఆస్థులను కూడబెట్టిన బడాబాబులు, ఇక ఏమాత్రం వాటిని రక్షించుకోలేమని గ్రహించాలి. అక్రమ ఆస్తులు ఎప్పుడైనా అక్రమమే, తెలంగాణా వచ్చినా, రాకపోయినా. వీరిని వదిలి వేయడం వల్ల సమైక్యవాదుల వద్ద మంచిపేరు సంపాయించు కోవడమనేది ఎండమావిలో నీళ్ళు ఆశించడమే. నిజానికి ఇలాంటి అక్రమార్కుల భరతం పడితే సగటు సీమాంధ్ర పౌరులు కూడా సంతోషిస్తారు.
  4. నిరసన కార్యక్రమాల సంఖ్య తగ్గించుకోవాలి. ఏ కార్యక్రమం జరిగినా కూడా జనసమీకరణ ఎక్కువగావుండి విజయవంతం కావడానికి పక్కా వ్యూహాలు రచించుకోవాలి. రోజువారీ నిరవధికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలు విసిగి పోయి ఉదాసీనత, తద్వారా నిరాశ పెరిగే అవకాశం వుంటుంది. మధ్య మధ్య స్వల్ప విరామాలు అనివార్యం.
  5. నిరసన కార్యక్రమాలు గాల్లో బాణాలు వదిలినట్టుగా వుండకూడదు, అవి తెలంగాణా వ్యతిరేక శక్తులపై కేంద్రీకరించ బడి వుండాలి. అప్పుడుగాని వారిలో చలనం రాదు. వారిలో చలనం తెప్పించ గలిగితే సమస్య పరిష్కరించమని వారే కేంద్రాన్ని కోరుతారు.
  6. ఏ కార్యక్రమం జరిపినా అహింసా మార్గంలోనే జరపాలి. కాని ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వహించి పెద్ద ఎత్తున బలగాలను మొహరించి నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసు బలగాల సంఖ్యకు వందల రెట్లు ఎక్కువగా జనాన్ని సమీకరించుకోవాలి. లేకపోతే అవి విజయవంతం కావు.
ప్రజాస్వామ్యయుత ఉద్యమాలను దోపిడీ శక్తులకు దాసోహం పలికే ఈ ప్రభుత్వాలు పట్టించుకోని ప్రస్థుత పరిస్థితిలో తదుపరి దశ ఉద్యమంలో పైన చెప్పిన వ్యూహంలో ఎత్తుగడలు వేస్తే తప్ప ఫలితాలు సాధించడం కష్టం. 

Wednesday, October 19, 2011

సమైక్యవాదం ద్వంద్వప్రవృత్తి


  1. ఏ లెక్కలైనా తీయండి. సీమాంధ్ర కంటే తెలంగాణాయే అభివృద్ధి చెందిందని రుజువు చేస్తాం.
  2. మీ తెలంగాణా నాయకులు చేతగానివారు, దద్దమ్మలు, పనికిరాని వారు. మా నాయకులు సమర్థులు. ఒకవేళ వారు పొరపాట్లు చేసినా మేం కాలరుచ్చుకుని అడుగుతాం. మీరు అలా చేయరు. మరి మీ ప్రాంతపు అభివృద్ధి వెనుక పడితే అది మా తప్పా?

అవును, లెక్కలు వేసేదీ వారే, లెక్కలు తీసేదీ వారే. అవసరమైన వాటిని మాయం చేసి లేవనేదీ వారే. అటువంటప్పుడు అవి వారికి గాక ఇంకెవరికి అనుకూలంగా వుంటాయి? తెలంగాణా అభివృద్ధి చెందినట్టైతే మరి తెలంగాణా (వి)నాయకులు దద్దమ్మలెలాగయ్యారో? అంతగా కాలరుచ్చుకుని అడిగే వారైతే మరి వారి ప్రాంతాలు  ఎందుకు వెనకబడ్డాయో? దీన్ని బట్టే తెలియడం లేదూ వారు చెప్పే కధల్లో పస యెంతో?

  1. తెలంగాణాలో ఏదో కొద్దిమంది రాజకీయ నిరుద్యోగులు తప్ప తెలంగాణాను ఎవ్వరూ కోరుకోవడం లేదు.
  2. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర అంతటా తీవ్రతరం చేస్తాం.

సమైక్యవాదుల చెవులకు మొత్తం తెలంగాణా అరిచి గగ్గోలు పెట్టినా వినపడదు మరి! వారి మాటే నిజం అయితే మరి సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్రం మొత్తం జరగాలి కదా? మరి రాష్ట్రం మొత్తం అంటే తెలంగాణాలో కూడా జరగాలి కదా?

సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్రం మొత్తంగా జరక్కపోయినా ఫరవాలేదన్న మాట! ఒక్క సీమాంధ్ర వాసులుకలిసుండాలని చెప్తే కలిసి ఉండాలన్న మాట! మరి తెలంగాణా ప్రజలు కూడా సమైక్యాంధ్ర కోరుతున్నట్టైతే ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా మంత్రం ఎందుకు జపిస్తున్నాయో? మరి సమైక్యవాడులామని చెప్పుకునే వాళ్ళు వారి ఉద్యమాలని కాకపోయినా కనీసం మిథ్యమాలని కూడా ఇక్కడ జరపలేక పోతున్నారెందుకో?


Tuesday, October 18, 2011

ఆంధ్ర రాష్ట్ర సాధన (పద్య కవిత)



ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును
కేరళుల్, తమిళులు దూరుచుండ,
ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల
అరవ దేశంబె ముందడుగు వేయ,
పండించి తిండికై పరులకు చేజాచి
ఎండుచు తెలుగులు మండుచుండ,
తమ పట్టణమునందె తాము పరాయిలై
దెస తోప కాంధ్రులు దేవురింప,

ఆంధ్ర రాష్ట్రము కావలె ననుట తప్పె?
తెలుగు పంట, తెలుగు సొమ్ము, తెలుగు కండ
తెలుగు వారికి గాని ఈ దీన దశను
ఎంత కాలము నలిగి పోయెదము మేము?

మన యింట పరుల పెత్తన మేమియని కాదె
సత్యాగ్రహంబులు సల్పినాము?
మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె
ఉపవాస దీక్షల నూనినాము?
మన కధికారముల్ పొనరలేదని కాదె
సహకార నిరసన సలిపినాము?
మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె
కారాగృహమ్ముల జేరినాము?

తలలు కలుపక రండని పలికినపుడు
బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి
పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!
మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!

మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!
ఆంధ్ర రాష్ట్ర మొకరి నడుగ నేల?
దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,
చీది, ఒక్కడేదొ చేయి విదుప!

ఢంకాపై గొట్టి నిరా
తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్
అంకించుకొందు మంతే!
ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?


ఇది 1952 లో ఆంద్ర రాష్ట్ర పోరాటంలో భాగంగా శ్రీనివాస సోదర కవులు వ్రాసిన పద్యభాగం. పై ఖండికలో ఆంధ్ర అన్న పదం వద్ద తెలంగాణా అనే పదం పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు తమ హక్కులను సాధించుకోవడంలో భాగంగా రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆంధ్రులు, ఇప్పుడు అవే హక్కులను సాధించుకోవడం కోసం తమ సోదర తెలంగాణీయులు చేసే ఆందోళనలను నిరసించ బూనడం అత్యంత విచారకరం.

Credits: Poetry content is taken from Dr.Sri Acharya Phaneendra's Blog.

Saturday, October 15, 2011

సమైక్యవాదుల విచిత్రవాదనలు


సమైక్యవాదులు చేసే వాదనలలో మనకు సాధారణంగా కనిపించే విషయం, వారు చెప్పే మాటల్లోనే ఒకదానికి మరోదానికి పొంతన లేకపోవడం. వారు చేసే వాదనలు ఇలా వుంటాయి.

అసలు మాకు ఏమాత్రం అవసరంలేకపోయినా మీరే 1956 లో మాతో కలవడానికి తహతహ లాడారు. 
పెద్దమనుషుల ఒప్పందం మీకు(తెలంగాణాకి) అనుకూలంగా 'ఏకపక్షంగా' జరిగింది. 

వీరు చెప్పేదాని ప్రకారం తెలంగాణా వారే తహ తహలాడి, తెలంగాణా వారే మళ్ళీ ఆంధ్రా వాళ్లకు కొన్ని కండిషన్లు పెట్టి, మళ్ళీ తెలంగాణా వారే ఏకపక్షంగా అగ్రిమెంటు చేశారన్న మాట! ఇలాంటి వాదనలు చేయడం కేవలం సమైక్యవాదులకు తప్ప భూమ్మీద మరెవరికీ చేతకాదు.

నదులు పళ్ళానికి పారేలా దేవుడు నిర్ణయించాడు. నీళ్ళు వస్తున్నాయి, వాడుకుంటున్నాం. అది తప్పా?
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి అవకాశాలు లేకపోతే మాతప్పా?
తెలంగాణా వస్తే కోస్తా థార్ ఎడారిగా మారుతుంది.  

తెలంగాణా వస్తే ఎడారిగా మారుతుందన్న భయం ఎందుకు? తెలంగాణలో నీళ్ళు ఆపే అవకాశం వుందనేగా? ఒకవేళ తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టడానికి అవకాశాలే లేకపోతే రాష్ట్రం వేరుపడ్డా నీళ్ళు మీకే వస్తాయిగా? మరి భయమెందుకు? ఒకవేళ మీరు ఇప్పటిదాకా అబద్ధాలే చెప్తున్నారని ఒప్పుకున్నా, తెలంగాణా ఏక మొత్తంగా నీళ్ళని వాడుకునే అవకాశమే లేదు. దాన్ని పర్యవేక్షించడానికి ట్రిబ్యునళ్ళు, కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు వున్నాయి. ఇవి కేవలం మభ్యపెట్టే మాటలు తప్ప వేరుకాదు.

తెలుగుజాతి విడిపోవడానికి ఎట్టిపరిస్థితిలో ఒప్పుకునేది లేదు. 
రాష్ట్రం విడిపోతే హైదరాబాదు సంగతి తేల్చాలి.

ఓ! అదన్నమాట మీ బాధ. మీ బాధ హైదరాబాదు గురించి తప్ప ఐక్యత గురించి కాదు.

రాష్ట్రం విడిపోతే హైదరాబాదులోని  సీమాంధ్ర వారికి రక్షణ ఉండదు.

హైదరాబాదులో సీమాన్ద్రులకంటే ఇతర భారతీయులే ఎక్కువగా (తెలంగాణా వారు కాక) వున్నారు. మరి వాళ్ళందరికీ లేని బాధ మీకెందుకు? ఆ విషయం పక్కన బెడితే ఆంధ్రా వాళ్ళు హైదరాబాదులో ఎంత మంది వున్నారో, మిగతా తెలంగాణా ప్రాంతాల్లో అంతే మంది వున్నారు. పైగా హైదరాబాదులో ఏక మొత్తంగా వుంటే, మిగతా తెలంగాణాలో ఊరికి ఒకటి రెండు కుటుంబాలుగా వున్నారు. అంటే హైదరాబాడుకన్నా కూడా గ్రామ్మాల్లో వారు ఎక్కువ మైనారిటీలన్న మాట. మరి తక్కువ నిష్పత్తిలో వున్నవారిపై లేని శ్రద్ధ ఎక్కువ నిష్పత్తిలో వుండి తమను తాము రక్షించు కోగలిగే స్థితిలో వున్న హైదరాబాదు ప్రాంతం వారిపై ఎందుకు అంట శ్రద్ధ?

కెసిఆర్ భాష సరిగా వుండడం లేదు.
నాలుకలు కోస్తాం - TG వెంకటేష్  
రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది - దేవినేని ఉమా
మానవబాంబులుగా మారుతాం - పయ్యావుల కేశవ్ 
(ఇక మన సీమాంధ్ర బ్లాగర్ల భాష సంగతి చెప్పనే అవసరం లేదు)  

దీనికి వేరే వివరణ అవసరమా?

సమైక్యాంధ్రకోసం ఊరూరా విద్యార్ధులు స్కూళ్ళూ కాలేజీలు వదిలేసి అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. (2009  డిసెంబరు)
ఉద్యమాలు చేసుకోండి. విద్యార్థులను వదిలేయండి. (ఇప్పుడు)

అదీ సమైక్యతా మార్కు నాలుక తిప్పడం అంటే! నాలుక్కి నరం ఉంటేగా!

ఇంకా చాలావున్నాయి, అవి మరో సారి చర్చిద్దాం.