Friday, February 10, 2012

జైలు అధికారి, ఖైదీలు



బక్కోడు: సార్, మీరు లేనిది చూసి వీడు నన్ను విరగ్గొడుతున్నాడు సార్. దయ చేసి నన్ను వేరే లాకప్ కి మార్చండి సార్. వీడి దగ్గర నేను బతక లేను.

బలిసినోడు: కాదు సార్, వీడు అబద్ధాలాడు తున్నాడు.  మీరు లేనిది చూసి వీడే నన్ను విరగ్గొడుతున్నాడు. వీడి వల్ల నాకే ఎక్కువ నష్టం సార్.

అధికారి: అవునా? అయితే ఇద్దరినీ చెరో సెల్ లో వేస్తాను.

బక్కోడు: ఆ పని చేయండి సార్, పుణ్యం వుంటుంది.

బలిసినోడు: అలా ఎలా కుదురుతుంది సార్? కొట్టాడని ఆరోపిస్తే లాకప్ మార్చాలని ఏ రూల్ వుంది చెప్పండి? అదీ గాక నేను కొడుతున్నానని వీడు ఆరోపణ చేశాడు కాబట్టి, దానివల్ల నా ఆత్మ గౌరవం దెబ్బతింది కాబట్టి... నేను కొట్టడం లేదని వీడు ఒప్పుకునేంత వరకు వీణ్ణి వేరే సెల్ లో వేయడానికి నేను ఒప్పుకోను.

అధికారి: నువ్వేంట్రా ఒప్పుకునేది? కావాలంటే వెంటనే మార్చేయ గలను. కాని ఇప్పుడు మటుకు మీ తగవు తీర్చడానికే ప్రయత్నిస్తున్నాను.

(బలిసినోన్ని చూస్తూ) అసలు నువ్వు కూడా ఆరోపించావుగా వాడే నిన్ను కొడుతున్నాడని? మరి వాడు నిన్ను కొడుతున్నప్పుడు నీకు వేరుగా ఉంటేనే సౌకర్యంగా వుంటుంది కదా? ఎందుకు ఒప్పుకోవు?

బలిసినోడు: సార్, వీడు నా సాటి ఖైదీ. ఇంతసేపు కలిసి ఉన్నాక ఇప్పుడు విడిపోదామంటే కుదరదు. కొట్టుకోవడం తిట్టుకోవడం ఖైదీల మధ్య మామూలుగా జరిగేదే. అంతమాత్రం చేత విడిపోతానంటే ఎలా? దెబ్బలు తింటూ కూడా నేను కలిసి వుండడం లేదా? వాడు ఎందుకు విడిపోతాననాలి?

అదంతా ఎందుకు? నేను వాణ్ని కొట్టలేదని ఒప్పుకోమనండి... అప్పుడు ఆలోచిస్తాను.

బక్కోడు: ఓరి బలిసినోడా! నువ్వు కొట్టలేదని నేను ఒప్పుకోవాలా? అలా ఒప్పుకుంటే ఏమంటావు? కొట్టనప్పుడు విడిగా ఉంచడ మెందుకు అని ప్రశ్నించవూ? సమైక్య తెలివితేటలు బాగానే వంట బట్టించుకున్నావు.

బలిసినోడు: సార్, మీరు వీడి వాదన పట్టించు కోవద్దు. జైల్లోకి తీసుకొచ్చినప్పుడు మీరే గదా అడిగారు... ఇద్దరూ  ఒకే సెల్లో ఉంటారా అని? అప్పుడు వీడూ ఒప్పుకున్నాడుగా... అప్పుడు సమైక్యతకు ఒప్పుకొని ఇప్పుడు విడిపోతానంటే ఎలా?

బక్కోడు:  అప్పుడేదో తోడుదొంగవని కలిసుందామన్న మాట నిజమే. అంతమాత్రాన నా ప్రాణాలకు ఆపద వస్తున్నా కూడా కలిసే ఉండాలా?

అయినా నా భద్రత ఎక్కడుందో నిర్ణయించు కోవడం నా హక్కు. ఆ విషయమే అధికారిని అడుగుతున్నాను. మధ్యలో నీకేం సంబంధం?

బలిసినోడు:  అన్యాయానికి గురయ్యానని నువ్వు చేస్తున్న వాదన పూర్తిగా అసమంజసమైనది. నేను లావుగా వుండి ఒకవైపు నీకు రక్షణ కల్పిస్తుంటే, నువ్వు విడిపోతాననడమే అసలు అన్యాయం. నీ పక్కన నేను వుండడం వాళ్ళ నీకు లాభమే గాని నష్టం వుండదు.

అధికారి: వార్నీ! ఇప్పుడే కదరా, వాడే నిన్ను కొడుతున్నాడని ఆరోపించావు. అంతలోనే మాట మార్పా? నీది నాలుకా తాటిమట్టా?

బలిసినోడు:  మీరు ఎన్నయినా చెప్పండి సార్. ఈ విభజనకు నేనొప్పుకోను. ఇప్పుడు వీడి ఆరోపణల కారణంగా మా ఇద్దరినీ విభజిస్తారు. రేపు ఇంకో సెల్లో వేరే ఖైదీ కూడా ఇదే ఆరోపణ చేస్తాడు. వారినీ విభజిస్తే ఎల్లుండి మరో ఖైదీ. ఇలా ఎంతమందిని విభజించ గలరు? ఇది అన్యాయం, జైలు సమగ్రత దృష్ట్యా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

అధికారి: (ఆలోచనలో పడ్డాడు) నిజమే రోయ్. ఇది నేను ఆలోచించ లేదు.

బలిసినోడు:  (ఉత్సాహంతో) చూసారా సార్! ఇందులో ఎంత మతలబు వుందో? విడదీయడమంటే అంత సులభ మనుకున్నారా సార్?

అధికారి: ఒరే! వేరే ఖైదీల గురించి నీకెందుకురా? నువ్వేమైనా ఖైదీలందరి గురించి ఆలోచించే స్పార్టకస్ వా? జైల్లన్నిటి గురించి ఆలోచించే డీజీపీవా? ఖైదీవి ఖైదీలా వుండు. ఇంత సేపు విచారించిన తర్వాత కూడా ఎవడు ఎవన్ని కొట్టాడో తెలుసుకోలేనంత ఎదవననుకున్నావా నేను? సరే, నిన్ను తీసుకెళ్ళి ఆ సిక్స్-పాక్ తమిళన్ సెల్లో వేస్తా. సమైక్యంగా వుంటావా?

బలిసినోడు:  బాబోయ్, అక్కడొద్దు సార్. వాడు రోజుకు మూడు పూటలు ఖైమా చేసి మరీ నన్ను చంపుకు తింటాడు.

అధికారి:  వాడైతే వద్దా? ఈ బక్కోడైతే నీకు ముద్దా? నేనేమైనా కేంద్ర ప్రభుత్వాన్ననుకున్నవురా నువ్వు -చెప్పిందల్లా వినడానికి? ఇరగదీస్తా నేమనుకున్నావో!


18 comments:

  1. hahahaha...good narration & clear explanation of current situation.

    ReplyDelete
    Replies
    1. reader,

      Thank you very much for your complements.

      Delete
  2. అవాస్తవంగా వున్నట్టనిపించినా కథ బాగుంది. ఇద్దరూ జైల్లో ఎందుకున్నారు? బక్కోడు జైల్లో ఎందుకున్నాడు? అధికారి వారిద్దరి కంప్లైంట్ చూసి ఆక్షన్ తీసుకుంటాడా లేదా కమిటీ వేసి, ఆధారాలను బట్టి చర్య తీసుకుంటాడా? బక్కోడి అబద్దాలకోరుగాబట్టే జైలుకు వచ్చుంటాడు. బలిసినోడు అబద్దాల బక్కోణ్ణి కొట్టి జైలుకొచ్చి వుంటాడు.

    ReplyDelete
    Replies
    1. జైలు, సెల్లు, బక్కోడు, బలిసినోడు, జైలు అధికారి ఎవరో ఊహించు కోవడం కష్టం కాదనుకుంటాను. జైలు దేశానికి ప్రతీక ఐతే రాష్ట్రం జైలులో సెల్ కి ప్రతీక. మరి జైలులో బక్కోడు, బలిసినోడు ఎందుకు కలిసున్నారో తెలియందెవరికి?

      అబద్ధాలు చెప్పేది బక్కోడో, బలిసినోడో కథ చూస్తే తెలియడం లేదూ?

      Delete
  3. Why transfer to another cell, had you told this cock&bull story to SKC, they would have believed and set bakkodu free.

    ReplyDelete
    Replies
    1. Don't worry, SKCs may be sold for suitcases, the people's verdict is still on.

      Delete
  4. Good idea to present your case,
    but I don't agree with your stand :-).

    ReplyDelete
  5. Correct annaya,
    "If your case is strong, ideas need not be fabricated, they just happen".
    Nyayam telangana vaipu undi.

    ReplyDelete
  6. If your case is strong, ideas need not be fabricated, they just happen.

    ReplyDelete
  7. Well said brother...
    If your case is strong, ideas or statistics need not be fabricated & you don't need any stupid statistics which SKC took into consideration.

    ReplyDelete
    Replies
    1. Hey Anon,

      SKC itself is a product of deception by Central Govt. After announcing Telangana process, It retreated its decision thanks to the stage management by some capitalists.

      But don't forget that even such a committee also recommened Telangana as second opotion. And first option is also a conditional unity with protections to Telangana. Can you tell why it recommended protections if it does not believe in T case?

      Delete
  8. emi cheppavu anna.. excellent. real gaa jaruguthunna danini comedy gaa malichi cheppavu.. super

    ReplyDelete