Sunday, February 26, 2012

తెలుగుమోసం


మహాకూటమిలో చేరినందుకే
బాబుగారు ఓడిపోయారట!
నిజమే కావచ్చు
బాబు తెలంగాణా తెస్తాడని
మా జనం నమ్మలేదు
ఆయన మాటల గారడీ
ఆంధ్రోల్లకూ నచ్చలేదు
అందుకే ఓడాడేమో
అబద్ధాల బాబు

అంతగా తెలంగాణా వాదం లేదు కాబట్టి
అసెంబ్లీలో మాట్లాడనంటున్న బాబూ,
అదే నిజమనుకుంటే
ఆరు ఉప ఎన్నికల్లో
సమైక్యవాద నినాదంతో పోటీ చెయ్
కనీసం డిపాజిట్ కోసం ట్రై చెయ్
అప్పుడు తెలుస్తుంది
తెలంగాణా వాదమంటే ఏంటో

పొద్దున్న
పార్టీ ఆఫీసులో ఆంధ్రోల్ల పాదపూజ
మధ్యాహ్నం
ప్రెస్సులో తెలంగాణా వాదులపై అవాకులు
సాయంత్రం
ప్రజల ముందు తెలంగాణా వాదం
ఇదీ
తెలుగు తమ్ముళ్ళ దినచర్య!

3 comments:

  1. పొరపాటున గెలిచుంటే ఎన్నికల వాగ్ధాన పట్టీలో (manifesto) రాసినట్టు శాసనసభలో తెలంగాణా తీర్మానం పెట్టే వాడివా? చదువు రాని నన్నపనేని, పయ్యావుల లాంటి నీ చంచాలు పడనిచ్చేవాల్లా?

    ReplyDelete
    Replies
    1. Jai,

      అప్పుడు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న అయ్యవారిని ఒక్క ముక్క కూడా అడక్కుండా కేంద్రం తెలంగాణా ప్రకటన చేసినందుకు అయ్యవారికి నషాళానికి అంటి వుండేది. ఇష్టం లేని పనికి వంకలు కొదవా?

      Delete
    2. అన్నా, ఎన్ని సార్లు అడగాలే? అఖిల పక్షంలో అడిగింది చాలదా? అసెంబ్లీలో మాట్లాడానికి ఇచ్చిన అవకాశం సరిపోలేదా? బొట్టు పెట్టి పిల్వనీకే గిదేమన్న పెరంటమా?

      డిసెంబర్ 10 చంద్రబాబు ప్రకటన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. "తమిళనాడులో ఉండే చిదంబరం, కర్ణాటకలో ఉండే వీరప్ప మొయిలి" అని నొక్కి వక్కాణిస్తూ తన మనుసులోని భాషాగజ్జి కక్కిండు.

      We will not forget or forgive those who backstabbbed us on December 10.

      Delete