Saturday, February 18, 2012

అంత మోజెందుకో?



అడుగు బయట పెడితే
హిందీ, ఉర్దూ ఇంగ్లీషు తప్ప
తెలుగు వినబడని స్థితి
అమలాపురం నుంచి
అప్పుడే వచ్చిన వ్యక్తి
దుబాసీ లేకుండా
అడుక్కూడా కదపలేని పరిస్థితి

తెలుగు భాషా తీవ్రవాది కూడా 
కుస్తీలు పడుతూ
వచ్చీ రాని ఉర్దూలో
మాట్లాడాల్సిన దుస్థితి
భాషా ప్రయుక్త రాష్ట్రం
తెలుగు భాష
దానికొక రాష్ట్రం
అంటూ
డబ్బా వాయిస్తూ
తిరిగే వారికి

హైదరాబాదు నగరం పై
అంత మోజెందుకో?

17 comments:

  1. మీరు కూడా ఉర్దూ లో రాసుకోవచ్చుకదా మీ బ్లాగు

    ReplyDelete
    Replies
    1. Expected question.

      మేం చెపుతున్నది తెలుగును వాడొద్దని కాదు. తెలుగును తెలుగులా కాక రాజకీయంలా వాడొద్దని.

      Delete
    2. అన్నా మనం ఉరుదులో "కూడా" రాసుకోవచ్చు కానీ వాళ్లకు అర్ధం కాదు కదా. आई बात समझ में?

      Delete
    3. Jai,

      వీళ్ళకు రాష్ట్రం ఒకటిగా వుండడం కోసమే తెలుగు కావాలి. తమ పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియం లోనే చదవాలి. అమెరికాలోయే ఉద్యోగాలు చేయాలి. వీటన్నిటికీ పనికిరాని తెలుగు కేవలం రాష్ట్రం ఒకటిగా వుండేందుకు మాత్రం కావాలి. తమ తెలుగు అభిమానాన్ని చాటుకునేందుకు సీమాన్ధ్రలో మొత్తం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను మూసి వేయమని చెప్పండి. చచ్చినా ఆ పని చేయరు. వారి భాషాభిమానం సమైక్యవాదంతో మొదలై సమైక్యవాదంతో ముగుస్తుంది.

      Delete
    4. VMS big boss Dr. Prabhakar runs an English medium school in Hyderabad :)

      Delete
    5. పరకాల ప్రభాకర్ నడుపుతోన్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలకి ఆధారం ఇదే:
      http://pranavatheschool.org/about/trust/

      >>>>>
      PRANAVA has recorded 100% First Class in ICSE 10th Standard this year (2010 - 11).Six of PRANAVA students secured distinction.
      >>>>>

      Delete
    6. పరకాల గారు ఇంగ్లిష్ మీడియం స్కూల్ నడపడం గురించి విమస వారు ఇచ్చిన కామెడీ సమాధానం
      >>>>>
      వ్యక్తులు ఎవరైనా వ్యవస్థకు అనుగుణంగా నడుచుకుంటారు.అందరూ విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ లాగా శాంతినికేతన్లు స్థాపించి కొత్త ఒరవడి సృష్టించలేరు కదా? తెలుగులో శాస్త్ర సాంకేతిక రంగంలో సరైన పాఠ్యపుస్తకాలే లేవు. చుక్కా రామయ్య గారు ఐఐటీ కోచింగ్ తెలుగులో అందించినా,పరకాల గారు ఒక స్కూల్ మేనేజ్మెంట్ సభ్యునిగా ఉన్నంత మాత్రాన IIT లు, ICSE లేదా స్టేట్ బోర్డు వారు తమ పద్ధతులు మార్చుకోరు కదా?
      >>>>>
      ఆ స్కూల్ నడుస్తున్నదే పరకాల గారి తండ్రి పేరు మీద. ఆ స్కూల్‌లో పరకాల గారు కేవలం మేనేజ్మెంట్ సభ్యుడంటే నమ్మాలా?

      Delete
    7. ప్రవీణ్,

      విద్యారంగం తన పద్ధతులు మార్చుకుని తెలుగులోకి మారడానికి ఎవరూ 'విషయం' ఉపయోగించరు కాబట్టి ఆ విషయంపై ఆయనకీ ఆసక్తి లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.

      అదే, తెలంగాణా విషయం అయితే, తెలంగాణా వ్యవస్థ మొత్తం కోరుతున్నా దానికి వ్యతిరేకంగా 'విషయం' ఉపయోగించి ఆపేవారు ఉన్నారు కాబట్టి, పుణ్యానికే పురుషార్థం లభిస్తుంది కాబట్టి ఆయనకు అమితాసక్తి!

      అర్థం జేసుకోరూ! :)

      Delete
    8. రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియం విద్యనే కోరుకుంటున్నారనేది నిజమే. తెలుగు మీడియం స్కూళ్ళని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళుగా మార్చడాన్ని గ్రామస్తులు సమర్థించినప్పుడే ఈ విషయం అర్థమైపోయింది. వ్యవస్థకి అనుగుణంగా నడుచుకోవాలి అనేది నిజమైతే మూడు కోట్ల మంది తెలంగాణా ప్రజలు తెలంగాణాని సమర్థిస్తున్నారు కనుక ఇది వ్యవస్థకి అనుగుణమైనదేనని అంగీకరించాలి. సమైక్యవాదం అనేది హైదరాబాద్‌ని కోరుకుంటున్నవాళ్ళలో తప్ప ఎవరిలోనూ లేదు కనుక సమైక్యవాదం వ్యవస్థకి అనుగుణం కాదు అని ఒప్పుకోవాలి. ఈ విషయం పరకాల ప్రభాకర్‌కి తెలుసు. అయినా అతను రాజకీయ ప్రయోజనాల కోసం గడ్డి తింటాడు.

      Delete
    9. అవును, మీరు చెప్పింది నిజం.

      ఒకవేళ పెట్టుబడిదారులంతా తమ ప్రయోజనాలు తెలంగాణా ఏర్పాటులోనే వున్నాయని గుర్తిస్తే, ఆ తెలంగాణా వాదాన్ని ప్రచారం చేయడానికి పరకాలను తమ బిజినెస్ కన్సల్టెంట్ గా ఏర్పరచుకొంటే, ఆయన తెలంగాణా వాదంపై వర్కుషాపులు పెట్టినా పెట్టగలడు. కన్సల్టెంట్ కు కావలసింది కమీషనే కాని, ఆయా వాదాల్లో నిజానిజాలు కాదుగదా!

      Delete
    10. @प्रवीण् शर्माFeb 22, 2012 12:14 PM:

      మీరు quote చేసిన మాట వాళ్ళు నాకు ఇచ్చిన జవాబే సుమండీ. విమస బ్లాగు నిర్వాహకుడికి ఆ స్కూలు పరకాల శేషావతారం ట్రస్ట్ నడిపిస్తుందని, కొద్ది రోజుల కిందటి వరకు నిర్మలక్క స్వయంగా రోజు వారీ విషయాలు చూసుకునే వారనీ, ఆమె రాజకీయాలలో చురుకుగా పాల్గోనడడం మొదలెట్టాక పరప్రభ వారే manage చేస్తున్నారనే విషయం తెలీదు పాపం. చెబుతామనుకున్నాకానీ అసలు విషయం అది కాదు కాబట్టి ఊరుకున్నా.

      @శ్రీకాంతాచారిFeb 23, 2012 09:36 PM:

      పరకాల వారికి communications & corporate branding వ్యాపారం కూడా ఉంది. ఆ రంగులన్నీ తన రాజకీయాలలో వాడుతుంటాడు పాపం. తిమ్మిని బమ్మి చేయడమనేది ఆయనకు ఎడం చేతి విద్య. ఎందుకో వోటర్లు నాలుగు సార్లూ కరుణ చూపించలేదు కానీ ఈ పాటికి చార్మినారును చీనీయులకు, అనకాపల్లిని అమెరికన్లకు అమ్మగల సమర్థుడు.

      Delete
  2. నేను విశాలాంధ్ర మహా సభవాళ్ళకి సూటి ప్రశ్నే అడుగుతాను. పట్టణ ప్రాంతాలలో తెలుగులో ఇంగ్లిష్, ఉర్దూ పదాలు కలపకుండా మాట్లాడేవాళ్ళు ఎంత మంది ఉన్నారు? తెలుగులో మాట్లాడడం ఇష్టం లేదు కానీ తెలుగు రాష్ట్రం ముక్కలు అవ్వకుండా ఉండేందుకు ప్రాణాలు అర్పిస్తాము అని చెపితే చిన్న వాల్తేరు మానసిక వైద్యశాల నుంచో, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచో పారిపోయి వచ్చినవాళ్ళు కూడా నవ్వుతారు. పల్లెటూరివాళ్ళకి ఇంగ్లిష్, ఉర్దూ ఎలాగూ రావు కాబట్టి వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతారు. పట్టణ ప్రాంతాలలో తెలుగులో ఇంగ్లిష్, ఉర్దూ పదాలు కలపకుండా మాట్లాడేవాళ్ళని ఒక్కణ్ణి చూపించమన్నా చూపించలేరు.

    ఇంకో గమనిక. మన రాష్ట్రంలో హిందీ మాట్లాడుతున్నామని చెప్పుకునేవాళ్ళు మాట్లాడుతున్నది హిందీ కాదు, అది ఉర్దూ. హిందీలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి, ఉర్దూలో పెర్సియన్-అరబిక్ పదాలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ భాష అయిన సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్న హిందీ భాష మాట్లాడడానికి కూడా సిగ్గుపడి విదేశీ భాష అయిన ఉర్దూ మాట్లాడుతూ అదే గొప్ప ఆధునికత అనుకుంటున్నారు మనవాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. ఎవరికి సులువుగా వుండే భాష వారు మాట్లాడుకోవచ్చు, పక్కవాడికి అర్థమయ్యే టంత వరకూ. అలాగే భాషాభిమానంతో భాషాభివృద్ధి కోసం ప్రయత్నం చేయవచ్చు. అదీ తప్పులేదు. కాని భాష పేరు చెప్పి, భాషను అడ్డం పెట్టుకొని తమ ప్రాంతీయ వలసవాదాన్ని సమర్థించు కోవాలని చూస్తున్నారు సమైక్యవాదులు. నిజానికి వీరికి తమ వికృత ప్రయోజనాలు పరిరక్షించు కోవడం తప్ప భాషపై గాని, జాతిపై గాని ఎలాంటి ప్రేమా లేదు.

      Delete
  3. VMS big boss Dr. Prabhakar runs an English medium school in Hyderabad :)

    chukka ramiah can run iit institute but when parkala prabhakar runs a school it is wrong for these arrogant t vadis like jai and praveen sharma. I had respect for a intellectual like ramiah now he has become a cunning fox who spews venom on andhra corporate colleges as if he is running the institute for free.

    ReplyDelete
    Replies
    1. No wonder, if you don't understand the difference.

      Parakala tells about telugu jati and runs english medium school.

      Ramaiah wants to see our students (of both sides of state, don't worry) as best engineers and hence iit coaching institute. If you can not understand the difference between the school run by Ramaiah and the so called carporate colleges, you better visit them and find out yourself.

      Delete
    2. my cousin studied in his institute his institute works in the same manner as sri chaitanya amd narayna what my argument is that if chukka ramiah's intention is to fight against corporate colleges fight for it irrespective of regions people will support him. Why do he add regional colour and show a particular in negative colour

      Delete