- ఏడేళ్లలో ఇదే మొదటి సారి
- 516. అడుగుల వద్ద నీటిమట్టం
- ఆంధ్ర ప్రాంతానికి రబీ కోసం భారీగా నీటి తరలింపు
- ఎడమ, కుడి కాల్వల ద్వారా ఆంధ్రకు పారుతున్న సాగర్ నీరు
- అడుగంటుతున్న భూగర్బ జలాలు
- తరుముతున్న తాగునీటి ఎద్దడి
- చెరువులు నింపాలన్న ఉత్తర్వులు బేఖాతరు చేసిన అధికారులు
- పట్టించుకోని జిల్లా మంత్రులు
సరిగ్గా ఏడేళ్ల క్రితం నాగార్జున సాగర్‌లో నీటి మట్టం 556.10 అడుగులు! ఇప్పుడు సాగర్‌లో నీటి మట్టం 516.0 అడుగులు! రమారమి 40 అడుగుల తేడా! సాగర్‌లో నీటి మట్టం ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి ఎందుకు పడిపోయింది? నాగార్జున సాగర్ ఎందుకు ఖాళీ అయిపోయింది? ఈ నీళ్లన్నీ ఎటుపోయాయి? ఖమ్మం, నల్లగొండ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను ఫణంగా పెట్టి ఏ దారి పట్టాయి? మా నీళ్లు మాకేనంటూ ఏళ్ల తరబడి పోరాటాలు సాగుతున్నా.. ఆ హక్కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధిస్తుందని నమ్ముతున్న లక్షలాది రైతులు ఆందోళన బాట పడుతున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా.. మళ్లీ అవే ప్రశ్నలు! నీరు ఆంధ్ర ప్రాంతానికి పారును! మళ్లీ అదే సిద్ధాంతం! అవును.. కృష్ణా డెల్టాలో రబీ పంట కోసం చెరువులు నింపేందుకు సాగర్ నీళ్లు తరలిపోయాయి! కాదు.. కాదు.. తరలించుకుపోయారు! సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం యథేచ్ఛగా జరుగుతున్న తెలంగాణ జల దోపిడీలో ఇది మరో అంకం!
(టీ న్యూస్ ప్రతినిధి-నల్లగొండ) నాగార్జున సాగర్ ఖాళీ అయిపోయింది. ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి నీటి మట్టం దిగజారిపోయింది. కృష్ణా డెల్టాలో రబీ పంట కోసం చెరువులు నింపేందుకు సాగర్ జలాలు తరలిపోయాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలను ఎండబెట్టి, ఎడమ కాల్వ ద్వారా రబీ పంటకు మూడవ జోన్ పరిధిలోని ఆంధ్ర ప్రాంతానికి, కుడి కాల్వ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు తరలించుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా గొంతెండుతున్నా కనీసం గుక్కెడు నీరు ఇవ్వని ప్రభుత్వం.. ఆంధ్ర ప్రాంతానికి రబీ పంట పేరుతో భారీగా చెరువులను నింపిపెడుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ల మందు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు.
అసలే కరువు, అపై భారీగా భూగర్భ జలాలు పడిపోయాయి. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చెరువులను నింపాలని కోరినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. కానీ.. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగర్ రిజర్వాయర్‌లో నీరును నిల్వ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి నీరును తరలించుకుపోయింది. సాగర్ ఎడమ, కుడి కాల్వల ద్వారా రబీ పంటకు ఆంధ్ర ప్రాంతానికి భారీగా నీరు తీసుకెళ్లుతున్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా మూడవ జోన్ (కృష్ణా, పశ్చిమగోదావరి) జిల్లాలకు రబీ పంటకు ఫిబ్రవరి 29వ తేదీ వరకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో తీవ్ర కరువు కారణంగా తెలంగాణలో పంటలు పూర్తిగా నష్టపోయాయి. భూగర్భ జలాలు 14 మీటర్ల లోతుకు పడిపోయాయి. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు (ఎమ్మార్పీ) పరిధిలోని 94 చెరువులను నింపాలని గత నెల 19వ తేదీన జరిగిన డీఆర్‌సీ సమావేశం ఏకక్షిగీవంగా తీర్మానించింది.
ఫిబ్రవరి 7 నుంచి ఎమ్మార్పీ పరిధిలోని చెరువులను నింపాలని ఉత్తర్వులు జారీ అయినా ఇరిగేషన్ అధికారులు ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 516.0 మాత్రమే ఉంది. ఎమ్మార్పీ పంపులు నడవాలంటే సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 510 అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి. ఎడమ, కుడి కాల్వల ద్వారా భారీ ఎత్తున కృష్ణా నీటిని తరలించకపోతుండటంతో ఎమ్మార్పీ పంపులకు నీళ్లు అందే అవకాశాలు మృగ్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున రిజర్వాయర్‌లో నీరు ఉన్నా, పాలకులు మాత్రం నల్లగొండ జిల్లాలో పరిధిలోని మొదటి జోన్‌కు నీరు విడుదల చేసేందుకు ఒప్పుకోలేదు. రైతులు భారీ ఎత్తున అందోళనలు, మంత్రులకు వినతిపవూతాలు, కలెక్టరేట్ దిగ్బంధం వంటి అనేక కార్యక్షికమాలు చేపట్టినా ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడవ జోన్‌కు రబీ పంటకు నీరు తరలించేందుకు ఫిబ్రవరి 29వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేవలం వ్యవసాయ పంటలకు కోసమే కాకుండా తాగునీటి అవసరాల కోసం కూడా భారీ వినియోగించుకుంటున్నారు. జిల్లా పరిధిలోని చెరువులను నింపేందుకు అటు అధికారులు, ఇటు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించకపోవడంపై రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాశయంలో క్రమేణా నీటి పరిమాణం తగ్గుతుండడంతో గురువారం 516 అడుగులు (143 టీఎంసీలు)కు చేరింది. అందులో నుంచి ఎడమ కాలువకు 7431 క్యూసెక్కులు, కుడి కాలువకు 245 క్యూసెక్కులతో కలిపి 15676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలో ప్రధానంగా మూడు రిజర్వాయర్లు, 135 చెరువులను నింపాల్సి ఉంది. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ 0.4 టీఎంసీలు, పొనుగోడు రిజర్వాయర్ 0.4 టీఎంసీలు, ఉదయ సముద్రం రిజర్వాయర్ 1.5 టీఎంసీలతో పాటు 135 చెరువులను నింపేందుకు సుమారుగా 4 టీఎంసీల నీరు అవసరముంది. ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నింపాలని అదేశాలు అందినా ఇంత వరకు ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
Curtesy: Namasthe Telangana
No comments:
Post a Comment