కోడిగుడ్డులో బలవర్ధకమైన పోషక పదార్థాలున్నాయి, నిజమే. పిల్లలకు రోజూ ఒక కోడిగుడ్డు పెడితే బలంగా ఎదుగుతారన్నదీ నిజమే. అంతమాత్రాన కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తే...
అవును మరి! తెలంగాణా కోడిగుడ్లను చూస్తే ప్రతీ వాడికీ ఈకలు పీకాలని అనిపిస్తుంది మరి!
అసలు విషయానికి వస్తే...
జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది కోడిగుడ్లు విసిరారట. ఆ కోడిగుడ్లు ఆయన తుడుచుకొని వెళ్లి పోయాడట. మరింకేంటి అంటారా! అదేనండీ, ఆ గుడ్లను తిండి లేని పిలగాండ్లకు పెడితే ఎంత బలంగా తయారవుతారో కొంతమంది సోదాహరణంగా వివరించడం మొదలు పెట్టారు.
అవును మరి! ఓ సినిమాకు వ్యతిరేకంగా విజయవాడలో వర్మగారి మీద గుడ్లు పడితే వీరికి కనపడదు. కడపలో రైతులు రోడ్లమీద టమాటాలు కుమ్మరిస్తే కనపడదు. కాని, ఎవడైనా తెలంగాణా వాడు ఒక సమైక్యవాద నాయకుని మీద కోడిగుడ్డు వేస్తే మాత్రం... ఆరోగ్య సూత్రాలూ, పోషక పదార్థాల విలువలూ, తిండి లేని దౌర్భాగ్యుల వివరాలూ గుర్తొస్తాయి.
తెలంగాణలో నైనా, ఆంధ్రాలో నైనా, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రాంతంలో నైనా రాజకీయ నాయకుని పైన కోడిగుడ్డో, కాలి బూటో ఎందుకు విసురుతారు? వారికి డబ్బులు ఎక్కువయ్యా? కానే కాదు. కడుపు మండి! ఆ కడుపుమంట వల్ల వచ్చిన కసితో. ఏ రాయో విసరకుండా కోడిగుడ్డు విసరడం, అలా విసిరినందుకు లాఠీ దెబ్బలు తినడం, ఆపైన కేసుల్లో ఇరుక్కోవడం అంటే అది ఒక శాంతియుతమైన ప్రజాస్వామ్య బద్ధమైన నిరసన రూపం కాబట్టే.
వీళ్ళు విసిరే ఒకటి రెండు కోడిగుడ్లతో ఎంతమంది తెలంగాణా పిల్లగాండ్ల కడుపులు నింపుతారో కూడా చెపితే బాగుండేది. ఈ సమెక్కుడు వాదుల మాటలు ఎట్లా ఉంటాయంటే, సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ తగుల బెట్టించిన బట్టలకు కూడా ఖరీదు లెక్కించే బాపతు గాళ్ళు వీళ్ళు. వీళ్ళ దృష్టిలో తెలంగాణా వాడు ఏది చేసినా తప్పే, అదే పని ఆంధ్రా వాడు చేస్తే ఆత్మగౌరవం, మట్టీ మశానం.
ఇలాంటి పిచ్చోళ్ళ నీతులు మనకవసరమా?
శ్రీకాంత్
ReplyDeleteఉతికి ఆరేసావు బాస్
ఎప్పుడు జరిగింది ఇది?
ReplyDelete"ఆ గుడ్లను తిండి లేని పిలగాండ్లకు పెడితే ఎంత బలంగా తయారవుతారో కొంతమంది సోదాహరణంగా వివరించడం మొదలు పెట్టారు."
లింక్ ప్లీజ్
This is not intended for any particular blog post. But related to the statements given by samaikyavadis who tries to critisize every event taken up by T activists.
Deletehahha nice repily
ReplyDelete