Tuesday, February 21, 2012

BJP, TRSకి ప్రత్యామ్నాయం కాబోతుందా?



తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికల వేడి మొదలైంది. యధా ప్రకారంగా టక్కు టమార విద్యలు ఉపయోగిస్తూ రాజకీయ పార్టీలు అప్పుడే మాటల యుద్ధాలు మొదలు పెట్టాయి. ఇచ్చేదీ తెచ్చేదీ మేమేనంటూ ఒక పార్టీ మరోసారి తెలంగాణా ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. సమైక్య వాది కాళ్ళ ముందు సాగిలబడ్డా సరే, మాకన్నా నిఖార్సైన తెలంగాణా వాదులు లేరంటూ మరో పార్టీ ఊదరగొట్టడం మొదలు పెట్టింది.

ఎన్నికల సమయంలో కుహనా తెలంగాణా వాదాన్ని చెప్పే సమైక్యవాద పార్టీలు, ప్రజలు వారిని నమ్మి వోట్లు వేసిన తర్వాత మాత్రం "చూసారా, తెలంగాణా వాదం వుంటే మేమెందుకు గెలుస్తాం?" అన్నట్టు మాట్లాడుతాయి. అయితే ఇటువంటి మాటలు విని విని చెవులు తూట్లు పడిన తెలంగాణా వాదులు వీరి మోసాలను ఇంకే మాత్రం సహించే ధోరణిలో లేరు. అందుకే ఈ రెండు పార్టీలు తమ మాటలను ప్రజలను నమ్మే స్థాయిని ఏనాడో కోల్పోయాయి. ఇవి తెలంగాణాలో గెలవడం అటుంచి డిపాజిట్లు వచ్చినందుకు సంతోషించే పరిస్థితికి దిగజారాయి. 

లోలోన సమైక్యవాదులకు దాసోహం చేస్తూ, పైకి తెలంగాణా వాదం చెప్పే పార్టీల సంగతి అలా వుంటే, గట్టిగా తెలంగాణా వాదం వినిపించే TRS, BJP ల పధ్ధతి మరోలా వుంది.

రాజీనామాలు చేసిన స్థానాలు పోగా TRS మహబూబ్ నగర్లో అభ్యర్థిని నిలబెట్టడం నిజంగా ఒంటెత్తు పోకడే. అది BJPకి నచ్చనట్టుంది. పైగా కిషన్ రెడ్డి పోరుయాత్ర విజయవంతంగా జరిగిన ఊపులో ఉందేమో, తాను కూడా అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలు తెలంగాణా వాదులను నిజంగా కలవర పరచేవే. ఎందుకంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడల్లా వాటి ఫలితాలకు, తెలంగాణా వాదానికి ముడిపెట్టడం గత దశాబ్ద కాలంగా జరుగుతూ వస్తుంది. కుహనా తెలంగాణావాద పార్టీల బండారం బయటపడ్డ నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణావాద పార్టీలే తమలో తాము పోటీపడి, వోట్లు చీలిపోయి, వ్యతిరేక ఫలితాలు వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నే ఆ కలవరానికి మూలం.

BJP, TRSకి ప్రత్యామ్నాయం కాబోతుందా అనేది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే BJP పార్టీ కూడా TRS అంత బలంగానే తన వాదాన్ని వినిపిస్తోంది. పైగా జాతీయ పార్టీ. అవకాశవాద కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఎప్పటికైనా తెలంగాణా ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకే ఉందన్న విషయం సర్వత్రా వున్న అభిప్రాయం. 

మరి అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీ అయినటువంటి TRS కన్నా జాతీయపార్టీ అయిన BJP తెలంగాణా వాదానికి ఎక్కువ బలం చేకూర్చే పార్టీగా కనిపిస్తుంది. కాని తరచి చూసినప్పుడు, BJP ని నమ్మడం అంత సబబు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే...
  • రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులకు తెలంగాణా పై ఎంత నిబద్ధత వున్నా, జాతీయస్థాయిలో ఆ పార్టీకి అధికారంలో వుండడం మాత్రమే ప్రాధాన్యం తప్ప తెలంగాణా కాదు.  
  • రేపు ఆపార్టీ ఏ చంద్రబాబో, జగన్ మోహన్ రెడ్డిదో సహకారం తీసుకొని తెలంగాణా వాదాన్ని మరోసారి తుంగలో  తొక్కదని చెప్పే పరిస్థితి లేదు.
  • అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలో వున్న తెలంగాణా కాంగ్రేసు నాయకుల్లానే, తీరా గెలిచిన తర్వాత ఇక్కడి BJP నాయకుల మాటలు కూడా అరణ్య రోదనే కావచ్చు.
ఈ పరిస్థితుల దృష్ట్యా, మంచికో చెడుకో తెలంగాణా ప్రజలు TRS పార్టీని మాత్రమే సమర్ధించ వలసిన అవసరం వుంది.  అప్పుడు మాత్రమే తెలంగాణా ప్రజలకు తమదంటూ ఒక ఐడెంటిటీ వుంటుంది. ఇప్పటికే రాజకీయాలతో అనేక ధక్కామొక్కీలు తిన్న తెలంగాణా ప్రజలు ఆ మాత్రం ఆలోచించగల పరిణతి వుంది.
   
   

15 comments:

  1. ప్రజలు ఆ మాత్రం ఆలోచించ గల పరిణతి వుంది

    ROFL

    ReplyDelete
  2. అయ్యా మీరు TRS పార్టి సభ్యుల్ల మాట్లాడటం మానడం మంచిది కేవలం TRS పార్టికి తెలగాణ ప్రాంతంలో ఉన్న అన్ని MLA,MP స్థానాలు వచిన్నంత మాత్రాన తెలంగాణ వస్తుందని మీరు గ్యారెంటి ఇవ్వగలరా ? ఎ రాజకీయ పార్టి తమ స్వార్థం లేకుండా తెలంగాణ ఉద్యమానికి మద్దత్తు ఇవ్వడంలేదు , అన్ని పార్టిలు తమ రాజకీయ మనుగడే ప్రాధాన్యంగా ఉద్యమాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి

    ReplyDelete
  3. అయ్యా మీరు TRS పార్టి సభ్యుల్ల మాట్లాడటం మానడం మంచిది కేవలం TRS పార్టికి తెలగాణ ప్రాంతంలో ఉన్న అన్ని MLA,MP స్థానాలు వచిన్నంత మాత్రాన తెలంగాణ వస్తుందని మీరు గ్యారెంటి ఇవ్వగలరా ? ఎ రాజకీయ పార్టి తమ స్వార్థం లేకుండా తెలంగాణ ఉద్యమానికి మద్దత్తు ఇవ్వడంలేదు , అన్ని పార్టిలు తమ రాజకీయ మనుగడే ప్రాధాన్యంగా ఉద్యమాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి

    ReplyDelete
    Replies
    1. ఆయ్యా,

      నేను ఒక తెలంగాణా పౌరునిగా మాట్లాడాను. తెలంగాణా పౌరుడిగా తెలంగాణా వాడంపైన నిజాయితీగా నిలబడ్డ పార్టీని సపోర్టు చేయవలసిన అవసారం వుంది. ఆ పార్టీ తెరాస కాక ఇంకేదయినా వుంటే సెలవియ్యండి.

      Delete
  4. trs ki votu veyyamani mee buddi bayata pettukunnaaru...

    ReplyDelete
    Replies
    1. What is wrong with that? Do you find any better party among the herd? If yes, can you name one? If no, what is your objection in selecting a party which is fully dedicated to T cause?

      Delete
    2. ఒక్క తెలంగాణా కే కాదు యావద్ రాష్ట్రానికి.. ఆ మాటకొస్తే దేశానికి కూడా ప్రత్యామ్నాయం లేదు..నాయకులంతా అవినీతి రొచ్చులో పొర్లు తున్నారు..వారికి అండగా కొంతమంది ఐ.ఏ.ఎస్ ఆఫీసర్లు కొమ్ము కాస్తూ దేశాన్ని దోచుకుంటున్నారు.. "నిజంగా దేవుండంటు ఒకడున్నాడు కనకే భారత దేశం ఈ మాత్రమైనా చల్లగా వుంది." అని ఎవరో అన్నారు..

      Delete
  5. ప్రత్యామ్నాయం = ప్రత్యాన్మాయం (మాయం ?)

    ReplyDelete
  6. @ శ్రీకాంతాచారి గారూ !
    తెలంగాణా ఆలస్యంగా రావాలని - అవసరమైతే అసలు రాకుండా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి కే.సీ.ఆర్. తెలుగు దేశం ను బొందపెట్టడమే కే.సీ.ఆర్ లక్ష్యం తప్ప తెలంగాణా తెచ్చుడు కాదు. ప్రజలను ఎల్ల కాలం ఎవరూ మోసం చేయలేరు. తెలంగాణా కోసం నిజాయితీగా పోరాడేది ఒక్క్ విధ్యార్ధులు మాత్రమే.

    ReplyDelete
    Replies
    1. అలాగా?

      గొప్ప రహస్యం చెప్పారు. తెలుగుదేశంను బొంద పెట్టడం ఆయన ఉద్దేశమైతే మరి కాంగ్రెస్ డిపాజిట్లు కూడా పోతున్నాయేంటి?

      విద్యార్థులు, నలభైరోజులు సకల జనుల సమ్మె చేసిన ఉద్యోగులు, అందరిలోనూ నిజాయితీ వుంది. అలాగే కొన్ని లోపాలు వున్నా తెలంగాణా వాదంపై నిబద్ధత వున్న రాజకీయ పార్టీ తెరాస తప్ప ఇంకోటి లేదు. కాబట్టి తెలంగాణా వాదులు దాన్ని సపోర్టు చేయ వలసిన అవసారం వుంది.

      Delete
    2. తెలుగు దేశం పార్టీని బొంద కొత్తగా బొంద పెట్టాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 10 ఘటనలు చంద్రబాబు పరోక్షంగా సమర్తించినప్పుడే తెదేపా నోట్లో మన్ను పడ్డది.

      Delete
    3. @Jai,

      తెలుగుదేశం అధ్యక్షుడు తెలంగాణా ఏర్పాటును సమర్థిస్తూ ప్రకటన చేసి, చిదంబరానికి లేఖ యిస్తే తప్ప తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బట్టగట్టే అవకాశం లేదు. అది చంద్రబాబు అధ్యక్షుడుగా వున్నంత వరకూ జరగని పని. కాబట్టి తెలుగు దేశానికి బొందబెడుతున్నది చంద్రబాబే తప్ప మరెవరో కాదు.

      Delete
    4. శ్రీకాంతాచారిగారు,

      మహబూబ్ నగర్ అసెంబ్లీ సీటు విషయంలో TRS, BJP ఇద్దరి వాదనలూ సబబే. అయితే మీరన్నట్టు ఏ తెలంగాణ పౌరుడూ ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పరస్పరం తలపడాలని కోరుకోవట్లేదు. పోటీ నివారించడానికి జేయేసి శాయశక్తులా కృషి చేస్తుంది. తప్పక ఒక పరిష్కారం లభించగలదన్న నమ్మకం నాకుంది.

      Delete
    5. దిలీప్ గారు,

      అంటా ఒకే కారణం కోసం పని చేసినా భావ వైరుధ్యాలు సహజం. అయితే ఈ విరుద్ధ భావాలతో మొదటికే మోసం రాగూడదనే తెలంగాణా ప్రజల ఆకాంక్ష.

      Delete