Saturday, February 18, 2012

గుర్తొస్తున్నాయి

దక్షిణ పాకిస్థానం
అన్నపుడు 
నా భాష గుర్తుకు రాలేదు
                             
న్యాయస్థానం 
ముల్కీ నిబంధనలు
సమర్థిస్తే 
నా జాతి గుర్తుకు రాలేదు 

నా నెల
బీటలువారి 
పోతిరెడ్డి పాడై
నీరు వెళ్లిపోతుంటే 
నా బంధుత్వం గుర్తుకు రాలేదు 

రాజోలి బండ 
తూములు 
బద్దలు గొట్టినప్పుడు 
ఐకమత్యం గుర్తుకు రాలేదు 

నేడు 
నాదారి 
నేను చూసుకుంటానంటే
ఇప్పుడు గుర్తొస్తున్నాయా?

4 comments:

  1. yes.. ippudu chaaala premaga(kapata) mokamu meedha navvu pulumukoni drutarstra kougili isthunnadu.

    andhronni (ajakar) mathramu nammakandi. Vallantha mosagallani nenu thirigina dehslannitlilo ekkada chudaledhu.

    ReplyDelete
  2. పూల బాధ గురించి ఏడ్చే కరుణశ్రీ బిరుదాంకితుణికి సాటి మనుషల మీద కరుణ లేకపాయే!

    "నాకు భాష రాదన్నోడు, నా యాసని ఎక్కిరించినోడు ఈరోజు సిగ్గు లేకుండా కలిసి ఉందామంటున్నాడు": ప్రజాకవి కాళోజి

    ReplyDelete
  3. Jai,

    పూలు సూదులతో గుచ్చితే బాధపడ్డ పెద్దమనిషి, తెలంగాణా ప్రజలను సూదుల్లాంటి మాటలతో గుచ్చితే బాధ పడతరన్న విషయం తెలువ లేదన్న మాట!

    ReplyDelete
  4. మేడిపండు లాంటి హైదరాబాద్ పోతుందనిపిస్తే పగవాణ్ణి కూడా అన్నయ్య అని పిలిచి హైదరాబాద్ పోకుండా చూడాలనుకుంటాడు.

    ReplyDelete